IVF Centers
-
గాంధీ ఆస్పత్రిలో ‘ఐవీఎఫ్’ సేవలు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ఉచితంగా పొందొచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. నిరుపేదలకు మాతృత్వపు మమకారాన్ని అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యవిద్యార్థుల వసతిగృహ భవన సముదాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి దామోదర రాజనర్సింహ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఎంసీహెచ్ భవనంలోని ఐవీఎఫ్ సెంటర్‌ను వైద్య ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం గాం«దీఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి వసతులు కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారిందని, తనకు తెలిసిన వెంటనే డైరెక్టర్, గైనకాలజిస్ట్, ఎంబ్రయాలజిస్ట్లను నియమించి, రీఏజెంట్స్ కోసం నిధులు కేటాయించి, సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.సంతానలేమితో బాధపడుతున్న వారిక్కడ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లలో ప్రభుత్వ సెక్టార్లో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 15 రోజుల్లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి లో ఐవీఎఫ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించారు. గాందీలో అదనపు విభాగాల ఏర్పాటు గాం«దీలో ప్రస్తుతం ఉన్న 34 విభాగాలతోపాటు అదనంగా మరో నాలుగు విభాగాలు, యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6 కేన్సర్ కేర్, 74 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకే అనే అభిప్రాయం పోగొట్టాలని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగాన్ని తీర్చిదిద్దేందుకు వైద్యులంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, గాంధీ ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ రాజకుమారి, రాజ్యసభ సభ్యు డు అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ రియా జ్, టీజీఎంఎస్ఐడీసీ చైర్మన్ హేమంత్‌కుమార్, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్‌పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్‌లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
Nizamabad: వ్యాపార కేంద్రాలుగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు!
నందిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సావిత్రి, రాజు(పేరుమార్చాం) దంపతులకు ఆలస్యంగా పెళ్లయ్యింది. నాలుగేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో జిల్లా కేంద్రంలోని ఇన్ఫెర్టిలిటీ కేంద్రానికి వెళ్లారు. ప్రముఖ వైద్యురాలు పరీక్షించి స్కానింగ్‌లు చేయించి మందులు వాడాలని సూచించారు. ఫలితం లేకపోవడంతో ఐయూఐ, అటు తర్వాత ఐవీఎఫ్ చేసినా సంతానం కలగలేదు. ఇందుకోసం సుమారు రూ. 3లక్షలతో పాటు అదనంగా మందుల కోసం రూ. లక్షా 50వేలు ఖర్చయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా చాలామంది దంపతులు పిల్లల కోసం అప్పులు చేసి చికిత్స చేయించుకున్నా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు దత్తత తీసుకుంటున్నారు. నిజామాబాద్‌నాగారం: పిల్లలు పుట్టక ఆవేదన చెందుతూ.. సంతానం కోసం పరితపిస్తున్న దంపతుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుని జిల్లాలో ‘ఇన్ఫెర్టిలిటీ’ దందాను జోరుగా నిర్వహిస్తున్నారు. సంతానం కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మొద ట మూడు నుంచి ఆరు నెలల పాటు ట్రిట్మెంట్ తీసుకోవాలని సూచిస్తారు.. అటు తర్వాత ఏడాది కోర్సు అని.. ఇంకా పిల్లలు పుట్టకపోతే రెండు నుంచి మూడేళ్ల కోర్సు అంటూ నమ్మబలుకుతూ డబ్బు లు వసూలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ పేరిట రూ. లక్షలు గుంజుతున్నారు. చివరకు సంతానం కలగకపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. వీటి సక్సెస్ రేటు 20శాతం ఉంటుందని వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి కేవలం రెండు శాతం మాత్ర మే ఉంటుందని సమాచారం. ఒకవైపు ఈ తతంగమంతా అనుమతి ఉన్న కేంద్రాల్లో సాగుతుండగా.. మరోవైపు అనుమతి లేకుండా జిల్లాలో చాలా కేంద్రాలు కొనసాగుతున్నాయి. అనుమతి లేకున్నా వైద్యం యాంత్రిక జీవనంలో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడంతో పాటు దంపతుల్లో సమస్యలు ఉండడంతో కొందరికి సంతానం కలగడంలేదు. పిల్లలు పుట్టడం లేదనే ఆందోళనతో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో నాలుగైదేళ్లుగా వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో జిల్లాలో సంతాన సాఫ ల్య కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. వీటిలో అనుమతి పొందిన కేంద్రాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో సంతానం కోసం చికిత్సలు అందిస్తున్నారు. కొందరు గైనకాలజిస్టులు అనుమతి లేకుండానే వైద్యం చేస్తున్నారు. పల్లెల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం ఫలానా ఇన్ఫర్టిలిటీ కేంద్రానికి వెళ్తే పిల్లలు పుడతారంటూ చెప్పి మరీ పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కూడా కమీషన్లు ఉండడం గమనార్హం. ఏదేమైనా రూ. లక్షలు ఖర్చు చేసి నెలలు, సంవత్సరాల పాటు చికిత్స పొందినా ఫలితం ఉండకపోవడంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. పర్యవేక్షణ కరువు జిల్లాలో ఇన్పెర్టిలిటీ కేంద్రాల పేరిట యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే అనుమతి ఉంది. వీటి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారో సంబంధిత అధికారులు తూతూమాత్రంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్, ఫీజుల విషయంలో సైతం పట్టించుకోవడం లేదు. కేంద్రాల నుంచి కూడా ‘మామూళ్లు’ ముడుతుండడంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు వస్తే చర్యలు ఇన్ఫెర్టిలిటీ కేంద్రాల్లో సంతానం కోసం చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఏమైనా తేడా జరిగినట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాం. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంతాన సాఫల్య కేంద్రాల చికిత్స విధానంలో సక్సెస్ రేటు ఎంత అనే విషయం నాకు తెలియదు. – గంగాధర్, ఇన్చార్జి ఏవో పర్యవేక్షణ చేయిస్తాం జిల్లాలో అనుమతి పొందిన ఫెర్టిలిటీ కేంద్రాలు ఆరు మాత్రమే ఉన్నాయి. ఇందులో కచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏవో గంగాధర్‌ను పర్యవేక్షణ చేయాలని ఆదేశించాం. తేడాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్‌వో -
వైద్య చరిత్రలో సంచలనం.. రోబో సాయంతో ఐవీఎఫ్.. ఆడ పిల్లల జననం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. స్పెయిన్ దేశం బార్సిలోనా నగరానికి చెందిన ఇంజినీర్ల బృందం రోబోటిక్స్ సాయంతో మానవ అండంలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టింది. ఈ రోబోటిక్ ఐవీఎఫ్ టెక్నాలజీ వినియోగాన్ని అమెరికా న్యూయార్క్ సిటీకి చెందిన న్యూహోప్ ఫర్టిలిటీ సెంటర్లో జరిపారు. ఫలితంగా పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ తెలిపింది. సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ సాయంతో రిపోర్ట్ ప్రకారం.. రోబోటిక్ ఐవీఎఫ్ విధానంపై ఏ మాత్రం అనుభవం లేని ఓ ఇంజినీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అండంలోకి శుక్రకణాల్ని పంపించేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను వినియోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచినట్లు నివేదిక తెలిపింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు తగ్గుతుంది ఇక అత్యాధునిక టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం వైద్యులు చేసే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోబోట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఓవర్చర్ లైఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోబోట్ సాయంతో ఐవీఎఫ్ పరీక్ష ప్రారంభ దశలో ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ విధానంతో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా 5 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు 5,00,000 మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుడుతున్నారు. కానీ చాలా మందికి సంతానోత్పత్తి కోసం ఉపయోగించే సరైన మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా ఖర్చుతు కూడుకున్నది. చదవండి👉 అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే? -
పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు
ఉన్నత చదువులు.. ఉపాధి అవకాశాలు.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఆ తర్వాత భర్త నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే.. భార్య పగలు విధులు నిర్వహించడం వెరసీ.. యువ దంపతుల్లో సంతానలేమి సమస్యకు కారణమవుతోంది. దీంతో పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దంపతుల్లో ఉన్న ఈ బలహీనతను వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. వీర్యకణాల సేకరణ.. అండాల అభివృద్ధి పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు ఒంటరి పేద మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: ఐటీ, అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గ్రేటర్ శివారు జిల్లాలు కేంద్ర బిందువుగా మారాయి. ముఖ్యంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్స్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, కోకాపేట్, నార్సింగి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ సహా కీలక ఐటీ అనుంబంధ సంస్థలన్నీ ఇక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ప్రత్యక్షంగా ఏడు లక్షల మంది యువత.. పరోక్షంగా మరో పది లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 35 ఏళ్లలోపు వారే. వీరంతా ఉన్నత చదువులు, ఉపాధి వేటలో పడి వివాహాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రేడియేషన్ ఎఫెక్ట్.. మూడు పదుల వయసు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. మారిన జీవన శైలికి తోడు ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం, మాంసాహారాలను అధికంగా తీసుకోవడం, రాత్రి వేళల్లో ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, శరీరానికి సరైన వ్యాయామం కూడా లేకపోవడంతో హార్మోన్ల సమతుల్యతలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. రోజంతా ఒడిలనే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు పెట్టుకుని కూర్చొవడం వల్ల వాటి నుంచి వెలువడే రేడియేషన్‌తో యువతీ యువకుల్లో అండాలు, వీర్యకణాలు దెబ్బతింటున్నాయి. యుక్త వయస్కుల్లో ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా.. వాటి నాణ్యత అంతంతే. ఫలితంగా ఆయా దంపతుల్లో సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల కోసం వీరంతా సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్టులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరోగసీ విధానంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇన్ విట్రో ఫెర్టిలేజేషన్ (ఐవీఎ‹ఫ్) ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ)వంటి పద్ధతులను సూచిస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటం.. గ్రేటర్ పరిధిలో సుమారు 200 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మాదాపూర్, శేర్లింగంపల్లి, మియాపూర్, నార్సింగి, గచ్చిబౌలి, శంషాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మణికొండ, కోకాపేట్, నార్సింగి, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో పలు ఫెర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేటు కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పిల్లలు కావాలనే ఆశతో వచి్చన యువ దంపతుల్లో ఉన్న బలహీనతను వీరు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వం సరోగసీ విధానంపై కఠినమైన ఆంక్షలు విధించడంతో ఐవీఎఫ్, ఐయూఐ పేరుతో కొత్త దందాకు తెరతీశాయి. చికిత్స చేసినా పిల్లలు పుట్టేందుకు అవకాశం లేని దంపతులకు ఎలాగైనా పిల్లలను కలిగించి, ఫెర్టిలిటీ సెంటర్‌కు, చికిత్స చేసిన వైద్యులకు మార్కెట్లో మంచి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నారు. చాలా వరకు మందులతోనే మంచి రిజల్ట్ వస్తుంది. మందులు వాడినా ప్రయోజనం లేని దంపతులకు దాతల నుంచి సేకరించిన అండాలు, వీర్య కణాలను ఆశ చూపుతున్నారు. ఇందుకు ఏ తోడూ లేని ఒంటరి పేద మహిళలను ఎంచుకుని వారికి మాయమాటలు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, అండాలు, వీర్యకణాల వృద్ధి పేరుతో మోతాదుకు మించి ఇంజక్షన్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. తీరా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గుట్టుగా అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ జిల్లా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. -
సంతానం లేనివారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగిచుకోవాలి
-
సృష్టి ఆసుపత్రి కేసు:. డాక్టర్ నమ్రతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతకు నోటీసులు జారీ చేసింది. సరోగసి చిన్నారుల అక్రమ విక్రయంపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్.. బినామీ పేర్లతో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ హాస్పిటల్స్ నిర్వహించినట్లు నిర్ధారించింది. నమ్రతపై చర్యలపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫార్సు చేసింది. -
క్లినిక్‌లలో 100 కోట్ల నల్లధనం
బెంగళూరు: ఐవీఎఫ్ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలతో కొందరు వైద్యులు సాగిస్తున్న రహస్య సంబంధాలు బెంగళూరులో బట్టబయలయ్యాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ కామిని రావ్‌కు చెందిన క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సుమారు రూ.100 కోట్ల నల్లధనమున్నట్లు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. తమ దాడుల్లో రూ.1.4 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఐటీ శాఖ ప్రకటించింది. అలాగే విదేశీ కరెన్సీ, కోట్లాది రూపాయల నిల్వలున్న విదేశీ ఖాతాలను కూడా కనుగొన్నట్లు తెలిపింది. ఆయా కేంద్రాలకు రోగులను రెఫర్ చేస్తున్నందుకు బదులుగా అవి డాక్టర్లకు భారీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. తమ సోదాల్లో ఆ ల్యాబ్‌లలో రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయం ఉన్నట్లు కనుగొనగా, ఒక్కో ల్యాబ్‌లో డాక్టర్లకు చెల్లించిన రెఫరల్ ఫీజు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. తమకు రోగులను పంపిన డాక్టర్లకు ల్యాబ్‌లు చెల్లిస్తున్న అనేక విధానాలను గుర్తించామని పేర్కొంది. ‘డాక్టర్లకు అందుతున్న కమిషన్ ల్యాబ్‌ను బట్టి మారుతుంది. ఎంఆర్ఐ పరీక్షలకు 35 శాతం, సిటీ స్కాన్, ఇతర పరీక్షలకు 20 శాతం చొప్పున ఇస్తున్నారు. అయితే ఈ చెల్లింపులను ల్యాబ్‌లు మార్కెటింగ్ ఖర్చులుగా చూపుతున్నాయి. కొన్నిసార్లు డాక్లర్లకు చెల్లించే రెఫరల్ ఫీజును ప్రొఫెషనల్ ఫీజుగా చూపుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఆసుపత్రులు డాక్టర్లను ఇన్–హౌస్ కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి. కానీ వారు క్లినిక్‌లకు రారు. పేషెంట్లను చూడరు. రిపోర్టులు రాయరు. డాక్టర్లకు కమిషన్లు చేరవేసేందుకు కొన్ని ల్యాబ్‌లు కమిషన్ ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి’ అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
ఐవీఎఫ్ కేంద్రాల్లో అక్రమ దందా!
సాక్షి, విశాఖపట్నం: అక్కడ జరుగుతున్నది అక్రమమని తెలుసు.. పేగు పచ్చి ఆరని పసి గుడ్డును విక్రయిస్తున్నారనీ తెలుసు.. అయినా ఏమీ జరగనట్టే ఉంటున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసు.. ఎలా నడిపిస్తున్నారో తెలుసు.. కానీ ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత నిర్లక్ష్యం? ఎవరి కోసం ఈ నిర్లిప్తత? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ‘బేబీ ఫ్యాక్టరీ’ వ్యవహారంలో ప్రభుత్వం, అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. కేవలం వివరాలడిగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేతులు దులుపుకుంటే, ఈ వ్యవహారంపై దష్టి పెట్టేందుకు పోలీసులు సాహసించడం లేదు. పైగా ఫిర్యాదు లేనిదే తామేమీ చేయలేమని తప్పించుకుంటున్నారు. ఏజెంట్లతో ఒప్పందాలు విశాఖపట్నంలో 10 ముఖ్యమైన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) కేంద్రాలు ఉన్నాయనేది అధికారుల లెక్క. ఇవి కాకుండా చిన్నాచితకా కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రధాన ఐవీఎఫ్ కేంద్రాలకు అనుబంధంగా నడుస్తున్నాయి. ఐవీఎఫ్‌కు వచ్చిన వారిలో సంపన్న వర్గాల వారుంటే వారికి పిల్లలను విక్రయించేలా కేంద్రాల నిర్వాహకులు కొందరు ఏజెంట్లతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తమ వద్ద ఉన్న దంపతుల వివరాలను ఏజెంట్లకు అందజేస్తున్నారు. దత్తత తీసుకోవాలంటూ కౌన్సెలింగ్ సంతానం కోసం తమ వద్దకు వచ్చే వారిని ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులు ట్రీట్మెంట్ పేరిట సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు. పరీక్షలంటూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇంతచేస్తున్నా ఈ కేంద్రాల్లో సంతాన భాగ్యం కలిగేది కొందరికే. ఎక్కువ శాతం దంపతులకు సరోగసీ ద్వారా కూడా బిడ్డలు కలిగే అవకాశం ఉండటం లేదు. ఇక ప్రయోజనం లేదని, ఎవరినైనా దత్తత తీసుకోవడమే మేలని నిర్వాహకులు కౌన్సె లింగ్ ఇస్తున్నారు. దానికి ఒప్పుకున్న దంపతులను అప్పటికే సిద్ధంగా ఉన్న ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. ఐవీఎఫ్ కేంద్రాల వద్ద ముగ్గురు చొప్పున ఏజెంట్లు ఉంటున్నారు. బేబీ ఫ్యాక్టరీల నుంచి పిల్లలను తీసుకువచ్చి దంపతులకు విక్రయిస్తున్నారు. మంత్రి ఆదేశాలు బేఖాతరు ఐవీఎఫ్ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటివరకు ఎంత మంది పుట్టారు. వారి వివరాలేమిటనే రికార్డులు వైద్య ఆరోగ్య శాఖ వద్ద లేవు. ఐవీఎఫ్లలోని పిండాలు ఏమవుతున్నాయనే దానిపై సమాచారం లేదు. ఐవీఎఫ్ కేంద్రాల్లో అవకతవకలపై విచారణ జరపాలని సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో 13 పెద్ద ఐవీఎఫ్ సెంటర్లు ఉండగా 10 సెంటర్లకే నోటీసులిచ్చారు. మిగతా మూడు సెంటర్లను ఎందుకు వదిలేశారో అధికారులకే తెలియాలి. ఇక చిన్నాచితకా సెంటర్ల బాగోతాన్ని పట్టించుకోవడమే లేదు. అన్నీ పట్టించుకోవాలంటే సిబ్బంది లేరు ‘‘ఐవీఎఫ్ కేంద్రాలకు పిల్లల విక్రయాలతో సంబం ధంఉండకపోవచ్చు. పిల్లలను విక్రయిస్తున్న వారు కావాలనే ఐవీఎఫ్ కేంద్రాల పేరు చెబుతుండవచ్చు. అయినప్పటికీ 10 ఐవీఎఫ్ సెంటర్లకు నోటీసులిచ్చాం. అన్నీ పట్టించుకోవాలంటే మా వద్ద తగిన సంఖ్యలో సిబ్బంది లేరు’’ -జె.సరోజిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, విశాఖపట్నం