
సాక్షి, మేడికొండూరు (గుంటూరు): సినిమాల్లో హీరో ఎస్సై వేషం వేసి రౌడీలను ఎక్కడ పడితే అక్కడ చితకబాదినట్లు ఉంది ఎస్సై వినోద్‌కుమార్ తీరు. యువకులు, వృద్ధులు, మందుబాబులను ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై కొట్టిన తరువాత ఆయన దాడిలో గాయపడిన వారు బయటకి చెప్పుకోలేక మిన్నుకుండి పోతున్నారు. ఇటీవల మేడికొండూరు ఈద్గా సమీపంలో ఇద్దరు రైతులను పొలంలో కొట్టడం చర్చనీయాంశమైంది.
పేరేచర్ల కూడలిలో మంగళవారం రాత్రి కేసులు రాస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహంపై వస్తుండగా వారి వాహనాన్ని ఎస్సై ఆపారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్ చేస్తామని చెప్పటం, కేసు రాసుకోమని అనటంతో చిర్రెత్తిన ఎస్సై ఒక యువకుడి చెంప చెళ్లు మనిపించాడు. రెండు సార్లు యువకుడిని కొట్టాడు. ఏదైనా ఉంటే చెప్పాలి లేక కేసులు రాయాలని బాధితులు అంటున్నారు. అంతేకానీ ఇష్టానుసారం దాడి చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పది గంటలు కాక మునుపే మందుబాబులపై తన ప్రతాపం చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ లాఠీతో దాడి చేస్తున్నారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని మరింత చితకబాదుతున్నారు. వీరికి తగలరాని చోట తగిలి ఎదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లితే పరిíస్థ్ధితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అర్బన్ సౌత్ డీఎస్పీ కమలాకర్‌ను వివరణ కోరగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇంతకమునుపు మేడికొండూరు ఠాణాలో పనిచేసిన ఎవరూ ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment