మెహందీ.. సంగీత్‌... సందడి | Priyamani is married to boyfriend Mustafa on 23rd of this month | Sakshi
Sakshi News home page

మెహందీ.. సంగీత్‌... సందడి

Published Sat, Aug 19 2017 12:46 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

మెహందీ.. సంగీత్‌... సందడి

మెహందీ.. సంగీత్‌... సందడి

పెళ్లికి ముందు రోజు మెహందీ (గోరింటాకు పెట్టుకోవడం) అండ్‌ సంగీత్‌... పెళ్లి తర్వాత రోజు కాక్‌టైల్‌ పార్టీ అండ్‌ రిసెప్షన్‌... కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ప్రియమణి వివాహ వేడుకలు జరగనున్నాయట. ఈ నెల 23న ప్రియుడు ముస్తాఫాతో కలసి ప్రియమణి ఏడడుగులు వేయనున్నారు.

అతికొద్ది మందికి మాత్రమే ఈ పెళ్లి ఆహ్వానాలు వెళ్లాయట. ఆహ్వానాలు అందుకున్నవారు చెబుతున్నదాని ప్రకారం... థీమ్‌ మెహందీ (అందరూ ఓ థీమ్‌ ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం), సంగీత్‌ వేడుకను 22న నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. పెళ్లి తర్వాత రోజు 24న సినీ ప్రముఖులతో సహా పలువురికి కాక్‌టైల్‌ పార్టీ ఇస్తున్నారు. అదే రోజు రిసెప్షన్‌ కూడా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement