
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆర చేతిపై చర్మం కమిలిన గుర్తులు ఎందుకు ఉన్నట్లు? కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో తైవాన్ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్‌ఎంసీ)గురించి మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఆయన ఎడమ చేయి అరచేతిలో రెండు చోట్ల చర్మం ఎర్రగా కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండో సారి కుడి చేయి పైభాగంలో అలాంటి గుర్తులే ఉన్నాయి. గతవారం ప్రపంచాది నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతిపై ఇదే తరహాలో గుర్తులు కనిపించాయి.
అంతేకాదు, కాళ్లు ఈడ్చుకుంటూ ట్రంప్ నడుస్తున్న వీడియోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అమెరికా అధ్యక్షుడు తన గోల్ఫ్ కార్ట్‌లో (వాహనం) నుండి ఇబ్బంది పడుతూ దిగారు. వాహనం నుంచి దిగిన తర్వాత కాళ్లు ఈడ్చుకుంటూ, కొన్ని సెకన్ల పాటు వణుకుతున్నట్లు కనిపించారు.
Donald Trump moves his right leg like a piece of wood?#grok does not report issue about that.@realDonaldTrump #USA #trump #republicans @cnnbrk #potus pic.twitter.com/lQIA54BLMG
— polemus (FR+EN) (@polemus) March 2, 2025
ట్రంప్ చర్మంపై కమిలిన గుర్తులతో పాటు కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ గుర్తులపై స్పందిస్తూ నెటిజన్లు.. ట్రంప్ డైమన్షియా సమస్యతో బాధపడుతున్నారని ఒకరంటే.. ట్రంప్‌కు ఆనారోగ్య సమస్యలు తలెత్తాయిని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని వైట్ హైస్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఖండించారు. అధ్యక్షునికి అనారోగ్య సమస్యలు లేవని,ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడు ప్రజల మనిషి. అతని నిబద్ధత తిరుగులేనిది. ఆయన చేతిపై గాయాలున్నాయి. ఎందుకంటే ఆయన నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. కరచాలనం చేస్తున్నారు. ఫలితంగా ట్రంప్ చేయి కమిలిందని అన్నారు. కాళ్లు ఈడ్చుకుంటూ ఎందుకు నడుస్తున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment