MIT
-
అమెరికాలో భారత విద్యార్థి కెరియర్ నాశనం.. ఆ ఫొటో కారణమా?
వాషింగ్టన్ : పాలస్తీనాకు మద్దతుగా రాసిన ఓ వ్యాసం అమెరికాలో భారత విద్యార్థి భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెచ్డీ చేస్తున్న ప్లహాద్ అయ్యంగార్‌పై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.ప్రహ్లాద్ ఎంఐటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎంఐటీ నిర్వహిస్తున్న మల్టీ డిసిప్లినరీ స్టూడెండ్ మ్యాగజైన్లో పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ‘వివాదాల్ని పరిష్కరించేందుకు యుద్ధం లేదంటే హింసకు పాల్పడాలి ’ అని అర్ధం వచ్చేలా రాసినట్లు తాము గుర్తించామని అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు. ప్రహ్లాద్ వ్యాసం ఎంఐటీలో హింసకు, నిరసనలకు ప్రేరేపించేలా ఉందని స్టూడెంట్ లైఫ్ డీన్ డేవిడ్ వారెన్ రాండాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వివాదం సృష్టించేలా వ్యాసం రాసినందుకు ప్రహ్లాద్‌పై ఎంఐటీ కఠిన చర్యలు తీసుకుంది. ఐదు సంవత్సరాల నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు చేసింది. క్యాంపస్‌లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి రాసిన వ్యాసాన్ని సైతం స్టూడెండ్ మ్యాగజైన్ నుంచి తొలగించింది.🚨🚨 MIT is effectively expelling PhD student Prahlad Iyengar for Palestine activism on campus. 🚨🚨EMERGENCY RALLY: Cambridge City Hall, Monday, 12/9 at 5:30pm. Org sign-on to letter: https://t.co/tCOrOLTeNy pic.twitter.com/7cAYrvn5ad— MIT Coalition Against Apartheid (@mit_caa) December 8, 2024ఎంఐటీ ఫిర్యాదుతో అమెరికా ప్రభుత్వం సైతం విచారణ చేపట్టింది. భారత విద్యార్థి రాసిన వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఉగ్రవాద సంస్థ లోగో ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. .కాగా, ఎంఐటీ తీసుకున్న నిర్ణయంపై ప్రహ్లాద్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం తాను అందించిన వ్యాసంలోని ఫొటోలే కారణమని చెప్పారు. ఎంఐటీ అడ్మినిస్ట్రేషన్ నన్ను 'ఉగ్రవాదానికి' మద్దతు ఇస్తున్నట్లు ఆరోపించింది. ఎందుకంటే నా వ్యాసంలో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఫొటోలు ఉన్నాయి ’ అని అతని తరుఫు న్యాయవాది ఎరిక్ లీ తెలిపారు. గతంలోనూ సస్పెండ్ ప్రహ్లాద్‌పై ఎంఐటీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. ఆ సస్పెండ్‌పై అమెరికా క్యాంపస్‌లలో మాట్లాడే స్వేచ్ఛలేదని ఆరోపణలు గుప్పించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగం తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తున్నాయి. నేను రాసిన వ్యాసాన్ని మ్యాగజైన్ నుంచి తొలగించడం, బ్యాన్ విధించడం విద్యార్థి సంఘాలు, లెక్చరర్ల హక్కుల్ని భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు. కాగా, ప్రహ్లాద్ ఎంఐటీ తీసుకున్న చర్యలు పలు అమెరికన్ కాలేజీల్లో విద్యార్థులు మద్దతు పలికారు. డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్లో అయ్యంగార్‌కు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
సైంటిస్ట్‌ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వైద్య చరిత్రలో సంచలనం.. రోబో సాయంతో ఐవీఎఫ్.. ఆడ పిల్లల జననం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. స్పెయిన్ దేశం బార్సిలోనా నగరానికి చెందిన ఇంజినీర్ల బృందం రోబోటిక్స్ సాయంతో మానవ అండంలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టింది. ఈ రోబోటిక్ ఐవీఎఫ్ టెక్నాలజీ వినియోగాన్ని అమెరికా న్యూయార్క్ సిటీకి చెందిన న్యూహోప్ ఫర్టిలిటీ సెంటర్లో జరిపారు. ఫలితంగా పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ తెలిపింది. సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ సాయంతో రిపోర్ట్ ప్రకారం.. రోబోటిక్ ఐవీఎఫ్ విధానంపై ఏ మాత్రం అనుభవం లేని ఓ ఇంజినీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అండంలోకి శుక్రకణాల్ని పంపించేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను వినియోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచినట్లు నివేదిక తెలిపింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు తగ్గుతుంది ఇక అత్యాధునిక టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం వైద్యులు చేసే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోబోట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఓవర్చర్ లైఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోబోట్ సాయంతో ఐవీఎఫ్ పరీక్ష ప్రారంభ దశలో ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ విధానంతో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా 5 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు 5,00,000 మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుడుతున్నారు. కానీ చాలా మందికి సంతానోత్పత్తి కోసం ఉపయోగించే సరైన మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా ఖర్చుతు కూడుకున్నది. చదవండి👉 అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే? -
కలుపు తీసేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ వచ్చేస్తున్నాయ్!
వ్యవసాయ సాంకేతిక పరికరాల తయారీ కంపెనీ ‘ఫార్మ్వైస్’ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణుల సాయంతో రైతులకు పనికొచ్చే సరికొత్త పరికరానికి రూపకల్పన చేసింది. పొలంలోని కలుపును ఏరిపారేసే రోబోను ‘వల్కన్’ పేరుతో రూపొందించింది. ఈ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని ‘ఇంటెలిజెంట్ ప్లాంట్ స్కానర్’ పనికొచ్చే మొక్కలేవో, పనికిరాని కలుపుమొక్కలేవో కచ్చితంగా గుర్తించగలదు. కలుపు మొక్కలను ఇట్టే గుర్తించి, వాటిని క్షణాల్లోనే సమూలంగా ఏరిపారేస్తుంది. దీనిని ట్రాక్టర్‌కు అమర్చుకుని, పొలంలో ఒకసారి ఇటూ అటూ నడిపితే చాలు, మొత్తం కలుపునంతటినీ పూర్తిగా ఏరిపారేస్తుంది. -
మాటను బట్టి మనిషిని చిత్రిస్తుంది
ఫొటో అప్లోడ్ చేస్తే డేటాబేస్‌లో పరిశీలించి ఎవరో గుర్తించడం ఇదివరకు చూశాం కానీ.. మాట్లాడితే ఆ ధ్వనిని బట్టి మాట్లాడిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో గీసేయడం చూశారా? అది కూడా డేటాబేస్‌లో ఆ ధ్వని ఎవరిదో పరిశీలించకుండా! ‘మాట్లాడితే ఆడో, మగోచెప్పొచ్చు కానీ.. ఏ మనిషని ఎలా గుర్తిస్తాం?’ అనుకోవచ్చు. కానీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు మాత్రం ‘మాటలు చాలు’.. మనిషెవరో పసిగట్టేస్తామంటున్నారు. ఇలాంటి పని చేయగల ‘స్పీచ్2ఫేస్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్‌వర్క్‌ను వీళ్లు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏఐ.. మనుషుల మాటలను బట్టి వాళ్ల ముక్కు, చెంప ఎముకలు, దవడ ఆకారాన్ని గీసేస్తుంది. మనుషులు మాట్లాడే విధానం వాళ్ల ముక్కు, ఇతర ముఖం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుందనే సూత్రంపై ఆధారపడి ఇది పని చేస్తుంది. అయితే ఈ ఏఐ ఇంకా ప్రాధమిక దశలో ఉంది. కొన్నిసార్లు ముఖాలను తప్పుగా కూడా గీస్తోంది. ఉదాహరణకు హై పిచ్ గొంతున్న మగ వారిని ఈ ఏఐ ఆడవారిగా గుర్తిస్తోంది. ఆడవాళ్లకు డీప్ వాయిస్ ఉంటే మగవారని చెబుతోంది. ఆసియా ప్రజలు ఇంగ్లిష్ బాగా మాట్లాడితే కాస్త పశ్చిమ దేశాల ప్రజల ముఖాలను పోలినట్టు చూపిస్తోంది. ఈ ఏఐలో కొన్ని లోపాలు కనిపిస్తున్నా.. ఇది అద్భుతాలు చేస్తోందని, మున్ముందు పరిశోధనలకు ఇది ఊతమిస్తోందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
Piyush Verma: ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. ఎంతో మందిని విజయాల బాట పట్టించాడు!
Uttarakhand Piyush Verma Inspiring Journey Manush Labs Helps Startups: మార్కెట్ వినీలాకాశంలో విజయవంతంగా దూసుకుపోతున్న స్టార్టప్‌లనే చూస్తారు కొందరు. కొందరు మాత్రం...వైఫల్యంతో నేలరాలిన స్టార్టప్‌లను కూడా చూస్తారు. వాటికి మరింత శక్తిమంతమైన ఇంధనం ఇచ్చి రయ్యిమని దూసుకెళ్లేలా చేస్తారు. పియూష్ వర్మ ఈ కోవకు చెందిన యువకుడు. ఫెయిల్యూర్ స్టార్టప్‌లను రిపేర్ చేసే వైద్యుడు.... మన దేశంలో ‘స్టార్టప్’ ఉత్సాహానికి కొదవ లేదు. అయితే సమర్థులు అనుకునేవాళ్లు కూడా ‘స్టార్టప్ ఫెయిల్యూర్స్’ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సరిౖయెన దారి చూపితే ఎక్కడో ఉంటారనే ఆలోచనతో పియూష్ వర్మ ప్రారంభించిందే....మనుష్ ల్యాబ్. ఫండింగ్, ఇన్వెస్టర్స్, నెట్వర్కింగ్ అవకాశాలు, సలహాలు, సూచనలు, మార్కెట్ స్ట్రాటజీలు....మొదలైన వాటికి ఇది సరిౖయెన వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు, ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి తన మనుష్ ల్యాబ్‌తో శ్రీకారం చుట్టాడు నైనిటాల్ ( ఉత్తరాఖండ్) కుర్రాడు పియూష్. ‘ఇండియాలో వివిధ రకాల మార్కెట్ అవకాశాలు ఉన్నప్పటికీ, సక్సెస్ఫుల్ స్టార్టప్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనికి కారణం సమర్థత లేక పోవడం కాదు...సమస్యను సరిగా అర్ధం చేసుకోకపోవడం’ అంటున్న పియూష్ ఫెయిల్యూర్ స్టార్టప్‌లను లోతుగా అధ్యయనం చేశాడు. నోట్స్ రాసుకున్నాడు. అలా అని తన ఆలోచనలు మాత్రమే ఉంటే సరిపోదు కదా! ఒక అత్యుత్తమమైన బృందాన్ని తయారుచేసుకున్నాడు. హార్వర్డ్, ఎంఐటీలో చదువుకున్న దిగ్గజాలు, సోషల్ఎంటర్ప్రెన్యూర్స్, వాలెంటీర్లు, యూఎస్‌లోనే కాదు మనదేశంలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారు...‘ల్యాబ్’ తరపున నిర్మాణాత్మకమైన సలహాలు అందిస్తారు. ‘ల్యాబ్’ నిర్వహించే ఇన్వెస్టర్ సెషన్లలో ప్రపంచవ్యాప్తంగా వందమంది వరకు ఇన్వెస్టర్లు పాల్గొంటున్నారు. పియూష్ అతడి బృందం మన దేశంలోని పాతికకు పైగా స్టార్టప్‌లకు ఇన్వెస్టర్ యాక్సెస్ నుంచి మార్కెట్స్ట్రాటజీ వరకు ఎన్నో విషయాలు బోధపరిచి సక్సెస్రూట్ చూపించింది. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే... హిమాచల్‌ప్రదేశ్‌లో ‘దీదీ కాంట్రాక్టర్’ అని పిలుచుకునే ఒక జర్మన్ అర్కిటెక్ట్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పియూష్‌కు. ఆమె చాలా సింపుల్‌గా స్థానిక వస్తువులు, సంప్రదాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో ఇండ్లను నిర్మించేది. సోషల్ ఆర్ట్ అంటే ఏమిటో అక్కడే అర్థమైంది. ఇది తనకు ఎంతగా స్ఫూర్తి ఇచ్చిందంటే...ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇండ్ల నిర్మాణం, దిల్లీలోని నిరాశ్రయుల కోసం ట్రాన్స్‌ఫార్మబుల్ ప్రొటోటైప్ షెల్టర్స్ నిర్మాణంలో పాలుపంచుకునేలా చేసింది. అప్పుడే అతడికి అర్ధమై ఉంటుంది... శాస్త్రానికి సామాజిక బాధ్యత ఉండాలని! మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(యూఎస్) గ్రాడ్యుయెట్ అయిన పియూష్ వర్మకు బాగా నచ్చిన పుస్తకం క్లినికల్ సైకాలజిస్ట్ డా.మెగ్ జె రాసిన డిఫైనింగ్ డికేడ్. మనిషి జీవితంలో ఇరవై ఏళ్ల వయసు ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం బాగా చెబుతుంది. ‘కలలు నిజం చేసుకునే విషయంలో దైవదత్త హక్కులు అంటూ ఉండవు. విజేతల్లో నువ్వు కూడా ఉన్నావు. నీ బలం ఏమిటో నీకు తెలియడమే కాదు నీ ప్రణాళిక ఏమిటో కూడా తెలిసి ఉండాలి’... గుడ్ లక్! చదవండి: Shefali Shah: రెస్టారెంట్ బిజినెస్‌లోకి నటి... పగటి‘కళ’లు నిజమవుతాయి! -
ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బెజోస్ అంతరిక్షయాత్రపై నెటిజన్లు తీవ్ర విమర్శలను గుప్పించారు. అంతేకాకుండా కొంతమంది తమ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఖాతాలను వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. కాగా తాజాగా జెఫ్ బెజోస్ మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! మానవుడు ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేందుకు చేస్తోన్న ప్రయోగాలకు ఊతం ఇస్తూ ఆయా కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆల్టోస్ ల్యాబ్స్ యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలను చేస్తోంది. ఈ కంపెనీ వెనుక జెఫ్‌బెజోస్ ఉన్నట్లు ఏమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. మానవ కణాలను రిప్రోగ్రామ్ చేయడం ద్వారా మానవుడుకి వృద్దాప్యం దరిచేరకుండా ఆల్టోస్ ల్యాబ్స్ పరీక్షలను చేస్తోంది. ఆల్టోస్ ల్యాబ్‌లో జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్ చేసిన కొద్దిరోజులకు కంపెనీ భారీ వేతనాలతో పలు శాస్త్రవేత్తలను నియమించుకున్నట్లు ఎమ్ఐటీ టెక్ రివ్యూలో తెలిసింది. ఈ విషయంపై జెఫ్‌బెజోస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ స్పందించలేదు. యాంటీ ఏజింగ్ పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2018లో యూనిటీ టెక్నాలజీస్ అనే బయోటెక్ సంస్థలో కూడా ఏర్పాటు చేయనుంది. ఎమ్ఐటీ టెక్ రివ్యూ ప్రకారం యాంటీ ఏజింగ్ పరిశోధనలో భాగంగా ఆల్టోస్ ల్యాబ్స్ కణాల రీప్రోగ్రామింగ్ టెక్నాలజీపై దృష్టిసారించింది. 2012లో నోబుల్ అవార్డును గెలిచిన షిన్యా యమనాకా ఆల్టోస్ ల్యాబ్స్‌కు సైంటిఫింక్ అడ్వైజరీ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..? -
ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?
ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు. శివ అయ్యదురై 1978లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశాడు. దానిని ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఈ-మెయిల్ టు బాక్స్, ఇన్‌బాక్స్, ఫోల్డర్లు, మెమోలు వంటి ఈ ప్రోగ్రామ్‌లు శివ అయ్యదురై ఈ మెయిల్లో కనిపించే ప్రధాన లక్షణాలు, ఇప్పటికీ అవి ఉన్నాయి. శివ అయ్యదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగష్టు 30, 1982 అధికారికంగా గుర్తించింది. ఈ-మెయిల్ సృష్టికర్తగా శివ అయ్యదురైకి 1978లో యూఎస్ కాపీరైట్ హక్కులు లభించాయి. తమిళ కుటుంబానికి వెల్లయప్ప అయ్యదురై శివ డిసెంబర్ 2, 1963న ముంబైలో జన్మించారు. తనకు ఏడు ఏళ్లు ఉన్నప్పుడు శివ కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. అయ్యదురై 14 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఒక ప్రత్యేక ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో చేరాడు. అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు పొందాడు. కొంచెం ఈ-మెయిల్ సృష్టికర్త విషయంలో కొందరు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రే టాంలిన్సన్ ఈ-మెయిల్ సృష్టించినట్లు భావిస్తున్నారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో
వాషింగ్టన్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు వస్తాయని, సింగిల్స్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే పోటీని గణాంకాలు నడిపించనున్నాయని జోస్యం చెప్పాడు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని, బేస్‌బాల్ తరహాలో క్రికెట్లో సైతం గణాంకాలే కీలమని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్లో గణాంకాలపై నిర్వహించిన సదస్సులో ద్రవిడ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్, ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల సాధన దగ్గర నుండి ఫిట్నెస్, బౌండరీలు, సిక్సర్లు లాంటి మరెన్నో అంశాల్లో డేటా చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. బాస్కెట్ బాల్లోని 3 పాయింట్ రెవల్యూషన్ తరహాలోనే క్రికెట్లో కూడా డేటా ప్రయోజనాలుంటాయని స్పష్టం చేశారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మరీ ప్రతిదాడి చేస్తున్నారని, ఇందుకు వారు డేటాను బాగా వినియోగించుకుంటున్నారని ఇషా గుహ తెలిపారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అన్న అంశాన్ని గ్యారీ కిర్‌స్టెన్ వివరించారు. చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
కరోనా: ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు
న్యూయార్క్ : భారత్‌లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోన్న మహమ్మారి రాబోయే రోజుల్లో స్వైరవిహారం చేస్తుందనే అంంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.కోవిడ్-19కు వ్యాక్సిన్ రానిపక్షంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో రోజుకు 2,87,000 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తాయని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అంచనా వేశారు. ఎంఐటీ పరిశోధకులు హజిర్ రెహ్మాందాద్, టీవై లిమ్, జాన్ స్టెర్‌మన్‌లు ఎస్ఈఐఆర్ (అనుమానిత, రిస్క్, వైరస్, రికవరీ) పద్ధతిలో ఈ విశ్లేషణ చేపట్టారు. అంటువ్యాధుల నిపుణులు శాస్త్రీయంగా ఉపయోగించే నిర్ధిష్ట గణాంక పద్ధతిగా భావించే ఎస్ఈఐఆర్ మోడల్‌ను వీరు అనుసరించి లెక్కగట్టారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే 2021 మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతాయని పరిశోధక బృందం తేల్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు భారత్‌లోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదవుతాయని తర్వాతి స్ధానంలో అమెరికా (రోజుకు 95,000 కేసులు), దక్షిణాఫ్రికా (21,000 కేసులు), ఇరాన్ (17,000 కేసులు)లు నిలుస్తాయని ఎంఐటీ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, వాటి వేగం పెరిగే అవకాశం, కాంటాక్ట్ రేటను పరిగణనలోకి తీసుకుని పరిశోధకులు ఈ గణాంకాలను వెల్లడించారు. ఇక కరోనా టెస్టులు ప్రస్తుత స్ధాయిలోనే ఉండి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించే రేటు స్ధిరంగా ఉంటే కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధక బృందం పేర్కొంది. అధికారిక కేసుల సంఖ్య కంటే వాస్తవ కేసులు అధికంగా ఉంటాయని, అత్యధికులు వ్యాధిబారిన పడే అనుమానితులేనని స్పష్టం చేసింది. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో హెర్డ్ ఇమ్యూనిటీని ఎంచుకోవడం సరైందికాదని పరిశోధకులు పేర్కొన్నారు.చదవండి : కోవిడ్-19 అప్డేట్ : 24 గంటల్లో 25,000 కేసులు -
శుభవార్త ;అందుబాటులోకి యాంటీబయాటిక్
ఇటీవల చాలాకాలం నుంచి మనకు సరికొత్త యాంటీబయాటిక్స్ ఏవీ లభ్యం కాకపోవడం మానవాళిని ఆందోళనలో ముంచెత్తుతోంది. అలాంటి దుస్థితిని తొలగించేందుకు ‘మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’(ఎమ్ఐటీ) పరిశోధకులు నడుంకట్టారు. అక్కడి ఫలితాలూ ఆశాజనకంగానూ ఉన్నాయి. అతి త్వరలోనే మానవాళికి ‘హాలిసిన్’ పేరుతో ఓ సరికొత్త యాంటీబయాటిక్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉండటం మన అలవాటు. ఆన్ కౌంటర్ మెడిసిన్స్‌గా అమ్ముడయ్యే వాటిల్లో యాంటీబయాటిక్సే ఎక్కువ. దాంతో గతంలో చిన్న యాంటీబయాటిక్ వేస్తే తగ్గిపోయే వ్యాధులు కూడా మొండికేయడం మొదలుపెట్టాయి. మనం తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములూ తమ శక్తిని విపరీతంగా పెంచుకుంటూ పోయి‘ సూపర్‌బగ్స్’గా మారిపోతూ మానవాళిని బెంబేలెత్తించాయి. ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయే ట్యూబర్క్యులోసిస్ (టీబీ) వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు... తమ నిరోధకశక్తిని పెంచుకొని రెసిస్టెంట్ వెరైటీ టీబీని కలిగిస్తూ సూపర్‌బగ్స్‌గా రూపొందాయి. దాంతో ప్రస్తుతం లభ్యమవుతున్న యాంటీబయాటిక్ మందులను డబుల్‌డోస్ ఇచ్చినా ఆ సూపర్‌బగ్స్‌ను నిర్మూలించలేకపోతున్నాం. ఇలాంటి దుస్ధితి వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయేమోనని అటు వైజ్ఞానికులూ, ఇటు వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో అలాంటి సూపర్‌బగ్స్‌ను తుదముట్టించే యాంటీబయాటిక్‌కు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఓ భరోసా లభించింది. హాలిసిన్ అనే పేరుతో రాబోతున్న ఈ సరికొత్త యాంటీబయాటిక్ ఔషధం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. -
ఏరో హీరో
కోట్ల రెమ్యునరేషన్. సినిమా రిలీజ్ అయితే వందల కోట్ల బిజినెస్. ఇదీ హీరో అజిత్ మార్కెట్. ఇప్పుడు మరో కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారు. శాలరీ ఎన్ని కోట్లో అనుకుంటున్నారా? కోట్లు కాదండి.. వెయ్యి రూపాయిలు మాత్రమే. అవును.. కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ హీరో వెయ్యి రూపాయిల జీతంతో కొత్త జాబ్ టేకప్ చేశారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అజిత్‌ను ‘హెలికాప్టర్ టెస్ట్ పైలెట్ అండ్ యూవీఏ సిస్టమ్ అడ్వైసర్’గా అపాయింట్ చేసింది. ఈ పని కోసం అజిత్ విజిట్ చేసిన ప్రతీసారి 1,000 రూపాయిలు జీతంగా ఇస్తారట. చిన్నప్పటి నుంచి ఏరో టాపిక్ అంటే ఇష్టం ఉన్న అజిత్ ఈ అసైన్మెంట్ను తనంతట తాను అడిగి టేకప్ చేశారట. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కాంపిటేషన్ కోసం అజిత్ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) టెస్టింగ్ అండ్ డిజైనింగ్‌లో తన సేవలు అందిస్తారు. వచ్చే 1,000 రూపాయిల జీతాన్ని కూడా ఎమ్ఐటీలో పేద విద్యార్థుల కోసం డొనేట్ చేయనున్నారు.తాజా చిత్రం ‘విశ్వాసం’ షూటింగ్ కోసం అజిత్ ఆదివారం హైదరాబాద్ వచ్చారని సమాచారం. -
అజిత్‌కు ఎంఐటీలో జీతం ఎంతో తెలుసా?
తమిళసినిమా: నటుడు అజిత్‌కు చెన్నై ఎంఐటీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎంతో తెసుసా? కేవలం రూ.1000. ఏమిటీ నమ్మశక్యం కావడం లేదా. అవునులే ఒక్క సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకునే అజిత్ కేవలం రూ.1000 జీతానికి ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరు మాత్రం నమ్ముతారు. అయితే ఇది నిజం. చెన్నైలోని ఎంఐటీలో సాంకేతిక పరిజ్ఞానం శాఖ తరఫున తయారు చేస్తున్న మానవశక్తి అవసరం లేని చిన్న విమాన పథకానికి నటుడు అజిత్ సలహాదారుడిగా నియమింపబడ్డారు. అంటే చిన్న విమానానికి అజిత్ టెస్ట్ పైలట్‌గా వ్యవహరించనున్నారన్న మాట. ఎంఐటీ సాంకేతిక పరిజ్ఞాన విభాగం మనవశక్తి అవసరం లేని విమానాలను తమారు చేసే పనిలో నిమజ్ఞమైంది. ఇవి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రోగులకు వైద్య సహాయాన్ని అందించి తిరిగి రాగలవు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎంఐటీలోని సాంకేతిక పరిజ్ఞాన విభాగ విద్యార్థులు మానవశక్తి అవసరం లేని చిన్న విమానాన్ని తయారు చేస్తున్నారు. వారికి తన సహకార, సలహాలను అందించడానికి నటుడు అజిత్ సిద్ధం అవుతున్నారు. అందుకుగానూ ఆయన పారితోషికంగా రూ.1000 అందుకోనున్నారు. ఈయన చదువుకునే రోజుల్లోనే ఆకాశంలో పయనించే విమానాలకు చెందిన మోడల్స్ తయారు చేయడంపై ఆసక్తి చూపించేవారు. అదే విధంగా రిమోట్ ద్వారా నడిపే వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి ఆసక్తితోనే చెన్నై ఎంఐటీలోని దక్ష అనే సాంకేతిక పరిజ్ఞాన బృందంలో తానూ ఒకరిగా చేరారు. ఈ బృందమే ఇప్పుడు అస్ట్రేలియాలో జరగనున్న మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 పోటీల్లో పాల్గొననుంది. అదే విధంగా అన్నావిశ్వవిద్యాలయం కూడా నటుడు అజిత్‌ను మనుషుల అవసరం లేని విమాన పథకానికి సలహాదారుడిగా నియమించుకుంది. ఇందుకుగానూ అజిత్ ప్రతిసారి వచ్చి వేళ్లేందుకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు. -
ఏ వ్యాధినైనా షెర్లాక్తో పట్టేయొచ్చు..!
బోస్టన్: మానవశరీరంలోని వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించే ప్రత్యేకమైన కాగితాన్ని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షెర్లాక్(స్పెసిఫిక్ హై సెన్సిటివిటీ రిపోర్టర్ అన్లాకింగ్)గా పిలుస్తున్న ఈ కాగితాన్ని ఆర్ఎన్ఏ శాంపిల్స్‌లో ముంచడం ద్వారా శరీరంలో ఏయే రోగాలున్నాయో వెంటనే తెలుసుకోవచ్చని ఎంఐటీకి చెందిన ఫెంగ్ జెహాంగ్ తెలిపారు. షెర్లాక్ ద్వారా ట్యూమర్ డీఎన్ఏ, ఊపిరితిత్తుల కేన్సర్, జికా, డెంగ్యూ వైరస్‌లను గుర్తించగలిగామని వెల్లడించారు. షెర్లాక్లో ప్రధానంగా సీఏఎస్ 13 అనే ఎడిట్‌చేసిన ప్రొటీన్ ఉంటుందని ఫెంగ్ తెలిపారు. ఏదైనా శాంపిల్స్లోకి సీఏఎస్ 13ను ముంచినప్పుడు అందులోని రోగకారక క్రిముల ఆధారంగా ఈ ప్రొటీన్ ఆర్ఎన్ఏలుగా విడిపోతుందన్నారు. తద్వారా రోగికి ఏ వ్యాధి సోకిందో వెంటనే తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
ఉల్కలే నీటిని భూమిపైకి తీసుకొచ్చాయా?
బోస్టన్: భూమిపై జీవం పుట్టుకకు నీరు ప్రధాన కారకమనే విషయం శాస్త్రీయంగా ఇప్పటికే రుజువైంది. మరి ఈ భూమిపైకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇందుకు సంబంధించి అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని వెల్లడించారు. మన సౌర వ్యవస్థ ఆవిర్భవించిన తొలి రెండు మిలియన్ సంవత్సరాల్లో భూమిపైకి ఉల్కలే నీటిని తీసుకొచ్చాయని చెబుతున్నారు. ‘ఉల్కలనేవి అంతరిక్షంలోని శిథిల పదార్థాలు. సౌర మండలంలోని మంచు, వాయువులు, ధూళితో ఉల్కలు ఏర్పడతాయి. ఇవి మైక్రాన్ల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. వీటికి నిర్దిష్ట కక్ష్య ఉండదు. అంతరిక్షంలో సంచరిస్తున్న శిథిల పదార్థం భూమి సమీపంలోకి వచ్చినపుడు గురుత్వాకర్షణకు లోనవుతుంది. ఫలితంగా భూమి వాతావరణంలోకి ఆకర్షితమవుతాయి. -
ఈ బంగారూ గొప్పేంటో తెలుసా?
చాలామంది మార్కులు, ర్యాంకులే గొప్ప అనుకుంటారు. అందుకోసం పిల్లల్ని నానారకాలుగా ఒత్తిడికి గురిచేస్తూ.. తమ అభిప్రాయాలను వారిపై రుద్దుతుంటారు. కానీ, ముంబైకి చెందిన సుప్రియా అందరిలాగా ఆలోచించలేదు. సంప్రదాయ చదువులే సర్వసమని భావించలేదు. నిజానికి నాలుగేళ్ల కిందట ఆమె ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తరగతిలో అద్భుతంగా చదువుతున్న తన కూతురు మాల్విక రాజ్ జోషీతో బడి మాన్పించింది. సంప్రదాయ చదువులకు స్వస్తిచెప్తి.. తనకు నచ్చిన సబ్జెక్ట్‌ను చదువుకొనేలా మాల్వికను ప్రోత్సహించింది. అదే 17 ఏళ్ల మాల్వికకు అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పదో తరగతి చదవకపోయినా.. ఇంటర్ సర్టిఫికెట్ లేకపోయినా ఆమెకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో సీటు లభించింది. మాల్వికలోని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రతిభను గుర్తించిన మిట్ పిలిచి మరీ సీటు ఇచ్చింది. మిట్ అందించే ఉపకార వేతనం (స్కాలర్షిప్)తో ఆమె ప్రస్తుతం బ్యాచ్‌లర్ సైన్స్ డిగ్రీని అభ్యసిస్తున్నది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు రతజ, ఒక కాంస్య పతకం సాధించడంతో ఆమెను ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చి వరించింది. ప్రొగ్రామింగ్ ఒలింపియాడ్‌గా పేరొందిన ఈ (మాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సబ్జెక్ట్) పోటీల్లో పతకాలు సాధించిన వారికి తమ ఇన్స్టిట్యూట్లోనే తీసుకొనే సంప్రదాయాన్ని మిట్ కొనసాగిస్తున్నది. నిజానికి మాల్విక ఇంటర్ పాస్ కాకపోవడంతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు లభించలేదు. కేవలం చెన్నై మాథ్మేటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ)లో ఆమెకు సీటు దొరికింది. డిగ్రీ విద్యార్థులకు సమానంగా ఆమెకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉండటంతో ఆమె ఎమ్మెస్సీలో చేరింది. మాల్వికకు ప్రతిష్టాత్మక మిట్లో సీటు రావడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 'మాది మధ్య తరగతి ఫ్యామిలీ. నిజానికి స్కూల్లో మాల్విక బాగా చదువుతున్నప్పుడే.. పిల్లలు సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయ చదువుల కన్నా ఆనందమే అత్యంత ముఖ్యమని భావించాను' అని సుప్రియా చెబుతారు. ఆమెకు మాల్వికతోపాటు రాధ అనే కూతురు ఉంది. 'క్యాన్సర్ రోగుల సంక్షరణ చూసే ఓ స్వచ్ఛంద సంస్థలో నేను పనిచేస్తాను. ఎనిమిది, తొమ్మిది తరగతి చదివే పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడి అవస్థలు పడటం నన్ను కలిచివేసింది. అందుకే చదువుల కన్నా నా బిడ్డలు ఆనందంగా ఉండటం ముఖ్యమనుకున్నా' అని ఆమె తెలిపారు. ఇంజినీరు అయిన భర్తను కూడా ఇందుకు ఒప్పించారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఉండి చదువుకుంటున్న మాల్విక మాట్లాడుతూ 'నాలుగేళ్ల కిందట చదువు మానేసినప్పుడు నేను చాలా సబ్జెక్టులను అన్వేషించారు. అందులో ఒకటైన ప్రోగామింగ్ నాకు ఆసక్తి కలిగించింది. దాంతో మిగతా సబ్జెక్టుల కన్నా ప్రోగ్రామింగ్‌పై ఎక్కువ దృష్టి సారించా. దానిపై ఇష్టం ఏర్పడింది' అని తెలిపింది. ఆ ఇష్టం వల్లే సబ్జెక్టుపై పట్టు సాధించి.. ఇప్పుడు మిట్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తాను సంతోషం వ్యక్తం చేసింది. -
ఇక సిలికాన్‌తో పనిలేదోచ్..!
బోస్టన్: సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో సిలికాన్ లేదా కాపర్ మెటీరియల్ ను ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ, బొగ్గు పొరలను ఉపయోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ హీటింగ్ డివైజ్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రంగంలోని మరిన్ని పరికరాల తయారీలో బొగ్గును ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బొగ్గు ఉపయోగాలను పరిశీలించిన శాస్త్రజ్ఞులకు క్రమంగా సాధారణ మెటీరియల్స్‌తో పోల్చితే బొగ్గు మాలిక్యులర్ కాంప్లెక్సిటీలో భారీ తేడా కనిపించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ వినియోగంలో వాడి విజయం సాధించారు. ఇప్పటివరకు బొగ్గుతో తయారుచేసిన ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజ్‌ను కార్లు, విమానాలు కిటికీలు, రెక్కల్లో ఉపయోగించారు. మొదటి దశలో బొగ్గులో ఉండే ఆంథ్రసైట్, లిగ్నైట్, రెండు బైట్యుమినస్ రకాల ప్రాపర్టీల్లో తేడాలను గమనించిన పరిశోధకులు సహజసిద్ధంగా లభించే బొగ్గులో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారీకి కావలసిన అన్నీ గుణాలు కలిగి ఉన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. తర్వాత ప్రత్యేక పద్ధతుల్లో బొగ్గును పొడిగా తయారుచేసి పలుచని ఫిల్మ్ మీద మిశ్రమాన్ని పోసి పొరలుగా తయారుచేసుకున్నారు. ఈ పొరల్ని సాధారణంగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పద్ధతి ఫ్యాబ్రికేషన్‌లో సిలికాన్ స్థానంలో బొగ్గు పొరల్ని ఉంచారు. ఇలా మామూలు తయారీ పద్ధతిని ఉపయోగించి ప్రస్తుతం తయారవుతున్న అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీనిని ఉపయోగించొచ్చని శాస్త్రజ్ఙులు చెబుతున్నారు. దీంతో సిలికాన్‌తో పోల్చితే తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ నానో లెటర్స్‌లో ప్రచురించారు. -
శ్రీకాంత్ సాధించాడు
'నువ్వేమీ చేయలేవంది ప్రపంచం..నేను చేయలేనిదేమీ లేదని దానికి చెప్పా..' అంటాడు శ్రీకాంత్ బొల్లా. యాభై కోట్ల విలువ చేసే కంపెనీ, ఏడాదికి ఏడు కోట్ల రూపాయల టర్నోవర్, ప్రెస్, పబ్లికేషన్ సంస్థలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.. ఇవన్నీ ఈయన సొంతం. కానీ, అవేవీ రాత్రికి రాత్రే సమకూరినవి కాదు. ప్రపంచంలోని ఏ వ్యక్తై సంపదలు సృష్టించగలడు. అయితే, ప్రపంచం అతన్ని విశ్వసించాలి. అతనిపై నమ్మకం ఉంచాలి. అప్పుడే అద్భుతాలు సాధ్యపడతాయి. కానీ, శ్రీకాంత్‌ను నమ్మేవారే లేరు. కారణం.. ఆయనో అంధుడు! అయితేనేం.. కార్యసాధకుడు!! కృష్ణాజిల్లా సీతారామపురంకు చెందిన కష్టాలు, శ్రీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే.. నిజమేననిపిస్తుంది అతడి కథ విన్నాక! పుట్టుకతోనే కష్టాలతో సావాసం చేశాడీ యువకుడు. తల్లిదండ్రులు పేద రైతులు. 'గుడ్డివాడు పుట్టాడు. వీడినేం చేసుకుంటారు?'అన్నారు చాలామంది. మరికొందరు ఓ అడుగు ముందుకేసి, 'చంపేయండి. పీడ విరగడైపోతుంది' అంటూ సలహా ఇచ్చారు. దేవుడి ఆజ్ఞాపించాడో ఏమో.. ఆ తల్లిదండ్రులకు చేతులు రాలేదు. అలా బతికి బట్టకట్టాడు శ్రీకాంత్. మెల్లగా పెరిగి పెద్దయ్యాడు. బడికి వెళ్లే వయసు. ఎలాగో బడిలో చేర్చుకున్నారు గురువులు. కానీ, ఏనాడూ ముందు వరుస బెంచీల్లో అతన్ని కూర్చోనివ్వలేదు. వెనక బెంచీకే పరిమితం చేశారు. ఇక, ఆట పాటలకూ శ్రీకాంత్ దూరమే. తప్పు అతనిది కాదు. ఎవరూ అతన్ని ఆటల్లో చేర్చుకునేవారు కాదు. అదే కారణం! అయితే, ఇవేమీ అతన్ని పదో తరగతి పరీక్షల్లో స్కూలు ఫస్ట్ ర్యాంకు సాధించకుండా ఆపలేకపోయాయి. తర్వాతి గమ్యం ఇంటర్మీడియట్.. కాలేజీ మెట్లెక్కుదామని సరదా పడ్డాడు. నేరుగా వెళ్లి, సైన్స్ గ్రూపులో చేరుతానంటూ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దానికాయన అంగీకరించలేదు. 'పోయి, ఆర్ట్స్ గ్రూపులో చేరు' అంటూ సలహా ఇచ్చాడు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం అంధులు సైన్స్ గ్రూపులు ఎంచుకోవడానికి వీల్లేదు. ఆర్ట్స్‌లో ప్రవేశాలకు మాత్రమే వారు అర్హులు. అయితే, శ్రీకాంత్ పట్టువిడవలేదు. బోర్డుకు వ్యతిరేకంగా ఓ కేసు దాఖలు చేశాడు. అంతే.. ఆరు నెలల తర్వాత బోర్డు దిగివచ్చింది. శ్రీకాంత్‌కు సైన్స్ గ్రూపులో ప్రవేశమూ వచ్చింది. తనకు అవకాశమిచ్చినవారికి తానేమిటో చూపించాడు. 98 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నివ్వెరపోవడం అందరి వంతూ అయింది. ఇక, శ్రీకాంత్ తదుపరి గమ్యం ఐఐటీలో ప్రవేశం పొందటం. దీని కోసం రేయింబవళ్లూ కష్టపడ్డాడు. కానీ, ప్రతిష్టాత్మక ఐఐటీలు శ్రీకాంత్‌ను స్వాగతించేందుకు సిద్ధంగా లేవు. అతనికి హాల్ టికెట్‌ను పంపించేందుకు నిరాకరించాయి. అంతే.. ఐఐటీల్లో ఇంజినీరింగ్ చదవాలన్న అతని కల నీరుగారిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాడు. 'నేను ఐఐటీలకు అవసరం లేకపోతే.. నేనూ వాటిని లెక్క చేయను' అని అమెరికావైపు చూశాడు. అక్కడి టాప్ కళాశాలలకు దరఖాస్తు చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత ఎమ్ఐటీ, స్టాన్ఫోర్డ్, బర్కెలీ, కార్నెగీ మెల్లాన్ కళాశాలలు శ్రీకాంత్‌కు ఆహ్వానం పలికాయి. వాటిలో ఎమ్ఐటీను ఎంచుకున్నాడు. ఆ కళాశాలకు తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలో బోలెడన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగమిస్తామంటూ ముందుకొచ్చాయి. వాటన్నిటినీ వదిలేశాడు. నేరుగా భారత్‌కు వచ్చాడు. తనలాగే సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వారి తరఫున బలంగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. తొలుత, ‘సమన్వయ్’ పేరిట హైదరాబాద్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. వికలాంగులకు సేవలందించడం మొదలుపెట్టాడు. అంధుల కోసం ఓ డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ని ఏర్పరచి, 3 వేల మందికి పైగా పాఠాలు చెప్పేవాడు. 2012లో శ్రీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికలాంగులకు ఉద్యోగాలిచ్చే కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. అలా ప్రారంభమైందే ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లు ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు. వీటితో పాటే ప్రింటింగ్ ప్రొడక్టులను సైతం తయారుచేశారు. ఇదంతా చూసిన రవి మంతా లాంటి పెట్టుబడిదారులు భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ కంపెనీలో 150 మందికి పైగా వికలాంగులు పనిచేస్తున్నారు. వీరు సాగించే అమ్మకాలు ఏడాదికి రూ.7 కోట్ల పైమాటే! శ్రీకాంత్ ఇక్కడితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. భవిష్యత్‌లో మరో కంపెనీ తెరవాలనీ, అందులో 70 శాతం వికలాంగులే ఉద్యోగులుగా ఉండాలనీ ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అసాధ్యుడు కదా.. సాధించేస్తాడు!! -
రోబోల తయారీ ఇక ఈజీ!
బోస్టన్: రోబోల తయారీలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. 3డీ ప్రింటర్లో ఉపయోగించే ఘన, ద్రవ పదార్థాలతో మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఓ రోబోను తయారు చేశారు. లోహాలతో కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసిన తొలి రోబో ఇదే. దీంతో భవిష్యత్తులో ఇక రోబోలను తయారు చేయడం ఓ ప్రింట్ తీసినంత సులభం కానుంది. బయట కనిపించే అవయవాలే కాకుండా బ్యాటరీ, మోటార్ వంటి అంతర పరికరాలను తయారు చేసేందుకు కూడా లోహాలను ఉపయోగించకపోవడం గమనార్హం. వీరు తయారు చేసిన ఆరుకాళ్ల ఈ బుల్లి రోబో నడవడం, పాకడం వంటివి చేస్తుంది. 3డీ ప్రింటింగ్‌కు ముందు అనేకరకాల ఏర్పాట్లు చేసుకోవాలని వీటి రూపకర్తలు చెప్పారు. లేయర్‌పై లేయర్‌గా వేస్తూ 3డీ ప్రింటర్ ఈ రోబోను తయారు చేస్తున్న సమయంలో ఏ లేయర్‌కు ఏ రకమైన ప్రింటింగ్ మెటీరియల్ వినియోగించాలనేదానిపై అవగాహన ఉండాలన్నారు. -
రెండు చేతులకు రెండు ఫ్రీఫ్రీఫ్రీ
నేనొక్కదాన్నే.. ఇంత పని చేయాలంటే ఎలా.. నాకేమీ నాలుగు చేతుల్లేవు అని విసుక్కునే వాళ్లెందరో.. ఇక విసుక్కోవద్దు. మీకు మరో రెండు చేతులు తగిలించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) రోబోటిక్ నిపుణులు సిద్ధమవుతున్నారు. చిత్రంలోని రోబోటిక్ ఆర్మ్ డిజైన్ అదే. దీన్ని మనం భుజానికి బ్యాక్‌ప్యాక్‌లా ఈజీగా తగిలించుకోవచ్చు. 9 కిలోల బరువుండే ఈ ఎక్స్ట్రా చేతులు భారీ బరువులను ఎత్తేస్తాయి. అంతేకాదు.. మీ చేతికి అందని వస్తువులను తీసిపెడతాయి. అంటే.. ఆ సమయంలో మన ం మన చేతులతో మరొక పనిని చేసుకోవచ్చు. చూడ్డానికి ఇది స్పైడర్ మ్యాన్ సినిమాలోని విలన్ డాక్టర్ ఆక్టోపస్ తరహాలో కనిపిస్తున్నా.. ఇది సినిమాలోలాగా మెదడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేయదు. మన శరీర కదలికలకు అనుగుణంగా ఈ రోబో చేతులు క దులుతాయి. అంటే.. మనం ఓ పుస్తకాన్ని చేతితో పట్టుకుంటే.. మన చేతులు ఏ దిశలో కదిలాయో.. ఇవి కూడా అలాగే కదులుతాయన్నమాట. అయితే.. భవిష్యత్తులో మన అవసరాలను ముందే గ్రహించి.. దానికి తగ్గట్లు వ్యవహరించేలా ఈ రోబోటిక్ ఆర్మ్స్ను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతానికి వారు ప్రాథమిక నమూనాను రూపొందించారు. అవి తలుపులు తీయడం, చిన్నచిన్న సామాన్లను ఎత్తడం వంటి పనులు చేస్తున్నాయి. -
ఆసియాలో నెంబర్ వన్ యూనివర్సిటీగా సింగపూర్ ఎన్.యు.ఎస్.
ఆసియాలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఏదో తెలుసా? సింగపూర్‌లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్.యు.ఎస్.)!! ఇన్నాళ్లూ ఈ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌ను తోసిరాజని సింగపూర్ వర్సిటీ అగ్రస్థానానికి ఎగబాకింది. లండన్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ఈ ర్యాంకులు ప్రకటించింది. క్వాక్వారెల్లి సైమండ్స్ అనే విద్యా సంబంధ కన్సల్టెన్సీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో సింగపూర్ వర్సిటీకి ప్రపంచంలో 24వ స్థానం వచ్చింది. హెచ్.కె.యు.లో ఎక్కువ మంది బ్రిటిష్ ప్రొఫెసర్లే ఉండటంతో అది దాదాపు బ్రిటిష్ వర్సిటీలా ఉంది. కానీ ఎన్.యు.ఎస్.లో ఇతరులు ఎక్కువ మంది ఉన్నారు. రాబోయే పదేళ్లలో అయితే ఎన్.యు.ఎస్. ప్రపంచంలో టాప్ 20 జాబితాకు వెళ్లిపోవచ్చని క్వాక్వారెల్లి సైమండ్స్ సంస్థ పరిశోధనా విభాగం అధిపతి బెన్ సోటర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం ఉన్నత విద్యకు లభిస్తున్న ప్రోత్సాహమే ఇందుకు కారణమని ఎన్.యు.ఎస్. ప్రొవోస్ట్ టాన్ ఇంగ్ షై తెలిపారు. ప్రపంచంలోని అగ్రస్థాయి 10 విశ్వవిద్యాలయాల్లో అమెరికాకు చెందినవే ఏడు ఉన్నాయి. అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), తర్వాత వరుసగా హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్ ఉన్నాయి.