Sangeeth Ceremony
-
నాడు సమంత సంగీత్ వేడుక.. సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల (ఫొటోలు)
-
ఆ రాత్రి సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్.. కియరా పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హొత్రను ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన ఈ జంట తాజాగా తిరిగి ముంబైకి చేరింది. ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది కియరా. సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెసల్’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోలు సంగీత్ వేడుకలోని అని ఆమె మెన్షన్ చేయకపోవడంతో కియరా తన తొలి రాత్రి గురించి చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ బాక్సులో ఫైర్ ఎమోజీలు, లవ్ సింబల్స్‌తో నింపేశారు. మరికొంత మంది మాత్రం 'కబీర్ సింగ్' డైలాగులు పెడుతున్నారు. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాకి హిందీ రీమేక్ అది. అందులో హీరోయిన్ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరో గడ్డం పెంచి సైకోలా తయారవుతాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ఏంటి కియరా ఇంత పని చేశావు.. ’అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
వైరల్ వీడియో : సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
బాలీవుడ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల పెళ్లి నిశ్చయమైంది. రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనమ్, ఆనంద్ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోనమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. సంగీత్ కార్యక్రమంలో కరణ్ జోహార్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ జోహర్ డ్యాన్స్ చేస్తుండగా... మధ్యలో అనిల్ కపూర్ రావడం... అనిల్ కపూర్, శిల్పా శెట్టిని డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం... శిల్పా డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
-
మెహందీ.. సంగీత్... సందడి
పెళ్లికి ముందు రోజు మెహందీ (గోరింటాకు పెట్టుకోవడం) అండ్ సంగీత్... పెళ్లి తర్వాత రోజు కాక్టైల్ పార్టీ అండ్ రిసెప్షన్... కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ పర్ఫెక్ట్ ప్లాన్‌తో ప్రియమణి వివాహ వేడుకలు జరగనున్నాయట. ఈ నెల 23న ప్రియుడు ముస్తాఫాతో కలసి ప్రియమణి ఏడడుగులు వేయనున్నారు. అతికొద్ది మందికి మాత్రమే ఈ పెళ్లి ఆహ్వానాలు వెళ్లాయట. ఆహ్వానాలు అందుకున్నవారు చెబుతున్నదాని ప్రకారం... థీమ్ మెహందీ (అందరూ ఓ థీమ్ ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం), సంగీత్ వేడుకను 22న నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. పెళ్లి తర్వాత రోజు 24న సినీ ప్రముఖులతో సహా పలువురికి కాక్టైల్ పార్టీ ఇస్తున్నారు. అదే రోజు రిసెప్షన్ కూడా!!