
గుడ్డు అడిగితే చితకబాదాడు..
రామకుప్పం(చిత్తూరు): భోజనంలో గుడ్డు ఇవ్వాలని అడిగినందుకు ఓ హాస్టల్ వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులను వార్డెన్ మద్యం తాగి కొడుతు ఉంటాడని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోజనంలో గుడ్డు వడ్డించమని అడిగిన విద్యార్థులను ఈ రోజు కూడా తీవ్రంగా కొట్టాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు.