
పిల్లాడిని బ్యాటుతో తలపై బాదాడు!
కోల్‌కతా: అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కోపంతో 12 ఏళ్ల బాలుడిపై ఓ హాస్టల్ వార్డెన్ తన ప్రతాపం చూపాడు. ఏకంగా క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ పిల్లాడి తలపై బాదాడు. దీంతో గాయమైంది. ఈ ఘటన గత నెల 30న పశ్చిమబెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రాజర్‌హట్ లో ఉన్న నార్ పాయింట్ సీనియర్ సెంకడరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.
దీని గురించి బాధిత విద్యార్థి మహమ్మద్ సాహిన్ మొండల్ (12) తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై దాడికి కారణమైన వార్డెన్ దేబ్‌జ్యోతి దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనను మగుగునపడేయాలని స్కూలు యాజమాన్యం భావించిందని, అందువల్లే ఆలస్యంగా ఘటన వెలుగుచూసిందని బాలుడి తల్లిదండ్రులు చెప్తున్నారు.