Piyush Verma: ఈ ఉత్తరాఖండ్‌ కుర్రాడు.. ఎంతో మందిని విజయాల బాట పట్టించాడు! | Uttarakhand Piyush Verma Inspiring Journey Manush Labs Helps Startups | Sakshi
Sakshi News home page

Piyush Verma: ఉత్తరాఖండ్‌ కుర్రాడు.. చదివింది యూఎస్‌లో.. ఎంతో మందిని విజయాల బాట పట్టించాడు!

Published Fri, Dec 10 2021 5:03 PM | Last Updated on Fri, Dec 10 2021 5:15 PM

Uttarakhand Piyush Verma Inspiring Journey Manush Labs Helps Startups - Sakshi

Uttarakhand Piyush Verma Inspiring Journey Manush Labs Helps Startups: మార్కెట్‌ వినీలాకాశంలో విజయవంతంగా దూసుకుపోతున్న స్టార్టప్‌లనే చూస్తారు కొందరు. కొందరు మాత్రం...వైఫల్యంతో నేలరాలిన స్టార్టప్‌లను కూడా చూస్తారు. వాటికి మరింత శక్తిమంతమైన ఇంధనం ఇచ్చి రయ్యిమని దూసుకెళ్లేలా చేస్తారు. పియూష్‌ వర్మ ఈ కోవకు చెందిన యువకుడు. ఫెయిల్యూర్‌ స్టార్టప్‌లను రిపేర్‌ చేసే వైద్యుడు....

మన దేశంలో ‘స్టార్టప్‌’ ఉత్సాహానికి కొదవ లేదు. అయితే సమర్థులు అనుకునేవాళ్లు కూడా ‘స్టార్టప్‌ ఫెయిల్యూర్స్‌’ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సరిౖయెన దారి చూపితే ఎక్కడో ఉంటారనే ఆలోచనతో పియూష్‌ వర్మ ప్రారంభించిందే....మనుష్‌ ల్యాబ్‌. ఫండింగ్, ఇన్వెస్టర్స్, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు, సలహాలు, సూచనలు, మార్కెట్‌ స్ట్రాటజీలు....మొదలైన వాటికి ఇది సరిౖయెన వేదికగా మారింది. ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు, ఇండియన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి తన మనుష్‌ ల్యాబ్‌తో శ్రీకారం చుట్టాడు నైనిటాల్‌ ( ఉత్తరాఖండ్‌) కుర్రాడు పియూష్‌.

‘ఇండియాలో వివిధ రకాల మార్కెట్‌ అవకాశాలు ఉన్నప్పటికీ, సక్సెస్‌ఫుల్‌ స్టార్టప్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనికి కారణం సమర్థత లేక పోవడం కాదు...సమస్యను సరిగా అర్ధం చేసుకోకపోవడం’ అంటున్న పియూష్‌ ఫెయిల్యూర్‌ స్టార్టప్‌లను లోతుగా అధ్యయనం చేశాడు. నోట్స్‌ రాసుకున్నాడు. అలా అని తన ఆలోచనలు మాత్రమే ఉంటే సరిపోదు కదా!

ఒక అత్యుత్తమమైన బృందాన్ని తయారుచేసుకున్నాడు. హార్వర్డ్, ఎంఐటీలో చదువుకున్న దిగ్గజాలు, సోషల్‌ఎంటర్‌ప్రెన్యూర్స్, వాలెంటీర్లు, యూఎస్‌లోనే కాదు మనదేశంలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారు...‘ల్యాబ్‌’ తరపున నిర్మాణాత్మకమైన సలహాలు అందిస్తారు. ‘ల్యాబ్‌’ నిర్వహించే ఇన్వెస్టర్‌ సెషన్‌లలో ప్రపంచవ్యాప్తంగా వందమంది వరకు  ఇన్వెస్టర్లు పాల్గొంటున్నారు. పియూష్‌ అతడి బృందం మన దేశంలోని పాతికకు పైగా స్టార్టప్‌లకు ఇన్వెస్టర్‌ యాక్సెస్‌ నుంచి మార్కెట్‌స్ట్రాటజీ వరకు ఎన్నో విషయాలు బోధపరిచి సక్సెస్‌రూట్‌ చూపించింది.

కొన్ని సంవత్సరాల వెనక్కి  వెళితే...
హిమాచల్‌ప్రదేశ్‌లో ‘దీదీ కాంట్రాక్టర్‌’ అని పిలుచుకునే ఒక జర్మన్‌ అర్కిటెక్ట్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పియూష్‌కు. ఆమె చాలా సింపుల్‌గా స్థానిక వస్తువులు, సంప్రదాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో ఇండ్లను నిర్మించేది. సోషల్‌ ఆర్ట్‌ అంటే ఏమిటో అక్కడే అర్థమైంది. ఇది తనకు ఎంతగా స్ఫూర్తి ఇచ్చిందంటే...ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు ఇండ్ల నిర్మాణం, దిల్లీలోని నిరాశ్రయుల కోసం ట్రాన్స్‌ఫార్మబుల్‌ ప్రొటోటైప్‌ షెల్టర్స్‌ నిర్మాణంలో పాలుపంచుకునేలా చేసింది.

అప్పుడే అతడికి అర్ధమై ఉంటుంది... శాస్త్రానికి సామాజిక బాధ్యత ఉండాలని! మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(యూఎస్‌) గ్రాడ్యుయెట్‌ అయిన పియూష్‌ వర్మకు బాగా నచ్చిన పుస్తకం క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డా.మెగ్‌ జె రాసిన డిఫైనింగ్‌ డికేడ్‌. మనిషి జీవితంలో ఇరవై ఏళ్ల వయసు ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం బాగా చెబుతుంది.
‘కలలు నిజం చేసుకునే విషయంలో దైవదత్త హక్కులు అంటూ ఉండవు. విజేతల్లో నువ్వు కూడా ఉన్నావు. నీ బలం ఏమిటో నీకు తెలియడమే కాదు నీ ప్రణాళిక ఏమిటో కూడా తెలిసి ఉండాలి’... గుడ్‌ లక్‌!

చదవండి: Shefali Shah: రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి నటి... పగటి‘కళ’లు నిజమవుతాయి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement