నాకిప్పుడు 32 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా కెరీర్ వల్ల పిల్లలను ప్లాన్ చేసుకోవడం లేట్ అవుతోంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌కి వెళితే.. ఇప్పటికిప్పుడు నా ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఒక అయిదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సాధ్యమేనా? అప్పటికీ ఎగ్స్ ఇంతే క్వాలిటీతో ఉంటాయా? ప్రెగ్నెన్సీ క్యారీ చేయడంలో అయిదారేళ్ల తర్వాత నా ఏజ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? నా డౌట్స్ క్లియర్ చేయగలరు. మీ ఆన్సర్స్ మీదే నేను పిల్లలను ప్లాన్ చేసుకోవడం డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నా హజ్సెండ్ సహా మా ఇంట్లో వాళ్లంతా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌ని ఒప్పుకోవట్లేదు.
పేరు, ఊరు రాయలేదు.
ఎగ్ ఫ్రీజింగ్‌ని oocyte cryopreservation అంటారు. ఈ ప్రొసీజర్‌లో అండాశయాల నుంచి అండాలను తీసి ఫ్రీజ్ చేసి అన్‌ఫర్టిలైజ్డ్ స్టేట్‌లో ఉంచుతారు. భవిష్యత్‌లో గర్భందాల్చాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్‌ని ఫర్టిలైజేషన్‌కి ఉపయోగించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చేలా చేస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల స్త్రీలు ఈ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో oocyte క్వాలిటీ చాలా త్వరగా తగ్గిపోతోంది. ఇప్పుడు 30–35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే సౌకర్యాన్ని చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి.
ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి దీన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలోనూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఫ్రోజెన్ ఎగ్స్ cryo freezing ప్రాసెస్‌లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అండాశయాల నుంచి అండాలను తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించి అంటే బవెల్ గాయపడడం, రక్తనాళాలు గాయపడడం వంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు.
ఎక్కువ అండాలను తీయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్‌కి కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి రావచ్చు. వీటిని మందులతో తగ్గించవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ 5 శాతం కేసెస్‌లో కనపడతాయి. 0.1 శాతం కేసెస్‌లో బ్లడ్ క్లాట్స్, చెస్ట్ ఇన్‌ఫెక్షన్ వంటివాటితో కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే.. నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత శాతం రిస్క్ ఉంటుందో ఫ్రోజెన్ ఎగ్స్‌తో వచ్చే ప్రెగ్నెన్సీలోనూ అంతే రిస్క్ ఉంటుంది. అదనంగా ఏమీ ఉండవని అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఫ్రోజెన్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ 30 – 60 శాతం వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎగ్ ఫ్రీజింగ్ సమయంలోని మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది.
--డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment