Golf club
-
ట్రంప్ అంటే విద్వేషం.. ఎఫ్‌బీఐ అదుపులో ర్యాన్ వెస్లీ రౌత్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ క్లబ్ వెలుపల ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ను ఏకే-47 ఆయుధంతో సహా ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు . దీనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్‌తో ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానిత షూటర్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు. ఇది దర్యాప్తునకు ఉపకరించింది. రెండు నెలల్లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గమనార్హం.తాజాగా ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగినవాడని పోలీసులు గుర్తించారు. ఎఫ్‌బీఐ ఇతనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనప్పటికీ.. న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది. లింక్డ్ఇన్ను ఆధారంగా చేసుకుని నిందితుడు నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది.లింక్డ్ఇన్లో రౌత్ తన అభిరుచులు, ఆలోచనలు పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయి. 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఆయుధాలు కలిగి ఉండటం, హిట్ అండ్ రన్ కేసులలో రౌత్‌కు శిక్ష పడింది. 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యింది. అమెరికా రాజకీయాల గురించి రౌత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు రాసేవాడు.రౌత్ 2019లో డెమోక్రటిక్ అభ్యర్థులకు విరాళాలు అందించాడు. 2022 ఏప్రిల్‌లో ఒక పోస్టులో అతను ట్రంప్‌ను విమర్శించాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రౌత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు.పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత రౌత్ అధ్యక్షుడు బైడెన్‌ను సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని బైడెన్‌ను కోరాడు. రౌత్ గత జూలై 16న ఈ పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు రౌత్ సూచించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం? -
సొంత గోల్ఫ్ క్లబ్లో అవార్డులు...
వాషింగ్టన్: సొంత గోల్ప్ క్లబ్లో అవార్డులు సాధించానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సరదాగా స్పందించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్‌కు సొంత ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్’ ఉంది. అందులో తాజాగా అవార్డుల గోల్ఫ్ ప్రదానం జరిగింది. తనకు ‘ది క్లబ్ చాంపియన్‌షిప్ ట్రోఫీ’, ‘ది సీనియర్ క్లబ్ మెంబర్షిప్ ట్రోఫీ’లు వచ్చాయంటూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై బెడెన్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘అబ్బో! ఎంతటి ఘనతో! అభినందనలు’’ అంటూ ‘ఎక్స్’లో ఆయన పెట్టిన పోస్ట్‌కు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘‘మీ అజమాయిïÙలో లేని ఏదైనా గోల్ప్ క్లబ్లో ట్రోఫీ గెల్చుకొస్తే చెప్పవయ్యా ట్రంపూ’’ అంటూ మాజీ స్పోర్ట్స్ కాలమిస్ట్ రిక్ రేలీ కూడా చురకలు వేశారు. ట్రంప్‌కు ఇలాంటివి కొత్త కాదు. తనకు పలు అవార్డులు వచ్చాయని, పలు సంస్థలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశాయని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!
‘అతి సర్వత్ర వర్జయేత్’ .. (ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు)అని పెద్దలు ఊరకనే అనలేదు. ఏదైన మన శరీరం తట్టుకోలేనంతగా అధికంగా ఏ పని చేసినా అది ప్రమాదమే . అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ చాలామంది అత్యుత్సహంతోనో లేక మరే ఇతర కారణాల వల్ల కొన్ని పనులు అతిగా చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన నిర్లక్యమో లేక అతని పై అధికారి నిర్లక్ష్యం కారణంగానో తెలియదు గానీ అతిగా ఆడి పెద్ద ప్రమాదాన్నే కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్లితే...యూకేలోని రీడింగ్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మైక్బ్రోకీ ఏప్రిల్ 2019లో కంపెనీ వార్షిక ఈవెంట్లో భాగంగా పబ్ గోల్ఫ్ గేమ్‌ని ఆడాడు. ఐతే విరామం తీసుకోకుండా గోల్ఫ్ గేమ్ అదేపనిగా ఆడాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఇక అప్పటి నుంచి బ్రోకీ కొన్నాళ్లపాటు కోమాలోనే గడిపాడు. అంతేకాదు అతను పుర్రెలో సగ భాగాన్ని కూడా తొలగించారు వైద్యులు. కోలుకోవడానికి అతనికి దాదాపు ఆరునెలలు పట్టింది. దీంతో అతను తనకు జరిగినదానికి పరిహారంగా పీడబ్ల్యూసీ కంపెనీ యజమాని సుమారు రూ.1.87 కోట్లు ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కాడు. తన మేనేజర్ సైమెన్ ఫ్రాడ్గలీ తన సహోద్యోగుల భద్రతను పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశాడు. బ్రోకీ పిటిషన్లో పబ్ గోల్ఫ్ ఈవెంట్లో తీవ్రంగా గాయపడటం అనేది ఊహజనితమైన విషయంగా ఉంటుందని పేర్కొన్నాడు. తన తలకు అయిన తీవ్ర గాయం కారణంగా ఇప్పటికి కొన్నింటిని గుర్తించుకోలేకపోతున్నానని వాపోయాడు. ఐతే లండన్ హైకోర్టు పీడబ్ల్యూసీ కంపెనీ తన మేనేజర్ నిర్లక్ష్యానికి భాద్యత వహించాలని స్పష్టం చేసింది. అలాగే కంపెనీలో ఏడేళ్లుగా కొనసాగతున్న వార్షిక ఈవెంట్‌ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. భాద్యతయుతమైన యజమానిగా ఉద్యోగుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటాం గానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది. (చదవండి: యువతి హల్చల్.. ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి!) -
రాకాసి పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!
The Crab Can Be Seen Clutching The End Of Golf Club: మనం ఇంతవరకు చాలా రకాల జంతువులు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి చేసే రకరకాల విన్యాసలు చూస్తే భయంకరంగానూ ఆశ్యర్యంగాను అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కొడక భారీ పీత గోల్ప్ స్టిక్‌ని భలే సులభంగా విరిచేసింది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ద్వీపంలో స్థానికుడు పాల్ బుహ్నర్ అతని స్నేహితులు గోల్ఫ్ క్లబ్లో ఒక పెద్ద పీతను చూశారు. ఆ పీత చూడటానికి చాలా పెద్దగా ఉంది. అది గోల్ఫ్ స్టిక్(ఐరన్)ని ఏదో చెకోడిలు విరిచినట్టుగా పటపటమంటు విరిచేస్తుంది. పైగా అలా మూడు గోల్ఫ్ స్టిక్ల్ని విరిచేస్తుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కెర్రీ బుహ్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైగా తన భర్త పాల్ బుహ్నర్ గోల్ప్ సందర్బంగా ఈ వీడియోని చిత్రికరించారు అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: రూ.లక్షకో డ్రైవింగ్ స్కూల్) -
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ఫండ్ రైసింగ్ కార్యక్రమం
-
చిన్నారుల కేన్సర్ చికిత్సకు ఖర్చు నేను భరిస్తా..
గోల్కొండ గోల్ఫ్ క్లబ్లో హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కేన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. కాసేపు గోల్ఫ్ఆడి అందర్నీ అలరించింది. గోల్కొండ: కేన్సర్‌పై అవగాహన కల్పించడంలో క్యూర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు తన పూర్తి సహకారం ఉంటుందని సినీనటి పూజాహెగ్డే అన్నారు. క్యూర్ ఫౌండేషన్, అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ కేన్సర్ క్రూసెడర్స్ ఇన్విటేషన్ కప్ పోస్టర్‌ను ఆదివారం గోల్కొండ నయాఖిలాలోని గోల్ఫ్ క్లబ్లో జరిగిన ప్రెస్మీట్లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ సదుద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్లో తాను కూడా భాగమైనందుకు సంతోషంగానూ, గర్వకారణంగానూ ఉందన్నారు. ఇద్దరు చిన్నారుల కంటికేన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు తాను భరిస్తానన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెప్టెన్ విక్రమ్ దేవ్‌రావ్ మాట్లాడుతూ క్రూసెడర్స్ కప్ నిర్వహణకు తమ గోల్ఫ్ కోర్స్ వేదికైనందుకు గర్విస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రముఖ గోల్ఫర్లు పాల్గొంటారని, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు.క్యూర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫౌండేషన్ ద్వారా 1300 మందికి కేన్సర్ చికిత్సలు అందించామన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన వాక్ ఆఫ్ లైఫ్ ర్యాంప్ నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో పీవీ.సింధు, పుల్లెల గోపిచంద్, సంగీతారెడ్డి, సినీనటి రాఖీఖన్నా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్జీఏ కెప్టెన్ భాస్కర్ రెడ్డి, గౌరవ కార్యదర్శి కె.శ్రీకాంత్ రావు, ప్రైడ్ హోండా ఎండీ సురేష్‌రెడ్డి, హెచ్ఐసీసీ అండ్ నోవాటెల్ జీఎం మనీష్ దయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూజాహెగ్డే ఓ లాంగ్డ్రైవ్తో టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పూజా.. ది ప్లేయర్ -
అధ్యక్షుడే లక్ష్యంగా.. ప్లాన్ ప్రకారమే చేశా..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడిన విషయం తెలిసిందే. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ లక్ష్యంగానే పదే పదే మధ్య వేలు చూపించానంటోన్న బ్రిస్క్‌మ్యాన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. కావాలనే అలా చేశాను 'గత అక్టోబర్ 28న తన కాన్వాయ్‌లో ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నేను అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తున్నాను. కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే నా ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపించాను. ఎందుకంటే.. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో నా రక్తం మరిగిపోతోంది. ముఖ్యంగా కొన్ని రోజుల ముందు హెల్త్ పాలసీ, తదితర కీలకాంశాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చిరాకు తెప్పించాయి. ఆరోజు ట్రంప్ గోల్ఫ్ కోర్టుకు వస్తారని తెలిసి ఆ దారిలో ఎదురుచూశాను. సరైన సమయంలో నా నిరసనను అలా తెలిపాను. అయితే మీడియాతో పాటు వైట్‌హౌస్ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మాన్ 'నేను వేలు చూపిస్తున్న ఫొటోను' సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నాపేరు మార్మోగిపోయింది. గోల్ఫ్ కోర్టుకు వెళ్లినప్పుడల్లా దీని గురించి అందరూ చర్చించుకోవాలి. రెండ్రోజుల తర్వాత నా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఆ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా అప్డేట్ చేశాను. ఆ తర్వాత వివాదం పెద్దదవుతుందని భావించి జాతీయ మానవహక్కుల సంస్థకు వెళ్లి ఓ ఉద్యోగిని కలిశాను. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా వేలు చూపించిన మహిళ ఎవరో తెలుసా అని అడిగాను. తెలియదని వారు చెప్పగా.. మీరు వెతుకుతున్న ఆ మహిళను నేనేనంటూ వెల్లడించాను. అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు తమకు రావన్న భయంతో అకీమా అనే కాంట్రాక్టర్ తన వద్ద ఆరునెలలుగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయాలన్నారు. చేసేదేంలేక జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. సోషల్ మీడియాలో తన చర్యను అందరూ మెచ్చుకుంటున్నారని, ట్రంప్ పాలనపై వ్యతిరేకత ఉందనడానికి ఇది నిదర్శనమని' బాధితురాలు బ్రిస్క్‌మ్యాన్ వివరించారు. -
అధ్యక్షుడికి అసభ్య సంకేతం.. జాబ్ ఊడింది!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్లో అధిక సమయం గడుపుతారని ఆయనపై విమర్శలున్నాయి. వర్జీనియాలోని తన నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గడపటం అలవాటుగా చేసుకున్న ట్రంప్.. గత నెలలో తన కాన్వాయ్‌లో గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న బ్రిస్క్‌మ్యాన్ అనే 50 ఏళ్ల మహిళ అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తోంది. ఆ కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే తన ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపింది. దీంతో అమెరికా మొత్తం ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. కాగా, బ్రిస్క్‌మ్యాన్ చేసిన చర్య వల్ల తమ సంస్థకు చెడ్డపేరొస్తుందని యాజమాన్యం భావించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతినకూదని భావించిన అకీమా అనే కాంట్రాక్టర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయగా.. మరో ఉద్యోగం కోసం బ్రిస్క్‌మ్యాన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. -
టూమచ్ ట్రంప్, వెంబడించి మరీ...
