hostel warden
-
మద్యానికి బానిసైన ప్రైవేట్ హాస్టల్ వార్డెన్.. విద్యార్థులతో అసభ్య ప్రవర్తన!
పిల్లల చదివిస్తూ ఆలనాపాలనా చూడాల్సిన వార్డెన్ దారి తప్పాడు. మద్యం తాగిన తర్వాత సైకోలా మారిపోతున్నాడు. విద్యార్థులను గదికి రప్పించుకుని బట్టలూడదీయించి నరకం చూపిస్తున్నాడు. ఎవరికై నా చెబితే మరింత పనిష్మెంట్ ఉంటుందని బెదిరించి శాడిజం ప్రదర్శిస్తున్నాడు. చివరకు విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం కొడిమి సమీపంలో సంసిధ్ ఇంటర్నేషనల్ (సబీఎస్‌ఈ) స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ ఆవరణలోనే హాస్టల్ కూడా ఉంది. విజయశంకర వరప్రసాద్ అనే వ్యక్తి హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఈయన వార్డెన్ విధులను పక్కనపెట్టి ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను తన గదిని బార్లా మార్చేశాడు. బయటి నుంచి మద్యం తెచ్చుకోవడం గదిలోనే పూటుగా తాగడం.. ఆ మత్తులో రోజూ కొంతమంది విద్యార్థులను గదికి రప్పించుకుని వికృత చేష్టలకు పాల్పడటం పరిపాటిగా మార్చుకున్నాడు. వార్డెన్ దెబ్బలకు తట్టుకోలేక కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు, పటిష్ట నిఘాతో కూడిన పర్యవేక్షణ ఉంటుందని పంపితే వార్డెన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంపై తల్లిదండ్రులు రగిలిపోయారు. ఆదివారం రాత్రి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్ వద్దకు వస్తున్న విషయం తెలుసుకున్న వార్డెన్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు వార్డెన్ గదిని తనిఖీ చేయగా అక్కడ తాగి పడేసిన మద్యం బాటిళ్లు వందల సంఖ్యలో కనిపించాయి. వార్డెన్‌పై కేసు నమోదు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్ విజయశంకర్ వరప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వార్డెన్ పరారీలో ఉన్నాడన్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపామని చెప్పారు. యాజమాన్యానికి నోటీసులు.. విద్యార్థులపై సంసిధ్ స్కూల్ హాస్టల్ వార్డెన్ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం అందడంతో డీఈఓ నాగరాజు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు సోమవారం స్కూలు కెళ్లి విచారణ చేపట్టారు. వార్డెన్ ప్రవర్తనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూలు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి.. సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణయ్య, కుళ్లాయిస్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ సంసిధ్ స్కూల్ హాస్టల్ వార్డెన్ నిత్యం మద్యం తెచ్చుకుని తాగుతున్నాడన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు మద్యం మత్తులో విద్యార్థులను విచక్షణారహితంగా చావబాదుతున్నాడన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, మంజు, పవన్, హరి, విశ్వ, రారాజు, శామ్యూల్, సిద్దు, గిరి, భీమేష్, సోము, చంద్రకాంత్, నందన్ పాల్గొన్నారు. -
మద్యం మత్తులో విద్యార్థులపై దాడి
వర్ని: వర్నిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులపై మోహన్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. బుధవారం ఉదయం ఎస్సీ హాస్టల్లో భోజనం ముగించుకొని పక్కనే ఉన్న జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ క్రీడామైదానంలో క్రికెట్ విద్యార్థులు క్రికెట్ ఆడటానికి వెల్లారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మోహన్ మద్యం మత్తులో విద్యార్థులతో గొడవపడి కర్రతో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో 12 మంది హాస్టల్ విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైస్కూల్ ఉపాధ్యాయులు గాయపడిన విద్యార్థులను వర్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో మోహన్ తాను క్రికెట్ ఆడుతానని గొడవపడినట్లు బాధిత విద్యార్థులు వెల్లడించారు. హాస్టల్ వార్డెన్ పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రుద్రురు సీఐ జాన్‌రెడ్డి వెల్లడించారు. -
Viral: మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్
క్రికెట్ క్రీడకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్‌కు సంబంధించిన ఈ వీడియోలో అబ్దుల్ అహద్ అనే కోచ్.. మైనర్ క్రికెటర్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ దర్శనమిచ్చాడు. యూపీలోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరలవ్వడంతో సదరు కోచ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్పీ సింగ్ సస్పెండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు అబ్దుల్ అహద్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అబ్దుల్ అహద్‌పై విచారణ జరుగుతుందని, డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్ఎన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించామని యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. కాగా, అబ్దుల్ అహద్ రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో కోచ్‌గా విధులు నిర్వహిస్తూనే అక్కడే వార్డన్‌గా కూడా పని చేస్తున్నాడు. ఈ స్టేడియంలో క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం ఉంది. వార్డన్ కూడా అయిన అబ్దుల్ అహద్ హాస్టల్లోనే మకాం వేసి తరుచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాడని యువ క్రీడాకారులు కంప్లైంట్ చేశారు. నెట్టింట చక్కర్ల కొడుతున్న వీడియోలో మైనర్ క్రికెటర్ ఒంటిపై షర్టు లేకుండా కోచ్‌కు అయిష్టంగా బాడీ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో గతేడాది ఆగస్ట్‌లో రికార్డు చేసినదిగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. స్పోర్ట్స్ హాస్టల్లలో ఉండే యువ క్రీడాకారులు, క్రీడాకారిణులు కోచ్, ఇతర సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తున్నారు. కోచ్‌లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఇటీవలికాలంలో చాలా కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయనగరం జిల్లాలో హాస్టల్ వార్డెన్ సాహసం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో హాస్టల్ వార్డెన్ పెద్ద సాహసం చేశారు. వ్యక్తిగత పనుల మీద వార్డెన్ కళావతి తన స్వగ్రామానికి వచ్చారు. అదే సమయంలో భారీ వర్షాలకు గజపతినగరం మండలం మర్రివలస దగ్గర చంపావతి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సరిగ్గా అదేసమయంలో వార్డెన్ హాస్టల్లోని విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించారు. ఆ వెంటనే కళావతి తన సోదరుల సాయంతో నది దాటి ఒడ్డుకు చేరారు. ప్రాణాలకు తెగించి విద్యార్థుల గురించి ఆలోచించిన వార్డెన్ కళావతిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చదవండి: (రూ.కోటితో విఘ్నేశ్వరుడు ధగధగ) -
శ్రీచైతన్య పాఠశాలలో దారుణం
సాక్షి, హైదరాబాద్(లింగోజిగూడ): 9వ తరగతి విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పాత రోడ్డులోని శ్రీ చైతన్య హాస్టల్లో పని చేస్తున్న కృష్ణ గత వారం రోజులుగా 9వ తరగతి బాలుడుతో పాటు ఇతర విద్యార్థులను రాత్రి సమయంలో పక్కన పడుకుని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు బాలుడు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో బుధవారం హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్ కృష్ణను పాఠశాల యజమాన్యం మంగళవారమే హాస్టల్ నుంచి తొలగించింది. హాస్టల్‌కు అనుమతి లేదని, ఇప్పటికే నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హీర్యానాయక్ తెలిపారు. చదవండి: (Hyderabad: ఇక కీలక ఘట్టమే.. నగరంలో ఆ ఫ్లైఓవర్లన్నీ బంద్) -
కన్నీరు తెప్పించే డెత్‌నోట్: అంతేసి ఫీజులు కట్టి.. నరకంలో పడేశారు
బనశంకరి: ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్ వార్డెన్ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుళ దంపతుల కుమారుడు పూర్వజ్ (14) ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి మంజుళ పుట్టిన రోజు. తల్లితో ఒకసారి మాట్లాడతానని, మొబైల్ ఇవ్వాలని బాలుడు హాస్టల్ వార్డెన్‌ను కోరగా, అందుకు వార్డెన్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్ శనివారం రాత్రి 12 గంటల వరకు ఒంటరిగా గడిపాడు. తరువాత డెత్‌నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. చదవండి: (Telangana: ఆకాశంలో అద్భుతం) కన్నీరు తెప్పించే డెత్‌నోట్ ఆదివారం ఉదయం పూర్వజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే హాస్టల్లో కలకలం చెలరేగింది. బాలుని ఆత్మహత్యకు విద్యా సంస్థ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెనే కారణమని మంజుళ సోదరుడు అరుణ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెత్‌నోట్‌లో.. ‘‘అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు.’’ అని బాలుడు రాసిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వార్డెన్ నిర్వాకం.. హస్టల్ గదులను శుభ్రం చేయాలని బాలికకు వేధింపులు
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఒక హస్టల్ వార్డెన్ బాలికపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బాలికను హస్టల్లోని గదులను శుభ్రంచేయాల్సిందిగా వేధించింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక.. విషంతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. 17 ఏళ్ల బాలిక తంజావురు జిల్లాలోని మిఛేల్పట్టి గ్రామంలోని ప్రభుత్వ హస్టల్ ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో బాలికను హస్టల్ వార్డెన్ సగయమేరీ గదులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతటితో ఆగకుండా బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించింది. దీంతో బాలిక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాలికను మెరుగైన వైద్యం కోసం తంజావురు ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కాగా, జనవరి 18న బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వార్డెన్ ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయాల్సిందిగా తనను వేధిస్తుండేదని తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హస్టల్వార్డెన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక చికిత్స పొందుతు జనవరి 19న మృతి చెందింది. బాలిక మృతికి హస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హస్టల్ వార్డెన్‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
పేదవాళ్లైతే పరిస్థితేంటి ?
పలమనేరు: ‘నేను ప్రభుత్వ ఉద్యోగి గనుక ఎలాగో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటా.. ఇదే పరిస్థితుల్లో పేదవాళ్లెవరైనా ప్రభుత్వాస్పత్రి మీద నమ్మకంతో వస్తే వారి పరిస్థితేంటి ?’ అని పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి హాస్టల్ వార్డెన్ మధుసూధన్‌రెడ్డి స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరుపై స్పందించిన తీరు. శనివారం ఉదయం పలమనేరులో ఉంటున్న మధుసూదన్‌రెడ్డి భార్య నేత్రకు ప్రసవనొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు తొలికాన్పు సిజేరియన్ కావడంతో రెండోకాన్పు ఆపరేషన్ చేయాల్సిందేనని చెప్పారు. అందుకు అతను సరే అన్నాడు. అయితే ఆపరేషన్ చేసేందుకు తమవద్ద రక్తం లేదని చెప్పారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో చేసేదిలేక అతను తన భార్యను హుటాహుటిన హొసకోటలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సిజేరియన్ చేశారు. అందుకుగానూ రూ.లక్ష దాకా ఖర్చు అయినట్లు బాధితుడు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మరో పేదవాడికి రాకుండా చూడాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వీణాకుమారిని సాక్షి వివరణ కోరగా వాళ్లు ఆస్పత్రికి రాగానే కరోనా టెస్ట్ చేయాలన్నారని, దీంతో కాదన్నామని తెలిపారు. తమ ఆస్పత్రిలో రక్తం లేదని అందుకే డ్యూటీ డాక్టర్ చిత్తూరుకు రెఫర్ చేశారన్నారు. ప్రసవ నొప్పులతో ఈ ఆస్పత్రికి వచ్చేవారికి రెఫర్లు మాత్రం తప్పడం లేదు. డీసీహెచ్ఎస్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ సైతం ఈ విషయమై ఇక్కడి వైద్యులను పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతోంది. -
పసి బాలుడిపై వార్డెన్ లైంగిక దాడి
డెహ్రాడూన్ : లాక్డౌన్ కారణంగా స్కూల్ హాస్టల్లో ఒంటరిగా చిక్కుకుపోయిన తొమ్మిదేళ్ల బాలుడిపై వార్డెన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పసి బాలుడని చూడకుండా తన వ్యక్తిగత పనులు చేయిస్తూ ప్రతి రోజు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఓ ప్రేవేటు పాఠశాలలో గత నెలలో ఈ ఘోరం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవల డెహ్రాడూన్‌కు వచ్చారు. కానీ విద్యార్థిని అప్పగించేందుకు తొలుత స్కూలు యాజమాన్యం ఒప్పకోలేదు. అనుమానం వచ్చి తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గత్యంతరం లేక బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికెళ్లిన బాలుడు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించారు. తనతో వ్యక్తిగత పనులను చేయించుకుంటూ లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పాడు.దీంతో బాలుడు తల్లిదండ్రులు శనివారం రోజు హరీశ్(30) అనే వార్డెన్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పొక్సో చట్టంతో పాటూ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందిడుని అరెస్ట్ చేశారు. -
లేనిది ఉన్నట్టు... వార్డెన్ కనికట్టు
ప్రకాశం, చీరాల: హాస్టల్ వార్డెన్ బాగోతం ఏసీబీ అధికారుల దాడులతో బట్టబయలైంది. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి పిల్లల పేరుతో నిధులన్నీ జేబులో వేసుకుంటున్నాడని తేటతెల్లమైంది. వాడరేవు బీసీ బాలుర వసతి గృహంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు గురువారం ఉదయం ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో ఏసీబీ ఏఎస్పీ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు వసతి గృహంలో దాడులు చేశారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హాస్టల్లో బాలురు కేవలం 9 మంది ఉండగా వార్డెన్ బండారు హరిప్రసాదరావు రికార్డుల్లో 86 మంది నివాసం ఉంటున్నారని నమోదు చేశారు. ఇలా ఏడాదికి రూ.10 లక్షల వరకు నిధులను తన జేబుల్లోకి మళ్లించుకుంటున్నాడు. ఈ అక్రమ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండటంతో వార్డెన్ హరిప్రసాదరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారు కావడం విశేషం తనిఖీ అధికారులను మభ్య పెడుతూ.. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.1000, హైస్కూల్ విద్యార్థులకు రూ.1200 చెల్లిస్తుంది. ఈ నిధులతో లేనిది ఉన్నట్టు... వార్డెన్ కనికట్టువసతిగృహ విద్యార్థులకు అల్పాహారం, భోజనం, కాస్మోటిక్ ఛార్జీలను ప్రభత్వుం అందిస్తుంది. వార్డెన్ ఏడాదిన్నర నుంచి విద్యార్థులు హాస్టల్లో ఉండకపోయినప్పటికీ రికార్డుల్లో మాత్రం 86 మంది ఉంటున్నారని నమోదు చేస్తున్నారు. ఎప్పుడైనా తనిఖీలకు వచ్చిన జిల్లా అధికారులను ఏదో విధంగా మభ్యపెటుతున్నారు. దీంతో విద్యార్థులు లేకుండానే వారిపేర్లతో వచ్చే నిధులను సుమారు రూ.18లక్షల వరకు ఏడాదిన్నర కాలంలోనే వార్డెన్ మింగేశారని సమాచారం. ఈ కోణంలోనే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆహార పదార్థాలూ స్వాహా.. వాడరేవు బీసీ బాలుర వసతిగృహం నిర్వహణ అధ్వానంగా ఉందని, వార్డెన్ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారని ఫిర్యాదుతో గుంటూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులతో దాడులు చేసినట్లు ఏసీబీ ఏఎస్పీ సురేష్ తెలిపారు. ఈ బాలుర వసతిగృహంలో రికార్డుల్లో మాత్రం 86 మంది విద్యార్థులు ఉంటున్నారని చూపుతుండగా వాస్తవంగా 9 మంది మాత్రమే నివశిస్తున్నారన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, పాలు, కోడిగుడ్లు, ఇతర నిధులను అక్రమంగా స్వాహా చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. 9 మందికి ప్రతి రోజు ఒకటిన్నర లీటరు పాలు, ఒకటిన్నర లీటరు పెరుగు, నాసిరకం కూరగాయలతో భోజనం అందిస్తున్నారని పాలు, ఆహార పదార్థాలు అందించే వారిని విచారించగా తమకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారన్నారు. వసతిగృహంలో విద్యార్థులకు నూతన మంచాలు, దుప్పట్లు ఉన్నాయని, కూరగాయలు, అరటి పండ్లు మాత్రం కుళ్లిపోయి ఉన్నాయన్నారు. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశులు సమక్షంలో వసతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించామన్నారు. కానీ హాస్టల్ వార్డెన్ బండారు హరిప్రసాద్‌రావు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎంతకాలంగా రికార్డులను తారుమారు చేస్తు అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుసుకునేందుకు హాస్టల్ ఆఫీసు గదికి తాళం వేశారని, ఆఫీసులో రికార్డులు చూస్తే మరిన్ని అక్రమాలు తెలుస్తాయన్నారు. తమ దాడి, విచారణలో తేలిన అంశాలను నివేదిక రూపంలో జిల్లా ఉన్నతాధికారులకు అందిస్తామని, హాస్టల్ వార్డెన్‌ను పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. ఇంటి నుంచి వార్డెన్ పరారీ.. వాడరేవు బాలుర వసతిగృహంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో వసతిగృహం వార్డెన్ బండారు హరిప్రసాద్‌రావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లోంచి ఉదయాన్నే పరారయ్యాడు. అధికారులు ఇంటికి వెళ్లినప్పటికీ అందుబాటులో లేడు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారికి కూడా సమాచారం అందించారు. హాస్టల్ వార్డెన్ల వెన్నులో వణుకు... మండలంలోని వాడరేవు బీసీ వసతిగృహంలో జరిగిన అక్రమాలపై మొదటిసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో చీరాల ప్రాంతంలో ఉన్న వసతిగృహాల నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. చీరాల ప్రాంతంలో ఉన్న పలు బాలురు, బాలికల వసతిగృహాల వార్డెన్లు వణుకుతున్నారు. ఇన్నాళ్లు విద్యార్థుల సొమ్మును అప్పనంగా కాజేసిన వార్డెన్లు అక్రమాలపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచడం, దాడులు చేయడంతో వార్డెన్లు భయాందోళనకు గరవుతున్నారు. -
ప్రిన్సిపాల్ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : సెల్ఫోన్లు ఉన్నాయనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ విద్యార్థులను దారుణంగా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ముందే విద్యార్థులను చితకబాదడం గమనార్హం. పదో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులను అనుమానంతో హింసించడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జయమని కంఠేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, స్కూలు యాజమాన్యాన్ని నిలదీయగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
లైటు వేశాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్..
సాక్షి, సిటీబ్యూరో: కడారి వివేకానంద్. తొమ్మిదో తరగతి విద్యార్థి. నగర శివార్లలోని శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. రాత్రి 9.30 గంటల తరువాత కూడా ఆ విద్యార్థి తన హాస్టల్ గదిలో లైటు ఆర్పేయకపోవడంతో ఆగ్రహానికి గురైన హాస్టల్ వార్డెన్ ఆ అబ్బాయిని చితకబాదాడు. దాంతో అతడి చేయి విరిగిపోయింది. ♦ నేరేడ్మెట్లోని మరో ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న యశ్వంత్ అనే చిన్నారిపైన కూడా స్కూల్ టీచర్ అలాగే చేయి చేసుకోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బోడుప్పల్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ♦ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 పని దినాల్లో 14 మంది చిన్నారులు ఈ తరహా కార్పొరల్ పనిష్మెంట్లకు గురైనట్లు స్వచ్చంద సంస్థలు వెల్లడిస్తున్నాయి. పిల్లలకు విద్యాబుద్ధులు బోధించే క్రమంలో ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. శారీరకంగా శిక్షిస్తేనే చెప్పినట్లు వింటారనే అపోహ, స్కూల్ యాజమాన్యాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల టీచర్లు ‘బెత్తం పాఠాల’కు పాల్పడుతున్నారు. కేవలం కొట్టడమే కాకుండా అనేక రకాలుగా పిల్లలను శారీరకంగా హింసిస్తున్నట్లు పలు స్వచ్చంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏటా 250 నుంచి 300 వరకు ఈ తరహా కార్పొరల్ పనిష్మెంట్ కేసులు నమోదు కావడం గమనార్హం. మూర్తిమత్వ వికాసానికి అడ్డంకులు.... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ బోధనా సదుపాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వైవిధ్యంగా బోధించాల్సిన టీచర్లు అందుకు విరుద్ధంగా పాతకాలం నాటి ‘బెత్తం’నే ఆశ్రయిస్తున్నారు. కొడితేనే చెప్పిన మాట వింటారనే అపోహ ఒకవైపు అయితే మరోవైపు పిల్లల వెనుకుబాటుకు టీచర్లనే బాధ్యులను చేసే యాజమాన్య వైఖరి, వాళ్ల జీతభత్యాల్లో కోత విధించడం, ఉత్తమ ఫలితాల కోసం టీచర్లపై ఒత్తిళ్లను తీవ్రతరం చేయడం వంటి అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో పిల్లల మూర్తిమత్వ వికాసం మసకబారుతుంది. చిన్నారుల ఆలోచనల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి దెబ్బతింటుందని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు. క్రమంగా చదువుకోవాలనే ఆసక్తికి దూరమవుతున్నారు. భావి జీవితంపైన ఈ అనాసక్తి దుష్ప్రభావం చూపుతుంది. ‘కార్పొరల్ పనిష్మెంట్ల వల్ల చిన్నారులు అన్ని రకాల హక్కులను కోల్పోతున్నారు. ప్రత్యేకించి స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యంపైన, విద్యాహక్కులపైన ఇది ప్రభావం చూపుతుంది.’ అని ఆందోళన వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కూడా టీచర్లు పిల్లలపై చేయి చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తరగతి గదిలో ఒక చిన్నారిని తీవ్రంగా కొట్టడం వల్ల మిగతా విద్యార్థులు భయపడి చెప్పిన మాట వింటారనే అపోహ కూడా ఉంది. కానీ దీనివల్ల పిల్లలు హాయిగా చదువుకోలేని వాతావరణం నెలకొంటోంది. శిక్షలు ఇలా.... ♦ పిల్లలను శిక్షించడంలో టీచర్లు అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. ♦ బెత్తంతో గట్టిగా విచక్షణ కోల్పోయి కొడుతున్నారు. దీంతో చిన్నారులు లేత శరీరం కందిపోయి తీవ్రమైన బాధను, నొప్పిని అనుభవిస్తున్నారు. కొన్ని సార్లు ఎముకలు విరుగుతున్నాయి. ఇలాంటి కేసుల్లో డాక్టర్లు సైతం విస్మయానికి గురవుతున్నారు. ♦ పిల్లలను గంటల తరబడి ఎండలో నిల్చోబెడుతున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ♦ అర్దనగ్నంగా నిల్చోబెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానిస్తున్నారు. ♦ ఫీజులు చెల్లించలేని వారిని వేరుగా కూర్చోబెట్టడం వల్ల తీవ్రమైన అవమానానికి గురవుతున్నారు. ♦ ఈ విధమైన హింసకు, వివక్షకు గురికావడం వల్ల పిల్లలు మారుతారనే భావన ఉంది. ♦ కానీ ఇలాంటి హింసలతో వాళ్లు పూర్తిగా చదువులకు దూరమవుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.తమకు ఇక చదువు రాదనే నిరాశ పిల్లల భావిజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చట్టాలు ఏం చెబుతున్నాయి.... ♦ పిల్లలపైన ఎలాంటి హింస, వేధింపులు, వివక్షత చూపినా చట్టప్రకారం నేరమే. జువైనెల్ యాక్ట్ 1975, 1981 చట్టాల ప్రకారం న్యాయస్థానాలు మూడున్నరేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. ♦ సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, టీచర్ల సంరక్షణలో, ఆధీనంలో ఉంటారు. వాళ్లు ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా ఎదిగే పరిస్థితులు ఉండాలి. ♦ పిల్లలకు సరైన పద్ధతిలో నేర్పించలేని ఉపాధ్యాయులే బెత్తంను ఆశ్రయిస్తున్నట్లు స్వచ్చంద సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. లైటు వేశాడని విద్యార్థిని చితకబాదిన వార్డెన్ శామీర్‌పేట్: హాస్టల్ రూమ్‌లో లైటు వేశాడని ఓ విద్యార్థిని పాఠశాల వార్డెన్ చితకబాదిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబసభ్యులు, శామీర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని మచ్చబొల్లారంకు చెందిన సతీష్‌కుమార్ కుమారుడు వివేకానంద శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని శాంతినికేతన్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అక్కడే పాఠశాల హాస్టల్లో ఉంటున్నాడు. కాగా ఈ నెల 2న రాత్రి సమయంలో హాస్టల్లోని తన గదిలో వివేకానంద తాళంచెవి కన్పించకపోవడంతో లైట్ వేసి వెతుకుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన హాస్టల్ వార్డెన్ రాకేష్ లైట్లు ఎందుకు వేశావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వివేకానంద ఎడమ చేయి వాచింది. బాగా నొప్పిపెట్టడంతో స్కూల్ యాజమాన్యం అతడికి స్కూల్లోనే ప్రాథమిక చికిత్స జరిపారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఈ నెల 8న తండ్రికి సమాచారం ఇచ్చారు. ఫుట్‌బాల్ ఆడుతుండగా ఎడమచేతికి గాయం తగిలిందని, విజయ హెల్త్‌కేర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని వివేకానంద తండ్రి సతీష్‌కుమార్‌కు తెలిపారు. దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి ఎక్స్‌రే తీయగా చెయ్యి విరిగిందని వైద్యులు నిర్ధారించారు. తన కుమారుడి చెయ్యి విరగడానికి కారణమైన హాస్టల్ వార్డెన్‌తో పాటు శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి సతీష్‌కుమార్ శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
విద్యార్థిని ఆత్మహత్య.. మనస్తాపంతో వార్డెన్ కూడా..
అమ్మా నాన్నా బై. నా వల్లే ద్రాక్ష చనిపోయింది. తమ్ముడ్ని మీరు బాగా చూసుకోండి. సుచరిత, అంజలి ఇద్దరూ బాగా ఉండి.. అమ్మను బాగా చూసుకోండి. జైన నా ప్రాణం..రాజు నా ఊపిరి. నన్ను, ద్రాక్షాయినిని ఇద్దరినీ ఒకేచోట పెట్టండి. ప్లీజ్ అమ్మా! నా ఫ్రెండ్స్ అందరికీ బై. ద్రాక్ష, అమ్మ, నాన్నకు సారీ. అయినా ద్రాక్ష తిరిగి రాదు. మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలనుంది.. కానీ వీలులేదు. సారీ అంకుల్. అందుకే నేనే తన వద్దకు పోతున్నా. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. నా మనసాక్షి నన్ను చనిపో అంటోంది. అమ్మా.. నేను మంచి జాబ్ చేసి, నిన్ను బాగా చూసుకోవాలని అనుకున్నా. నా జీవితమంతా రాజుతో కలసి ఉండాలని అనుకున్నా. కానీ నా వల్ల ద్రాక్ష చనిపోయింది. ఒక అమ్మాయి జీవితం పోయింది. నన్ను క్షమించండి. ఇదీ ఆత్మహత్యకు ముందు పుష్పావతి అనే అమ్మాయి పడిన సంఘర్షణ. స్నేహితురాలిగా ఉన్న హాస్టల్ విద్యార్థిని అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనోవేదనకు గురైన వార్డెన్ పుష్పావతి కూడా బలవన్మరణానికిపాల్పడింది. ఈ విషాదకర ఘటనలు కర్నూలు నగరంలో చోటుచేసుకున్నాయి. కర్నూలు(హాస్పిటల్): నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ద్రాక్షాయిని(17), అక్కడి హాస్టల్ వార్డెన్ ఎం.పుష్పావతి (24) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ద్రాక్షాయిని(17) శనివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ద్రాక్షాయిని తండ్రి నాగేశ్వరయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ద్రాక్షాయిని అందరికంటే చిన్నది. ఆమె సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో బైపీసీ సెకండియర్ చదువుతూ హాస్టల్లోనే ఉండేది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఆహారం సరిగా తీసుకోలేదని, అల్సర్‌తో బాధపడుతుండేదని తల్లిదండ్రులు చెప్పారు. హాస్టల్ వార్డెన్ పుష్పావతి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద విలపిస్తున్న పుష్పావతి కుటుంబ సభ్యులు వార్డెన్ పుష్పావతి కూడా.. ద్రాక్షాయిని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన హాస్టల్ వార్డెన్ పుష్పావతి కూడాఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ పలువురిని కదిలించింది. ఆమె స్వగ్రామం మిడుతూరు మండలం జలకనూరు. తండ్రి ఏసన్న, తల్లి రాజమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరుకుమారులు. రెండో కుమార్తె అయిన పుష్పావతి డిగ్రీ వరకు చదువుకుంది. ఇటీవల ఎస్ఐ పరీక్షల్లోనూ పాల్గొంది. ఇంటికి ఆసరాగా ఉండేందుకు హాస్టల్వార్డెన్గా పనిచేసేది. విద్యార్థిని ద్రాక్షాయిని, ఈమె ఇద్దరూ స్నేహితులుగా ఉండేవారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ద్రాక్షాయిని మృతి చెందడం, ఆ తర్వాత కొన్ని గంటలకే నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో కేసీ కెనాల్‌కు వేసిన కంచె పైపునకు పుష్పావతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. విషయం తెలిసి కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. ఈ ఘటనలపై సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. సంఘటన తర్వాత పోలీసులు మినహా ఎవ్వరినీ కళాశాల లోపలికి అనుమతించలేదు. ఆత్మహత్యలకు సంబంధించి కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలుడిపై వార్డెన్ లైంగికదాడి
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలంలోని మావల శివారు ప్రాంతంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మావల ఎస్సై ముజాహిద్ కథనం ప్రకారం..మావల శివారు ప్రాంతంలోని ఎస్ఆర్ ప్రైం కార్పొరేట్ స్కూల్ బాలుడిపై మంగళవారం రాత్రి అదే పాఠశాలలో రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ లైంగిక దాడి చేయగా విషయాన్ని బాలుడు తోటి విద్యార్థులకు, వసతి గృహాం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం పాఠశాలకు చేరుకున్న వారు జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆగ్రహించిన పోషకులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మావల ఎస్సై పాఠశాలకు చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడి పోషకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో కొరవడుతున్న పర్యవేక్షణ.. పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతా ఫీజులు చెల్లిస్తున్నా, తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనపై ఆందోళన చెందుతున్నారు. నిర్వాహకుల పర్యవేక్షణ లోపంతో పాఠశాల, కళాశాలల్లో లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రార్థనలో మాట్లాడాడని...
మెంటాడ: పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ మెంటాడ మండలం కుంటినవలసలో ఉన్న హిమ్మానియల్ గాస్పెల్ ఫైత్ మెయిస్ట్రీస్ (క్రిస్టి్టయన్)హాస్టల్లో ఉంటూ దత్తిరాజేరు మండలం, మరడాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శని వారం ఉదయం ప్రేయర్లో చంద్రశేఖర్, నవీన్ తో మాట్లాడుతున్నాడని వార్డెన్ అనుషా డైరెక్టర్ శ్యామ్యల్తో చెప్పారు. అంతే... ఆయన బెత్తానికి పనిచెప్పారు. చంద్రశేఖర్‌ను దండించారు. తీవ్రం గా గాయపరిచారు. శరీరంపై బెత్తం మచ్చలు తేరాయి. తలకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ హాస్టల్ నుంచి మరడాం పాఠశాలకు వచ్చి తరగతి గదిలో సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే హెచ్ఎం రావాడ భాస్కరరావుకు తెలియజేశారు. ఏం జరిగిందని చంద్రశేఖర్‌ను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ చెప్పాడు. ప్రేయర్లో మా ట్లాడినందుకే ఇలా పైశాచికంగా కొట్టడంపై తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యం లో ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి శరీరంపై ఉన్న దెబ్బలను గుర్తిం చిన పోలీసులు చికిత్స కోసం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు సత్యవతి, తిరుపతిలు నిరుపేదలు. కుమారుడు చంద్రశేఖర్‌ను బాగా చదివించాలన్న ఉద్దేశంతో హాస్టల్లో చేర్పించి కూలిపనుల కోసం విజయవాడ వెళ్లిపోయారు. విద్యార్థి శరీంపై దెబ్బలను చూసిన వారంతా అయ్యయ్యో అంటూ హాస్టల్ డైరెక్టర్ శ్యామ్యల్ను దూషిస్తున్నారు. ఆయనపై విద్యాహక్కుచట్టం ప్రకారం శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
బాలికల హాస్టల్లో దుర్భర పరిస్థితులు!
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని చిన్నాయిగూడెం బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బాలికల వసతి గృహంలో భారీగా అవకతకవలు జరిగినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా దుర్భరమైన పరిస్థితుల్లో నడుమ హాస్టల్లో బాలికలు గడుపుతున్నారని, హాస్టల్లోని బాత్రూమ్లు, కిచెన్‌తోపాటు పరిసర ప్రాంతాలు ఏమాత్రం శ్రుభంగా లేవని తెలిపారు. వసతి గృహంలో భారీగా బియ్యపు నిలువలు ఉన్నాయని, 865 కేజీలకుగాను 2500 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉండాల్సిన పరిమాణంలో వంట సరుకులు లేవని, మెనూలో ఉన్న ఆహార పదార్ధాలు ఎందుకు పిల్లలకు పెట్టడం లేదని హాస్టల్ వార్డెన్‌ను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో వార్డెన్ ఆటలాడుతున్నారని అధికారులు మండిపడ్డారు. -
బాలికల ఆందోళన
సాక్షి, జయపురం : హాస్టల్ వార్డెన్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కొరాపుట్ జిల్లా బందుగాం సమితి కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు బందుగాం సమితి విద్యాధికారి (బ్లాక్‌ఎడ్యుకేషన్ ఆఫీసర్) కార్యాలయానికి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాల వార్డెన్ లలిత బిశ్వాల్ అనేక సమయాలలో హాస్టల్లో తమపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమపట్ల వార్డెన్ వ్యవహరిస్తున్న తీరు, వేధింపులపై పాఠశాల విద్యార్థినులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి(బీఈఓ)కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ బీఈఓ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమార్గం లేక బీఈఓ కార్యాలయానికి తీళాలు వేసి ఆందోళన చేపట్టినట్లు విద్యార్థినులు వెల్లడించారు. విద్యార్థినులు మూకుమ్మడిగా వచ్చి బీఈఓ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడ బైఠాయించారు. వార్డెన్‌ను బదిలీ చేసేంత వరకు తాము ఆందోళన విరమించేంది లేదని ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. డీపీసీ హామీతో ఆందోళన విరమణ ఈ విషయం తెలిసిన డీపీసీ మహేష్ చంద్రనాయక్ జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బందుగాం చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో చర్చలు జరిపారు. దాదాపు రెండుగంటల పాటు విద్యార్థినులతో చర్చించి వారి ఆరోపణలు తెలుసుకుని ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిస్తామని అంతేకాకుండా పది రోజుల్లో సమస్యను పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో విద్యార్థినులు శాంతించి సాయంత్రం 5 గంటల తరువాత ఆందోళన విరమించారు. అనంతరం ఆయన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినుల ఆరోపణలపై ప్రధానోపాధ్యాయునితో చర్చించారు. అక్కడ కూడా వార్డెన్‌ను బదిలీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. -
ఇదేం శిక్ష?
జహీరాబాద్: చిన్న విషయమై ఇద్దరు విద్యార్థులు పోట్లాడుకోగా హాస్టల్ వార్డెన్ వారిని తలకిందులుగా నిలబడాలంటూ శిక్ష విధించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్టీ హాస్టల్లో ఆదివారం చోటుచేసుకుంది. శేఖాపూర్ తండాకు చెందిన పరమేశ్వర్, సీహెచ్ లక్ష్మణ్ హాస్టల్లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నారు. శనివారం వీరి చిన్న విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వార్డెన్ యాదయ్య ఇద్దరినీ పిలిచి తలకిందులుగా నిలిపి శిక్షించాడు. వార్డెన్ నిర్వాకాన్ని వీడియో తీసిన కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఈ విషయమై వార్డెన్ యాదయ్యను వివరణ కోరగా విద్యార్థులు హాస్టల్లోనే ఉంటూ సక్రమంగా బడికి వెళ్లడం లేదని, అందుకే 2 నిమిషాల పాటు శిక్షించానని తెలిపారు. ఇకపై వారు బడికి డుమ్మా కొట్టకుండా ఉండేందుకే భయపెట్టాను తప్ప శిక్షించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. -
అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై కేసు నమోదు
మేడ్చల్: ప్రైవేట్ హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్న యువకుడు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మేడ్చల్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక హైటెక్ మోడ్రన్ హైస్కూల్లో వార్డెన్‌గా పని చేస్తున్న రవితేజ అదే హాస్టల్లో ఉంటున్న బాలికల పట్ల గత కొన్నిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని విషయం తన తల్లికి చెప్పడంతో.. విషయం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లరి చేస్తున్నాడని విద్యార్థిపై దారుణం
హయత్‌నగర్: అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాదాడు. కంటికి తీవ్రగాయమై చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... శంషాబాద్ సమీపంలోని చిన్న తూఫ్రాన్ పేటకు చెందిన దయాసాగర్ కుమారుడు మనీష్(13) హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి అల్లరి చేస్తున్నాడనే కారణంగా వార్డెన్ లక్ష్మణ్ అతడిని చితకబాది, తలను బెంచీకేసి కొట్టాడు. దీంతో పెదవులతో పాటు కంటిలోపల గాయాలయ్యాయి. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో విద్యార్థి తల్లిదండ్రులు శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలి: బాలల హక్కుల సంఘం విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను జువైనల్ యాక్ట్ ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ, దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మండల ఎస్ఎఫ్ఐ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మత్తుమందిచ్చి హాస్టల్ నిర్వాహకుడి నిర్వాకం!
అమీర్‌పేట: యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి యత్నించాడో హాస్టల్ నిర్వాహకుడు. ఈ ఘటనలో నిందితుడిని ఎస్సార్‌నగర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం.. గురజాలకు చెందిన నరేందర్‌రెడ్డి అనే యువకుడు 10 నెలల కిత్రం నగరానికి వచ్చి బల్కంపేట బీకేగూడలో 'అర్రు' హాస్టల్ నడుపుతున్నాడు. కోయంబత్తూర్‌కు చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇతని హాస్టల్లో దిగింది. రూంలోని బ్యాగులో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో ఆమె నరేందర్‌రెడ్డికి ఫోన్ చేసిచెప్పింది. హాస్టల్ వద్ద ఎందుకు బీకేగూడ పార్కు వద్దకు వస్తే మాట్లాడతానని చెప్పడంతో ఆమె వెళ్లింది. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న ఓ రూమ్‌కు తీసుకెళ్లిన నరేందర్‌రెడ్డి బలవంతంగా ఆమె నోట్ల సిగరెట్ పెట్టాడు. దీంతో ఆమెకు మత్తు వచ్చినట్లైంది. అతడి పన్నాగం కనిపెట్టిన యువతి అతడి నుంచి తప్పించుకొని బాలానగర్‌లో ఉంటున్న తన పెద్దమ్మ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆమె సహాయంతో ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నరేందర్రెడ్డిపై లైంగికదాడికి యత్నం కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. -
పిల్లాడిని బ్యాటుతో తలపై బాదాడు!
కోల్‌కతా: అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కోపంతో 12 ఏళ్ల బాలుడిపై ఓ హాస్టల్ వార్డెన్ తన ప్రతాపం చూపాడు. ఏకంగా క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ పిల్లాడి తలపై బాదాడు. దీంతో గాయమైంది. ఈ ఘటన గత నెల 30న పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రాజర్హట్ లో ఉన్న నార్ పాయింట్ సీనియర్ సెంకడరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. దీని గురించి బాధిత విద్యార్థి మహమ్మద్ సాహిన్ మొండల్ (12) తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై దాడికి కారణమైన వార్డెన్ దేబ్జ్యోతి దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనను మగుగునపడేయాలని స్కూలు యాజమాన్యం భావించిందని, అందువల్లే ఆలస్యంగా ఘటన వెలుగుచూసిందని బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. -
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉంది
-
'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే
ఆర్కిటెక్చర్ కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి స్పష్టీకరణ సాక్షి, గుంటూరు, ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది. దీంతో ఐదుగురు విద్యార్థినుల్ని హాస్టల్నుంచి పంపించేశాం. అయితే వారిపై విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని తెలిపారు. ప్రిన్సిపల్ బాబూరావు ఆదేశాలతోనే విద్యార్థులు రిషితేశ్వరి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారన్నారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. మృతదేహాన్ని తరలించాలని తానెవర్నీ ఆదేశించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకే పార్టీలో డ్యాన్స్ చేశా నన్నారు. హాస్టల్ వార్డెన్ రాజీనామా.. వర్సిటీలో బాలికల వసతిగృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూపరాణి జూలై 30నే రాజీనామా చేసినట్టు వెల్లడైంది. రిషితేశ్వరి ఘటన అనంతరం తనపై విమర్శలు రావడంతో కలత చెంది రాజీనామా చేసినట్లు ఆమె తెలిపింది. తాను వార్డెన్‌గా నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ చేయాలని కోరినా కొనసాగించారన్నారు. కాగా రిషితేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వరకు వార్డెన్‌గా కొనసాగానన్నారు. విచారణ కమిటీ గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నియమించిన విచారణ కమిటీ గడువును ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
'హాస్టల్ లో ర్యాగింగ్ వాస్తవమే'
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నాగార్జున యూనివర్సిటీ బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూప రాణి స్పందించారు. ఆమె కేసు విషయమై శనివారమిక్కడ జిల్లా లోక్ అదాలత్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే రిషితేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వార్డెన్ చెప్పారు. 'రిషితేశ్వరి మృతి చెందిన రోజు నేను హాస్టల్ కు వచ్చేసరికి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అప్పటికే రిషితేశ్వరి చనిపోయిందని వర్సిటీ వైద్యాధికారి ధృవీకరించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు' అని స్వరూపరాణి తెలిపారు. -
కంచం కడగలేదని చితకబాదిన వార్డెన్
బనగానపల్లె (కర్నూలు జిల్లా) : భోజనం చేసిన తర్వాత కంచం సరిగా కడగలేదని ఒక విద్యార్ధిని హాస్టల్ వార్డెన్ కర్రతో చితకబాదాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..7వ తరగతి విద్యార్థి జనార్థన్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కంచం సరిగా కడగలేదని వార్డెన్ గమనించాడు. దీంతో బాలుడిని కర్రతో చితకబాదాడు. వార్డెన్ తీవ్రంగా కొట్టడంతో బాలుడు ఈ విషయాన్ని తండ్రి రాములు నాయక్‌కు చెప్పాడు. దీంతో రాములు నాయక్ స్థానిక పోలీసు స్టేషన్లో వార్డెన్‌పై ఫిర్యాదు చేశాడు. రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన కుల సంఘాలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ధర్నాకు దిగాయి. -
అన్నమో ‘చంద్రశేఖరా’!
వంద మందికి నాలుగు అంటే నాలుగే స్నానపు గదులు., చదువుకునేందుకు సరైన చోటు కరువు., పసుపు, కారం కలిపిన నీళ్ల చారు, పిండి ముద్దలాంటి అన్నం., ఆకలితో అలమటిస్తూ కొందరు విద్యార్థుల సొమ్మసిల్లిపడిపోయిన ఘటనలు ఇక్కడ అనేకం. సోమ, మంగళవారాల్లో రామచంద్రాపురం బీసీ సంక్షేమ హాస్టల్ పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన గుండెల్ని పిండేసే వాస్తవాలివి. పటాన్చెరు: విద్యాసంవత్సరం మొదలైనా ఇప్పటికీ ఆ హాస్టల్లో మెనూ బోర్డును అతికించలేదు. హాస్టల్ వార్డెన్ (వసతి గృహ సంక్షేమాధికారి) స్థానికంగా ఉండడం లేదు. దాంతో విద్యార్థులకు ఆలనా పాలనా కరువైంది. రామచంద్రాపురం మండలంలో జాతీయ రహదారిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను విద్యార్థుల స్కాలర్‌షిప్‌తో సెల్ఫ్ మెయింటేన్ హాస్టల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఇంటర్, బీటెక్, డిప్లొమాలు చదువుతున్నారు. నాలుగేళ్లుగా ఇక్కడ కొనసాగుతున్న ఈ హాస్టల్లో గత ఏడాది కంటే కూడా భోజనం అధ్వానంగా ఉంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల గోడు వాళ్ల మాటల్లోనే.. నీళ్ల చారు, పిండిలాంటి తెల్లని అన్నం మాత్రమే పెడుతున్నారు. మూడు రోజులే గుడ్డు ఇస్తున్నారు.దాదాపు ప్రతి రోజు 80 మంది కంటే ఎక్కువ మందిమి ఈ హాస్టల్లో ఉండటం లేదు. వంట మాత్రం వంద మందికి వండుతున్నారని చెప్తున్నారు. చిన్న అరటి పండు అదీ బాగా నల్లబడి, పాడైన వాటినే ఇస్తున్నారు. కూరగాయ కూరలు అస్సలు పెట్టడంలేదు. ఉదయం అల్పాహారం ఇవ్వడంలేదు. ఉదయం పూటే అన్నం, చారు పెడుతున్నారు. కొందరు మధ్యాహ్నం పూట ఆకలితో సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలూ ఉన్నాయి. వంట మనిషి పోస్టు ఖాళీగా ఉంది. డైనింగ్ హాల్ ఎప్పుడూ మురికి కూపంగానే ఉంటోంది. 100 మంది ఉండే హాస్టల్లో నాలుగే బాత్రూంలు. చేతులు కడుక్కునేందుకు కూడా నల్లాలో నీళ్లు రావు. అద్దె భవనంలో ఈ హాస్టల్ నడుస్తోంది. తాగునీరు లేదు. ఇంటి ఓనర్ నీళ్లు ఎక్కువ వాడుతున్నామంటూ మమ్మల్ని తిడుతున్నారు. సరిపడా వాడుక నీరు రావడంలేదు. హాస్టల్ వార్డెన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఓనర్ మాపై అరుస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. గత ఏడాదిలో హాస్టల్ బాగుంది. కాని ఇప్పుడు మూడు నెలలుగా అర్ధాకలితో అలమటిస్తున్నాం. మాకు న్యాయం చేయండి అని విద్యార్థులందరూ మొరపెట్టుకున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వివరణ: మెనూ అమలు చేస్తాం. నేను స్థానికంగానే ఉంటున్నా. విద్యార్థుల మాటల్లో నిజం లేదు. -
గదిలో వేసి 2వ తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్