Kiara Advani, Sidharth Malhotra share unseen pics from sangeet night - Sakshi
Sakshi News home page

Kiara Advani: ఏం చెప్పాలి.. ఆ రాత్రి సమ్‌థింగ్‌ రియల్లీ స్పెషల్‌.. కియరా పోస్ట్‌ వైరల్‌

Published Wed, Feb 22 2023 1:11 PM | Last Updated on Wed, Feb 22 2023 1:31 PM

Kiara Advani, Sidharth Malhotra Share Unseen Pics From Sangeet Night - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె వివాహ బంధంలోకి  అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్‌ మల్హొత్రను ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన ఈ జంట తాజాగా తిరిగి ముంబైకి చేరింది. ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది కియరా. సంగీత్‌ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్‌ రియల్లీ స్పెసల్‌’ అంటూ  రాసుకొచ్చింది.

అయితే ఆ ఫోటోలు సంగీత్‌ వేడుకలోని అని ఆమె మెన్షన్‌ చేయకపోవడంతో కియరా తన తొలి రాత్రి గురించి చెప్పిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కామెంట్ బాక్సులో ఫైర్ ఎమోజీలు, లవ్ సింబల్స్‌తో నింపేశారు. మరికొంత మంది మాత్రం 'కబీర్ సింగ్' డైలాగులు పెడుతున్నారు. ఆ సినిమాలో  షాహిద్ కపూర్, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డి సినిమాకి హిందీ రీమేక్‌ అది. అందులో హీరోయిన్‌ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరో గడ్డం పెంచి సైకోలా తయారవుతాడు. ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ.. ఏంటి కియరా ఇంత పని చేశావు.. ’అని కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement