హ్యూమన్స్ ఆఫ్ బాంబే సీఈఓ కరిష్మా మెహతా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటీవల తన అండాలను (ఎగ్స్)ను భద్రపర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్దతిని ఇప్పటికే చాలా మంది, సెలబ్రిటీలు హీరోయిన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పునరుత్పత్తి సాధికారత కోసం ఎగ్స్‌ను చాలా మంది మహిళలు ఫ్రీజ్ చేసుకుంటున్న అంశాన్ని ఆమె హైలైట్ చేశారు. ఇంతకీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో..
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?
ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకోవడం. ఇది కరియర్‌లో లేదా చదువులో బిజీగా ఉన్నపుడు, కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులు బాటు కల్పిస్తుంది. 30 వయసు దాటిన తరువాత నుంచి మహిళల్లో అండాల ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత క్షీణిస్తుంది అందుకే ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మహిళల అండాలను సేకరిచి భద్రపరుస్తారు. కావాలనుకున్నపుడు ఈ అండాల ద్వారా పిల్లల్ని కనవచ్చు.ఈ ప్రక్రియను “ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ అంటారు. తద్వారా జీవితంలో తరువాతి కాలంలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు తమ అండాలను గుడ్డు దానం విషయంలో ఇదే టెక్నిక్ సహాయపడుతుంది. మహిళల అండాల పరిస్థితి, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకోసం దాదాపు 10 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చు.
తాజాగా కరిష్మా మెహతా ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. తద్వారా ఎగ్ ఫ్రీజింగ్ మహిళల సంతానోత్పత్తి, పిల్లల్ని ఎపుడు కనాలి అంశాలనే చర్చను మరింత విస్తృతం చేశారు. కాగా ముంబైకి చెందిన కరిష్మా 1992 మార్చి 5న జన్మించింది. తన ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్‌బుక్ ద్వారా ఎందరో విజేతలను పరిచయం చేసింది. వారు అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి.
ఇలా సంతానోత్పత్తిలో కీలకమైన అండాలను మహళలు భద్రపర్చుకోవడం ద్వారా పిల్లల్ని ఎపుడు కనాలనుకుంటే అపుడు కనేందుకు ఇది చాలా అవసరమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పిల్లల్ని కనేందుకు సంసిద్దంగా లేనపుడు, భవిష్యత్తులో పిల్లలు పుడతారా లేదా? అనే ఒత్తిడిని అరికట్టేందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అనుమతిస్తుంది.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. స్టార్ హీరోయిన్, ప్రియాంక చోప్రా, హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరారు. అంతేకాదు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్ షిప్ దొరకడం చాలా కష్టమని. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పు కొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment