మెహిందీ డిజైన్‌తో తన బాధను వివరించిన ఊర్వశి వోరా శర్మ
శుభకార్యం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా చేతి నిండా మెహిందీ (హెన్నా) పెట్టుకుంటే ఆ వేడుకకు మరింత కళ. ఈ మెహిందీ కళలో అనేక రకాలను చూశాం. వాటిల్లో ప్రధానంగా బ్రైడల్ మెహిందీ. కానీ విడాకుల మెహిందీ గురించి ఎపుడైనా విన్నారా? తన వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రస్తావిస్తూ మొత్తానికి విడాకులు తీసుకున్నాను అంటూ తన బాధను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట పలువురి హదయాలను కదిలిస్తోంది.
ఊర్వశి వోరా శర్మ ఇన్‌స్టా వేదికగా విడాకుల స్టోరీని మెహిందీ డిజైన్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన విఫలమైన పెళ్లి, తన కలలు, భర్త చేసిన ద్రోహం, అనుభవించిన క్షోభను చాలా భావోద్వేగంతో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా వివరించింది.
కేవలం ఒక పనిమనిషిలాచూసిని అత్తమామలు, భర్త మద్దతు ఏమాత్రం లేక కుంగిపోయిన వైనం, ఒంటరితనంతో అనుభవించిన నరకం, భయంకరమైన ఒత్తిడి, చివరికి విడిపోవాలనే అంతిమ నిర్ణయంతో ముగుస్తుందీ మెహిందీ ఆర్ట్. దీనిపై నెటిజన్లు స్పందించారు.
‘మీ బాధను వ్యక్తం చేయడానికి ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ చాలామంది ప్రశంసించారు.
"మెహిందీలో నొప్పిని చూడటం హృదయ విదారకం. కానీ ఆమె సాధించిన స్వేచ్చ సంతోషానిస్తోంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
‘విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు, కానీ ఈ మెహిందీ మళ్లీ మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన శక్తినిస్తుంది’
“ఇది కేవలం కళ కాదు; అది ఒక ఉద్యమం. స్త్రీలు తమ బాధలను పంచుకుంటున్నారు’’ అంటూ మరికొంతమంది వ్యాఖ్యానించారు. ‘‘ఫైనల్లీ.. మెహిందీ ద్వారా వివాహాలకు ఆవల గాథలు. ఇవి పచ్చి నిజాలు, కఠోర వాస్తవాలు’’ అంటూ మరొకరు పేర్కొనడం గమనార్హం
Comments
Please login to add a commentAdd a comment