Mehndi
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
టాటూలు.. మెహందీలు వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్‌టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజు ఫొటో(ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ... సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు. -
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
Blouse Mehndi: మెహందీని ఇలా కూడా వాడుతున్నారా!
చేతి నిండా ఎర్రగా పండే.. ‘మెహందీ’ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజట్టుకు వేసుకోవటం తెలుసు. అయితే రోజురోజుకు మహిళలు కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతూ ట్రెండీగా మెరిసిపోతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్ బ్రాండ్లను వాడుతున్నారు. భిన్నమైన చుడీదార్లు, డిజైన్ శారీలు, బ్లౌజులు వేసుకొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మెహందీ బ్లౌజ్ వేసుకున్న ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను థానోస్ జాట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై హెన్నా(మెహంది) డిజైన్ వేసుకోవడం. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘కొత్తగా ఉంది డిజైన్’.. ‘మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?’.. అసలు బ్లౌజ్‌గా మెహందీని వేసుకోవడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanos (@thanos_jatt) -
వాడుకగా వేడుకకు
ఒకసారి పేరొచ్చేస్తే ఇక అదెక్కడికీ పోదు. ఆ పేరున్న చోటికే అందరూ వచ్చేస్తారు. వీణా నాగ్దాకు బాలీవుడ్ పెళ్లిళ్ల ‘మెహందీవాలా’ అనే పేరు వచ్చేసింది. ఎవరింట్లో పెళ్లి జరిగినా, పెళ్లికూతురు చేతులపై పండేది వీణ పెట్టిన గోరింటాకే. నిన్న సోనం పెళ్లి జరిగింది కదా! ఆమె చేతులకు మొన్న ‘మెహందీ ఫంక్షన్’లో గోరింటాకు పెట్టింది కూడా వీణమ్మే! గుండెల్ని మీటేలా గోరింటాకు పెట్టడంలో ఆమె ఎక్స్పర్ట్. సోనమ్ పెళ్లి మాట అటుంచండి, సోనమ్ చిన్నప్పట్నుంచి కూడా ఆమెకు మెహందీ దిద్దుతోంది ఈ మెహందీ క్వీనే. శిల్పాశెట్టి, ఆసిన్ కూడా తమ పెళ్లికి వీణ దగ్గరే గోరింటాకు పెట్టించుకున్నారు. ఏటా ‘కర్వాచాత్’కి శ్రీదేవి తప్పనిసరిగా వీణను పిలిపించుకుని తన అరిచేతుల్ని పండించుకునేవారు. పెళ్లిళ్లకే కాదు, పెద్ద పెద్ద ఈవెంట్లకు పెద్దవాళ్లు ఎవరు పిలిచినా వెళ్లి గోరింటాకు పెడుతుంటారు వీణ. సీనియర్ క్రికెటర్ వెంగ్‌సర్కార్ కూతురు పెళ్లికీ, కరిష్మా కపూర్ మెహిందీ ఫంక్షన్‌కీ, దీపికా పదుకోన్ చేతులకు ఈవిడే మెహందీని డిజైన్ చేశారు. ఇదంతా వింటున్నప్పుడు.. నిజానికి పండింది వీణ పంటే అనిపిస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. పెద్దవాళ్ల చేతుల్ని అలంకరించే అవకాశం రావడం మాటలా మరి! అరిచేతులపై అదృష్టరేఖలు వీణా నాగ్దా ముప్పై ఏళ్లుగా గోరింటాకు పెడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా గోరింటాకు పెట్టగల మెహందీ డిజైనర్‌గా ఆమె పేరున ఒక రికార్డు కూడా ఉంది! అంతే కాదు, ఓ నమ్మకం కూడా ఉంది. వీణ గోరింటాకు పెడితే అదృష్టం కలిసి వస్తుందని! అందుకే లిజ్ హర్లీ నుంచి కాజోల్ వరకు, కరిష్మ దగ్గర్నుంచి సోనమ్ వరకు ఆమె ముందు చెయ్యి చాపారు. ఆమెకు మెహందీ క్వీన్ అని పేరు పెట్టిందెవరో తెలుసా? కరణ్ జోహార్! వీణ ముంబైలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. టెన్త్ వరకే చదివారు. ఆర్థికంగా బాగోలేక కాదు. చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేక! ఆ తర్వాత మెల్లిగా మెహందీ డిజైనర్ అయిపోయారు. బ్రైడల్, నెయిల్ పాలిష్, షేడెడ్, హీరా–మోటీ, జర్దోసీ, అరబిక్, బ్లాక్ మెహందీ, స్టోన్/సీక్వెన్స్/స్వీరోస్కీ డైమండ్ మెహిందీలు పెట్టడంలో వీణ స్పెషలిస్ట్. ఈ కళలో అప్డేట్ అవడం కోసం ఆమె విదేశాల్లో కూడా తిరిగొచ్చారు. బాలీవుడ్ బ్లాక్బస్టర్లు ఖుషీ కభీ ఘమ్, కల్ హో న హో, మేరే యార్ కీ షాదీ హై, గాడ్ తుస్సీ గ్రేట్ హో, యు మి ఔర్ హమ్, పాటియాలా హౌస్, ఏ జవానీ హై దివానీలలో కనిపించే మెహందీ వర్క్ అంతా వీణదే. ఇక వాడుకగా ఈమెతో మెహందీ పెట్టించుకునే వాళ్ల లిస్టు కాస్త పెద్దదే. డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, రేఖ, ట్వింకిల్ ఖన్నా, శ్వేతాబచ్చన్, రాణీ ముఖర్జీ, ఫరా ఖాన్, నేహా దుపియా, ప్రీతీ జింతా, నీతా అంబానీ, ప్రఫుల్ పటేల్ కూతురు అంజలీ పటేల్.. ఆ జాబితాలోని కొందరు సెలబ్రిటీలు. -
మెహందీ.. సంగీత్... సందడి
పెళ్లికి ముందు రోజు మెహందీ (గోరింటాకు పెట్టుకోవడం) అండ్ సంగీత్... పెళ్లి తర్వాత రోజు కాక్టైల్ పార్టీ అండ్ రిసెప్షన్... కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పర్ఫెక్ట్ ప్లాన్‌తో ప్రియమణి వివాహ వేడుకలు జరగనున్నాయట. ఈ నెల 23న ప్రియుడు ముస్తాఫాతో కలసి ప్రియమణి ఏడడుగులు వేయనున్నారు. అతికొద్ది మందికి మాత్రమే ఈ పెళ్లి ఆహ్వానాలు వెళ్లాయట. ఆహ్వానాలు అందుకున్నవారు చెబుతున్నదాని ప్రకారం... థీమ్ మెహందీ (అందరూ ఓ థీమ్ ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం), సంగీత్ వేడుకను 22న నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. పెళ్లి తర్వాత రోజు 24న సినీ ప్రముఖులతో సహా పలువురికి కాక్టైల్ పార్టీ ఇస్తున్నారు. అదే రోజు రిసెప్షన్ కూడా!! -
గోరింట పండింది..
– ఆషాడంలో గోరింటాకు ఉత్సవం – ఆడవారి అరచేతుల్లో అందమైన డిజైన్లు – అతివలకు ఇష్టమైన వేడుక ‘గోరింట పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.. ఎంచక్కా పండేలా ఎర్రన్ని చుక్క..’ అన్నారో సినీ కవి. ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కూడా ఓ వేడుకే. గోరింటను అరచేతుల్లో పూయించడం అంటే అతివలకు అత్యంత ఇష్టం. మందారంలా పండినా, గులాబీలా పూసినా.. చేతులను చేసుకుని మురిసిపోతుంటారు. మనదేశంలో ప్రాచీన కాలం నుంచి గోరింటాకుకు ఎంతో చరిత్ర ఉంది. సున్నితమైన వారికి ఎర్రటి గోరింటాకు శోభాయమానంగా ఉంటుంది. ఆడపడుచుల చేతులు, కోమల పాదాలకు ఇనుమడింపజేసే అందమైన డిజైన్లు చూస్తే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఆషాడమాసంలో ప్రత్యేకంగా నిర్వహించే ‘గోరింటాకు’పై ప్రత్యేక కథనం.. – మహబూబ్‌నగర్ కల్చరల్ గోరింట.. ఆరోగ్య ఔషధం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఆషాడమాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పని చేయడం పరిపాటి కాబట్టి వారికి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్ డైగా, గోరింటాకు పొడిని హెన్నాగా ఉపయోగిస్తున్నారు. గోరింటాకుకు గాయాలను మాన్పే గుణం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గోర్లను, పాదాలను, చేతులను రక్షిస్తుంది. దీని సహజ గునాల వల్ల తలనొప్పి చర్మవ్యాధులు, లివర్ సమస్యలు వంటివి నయమవుతాయి. ఔషధ గుణాల వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, కాళ్ల మంటలు తగ్గుతాయి. శరీరంలోని వేడిని తగ్గించే శక్తి గోరింటకే ఉంది. శాస్త్రీయ ప్రయోజనాలు.. స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. గోరింట వల్ల గోళ్లకు అందం రావడమే కాక, గోరు చుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు ఎర్ర మందారంలా పండితే మంచి మొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఆషాడం వచ్చిందంటే చాలు ‘గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ’ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల గోడు తట్టుకోలేక పెళ్లికాని ఆడపిల్లలు గోరింటాకు తీసుకొచ్చి, అందులో చింతపండు ముద్దవేసి మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరుతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండేలా ఉంటుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాడంలో చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని తిరిగి, అత్తారింటికి వెళ్లాక అమ్మ, చెల్లిపెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోవడమే కాకుండా వాటి తీపి జ్ఞాపకాలు పదిలం చేసుకుంటారు. ఎన్నో సద్గుణాలున్న ఈ గోరింట ఏ పేరుతో పిలిచినా, ఏ విధంగా ఉపయోగించినా మంచే చేస్తుంది. మెహందీ పేరుతో వేడుకలు.. వివిధ రకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. గోరింటాకు అలంకరించుకోని ఉత్సవం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో మెహిందీ ఫంక్షన్ పేరిట పెళ్లికి ముందే గోరింటాకు పెట్టుకోవడాన్నే ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు. గోరింటాకును ఇప్పుడు అనేక రూపాల్లో, అనేక రకాలుగా వాడుతున్నారు. ఒరిజినల్, బ్లాక్మెహందీ, నెయిల్ పెయింట్ మెహందీ ప్రధానమైనవి. వేలాదిగా మెహందీ డిజైన్లు ఆడవారి చేతులపై విరబూస్తున్నాయి. వాటిలో ట్రెడిషనల్, బుట్ట, చుడి, కాశ్మీరీ, బ్రైడల్, బాందినీ, జర్దోసి, అరబిక్, రాజస్థానీ, మర్వారి తదితర డిజైన్లు ఉన్నాయి. మెహందీ డిజైనింగ్ ఇప్పుడు అతి పెద్ద వ్యాపారంగా మారింది. గోరింటాకు పేస్టు తయారీ .. గోరింటాకు పేస్టు తయారీలో ఎన్నో రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. గోరింటాకు అందంగా, ఎర్రగా పండి చేతులు, పాదాలకు చక్కటి అందం రావాలంటే ముందుగా, గోరింటాకు నాణ్యతను పరిశీలించారు. మిశ్రమాన్ని సరైన పద్ధతిలో తయారు చేసుకోవాలి. అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడి నీళ్లు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కలిపి నాన»ñ డితే మరింత డార్క్ కలర్‌తో గోరింట పడుతుంది. మెహందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలుపుకుని రాత్రంతా నాన బెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల కాఫీ బ్రౌన్ కలర్లో పండుతుంది. నిమ్మరసంతో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారు చేసుకోవాలి. మెహందీ చేతులకు పెట్టుకున్న తర్వాత తడి ఆరే సమయంలో ఈ లెమన్ సుగర్ సిరప్‌ను చేతులకు అప్లై చేయాలి. దీని వల్ల మెహందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది. -
మెహందీ అంటింది
కథ ‘‘ఎన్నాళ్లకు మళ్లీ మీ దర్శనం సాబ్! లోపలికి దయ చేయండి’’ అంది. ఆమె వెనకాలే నడిచాడు. లేకపోతే చేయి పట్టుకుని లాక్కుపోతుందేమోననిపించింది. ‘‘మాల్ చాహియే సాబ్’’ అడిగాడు ఆటోవాలా. పరధ్యానంలో ఉన్న శంకరానికి ఆ మాటలు చెవికెక్కలేదు. మళ్లీ అదే మాట ఆటోవాలా నోటి నుండి వెలువడింది. ఏ కళనున్నాడో అతడు జవాబివ్వలేదు. ఆయన బుర్ర నిండా ఆలోచనల సుడులు. ఏదో తెలియని ‘సాంత్వన’ కోసం ఆయన మనస్సు వెదుకులాడుతోంది. ఆటోలో కూర్చున్నాడు. మౌనం అంగీకారంగా తీసుకున్న ఆటోవాలా, స్టార్ట్ చేసి చార్మినార్ వైపు పోనిచ్చాడు. పుత్లీబౌలి, గౌలీగూడ, నయాపూల్, మూసీ సువాసనలు, హైకోర్టు భవనం దాటి చార్మినార్ ఏరియాలో ప్రవేశించింది ఆటో. ఏవేవో సందులు, ఇరుకు గల్లీలు, ఇరానీ హోటళ్లు, అరిగిపోయిన రికార్డులోంచి పాత హిందుస్తానీ పాటలు, గుడ్డి వెలుతురు. ఇరుకు సందుకు రెండు వైపులా ఇళ్లు. రోడ్డుపైకి తెరుచుకున్న పాతకాలపు భవంతుల కిటికీలు, కిటికీల కింద సింహద్వారాన్ని కప్పుతూ వేలాడుతున్న నిజాము కాలం నాటి గోనెపట్టా పరదాలు. పై కప్పులు కూలిన ఇళ్లు, ఒక్కో చోట గోడల మీద నిలువుగా జారిన వర్షపు నీటి చారికలు. రోడ్డంతా పాన్ మరకలు. ఖాళీ గుట్కా పొట్లాలు. నవ్య నగరానికి భిన్నంగా నాలుగు వందల నాటి సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు. ఓ ఇరుకు గల్లీలో ఆటో ఆగింది. ఢోలక్ మోత, చప్పట్లు. ‘మేరి బన్‌కీ బాత్ న పూఛో మేరీ బన్ హరియాలా హై’, (నా వనం గురించి అడుగకు. నా వనం సస్యశ్యామలం) అంటూ ఆడ, మగ కాని గొంతులు, గజ్జెల చప్పుడు. ‘‘దిగండి సాబ్’’ అన్న మాటతో మళ్లీ ఈ లోకానికి వచ్చాడు. ఆ ఏరియాలోకి మొదటిసారి వస్తున్న శంకరానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఇదేమిటోయ్?’’ ప్రశ్న. ‘‘భలే వారే సార్... గానా బజానా. వెయిట్ చేయమంటారా?’’ ‘‘అక్కరలేదు’’ అన్నట్లుగా చేసైగ చేసి ఆటో దిగాడు. సంకేతం కాబోలు, రెండుసార్లు లాంగ్ హారన్ ఇచ్చి ‘యు’ టర్న్ చేసుకుని వెళ్లిపోయాడా ఆటోవాలా. సందు అంతా చీకటి. ఎక్కడో చదివాడతను- వీధి లైట్ల బల్బుల్ని స్థానికులు కావాలనే పగలగొడతారట. కొత్తవి వేసినా రెండు రోజుల్లో అవీ పగిలిపోతాయట. కిటికీలు అనబడే తెరలు కట్టిన కన్నాల్లోంచి బలవంతంగా బయటకు వస్తోన్న గుడ్డి వెలుతురు. సందుకు ఎదురుగా ఓ ఇల్లు. ఇంటికి రెండు వైపులా ఇంటి గోడల మీద గీచిన పసుపు రంగు పెద్దపులి బొమ్మలు, వాటి పంజాల్లో ‘తల్వారు’లు. బూడిద రంగుకు మారిన పరదా. చేరేడు, తలుపుల రెక్కలు, అన్నీ ఒకే రంగుకు మారాయి. పట్టా పరదాను కాస్త తొలిగించాడు శంకరం. ‘‘అయియే, ఆయియే బాద్షా!’’ ఓ నడి వయస్సు దాటిన ఆడగొంతు. షర్టు లాంటి పల్చని వదులు లుంగీ, చీర. ముక్కుకూ, చెవులకూ బంగారం గుళ్ల వరుసలు. సుర్మా కళ్లు, నెత్తిన ఏవో వెండి ఆభరణాలు. ‘ఒగల్దాన్’లోకి పాన్‌ను తుపుక్కున ఉమ్మేసింది. ‘‘పీర్ల బీబీ మీకు సలాం చేస్తోంది’’ అంటూ ఆహ్వానించిందామె. లోపల మళ్లీ ఓ తెర కట్టిన దర్వాజా. ‘‘అరే ఖాజా! నవాబ్ సాబ్ ఆగయా’’ అంది లోనికి చూస్తూ. శంకరం వైపు తిరిగి, ‘‘ఎన్నాళ్లకు మళ్లీ మీ దర్శనం సాబ్! లోపలికి దయ చేయండి’’ అంది. ఆమె వెనకాలే నడిచాడు. లేకపోతే చేయి పట్టుకుని లాక్కుపోతుందేమోననిపించింది. ‘ఠప్’మని నుదురుకు కొట్టుకుంది ద్వార బంధం. తడుముకున్నాడు. అతడి ఎత్తు ద్వారానికి సరిపోలేదు. ‘‘అరరే! మార్ లగ్ గయా క్యా? ఖాజా! బద్మాష్! ఇక్కడ బత్తీ (లైటు) వేయలేదురా’’ అన్న అరుపు. ఆవిడకు తెలుసు అక్కడ లైటు లేదని. ‘‘ఇలా నా చేయి పుచ్చుకుని రండి సాబ్’’ అంది. ఆమె చేయి సాయం అక్కర లేకుండానే లోనికి నడిచాడు. విశాలమైన హాలు. నేలమీద ఓ మాసిపోయిన తివాచీ. తివాచీకి రెండు వైపులా బయటకు తెరుచుకునే అగ్గిపెట్టెల్లాంటి అరలు. గోడల మీద అసఫ్‌జాహీ వంశీయుల ఫొటోలు. ఎవరో ఓ నవాబు తుపాకీని నేలకి ఆనించి మీసాల్ని మెలిపెడుతూ నించున్నాడు. ఆయన కాళ్ల దగ్గర పులి కళేబరం. నెత్తిన ఇంగ్లిషు వాడి టోపి, వెడల్పాటి బెల్టు, టైట్ ప్యాంటు. తివాచీకి అటువైపు ఐదారుగురు యువతులు కూర్చున్నారు. వారి వయస్సులు ఇరవై ఐదు నుంచి నలభై మధ్య ఉంటుండొచ్చు. ఒకరు ఢోలక్ కొడుతుంటే మరొకరు గొంతు కలిపారు. మిగతా వారు చప్పట్లు చరుస్తున్నారు. పెట్రోమాక్సు వెలుతురు అంతగా లేదు. వాళ్ల పాటకు నాదస్వరంలా ‘సుయ్’మంటోంది. ‘‘అరే! ఖాజా! బద్మాష్! పాందాన్ తీసుకురా’’ అన్న పీర్ల బీబీ కేక. వయస్సులో ఉన్నప్పుడు ఆమెను ‘బేబీ’ అని పిలిచేవారు కావొచ్చు. వయస్సుడిగాక ‘బీబీ’ అయింది. శంకరం, ఆవిడ, బాలీసులకు ఆనుకుని కూర్చున్నారు. హాలుని మరింత పరిశీలనగా చూశాడు శంకరం. వాడిపోయిన మందారం రంగు బాలీసులు. ఇంచుమించు అదే రంగు తివాచీ. అక్కడక్కడా స్టూల్స్ మీద నిలబెట్టబడిన ఆయుధాలు ధరించిన సైనికుల ఇత్తడి విగ్రహాలు. గోడలకు ప్లాస్టిక్ పూలసరాలు. మొఖాన మేకప్, సన్నని మీసం, గమ్మత్తుగా కత్తిరించుకున్న గడ్డం, నెత్తిన బోర్లించిన బౌల్ లాంటి ఎంబ్రాయిడరీ టోపీతో ఓ ముప్ఫై ఏళ్ల యువకుడు చేతిలోని పాందాన్ అక్కడుంచి, మోకాళ్లు ముందుకు వంచి, చూపుడు వేలు చుబుకానికి ఆనిస్తూ ‘సలాం’ చేశాడు. పాందాన్ తెరిచి, తమలపాకు ఈనెలు చీల్చి నాజూగ్గా సున్నం రాస్తోంది పీర్ల బీబీ. వయస్సుడిగినా వృత్తితో అబ్బిన నాజూకుదనం ఆమెలో కనబడుతోంది. శంకరం కంటే ముందే వచ్చి కూర్చున్న ఓ యువకుడు, యువతుల గుంపులోంచి లేచిన ఓ యువతీ అగ్గిపెట్టెల అరల్లో ఓ అరలోకి వెళ్లిపోయారు. ఉక్క లాంటి వేడి, చవక రకం సెంటు వాసన, శంకరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గాలి ఆడటం లేదు. ఒక రకమైన విసుగు ముఖం పెట్టి ‘ఊఫ్’ అంటూ ఊదుకున్నాడు. విసుగు కనిపెట్టిన పీర్ల బీబీ చెప్పసాగింది, ‘‘ఆ పాడుతున్న పిల్ల ఉంది చూశారు! ‘చమేలీ’. పద్నాలుగేళ్లే సాబ్! ఎంత మంది దానిమీద కన్నేశారనుకున్నారు? మీరు చాలా కిస్మత్వాలా సాబ్! ఒక్కరోజు ఆలస్యం అయినా మీకు దొరికేది కాదు.’’ శంకరం నిశ్శబ్దాన్ని గమనించి మళ్లీ తనే అందుకుంది. ‘‘నిజం నవాబ్ సాబ్’’ వేయికి తక్కువ అసలు ముట్టనే ముట్టను. మీరు వెళ్లేటప్పుడు మరో అయిదు వందలు బక్షీష్గా ఖుషీగా మీరే ఇస్తారు. ఇంత ఫ్రెష్ సరుకు ఈ గల్లీ మొత్తానికి లేదు సాబ్! అబద్ధం అయితే నా పేరు మార్చుకుంటా’’ అంది రొమ్ము చరుచుకుంటూ. ఆమె చేతి పది వేళ్లకున్న పెద్ద పెద్ద రాళ్లు తళుక్కుమన్నాయి. శంకరం జేబులోంచి ఫెళఫెళలాడే ఓ నోటు పీర్ల బీబీ వదులు అంగీ జేబులోకి పోయింది. చమేలీకి కనుసైగ అందింది. ఓరగా శంకరాన్ని చూస్తూ, ఓ అగ్గిపెట్టెల అరలోనికి వెళ్లింది. మరో పాట మొదలైంది. ‘‘మేరీ మహబూబ్ తూ...’’ చమేలీని అనుసరించటానికి శంకరం కూడా లేవబోయాడు. ‘‘సాబ్! నా ఇనాం’’ ఒళ్లంతా మెలికలు తిరుగుతూ ఖాజా. ఓ పచ్చనోటు జేబులు మారింది. నుదురు నేలకు తాకేంతగా వంగి సలాం చేశాడు ఖాజా. ‘‘జరా నాజూక్ సాబ్! ఇదే మొదటిసారి. బెదరగలదు. అయినా మీ లాంటి ‘ఆశిఖ్’లకు చెప్పాలా సాబ్!’’ పీర్ల బీబీ గొంతు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. చాలా ఇరుకైన గది. చిన్న మంచం. పల్చని పరుపు. నల్లరంగు ఛాదర్. తెరలు దించిన కిటికీ వైపు ముఖం చేసి నిలుచున్న చమేలీ. ఆకుపచ్చ పైజామా, తెల్ల కుర్తా, మెడకు ఓ వైపు జీరాడుతున్న నైలాన్ దుపట్టా. చమేలీ భుజం మీద శంకరం చేయి సతారంగా పడింది. చమేలీ అతడి వైపు తిరిగింది. పీర్ల బీబీ మాటలు పూర్తిగా అబద్ధం కావు. చామనఛాయ, కోల ముఖం. చేపల్లాంటి కళ్లు. సన్నజాజి లాంటి నాసిక. ‘పాన్’ వల్ల మెరుస్తున్న ఎర్రని పెదాలు. పాపెట్లో ‘సునేరు’. జుట్టునూ ముఖాన్నీ కప్పుతున్న ప్లాస్టిక్ ముత్యాల సరాలు. మోచేతి వరకు మెరుస్తున్న గాజులు. మంచంలో కూర్చున్నాడు శంకరం. ‘‘సాబ్!’’ మృదువుగా పెదాలు విచ్చుకున్నాయి. పండు దానిమ్మ గింజల్లాంటి పలువరుస. ‘‘పాన్ ఇవ్వనా?’’ పీర్ల బీబీ ఇచ్చిందే ఇంకా నోట్లోనే ఉంది. అయినా చమేలీ చేత్తో అందుకోవటంలోని అనుభవం వేరు. ‘ఊ’. కావాలో వద్దో ఎటూ తేల్చని సమాధానం. చిన్నగా గాజులు లయబద్ధంగా శబ్దం చేస్తూంటే తమలపాకుపైకి నాజూగ్గా సున్నం, కాచు, ఛాలియా చేర్చింది. మధ్య మధ్య శంకరం వైపు చిరునవ్వులు విసిరేస్తూ ‘బీడా’లు చుట్టింది. చనువుగా మంచంలో శంకరం పక్క కూర్చుంది. మంచం కిర్రుమంది. సిగ్గు నటిస్తూ నోటికి అందించింది. శంకరానికింకా కైపు ఎక్కటం లేదు. ఎక్కడో చదివాడు. ఈ ప్రొఫెషనల్స్‌లో ఎన్నో జబ్బులుంటాయని వెనక్కు తగ్గలేక ముందుకు పోలేకా మల్లగుల్లాలు పడుతున్నాడు. చమేలీ పక్కన చేరగానే ఆయన మనస్సు ముడుచుకుపోయింది. వృత్తిపరంగా ఆరితేరిన చమేలీకి అది అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు. ‘‘మీకిది కొత్తా’’ అంది. ‘‘జరా నాజూక్ సాబ్! ఇదే మొదటిసారి’’ మాటలు గుర్తుకు వచ్చాయి. శంకరానికి నవ్వు వచ్చింది. ‘‘ఆ నవ్వెందుకో నాకు చెప్పగూడదూ’’ అంటూ మంచం పట్టీ మీదకు ఒరుగుతూ ఆయన్నూ లాక్కుంది. పులుముకున్న సెంటూ చెమటా రెండూ కలిసి అదో కొత్త వాసన. గుచ్చుకుంటున్న చమ్కీ దుస్తులు దూరమయ్యాయి. ఆమె పొడవాటి వేళ్ల గోళ్లు శంకరం వీపును గుచ్చుతున్నాయి. మెరుస్తున్న ఆమె గాజులు ఆయన వీపుకు ఒరుసుకుపోతున్నాయి. ఆయన వీపు ఎర్రనై చిన్న మంట. ‘మెహబూబ్‌కా మెహందీ’ అంటుకుంది. పున్నమి చంద్రుటి రాకతో పొంగిన సముద్రపు కెరటాలు రగిలి రగిలి అమావాస్య రాత్రిలాగా చల్లబడ్డాయి. అనుభవాంతర తన్మయత్వంతో కళ్లు మూతలు పడుతున్నాయి. ప్యాంటు జోబీలో చమేలీ చేయి తారాడుతుంటే ఈ లోకంలోకి వచ్చాడు శంకరం. ‘ఏం’ అన్నట్లుగా కళ్లతోనే ప్రశ్న. ‘‘అంతా ఆ ముసలి ముండకే ఇచ్చారా?’’ ఖాళీ జేబులు తడుముతున్న చమేలీ శంకరం నుండి దూరం జరిగి, ‘‘నా బక్షీష్’’ అంది దీనంగా. ‘నా శ్రమంతా వృథాయేనా’ అన్నట్లున్నాయ్ ఆ చూపులు. ‘‘అదేంటి, నా మీద ప్రేమ లేదూ! నీదంతా నటనేనా?’’ శంకరం నిలవరింపు. ‘‘ప్రేమా, మట్టిగడ్డా!’’ అంటూ కాసేపాగి, ‘‘నా బక్షీష్’’ అంది కొంచెం అధికార స్వరంతో. దగ్గరకు లాక్కోబోయాడు. విదిలించుకుంది చమేలీ. ‘బోణీ నై హూవా’ సణుగుతోంది. ఆయన హిప్ పాకెట్లోంచి రెండు పచ్చనోట్లు బయటకు వచ్చాయి. చమేలీ ముఖంలో మళ్లీ వెలుగు వచ్చింది. గభాలున మంచంలో వాలి శంకరాన్ని పొదుముకుంది. ‘‘అజీ! నువ్వే నా ప్రాణం. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి. క్వార్టర్, బిర్యానీ తెప్పించనా? ఎగస్ట్రా అవుతుంది. మరి’’ ముద్దుల వర్షం కురిపిస్తోంది. శంకరానికి తన్మయత్వం కలుగటం లేదు. నెమ్మదిగా వదిలించుకుని బయటకు వచ్చాడు. హాల్లో పీర్ల బేబీ కునుకుతోంది. తలుపు చప్పుడు విని కళ్లు తెరిచింది. శంకరాన్ని గమనించింది. మరోవైపు తిరిగి కళ్లు మూసుకుంది. ఖాజా బద్మాష్ పత్తాలేడు. చెప్పుల్లో కాళ్లు దూర్చి బయటపడ్డాడు. పక్కింట్లోంచి ఖవాలీ, మద్దెల చప్పుడు, ‘‘ఓ జానె వాలే కభీ న కభీ లౌట్ కె ఆనా’’. చమేలీ ఇచ్చిన బీడాలో సున్నం ఎక్కువైనట్లుంది. నోరు మండుతుంటే దవడ తడుముకున్నాడు. ఇంటి బయటి గోడలకు గీచిన పులులు గర్జించినట్లనిపించింది. ‘పులి రాజు’ శంకరం మళ్లీ మెహందీకై అటేపు వస్తాడో - లేక అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతాడో కాలమే నిర్ణయించాలి.