
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది.
తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment