ప్రిన్సిపాల్‌ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్‌ | The Hostel Warden Beat the Students in Front of the Principal in Kadapa | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్‌

Published Wed, Nov 6 2019 8:42 PM | Last Updated on Wed, Nov 6 2019 8:49 PM

The Hostel Warden Beat the Students in Front of the Principal in Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : సెల్‌ఫోన్లు ఉన్నాయనే అనుమానంతో హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థులను దారుణంగా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌ ముందే విద్యార్థులను చితకబాదడం గమనార్హం. పదో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులను అనుమానంతో హింసించడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జయమని కంఠేశ్వర్‌ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, స్కూలు యాజమాన్యాన్ని నిలదీయగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement