beats student
-
విద్యార్థిని ఐరన్ స్కేల్‌తో తలపై బాదిన టీచర్
కుషాయిగూడ: ఓ టీచర్ ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. హెచ్‌బీకాలనీలో నివసించే భార్గవి కుమారుడు నిఖిల్‌సాయి ఈసీఐఎల్‌లోని యస్ఆర్ డీజీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం టీచర్ శశికళ క్లాస్ తీసుకునేందుకు తరగతి గదికి వెళ్లారు. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారిస్తున్న క్రమంలో నిఖిల్సాయిని ఆమె ఐరన్ స్కేల్‌తో తలపై కొట్టారు. దీంతో రక్తస్రావమై బాలుడి తలకు గాయమైంది. దీంతో జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లి భార్గవి ప్రిన్సిపల్‌ను నిలదీయగా..ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలుడి తాతయ్య దయానంద్‌తో కలిసి ఆమె కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా 5 గంటలు స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 11 గంటల సమయంలో వారుఅక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం కాస్తా మీడియాకు పొక్కడంతో మంగళవారం ఉదయం పోలీసులు బాధితులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి బాలుడిని కొట్టిన టీచర్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
విద్యార్ధుల పై టీచర్ కర్కశత్వం
-
ప్రార్థనలో మాట్లాడాడని...
మెంటాడ: పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ మెంటాడ మండలం కుంటినవలసలో ఉన్న హిమ్మానియల్ గాస్పెల్ ఫైత్ మెయిస్ట్రీస్ (క్రిస్టి్టయన్)హాస్టల్లో ఉంటూ దత్తిరాజేరు మండలం, మరడాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శని వారం ఉదయం ప్రేయర్లో చంద్రశేఖర్, నవీన్ తో మాట్లాడుతున్నాడని వార్డెన్ అనుషా డైరెక్టర్ శ్యామ్యల్తో చెప్పారు. అంతే... ఆయన బెత్తానికి పనిచెప్పారు. చంద్రశేఖర్‌ను దండించారు. తీవ్రం గా గాయపరిచారు. శరీరంపై బెత్తం మచ్చలు తేరాయి. తలకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ హాస్టల్ నుంచి మరడాం పాఠశాలకు వచ్చి తరగతి గదిలో సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే హెచ్ఎం రావాడ భాస్కరరావుకు తెలియజేశారు. ఏం జరిగిందని చంద్రశేఖర్‌ను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ చెప్పాడు. ప్రేయర్లో మా ట్లాడినందుకే ఇలా పైశాచికంగా కొట్టడంపై తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యం లో ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి శరీరంపై ఉన్న దెబ్బలను గుర్తిం చిన పోలీసులు చికిత్స కోసం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు సత్యవతి, తిరుపతిలు నిరుపేదలు. కుమారుడు చంద్రశేఖర్‌ను బాగా చదివించాలన్న ఉద్దేశంతో హాస్టల్లో చేర్పించి కూలిపనుల కోసం విజయవాడ వెళ్లిపోయారు. విద్యార్థి శరీంపై దెబ్బలను చూసిన వారంతా అయ్యయ్యో అంటూ హాస్టల్ డైరెక్టర్ శ్యామ్యల్ను దూషిస్తున్నారు. ఆయనపై విద్యాహక్కుచట్టం ప్రకారం శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
రాక్షసుడిలా మారిన శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్
-
జగద్గిరిగుట్టలో స్కూల్ టీచర్ రాక్షసత్వం
-
గుడ్డు అడిగితే చితకబాదాడు..
రామకుప్పం(చిత్తూరు): భోజనంలో గుడ్డు ఇవ్వాలని అడిగినందుకు ఓ హాస్టల్ వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వార్డెన్ మద్యం తాగి కొడుతు ఉంటాడని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోజనంలో గుడ్డు వడ్డించమని అడిగిన విద్యార్థులను ఈ రోజు కూడా తీవ్రంగా కొట్టాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు.