మహిళల్లో పెరుగుతున్న ఎగ్ ఫ్రీజింగ్
పురుషుల సమస్యలపైనా సానుకూల చర్చ
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం
పదేళ్లు పూర్తిచేసుకున్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్‌్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.
సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.
నోవా ఐవీఎఫ్‌లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.
పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పు
సంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment