వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు.
స్పెయిన్ దేశం బార్సిలోనా నగరానికి చెందిన ఇంజినీర్ల బృందం రోబోటిక్స్ సాయంతో మానవ అండంలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టింది. ఈ రోబోటిక్ ఐవీఎఫ్ టెక్నాలజీ వినియోగాన్ని అమెరికా న్యూయార్క్ సిటీకి చెందిన న్యూహోప్ ఫర్టిలిటీ సెంటర్‌లో జరిపారు. ఫలితంగా పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ తెలిపింది.
సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ సాయంతో
రిపోర్ట్ ప్రకారం.. రోబోటిక్ ఐవీఎఫ్ విధానంపై ఏ మాత్రం అనుభవం లేని ఓ ఇంజినీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అండంలోకి శుక్రకణాల్ని పంపించేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను వినియోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచినట్లు నివేదిక తెలిపింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది.
ఖర్చు తగ్గుతుంది
ఇక అత్యాధునిక టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం వైద్యులు చేసే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోబోట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఓవర్‌చర్ లైఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోబోట్ సాయంతో ఐవీఎఫ్ పరీక్ష ప్రారంభ దశలో ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ విధానంతో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
ఐవీఎఫ్ ద్వారా 5 లక్షల మంది పిల్లలు
ప్రతి సంవత్సరం దాదాపు 5,00,000 మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుడుతున్నారు. కానీ చాలా మందికి సంతానోత్పత్తి కోసం ఉపయోగించే సరైన మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా ఖర్చుతు కూడుకున్నది.
చదవండి👉 అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment