
అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుబడిన జేమ్స్ శాక్‌స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?
ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.
ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్‌స్టన్. అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.
మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?
అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.
చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడం
తగిన సమయం ఇవ్వకపోవడం
సంభాషించకపోవడం
మాటల్లేని రోజులను పొడిగించడం
అసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..
ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?
లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?
సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?
సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?
ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.
మంచి తల్లిదండ్రులైతే సరిపోదు
చాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్‌ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.
ఇలా చేయండి..
మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.
తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.
ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.
మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.
మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.
పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి.
(చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!)
Comments
Please login to add a commentAdd a comment