Start Ups
-
ఎల్లలు దాటిన ‘రెవ్వ్ అప్’ : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్టార్టప్‌లను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘రెవ్వ్ అప్’ దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు ఊతమివ్వడం హర్షణీయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇది తెలంగాణలోని ఆవిష్కరణల వాతావరణ బలాన్ని చాటడంతో పాటు స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు అద్దంపడుతోందన్నారు. తెలంగాణ ఏఐ మిషన్ (టి–ఎయిమ్) ‘రెవ్వ్ అప్’ కార్యక్రమంలో భాగంగా మూడో విడతలో ఎంపిక చేసిన 62 స్టార్టప్‌లకు కేటీఆర్ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. తెలంగాణలోని అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని ఏఐ రంగంలోని స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. ‘రెవ్వ్ అప్’ మూడో విడతలో 15 రంగాలకు చెందిన స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టి–ఎయిమ్ వెల్లడించింది. స్మార్ట్ సిటీస్, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లను ఎంపిక చేయగా ఇందులో 13 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. ఎంపికైన స్టార్టప్‌లలో 20 శాతం మహిళల సారథ్యంలో నడుస్తున్నవే కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో నాస్కామ్ సహకారంతో టి–ఎయిమ్ ‘రెవ్వ్ అప్’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రెండు విడతల్లో 140 ఏఐ స్టార్టప్‌లకు లబ్ధి చేకూరినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో చిన్న సంస్థలకు భారీ అవకాశాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో చిన్న సంస్థలు, కొత్తగా ఇటువైపు అడుగుల వేసే కంపెనీలకు, స్టార్టప్‌లకు భారీ అవకాశాలు వచ్చిపడతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. వాహన రంగంలో ఎలక్ట్రిఫికేషన్ (ఈవీకి మారడం) వేగం తీరు, పోటీ వాతావరణంపై అచ్చమైన ఈవీ కంపెనీల వ్యాల్యూషన్ ఆధారపడి ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్యాసింజర్ వాహనాల విభాగం వేగంగా ఈవీలకు మళ్లుతోందని కనుక.. అచ్చమైన ఈ–ప్యాసింజర్ కంపెనీలకు అధిక విలువ దక్కుతున్నట్టు విశ్లేషించింది. మధ్య తరహా, భారీ వాణిజ్య వాహన విభాగంలో ఎలక్ట్రిఫికేషన్ నిదానంగా ఉందని.. చిన్నపాటి వాణిజ్య వాహనాల్లో ఇది వేగంగా ఉన్నట్టు వివరించింది. 2026–27 నాటికి ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా 15 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. స్కూటర్ల విభాగంలో ఈవీల వాటా ఇప్పటికే 35 శాతానికి చేరినట్టు వివరించింది. 2020–21 నాటికి ద్విచక్ర ఈవీల వాటా 1శాతంగానే ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ చాలా నిదానంగా ఉందని, ఫేమ్–2 పథకం కింద సబ్సిడీల్లేకపోవడం (వ్యక్తిగత వినియోగానికి), చార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉండడం ఇందుకు కారణంగా తెలిపింది. ‘‘ఎలక్ట్రిఫికేషన్‌తో సంప్రదాయ స్కూటర్ల విభాగానికి ముప్పు ఎక్కువగా ఉంది. దేశీ త్రిచక్ర వాహన విభాగంలో ఈవీ వాటా 2026–27 నాటికి 19 శాతానికి చేరొచ్చు. వాణిజ్య వాహనాల వాటా 23 శాతానికి, చిన్న పాటి వాణిజ్య వాహనాలు 18 శాతానికి చేరుకోవచ్చు’’ అని వివరించింది. ఆరంభంలోనే.. ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో భారత్ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఎలక్ట్రిఫికేషన్ రిస్క్ దృష్ట్యా ద్విచక్ర వాహన స్టాక్స్‌కు డీరేటింగ్ ముప్పు ఉన్నట్టు తెలిపింది. ఈవీ వ్యాపారానికి సంబంధించి నిధులు సమీకరించిన కంపెనీలకు ఇప్పటికే మార్కెట్ మెరుగైన వ్యాల్యూషన్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈవీల్లోకి అడుగుపెట్టిన ఓరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (ఓఈఎం) సంబంధించి విలువ ఇంకా వెలుగుచూడాల్సి ఉందని తెలిపింది. చదవండి: మరోసారి తెరపైకి టాటా - ఎయిరిండియా డీల్..! -
Piyush Verma: ఈ ఉత్తరాఖండ్ కుర్రాడు.. ఎంతో మందిని విజయాల బాట పట్టించాడు!
Uttarakhand Piyush Verma Inspiring Journey Manush Labs Helps Startups: మార్కెట్ వినీలాకాశంలో విజయవంతంగా దూసుకుపోతున్న స్టార్టప్‌లనే చూస్తారు కొందరు. కొందరు మాత్రం...వైఫల్యంతో నేలరాలిన స్టార్టప్‌లను కూడా చూస్తారు. వాటికి మరింత శక్తిమంతమైన ఇంధనం ఇచ్చి రయ్యిమని దూసుకెళ్లేలా చేస్తారు. పియూష్ వర్మ ఈ కోవకు చెందిన యువకుడు. ఫెయిల్యూర్ స్టార్టప్‌లను రిపేర్ చేసే వైద్యుడు.... మన దేశంలో ‘స్టార్టప్’ ఉత్సాహానికి కొదవ లేదు. అయితే సమర్థులు అనుకునేవాళ్లు కూడా ‘స్టార్టప్ ఫెయిల్యూర్స్’ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సరిౖయెన దారి చూపితే ఎక్కడో ఉంటారనే ఆలోచనతో పియూష్ వర్మ ప్రారంభించిందే....మనుష్ ల్యాబ్. ఫండింగ్, ఇన్వెస్టర్స్, నెట్వర్కింగ్ అవకాశాలు, సలహాలు, సూచనలు, మార్కెట్ స్ట్రాటజీలు....మొదలైన వాటికి ఇది సరిౖయెన వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు, ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి తన మనుష్ ల్యాబ్‌తో శ్రీకారం చుట్టాడు నైనిటాల్ ( ఉత్తరాఖండ్) కుర్రాడు పియూష్. ‘ఇండియాలో వివిధ రకాల మార్కెట్ అవకాశాలు ఉన్నప్పటికీ, సక్సెస్ఫుల్ స్టార్టప్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనికి కారణం సమర్థత లేక పోవడం కాదు...సమస్యను సరిగా అర్ధం చేసుకోకపోవడం’ అంటున్న పియూష్ ఫెయిల్యూర్ స్టార్టప్‌లను లోతుగా అధ్యయనం చేశాడు. నోట్స్ రాసుకున్నాడు. అలా అని తన ఆలోచనలు మాత్రమే ఉంటే సరిపోదు కదా! ఒక అత్యుత్తమమైన బృందాన్ని తయారుచేసుకున్నాడు. హార్వర్డ్, ఎంఐటీలో చదువుకున్న దిగ్గజాలు, సోషల్ఎంటర్ప్రెన్యూర్స్, వాలెంటీర్లు, యూఎస్‌లోనే కాదు మనదేశంలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారు...‘ల్యాబ్’ తరపున నిర్మాణాత్మకమైన సలహాలు అందిస్తారు. ‘ల్యాబ్’ నిర్వహించే ఇన్వెస్టర్ సెషన్లలో ప్రపంచవ్యాప్తంగా వందమంది వరకు ఇన్వెస్టర్లు పాల్గొంటున్నారు. పియూష్ అతడి బృందం మన దేశంలోని పాతికకు పైగా స్టార్టప్‌లకు ఇన్వెస్టర్ యాక్సెస్ నుంచి మార్కెట్స్ట్రాటజీ వరకు ఎన్నో విషయాలు బోధపరిచి సక్సెస్రూట్ చూపించింది. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే... హిమాచల్‌ప్రదేశ్‌లో ‘దీదీ కాంట్రాక్టర్’ అని పిలుచుకునే ఒక జర్మన్ అర్కిటెక్ట్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పియూష్‌కు. ఆమె చాలా సింపుల్‌గా స్థానిక వస్తువులు, సంప్రదాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో ఇండ్లను నిర్మించేది. సోషల్ ఆర్ట్ అంటే ఏమిటో అక్కడే అర్థమైంది. ఇది తనకు ఎంతగా స్ఫూర్తి ఇచ్చిందంటే...ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇండ్ల నిర్మాణం, దిల్లీలోని నిరాశ్రయుల కోసం ట్రాన్స్‌ఫార్మబుల్ ప్రొటోటైప్ షెల్టర్స్ నిర్మాణంలో పాలుపంచుకునేలా చేసింది. అప్పుడే అతడికి అర్ధమై ఉంటుంది... శాస్త్రానికి సామాజిక బాధ్యత ఉండాలని! మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(యూఎస్) గ్రాడ్యుయెట్ అయిన పియూష్ వర్మకు బాగా నచ్చిన పుస్తకం క్లినికల్ సైకాలజిస్ట్ డా.మెగ్ జె రాసిన డిఫైనింగ్ డికేడ్. మనిషి జీవితంలో ఇరవై ఏళ్ల వయసు ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం బాగా చెబుతుంది. ‘కలలు నిజం చేసుకునే విషయంలో దైవదత్త హక్కులు అంటూ ఉండవు. విజేతల్లో నువ్వు కూడా ఉన్నావు. నీ బలం ఏమిటో నీకు తెలియడమే కాదు నీ ప్రణాళిక ఏమిటో కూడా తెలిసి ఉండాలి’... గుడ్ లక్! చదవండి: Shefali Shah: రెస్టారెంట్ బిజినెస్‌లోకి నటి... పగటి‘కళ’లు నిజమవుతాయి! -
పేటీఎం, జొమాటోలకు ఎఫ్‌డీఐ షాక్!?
సాక్షి, న్యూఢిల్లీ: చైనా పెట్టుబడులపై భారత ప్రభుత్వం దృష్టి సారించిన వేళ స్టార్టప్ కంపెనీలు కష్టాల్లో పడనున్నాయి. ముఖ్యంగా దేశంలో వివిధ రంగాల్లోసేవలందిస్తున్న యూనికార్న్, పేటీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, డ్రీమ్ 11 లాంటి కంపెనీలకు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుడులపై స్వీకరిస్తున్న వీటికి మూలధన కొరత ఏర్పడే అవకాశం వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను భారత ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇకపై ఈ పెట్టుబడులు భారత ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని స్పష్టం చేసింది. భారతీయ కంపెనీల్లో అవకాశవాద పెట్టుబడులు, స్వాధీనాలను అరికట్టే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు అని భారత ప్రభుత్వం శనివారం జారీచేసిన ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది కొత్త పెట్టుడుల కోసం చైనా పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్న కంపెనీలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు పెట్టుబడిదారులు, స్టార్టప్ కంపెనీ ఫౌండర్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే 33 శాతం వ్యూహాత్మక చైనీస్ పెట్టుడులను కలిగి ఉన్నతమలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది వుండదనీ యునికార్న్ వ్యవస్థాపకుడు వ్యాఖ్యానించారు. తాజాపరిణామాలపై ఇతర స్టార్టప్ కంపెనీలు ఇంకా స్పందించలేదు. భవిష్యత్తు పెట్టుబడులు నిలిచిపోవడం, లేదా పెట్టుబడుల సమీకరణ జాప్యం కావచ్చని తెలిపారు. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై కొత్త నియమాలు డబ్ల్యుటిఒ సూత్రాలను విరుద్ధమని స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని వీటిని సవరించాలని చైనా సోమవారం తెలిపింది. చైనా కంపెనీల వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడులు 2019 లో 3.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2018లో 2 బిలియన్ డాలర్లుగా వుంది. ముఖ్యంగా చైనా ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని అనుబంధ యాంట్ ఫైనాన్షియల్, టెన్సెంట్ హోల్డింగ్స్, ఫోసున్ ఆర్‌జెడ్ క్యాపిటల్ యునికార్న్స్‌తో సహా పెద్ద సంఖ్యలో భారతీయ స్టార్టప్‌లలో అనేక వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులను కురిపించాయి. పేటిఎమ్, జోమాటో, బిగ్‌బాస్కెట్, పాలసీబజార్, ఉడాన్, ఓయో హోటల్స్, ఓలా, డ్రీం 11 వీటిల్లో ప్రముఖంగా వున్నాయి. దీంతో అమెరికాను వెనక్కి నెట్టి మరీ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీలోకి దూసుకొచ్చింది. మరోవైపు చైనానుంచి భారత సంస్థలకు వచ్చే పెట్టుబడులన్నీ ఇకపై ప్రభుత్వ అనుమతికి లోబడి వుంటాయని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. అలాగే భారత స్టాక్ మార్కెట్లోకి వచ్చిన చైనా పెట్టుబడులపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరా తీస్తోంది. విదేశీ పెట్టుబడుల వివరాలను సమర్పించాలని ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్ల నుంచి వచ్చిన ఉక్కువగా దృష్టి పెట్టాలని సెబీ కేంద్రం కోరింది. దీంతోపాటు వేరే ఏవైనా కంపెనీలు తమకు చైనాలో ఉన్న సంస్థల ద్వారా ఇండియా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయా అనేది కూడా చూడమని సెబీని ప్రభుత్వం ఆదేశించింది. హెచ్‌డీఎఫ్‌సీలో చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) వాటా మార్చి క్వార్టర్లో 0.8 శాతం నుంచి 1.01 శాతం పెంచుకుంది. చైనా బ్యాంక్ ఈ వాటాను ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
స్టార్టప్‌ల రాష్ట్రంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు అంతా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లదేనని, అందుకే రాష్ట్రాన్ని స్టార్టప్‌ల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వాటితోనే ఉండనున్న నేపథ్యంలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా(ఏఐ) ప్రభుత్వం ప్రకటించిందని, ఏఐని అన్ని కాలేజీలు ప్రవేశపెట్టేలా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులపై సోమవారం అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 రోజుల అంతర్జాతీయ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే త్రీఐ మంత్రాను తాను బలంగా నమ్ముతాన న్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీహబ్ ప్రారంభించామన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఐటీ, ఇతర పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు పక్కా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఏఐసీటీఈకే మోడల్‌గా తెలంగాణ నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించి, ఆయా రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టిందన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 28 వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులలో నైపుణ్యం లేదని తమకు పరిశ్రమల నుంచి ఫిర్యాదులు అందాయని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపునకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్‌ను(టాస్క్) ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్లలో టాస్క్ 680 కళాశాలల్లో 5,070 మంది అధ్యాపకులకు, 2.9 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చిందన్నారు. టాస్క్‌ను వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలకు విస్తరింపజేస్తామన్నారు. అనురాగ్ కాలేజీ తరహాలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందేలా కృషి చేయాలన్నారు. ఐటీ ఇక ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ‘ఐటీ’ఇకపై ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’గా కాకుండా ‘ఇంటెలిజెన్స్ టెక్నాలజీ’గా పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రొబోటిక్స్ వంటి సబ్జెక్టులను తీసుకువచ్చి పరిశ్రమలతో అనుసంధానం కావాలన్నారు. తమ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలపై దృష్టి సారించిందన్నారు. జర్మనీ తరహాలో ప్రాక్టీస్ స్కూల్ ఆప్షన్‌ను మన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలన్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి అప్రెంటిస్‌షిప్ అమలు చేయాలన్నారు. ఈ కొత్త విధానాలను జేఎన్టీయూహెచ్ సీరియస్‌గా పరిశీలిస్తోందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అప్రెంటిస్‌షిప్ అమల్లోకి వస్తుందని ఆశిద్దామన్నారు. వందశాతం అక్షరాస్యత ధ్యేయం సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘ఈచ్‌వన్ టీచ్‌వన్’నినాదంతో అక్షరాస్యత శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను వందశాతం అక్షర్యాత గల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెంపొందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అక్కడి విద్యా సంస్థలే ఇక్కడికి వచ్చేలా ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందన్నారు. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో బోధనా వృత్తి ఎన్నో సవాళ్లను ఎదుర్కొం టోందన్నారు. సదస్సులో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నీలిమ, ఐఐటీహెచ్ మాజీ డైరెక్టర్ యు.బి.దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీటీఐఈఈ –2020 సావనీర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. -
వాల్‌మార్ట్ ల్యాబ్స్ చేతికి రెండు స్టార్టప్‌లు
సాక్షి, బెంగళూరు : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ వాల్‌మార్ట్ ల్యాబ్స్ భారత్‌లోని రెండు స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లోకేర్, బిగ్ట్రేడ్ అనే కంపెనీలను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. తద్వారా అయితే ఈ డీల్‌కు సంబంధించి నగదులావాదేవీల వివరాలు వెల్లడికాలేదు. గూగుల్ మాజీ ఉద్యోగులు స్థాపించిన హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఫ్లోకేర్. సరసమైన ధరల్లో ఇది ఒక వైద్యుడు చేయవలసిన అన్ని పనులను ఒకే చోట నిర్వహిస్తుంది. బిగ్ట్రేడ్ హోల్‌సేల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. "ఎండ్-టు-ఎండ్" బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తుంది. కాలిఫోర్నియాలో కూడా కార్యాలయం ఉన్న ప్లోకేర్ పాలో ఆల్టో వాల్‌మార్ట్ ల్యాబ్స్ కస్టమర్ టెక్నాలజీ బృందంలో చేరారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్టార్టప్‌లను వాల్‌మార్ట్ లాబ్స్ ఇండియా సొంతం చేసుకుంది. వాల్‌మార్ట్ ఆన్లైన్ ఫార్మసీ, సప్లయ్ ఛైన్ బిజనెస్ గ్లోబల్‌గా ప్రఖ్యాతి పొందిందనీ.. ఈ క్రమంలో ఈ రెండు స్టార్టప్‌లను సొంతం చేసుకోవడం తమకు చాలా ఉత్సాహాన్నిస్తుందని వాల్‌మార్ట్ లాబ్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హరి వాసుదేవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తాజా కొనుగోలుతో ప్లోకేర్, బిగ్ ట్రేడ్ బృందం తమ వ్యాపార సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. -
'స్టార్టప్స్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు'
న్యూఢిల్లీ: 'స్టార్టప్స్' అంటే ఐటీ పరిశ్రమలకు చెందినవేనన్న దురభిప్రాయాన్ని తాము దూరం చేశామని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్టార్టప్ ఇండియా' పథకంలో అన్ని రంగాల్లోనూ అంతులేని అవకాశాలు లభిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 'మన్ కీ బాత్' 16 ఎడిషన్ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించారు. 'స్టార్టప్ ఇండియా' ద్వారా దేశ యువతలో కొత్త ఉత్సాహం, శక్తిని నింపామని ఆయన అన్నారు. దేశంలోని లక్షలాది మంది ప్రజలకు ఖాదీ పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని, దేశ ప్రయోజనాలు, యువత ఆకాంక్షలకు ఇది ప్రతీకగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ప్రతి ఒక్కరూ ఒక జత ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభంలో గాంధీజీకి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా దేశ ప్రజలను మోదీ కోరారు.