వర్జీనియా : ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది. కానీ, తన విధానాల వల్లనో లేక గత చరిత్ర మూలంగానే ఏమో డొనాల్డ్ ట్రంప్‌పై దానిని నిలుపుకోలేకపోతున్నారు. అక్కడి ప్రజలకే ఆయనపై కనీస మర్యాద లేకుండా పోతుంది. గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో మొదలైన ఈ వ్యతిరేకత.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన పాలనపై వ్యతిరేకత వెల్లగక్కిన ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రతీ వారాంతం వర్జీనియాలోని తన నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గడపటం అలవాటుగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా మొన్న శనివారం కూడా వెళ్లిన ఆయనకు ఓ మహిళ మధ్య వేలు చూపించేసింది. తిరిగి వైట్‌హౌజ్‌కు పయనమైన క్రమంలో కాన్వాయ్‌ను వెంబడించి మరీ ఆ మహిళ ఆ పని చేసింది. రెండుసార్లు ట్రంప్ ఉన్న కారు దగ్గరకు వెళ్లిన ఆమె మిడిల్ ఫింగర్ సింబల్ చూపిస్తూ ముందుకెళ్లింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించటం లేదు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీ కూడా అక్కడి సీసీ కెమెరాల్లో లేకపోవటం గమనార్హం. ఆ మహిళ ఎవరన్నది తెలియకపోయినా.. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు కురిపించటం గమనార్హం. Lone cyclist responds to @POTUS motorcade shortly after departing Trump National Golf Club in Sterling, Va. (Photo: @b_smialowski/@AFP) pic.twitter.com/MKM1kVIyTY — Steve Herman (@W7VOA) October 29, 2017 ట్రంప్.. జల్సా రాయుడు ట్రంప్ 285 రోజుల పాలనలో 96 రోజులు వైట్‌హౌజ్‌కు దూరంకాగా.. అందులో దాదాపు 80 రోజులు కేవలం గోల్ఫ్ క్లబ్‌లోనే గడిపాడంట. పాలన సంగతి పక్కన పెట్టి జల్సాగా గడుపుతున్నాడంటూ ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉండే తక్కువ సమయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆర్థికవేత్తలు కూడా ఆయనపై మండిపడుతున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే... గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గోల్ఫ్ తెగ ఆడుతున్నాడంటూ ట్రంప్ విమర్శలు చేయటం. -
గ్రీన్ గోల్ఫ్ క్లబ్
హైదరాబాద్: పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది కదూ ఈ చిత్రం. ఇది ఏ చిత్ర కారుడి కుంచె నుంచో జాలువారితే తప్ప.. ఇంత పచ్చదనం సహజసిద్ధం అంటే నమ్మడం కష్టమే కదా! అయినా.. నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాత అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఇది. అమెరికాలోని జార్జియాలో ఉంది. వారం క్రితం మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ ప్రారంభమైనపుడు ఇక్కడకు వచ్చిన వారు ప్రకృతి రమణీయతకు ముగ్దులైపోయారట. -
కొడితే బాల్ బద్దలవ్వాల్సిందే..
ఇంత పెద్ద గోల్ఫ్ క్లబ్‌తో బాల్‌ను కొడితే ఇంకేమైనా ఉందా.. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోల్ఫ్ క్లబ్(ఉపయోగించదగినది). దీని పొడవు 14 అడుగుల 5 అంగుళాలు. దీంతో బాల్‌ను కొడితే 542 అడుగుల దూరం వెళ్తుందట. దీన్ని తయారుచేసింది ఈయనే.. పేరు కార్స్టెన్ మాస్(49). డెన్మార్క్‌లో ఉంటారు. -
సచిన్‌కు మరో గౌరవం
దుబాయ్ ఎల్స్ గోల్ఫ్‌క్లబ్‌లో శాశ్వత సభ్యత్వం దుబాయ్: క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కి మరో గౌరవం దక్కింది. దుబాయ్‌లోని ప్రముఖ గోల్ఫ్ క్లబ్ ‘ఎల్స్’లో శాశ్వత సభ్యత్వం దక్కింది. ఈ క్లబ్లో ప్రపంచ నంబర్ వన్ రోరీ మెకిల్రాయ్, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, డెన్మార్క్ మాజీ గోల్‌కీపర్ పీటర్ షుమికిల్కు శాశ్వత సభ్యత్వం ఉంది. ముంబై మెంటర్‌గా ఉన్న సచిన్ ఐపీఎల్ తొలి దశ సందర్భంగా ఎల్స్ గోల్ఫ్ క్లబ్‌లోనే విడిది చేశాడు. అదే సమయంలో జేమీ మెక్కొన్నెల్ ఆధ్వర్యంలో సచిన్ గోల్ఫ్ పాఠాలు కూడా నేర్చుకున్నాడు. ఈ క్రీడలోనూ మాస్టర్ సత్తా చాటుతాడని క్లబ్ మేనేజర్ బ్రౌన్ అన్నారు.