
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ హాజరుకానున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. భారతీయ సంతతి ప్రముఖులు సుమారు 50వేల మంది పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడాన్ని మోదీ స్వాగతించారు. ‘ఇరుదేశాల సత్సంబంధాలకు, భారతసంతతి ప్రజలు అమెరికా సమాజం, ఆర్థిక రంగానికి చేసిన సేవలకు లభించిన ప్రత్యేక గుర్తింపు ఇది’ అని ట్రంప్‌ను ప్రశంసిస్తూ సోమవారం మోదీ ట్వీట్లు చేశారు. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల నేతలు ఓ సంయుక్త కార్యక్రమంలో ప్రసంగించడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి అని, భారత–అమెరికా ధృడబంధానికి ఇది ఓ తార్కాణమని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment