beated
-
ప్రిన్సిపాల్ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : సెల్ఫోన్లు ఉన్నాయనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ విద్యార్థులను దారుణంగా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ముందే విద్యార్థులను చితకబాదడం గమనార్హం. పదో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులను అనుమానంతో హింసించడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జయమని కంఠేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, స్కూలు యాజమాన్యాన్ని నిలదీయగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!
సాక్షి, మేడికొండూరు (గుంటూరు): సినిమాల్లో హీరో ఎస్సై వేషం వేసి రౌడీలను ఎక్కడ పడితే అక్కడ చితకబాదినట్లు ఉంది ఎస్సై వినోద్‌కుమార్ తీరు. యువకులు, వృద్ధులు, మందుబాబులను ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై కొట్టిన తరువాత ఆయన దాడిలో గాయపడిన వారు బయటకి చెప్పుకోలేక మిన్నుకుండి పోతున్నారు. ఇటీవల మేడికొండూరు ఈద్గా సమీపంలో ఇద్దరు రైతులను పొలంలో కొట్టడం చర్చనీయాంశమైంది. పేరేచర్ల కూడలిలో మంగళవారం రాత్రి కేసులు రాస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహంపై వస్తుండగా వారి వాహనాన్ని ఎస్సై ఆపారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్ చేస్తామని చెప్పటం, కేసు రాసుకోమని అనటంతో చిర్రెత్తిన ఎస్సై ఒక యువకుడి చెంప చెళ్లు మనిపించాడు. రెండు సార్లు యువకుడిని కొట్టాడు. ఏదైనా ఉంటే చెప్పాలి లేక కేసులు రాయాలని బాధితులు అంటున్నారు. అంతేకానీ ఇష్టానుసారం దాడి చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పది గంటలు కాక మునుపే మందుబాబులపై తన ప్రతాపం చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ లాఠీతో దాడి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని మరింత చితకబాదుతున్నారు. వీరికి తగలరాని చోట తగిలి ఎదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లితే పరిíస్థ్ధితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అర్బన్ సౌత్ డీఎస్పీ కమలాకర్‌ను వివరణ కోరగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇంతకమునుపు మేడికొండూరు ఠాణాలో పనిచేసిన ఎవరూ ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించలేదని చెబుతున్నారు. చదవండి: వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి -
చాక్‌పీస్‌తో ఆడుకున్నాడని...
విద్యార్థిని చితకబాదిన టీచర్ లంగర్‌హౌస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘటన హైదరాబాద్: తరగతి గదిలో చాక్‌పీస్‌తో ఆడుకున్నాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని చితకబాదాడు. ముందటి పళ్లు ఊడేలా కొట్టాడు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వెన్ను విరగొట్డాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో నివాసముండే ప్రీతిబాల, మహేశ్ యాదవ్‌ల కుమారుడు తనిష్క్ యాదవ్ (11). బాపూఘాట్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లి గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. తనిష్క్ గురువారం తరగతి గదిలో ఉండగా తోటి స్నేహితుడు అతనిపై చాక్‌పీస్ విసిరాడు. అదే చాక్పీస్ను తనిష్క తిరిగి ఆ విద్యార్థిపై పడేశాడు. ఇది గమనిం చిన టీచర్ సుధీర్ ఆగ్రహంతో ఊగి పో యి తనిష్క్‌ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టా డు. విషయం తెలుసుకున్న స్థాని కులు, బాలుడి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరింత కోపం పెంచుకున్న సుధీర్ శుక్రవారం పాఠశాలకు వచ్చిన తనిష్క్‌పై అకారణంగా దాడికి దిగాడు. వెన్నుపూస భాగంలో తీవ్రంగా కొట్టడంతో బాలుడు కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు బాలుడిని లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.