సొంత గోల్ఫ్‌ క్లబ్‌లో అవార్డులు... | Joe Biden Trolls Donald Trump For Winning Golf Awards At Own Golf Club, More Details Inside - Sakshi
Sakshi News home page

సొంత గోల్ఫ్‌ క్లబ్‌లో అవార్డులు...

Published Tue, Mar 26 2024 6:35 AM | Last Updated on Tue, Mar 26 2024 9:49 AM

Joe Biden trolls Donald Trump for winning golf awards at own golf club - Sakshi

ట్రంప్‌పై బైడెన్‌ విసుర్లు

వాషింగ్టన్‌: సొంత గోల్ప్‌ క్లబ్‌లో అవార్డులు సాధించానన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సరదాగా స్పందించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ట్రంప్‌కు సొంత ‘ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌’ ఉంది. అందులో తాజాగా అవార్డుల గోల్ఫ్‌ ప్రదానం జరిగింది. తనకు ‘ది క్లబ్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీ’, ‘ది సీనియర్‌ క్లబ్‌ మెంబర్‌షిప్‌ ట్రోఫీ’లు వచ్చాయంటూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు.

దీనిపై బెడెన్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘అబ్బో! ఎంతటి ఘనతో! అభినందనలు’’ అంటూ ‘ఎక్స్‌’లో ఆయన పెట్టిన పోస్ట్‌కు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ‘‘మీ అజమాయిïÙలో లేని ఏదైనా గోల్ప్‌ క్లబ్‌లో ట్రోఫీ గెల్చుకొస్తే చెప్పవయ్యా ట్రంపూ’’ అంటూ మాజీ స్పోర్ట్స్‌ కాలమిస్ట్‌ రిక్‌ రేలీ కూడా చురకలు వేశారు. ట్రంప్‌కు ఇలాంటివి కొత్త కాదు. తనకు పలు అవార్డులు వచ్చాయని, పలు సంస్థలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశాయని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement