భారత్‌, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం: ట్రంప్‌ | USA President Trump Meets PM Modi, US Visit Tour Highlights, Videos And Photos Viral | Sakshi
Sakshi News home page

PM Modi: ట్రంప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది

Published Fri, Feb 14 2025 7:12 AM | Last Updated on Fri, Feb 14 2025 10:08 AM

USA President Trump Meets PM Modi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.  భారత్‌, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే, సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. 

ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఇరు దేశాధినేతలు. మిమ్మల్ని చాలా మిస్సయ్యా అంటూ మోదీతో వ్యాఖ్యానించిన ట్రంప్‌. నాకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోదీ. 

 

డొనాల్డ్‌ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ..‘భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణం. మోదీ నాకు మంచి మిత్రుడు. రానున్న నాలుగేళ్లు  మా స్నేహాన్ని కొనసాగిస్తాం. దేశాలుగా భారత్‌, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది. ప్రపంచంలో ఏ దేశానికీ  లేని విధంగా మాకు ఆయిల్‌, గ్యాస్‌ వనరులు అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. భారత్‌కు ఎఫ్‌ 35 యుద్ధ విమానాలు విక్రయిస్తాం. ఈ ఏడాది భారత్‌కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు. ఎఫ్‌-35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు. అలాగే, భారత్‌ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తాం’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో​ విజయం సాధించినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున ట్రంప్‌నకు శుభాకాంక్షలు. వైట్‌హౌస్‌లో మళ్లీ ట్రంప్‌ను చూడటం ఆనందంగా ఉంది. మరో నాలుగేళ్లు ట్రంప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్‌ కృషి చేయడం సంతోషం. ట్రంప్‌లాగే నేను భారత్‌ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం. మేం రెట్టింపు వేగంతో పని చేస్తాం. భారత్‌, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే మా ఆకాంక్ష. భారత్‌ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంది. శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్‌ మద్దతు ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారన్నారు’ అని తెలిపారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement