
మెంటాడ: పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ మెంటాడ మండలం కుంటినవలసలో ఉన్న హిమ్మానియల్ గాస్పెల్ ఫైత్ మెయిస్ట్రీస్ (క్రిస్టి్టయన్)హాస్టల్‌లో ఉంటూ దత్తిరాజేరు మండలం, మరడాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శని వారం ఉదయం ప్రేయర్‌లో చంద్రశేఖర్, నవీన్ తో మాట్లాడుతున్నాడని వార్డెన్ అనుషా డైరెక్టర్ శ్యామ్యల్‌తో చెప్పారు. అంతే... ఆయన బెత్తానికి పనిచెప్పారు. చంద్రశేఖర్‌ను దండించారు. తీవ్రం గా గాయపరిచారు. శరీరంపై బెత్తం మచ్చలు తేరాయి. తలకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ హాస్టల్ నుంచి మరడాం పాఠశాలకు వచ్చి తరగతి గదిలో సొమ్మసిల్లి పడిపోయాడు.
తోటి విద్యార్థులు వెంటనే హెచ్‌ఎం రావాడ భాస్కరరావుకు తెలియజేశారు. ఏం జరిగిందని చంద్రశేఖర్‌ను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ చెప్పాడు. ప్రేయర్లో మా ట్లాడినందుకే ఇలా పైశాచికంగా కొట్టడంపై తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యం లో ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి శరీరంపై ఉన్న దెబ్బలను గుర్తిం చిన పోలీసులు చికిత్స కోసం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు సత్యవతి, తిరుపతిలు నిరుపేదలు. కుమారుడు చంద్రశేఖర్‌ను బాగా చదివించాలన్న ఉద్దేశంతో హాస్టల్‌లో చేర్పించి కూలిపనుల కోసం విజయవాడ వెళ్లిపోయారు. విద్యార్థి శరీంపై దెబ్బలను చూసిన వారంతా అయ్యయ్యో అంటూ హాస్టల్ డైరెక్టర్ శ్యామ్యల్‌ను దూషిస్తున్నారు. ఆయనపై విద్యాహక్కుచట్టం ప్రకారం శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment