V Srinivas goud
-
TS: ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. కీలక ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ క్రమంలో.. సోమవారమూ ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. 19-11-2018వ తేదీన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ జరుపుతోంది ధర్మాసనం. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుకు నాంపల్లి కోర్టు ఆదేశం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో పిటిషనర్ రాఘవేంద్ర రాజు సాక్షితో మాట్లాడారు. ‘‘2022, ఆగస్టు 4వ తేదీన నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ వేశాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎన్నికల అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్ కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత ghmc కమిషనర్, సంజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, ఆర్థివో శ్రీనివాస్, పద్మ శ్రీ డిప్యుటీ కలెక్టర్, కే వెంకటేష్ గౌడ్, నోటరీఅడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, దానం సుధాకర్ ప్రపోజర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది అని తెలిపారు రాఘవేంద్ర రాజు. ‘‘ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదిక ఇచ్చాడని పిటిషన్ లో తెలిపాను. ఎన్నికల కమీషన్ వెబ్సైట్ టాంపరింగ్ కు పాల్పడ్డారని ఆధారాలు ఇచ్చాను. 11 సెప్టెంబర్ పూర్తి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ -
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య లేకుండా సన్మానమా? సిగ్గుచేటు: నట్టి కుమార్
ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య లేకుండా అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు నిర్మాత నట్టి కుమార్. ఆస్కార్ గ్రహీతలను అంత అర్జెంటుగా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారని ప్రశ్నించారు. 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నట్టి కుమార్. 'తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు? ఆస్కార్ సాధించినవాళ్లను అంత అర్జెంట్‌గా ఎవరికీ తెలియకుండా ఎందుకు సన్మానించారు? నిన్న జరిగిన ఈవెంట్ గురించి చాలామందికి సమాచారమే అందలేదు. సన్మానం చేయాలి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఈసీ అప్రూవల్ లేకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి రూ.25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు? తెలంగాణ వచ్చాక ఇండస్ట్రీకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ తెలంగాణలో చిన్న సినిమాలకు ఏం చేయట్లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. దీనిపై ఇంతవరకు స్పందించనేలేదు. తెలంగాణలో ఎక్కువ లాభాలు వస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ ఇక్కడ 32%, ఆంధ్రప్రదేశ్‌లో 62% లాభాలు వస్తున్నాయి. అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఏపీ, తెలంగాణ అంటూ ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం' అన్నారు నట్టి కుమార్. -
ఐసీసీ లెవెల్-1 క్రికెట్ కోచ్ కోర్సు పూర్తి చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ
ఐసీసీలో లెవెల్-1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్‌గా తెలంగాణకు చెందిన బుర్రా లాస్య చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బుర్రా లాస్యను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేర న్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారుల కోసమే పనిచేస్తూ, ఏ వర్గానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర పన్నిందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే 2 రోజుల పర్యటనతో ఇదే విషయం స్పష్టమైందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా స్థితిగతులు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి విమర్శలు చేశారని, కేసీఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా దశ మారిందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో తెలుసుకునేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఇదీ చదవండి: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని -
కాల్పుల వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని మరీ ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసుల ఎస్ఎల్ఆర్ వెపన్తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. ‘‘నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన. @TelanganaCMO @KTRTRS @TelanganaDGP @CPHydCity @AmitShah తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. పోలీసు తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి.... Minister firing.... pic.twitter.com/d8iiHwBeZb — Aravind Sharma (@MAravindSharma1) August 13, 2022 -
బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్‌లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరు పైన విషం చిమ్ముతున్నాడంటూ బండి సంజయ్‌ను విమర్శించారు. పుట్టుకతోనే తెలంగాణ ఆగం చేసిన పార్టీ బీజేపీ.. పాలమూరుకు సిగ్గు లేకుండా అన్యాయం చేసింది. పచ్చని పైర్లతో పాలమూరు ఉంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నావా? అంటూ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకింత తీవ్ర పరుష పదజాలంతో బండి సంజయ్‌ను విమర్శించారు. కులం మతం అంటూ దేశంలో మాదరితే.. పాలమూరులో కూడా తిరుగుతున్నాడని, ఒక బీసీ మంత్రిపై ఇష్టానుసారం మాట్లాడడం ఏంటని? మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. చదవండి: మాటల్లో కాదు.. చేతల్లో పోటీ పడదాం -
ప్లీనరీలో ‘మున్నూరు రవి’ కలకలం
సాక్షి, హైదరాబాద్: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరు కావడం కలకలం సృష్టించింది. వీవీఐపీలు ఉన్న ప్లీనరీలోకి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా, బార్‌కోడ్‌గల పాస్‌లు ఉన్న వారే ప్రవేశించగల సమావేశ మందిరంలోకి రవి రావడాన్ని భద్రతా లోపంగానే నేతలు భావిస్తున్నారు. ప్లీనరీకి 22 కేటగిరీల పార్టీ నేతలను ఆహ్వానించగా ఆ జాబితాలో లేనప్పటికీ రవి ఎలా హాజరయ్యాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీవీఐపీల బార్కోడ్ ఉన్న పాస్‌తోనే అతను లోపలికి వచ్చి ఉంటాడని, ఆ పాస్ ఎవరు ఇచ్చి ఉండొచ్చనే దానిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యకర్తగా హాజరయ్యా: రవి ఈ విషయంపై మున్నూరు రవిని మీడియా సంప్రదించగా ‘కేసీఆర్ అభిమానిగా, పార్టీ కార్యకర్తగా సమావేశాలకు హాజరయ్యా, దీన్ని వివాదాస్పదం చేయడం తగదు. నేను బెయిల్‌పై ఉన్నా.. నేరస్తుడిని కాదు’అని వ్యాఖ్యానించారు. -
కొందరి వల్లే చెడ్డ పేరు వస్తోంది: శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారని, ఇకపై పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే రాష్టానికి అనేక పెట్టుబడులు వస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్టాన్ని నిలబెట్టడం. కానీ, కొందరు డబ్బుకు కక్కుర్తి పడి చేసే పనుల వల్ల చెడ్డ పేరు రాష్ట్రానికి వస్తోంది. ఈ తరుణంలో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో పేకాట, గుడుంబాను అరికట్టగలిగాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లెవరినీ వదిలిపెట్టం. అలాగే వ్యాపారాలు చేసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి అందించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు -
షూటింగ్ రేంజ్లో చెలరేగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో షూటింగ్ రేంజ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, గగన్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్ భారత బృందానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ నుంచి అయిదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. గగన్ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి మరింత మంది షూటర్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టగానే చెలరేగారు. అలవోకగా .22 వాల్తర్ పిస్టల్‌ను అందుకుని ప్రొఫెషనల్ తరహాలో పలు షాట్స్‌ను ఫైర్ చేశారు. మంత్రి టార్గెట్‌ను గురిపెట్టి ఫైర్ చేయడంతో ఒలింపిక్ మెడల్ విజేత, ఏస్ షూటర్ గగన్ నారంగ్ సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పిస్టల్‌తోనే కాకుండా రైఫిల్, షాట్ గన్, ఎయిర్ రైఫిల్‌తో పది మీటర్ల రేంజ్లో సైతం చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. షూటింగ్ అంటే ఇప్పటికీ తనకు ఆసక్తి అధికమని, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)లో తాను లైఫ్ మెంబర్‌నని, తనకు లైసెన్డ్ గన్ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. pic.twitter.com/CQkIQUZICK — V Srinivas Goud (@VSrinivasGoud) July 21, 2021 -
ప్రతిపక్షాలకు మంత్రుల సవాల్.. నిరూపిస్తే రాజీనామాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణను అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ ప్రాజెక్టులను విరమించుకోవాలని.. లేకుంటే ప్రజాయుద్ధం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మొండి అని.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటారని.. తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకోరన్నారు. త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర సీఎం రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాల్వ కట్టి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే.. పాలమూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి మంగళహారతులు పట్టారని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎక్కడ ఉన్నా ఆంధ్రోళ్లేనని.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు బతకొద్దా... ఎవరి బతుకులు వాళ్లు బతకాలని, రైతులు ఎక్కడ ఉన్నా రైతులేనని.. తెలంగాణలోని రైతులు కూడా బతకొద్దా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్‌లపై మరో ప్రజాయుద్ధం చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. లాంటి పథకాలు మీరు పాలించే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలంటూ వేముల ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వారు మొరిగే కుక్కలని.. ఇవి తప్పని నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు అన్యాయం జరిగే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరన్నారు. కాగా, సభ చివరలో ఆంధ్ర నిర్మించే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు -
డబుల్ హ్యాపీ: కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు, గతంలో ఇస్తున్న రూ. 1,500 పెన్షన్‌ను రూ. 3,016కు పెంచుతూ సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వృద్ధ కళాకారుల అర్హత, సమగ్ర సమాచారాన్ని వెరిఫై చేసి పంపాలని సూచించారు. సీఎంకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు కళాకారుల వృద్ధాప్య పెన్షన్లను పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధాప్య పెన్షన్ల వల్ల రాష్ట్రంలోని 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సాహితీవేత్తలు, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్లే పెన్షన్‌ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేశారని కొనియాడారు. -
దేత్తడి హారిక ఎవరో తెలియదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని వెల్లడించారు. చదవండి: ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి శివుడు మన దగ్గరే! బిగ్‌బాస్ హారికకు భారీ షాక్..! -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృ వియోగం
పాలమూరు/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృ వియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి రిటైర్డ్ హెచ్ఎం వి.నారాయణగౌడ్ (73) హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ప్రముఖుల సంతాపం శ్రీనివాస్‌గౌడ్ తండ్రి మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణగౌడ్ మరణ వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు దామోదర్‌రెడ్డి, బాల్కసుమన్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లి నారాయణగౌడ్ పార్థివదేహాన్ని సందర్శించారు. మరో మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి శ్రీనివాస్‌గౌడ్‌కు ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఫోన్లో శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు వేర్వేరు ప్రకటనల్లో నారాయణగౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కదం తొక్కిన పాలమూరు సర్పంచ్‌లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా సర్పంచ్‌లు నిరసనబాట పట్టారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు, జనాభా ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, గ్రామ పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ తదితర డిమాండ్లు ఆమోదించాలని నినదించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని వైట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాటు చేసిన సర్పంచ్ల అవగాహనాసదస్సును బహిష్కరించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి భారీర్యాలీలుగా వైట్‌హౌస్‌కు చేరుకున్న సర్పంచ్‌లు లోపలికి వెళ్లకుండా అరగంటపాటు బయట ఆందోళనకు దిగారు. అప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి వచ్చి సర్పంచ్‌లను సముదాయించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌లు చివరికి లోపలికి వచ్చి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తీరుపై మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు నా మాట వినకపోతే వెళ్లిపోతా. పరిస్థితి ఇలా ఉంటుం దనుకుంటే అధికారులతోనే సమీక్ష పెట్టుకునేవాళ్లం. పాలమూరు నుంచే సదస్సులు ప్రారంభించాలనుకున్నాం. మీరిలా చేయడం నన్ను బాధించింది’అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ సర్పంచ్ల సదస్సు పూర్తయింది. ఇప్పటికిప్పుడే మార్పు అసాధ్యం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు ఇప్పటికిప్పుడే అసాధ్యమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ గౌరవవేతనం మంజూరుకు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి. కొంతమంది ఉపసర్పంచ్లు సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో చర్చించి నేరుగా అవి మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఉపసర్పంచులు వారంరోజుల్లో సంతకం చేయకుంటే వారి చెక్‌పవర్‌ను రద్దు చేసి ఆ అధికారం మీకు నమ్మకస్తుడైన వార్డ్‌మెంబర్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అందుకూ ఓ పద్ధతి ఉంది. మీరు ముందుగా అధికారులకు పిటిషన్ ఇవ్వాలి. ఒకవేళ అధికారులూ స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం’అని అన్నారు. సర్పంచ్‌లను సముదాయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
అతడెవడు.. సస్పెన్స్
సాయికిరణ్ హీరోగా, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోయిన్లుగా వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అతడెవడు’. ఎస్ఎల్ఎస్ సమర్పణలో తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మొదటి సన్నివేశానికి తోట నాగేశ్వర్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట సుబ్బారావు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు నంది వెంకట్‌రెడ్డి. ‘‘ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానిగా నటిస్తున్నాను’’ అన్నారు సాయి కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: డమ్స్ర్ రాము, కెమెరా: డి. యాదగిరి. -
బీజేపీకి అభ్యర్థులు లేరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ దయనీయమైన పరిస్థితని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు సైతం దొరకడం లేదని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తాము టికెట్ ఇవ్వని రెబెల్ అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతోందని, ఎక్కడైనా అభ్యర్థులుంటే అక్కడ పార్టీ నేతలు టికెట్టు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. వంద మున్సిపాలిటీల్లోనూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చందర్, జెడ్పీ చైర్మన్ పుట్టా మధుతో కలసి మంత్రులిద్దరూ ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పగటికలలు కంటోందని, అవి సఫలం కావని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు మాట్లాడారని, చివరకు స్వయంగా ఆయనే ఓడిపోయారన్నారు. బీజేపీ అతిగా ఊహించుకుంటుందని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలతో ఓటర్లు నవ్వుకుంటున్నారన్నారు. మరో 20 ఏళ్లు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో సెంటిమెంట్‌తో బీజేపీకి ఓట్లు వేసిన వారు ఇప్పుడు ప్రశ్చాత్తాప పడుతున్నారని, జెడ్పీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత తమకు దక్కుతుందని, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అన్ని జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అన్ని పట్టణాల అభివృద్ధికి తమ వద్ద ప్రణాళికలున్నాయని, బీజేపీ గెలిచినా చేసేదేమీ ఉండదన్నారు. ఆరేళ్ల తమ పాలన గత ప్రభుత్వాల పాలన కన్నా ఎంతో మెరుగ్గా ఉందన్నారు. -
తెలంగాణ మంత్రి నాన్‌స్టాప్ డిప్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. తాను నాన్‌స్టాప్‌గా డిప్స్ కొడుతున్న వీడియోను మంత్రి ట్విటర్లో పోస్ట్‌చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫ్రీడం హైదరాబాద్ పేరిట ఆదివారం రోజున నగరంలోని నెక్లెస్ రోడ్లో గల పీపుల్స్ ప్లాజా వద్ద 10కే రన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్నెస్ ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా.. వేదికపై ఆగకుండా 50కి పైగా డిప్స్ కొట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన శ్రీనివాస్‌గౌడ్.. ఫిట్నెస్ను ఇష్టమైన అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
‘ట్యాంక్‌బండ్ వద్ద తొలి నీరా స్టాల్’
ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. సాక్షి, హైదరాబాద్ : త్వరలో రాష్ట్ర రాజధానిలో నీరా స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం బేగంపేట పర్యాటక భవన్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నీరా పానీయాన్ని జనానికి చేరువ చేస్తామని గతంలో ప్రభుత్వాలు పేర్కొన్నా.. మాట నిలబెట్టుకోలేదని, గీత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా నీరా విక్రయించే స్టాళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని అయిన నీరా వల్ల సాధారణ ప్రజలకు మేలు కలగటమే కాకుండా, దాన్ని విక్రయించే స్టాళ్ల ఏర్పాటుతో గీత కార్మికులకు ఉపాధి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ స్టాళ్ల బాధ్యతను గౌడ కులస్తులకే అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు గౌడ కులస్తుల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఔషధ గుణాలు నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. కంబోడియా, ఆఫ్రికాలోని పలు దేశాలు, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువగా ఉందని, ఇప్పుడిప్పుడే అమెరికాలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో నీరా విక్రయాలున్నాయని, తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అన్ని కులాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నామని, హైదరాబాద్‌లో ఆయా కులాలకు సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఐక్యతకు ప్రతీక బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐక్యత, సామరస్యాలకు ప్రతీక బతుకమ్మ పండగ సంబురాలని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే బతుకమ్మ సంబురాల కార్యక్రమంపై హరిత ప్లాజాలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి వరంగల్ జిల్లాలో భద్రకాళి అమ్మవారు ఆలయంలో 10 వేల మంది ఆడపడుచులతో బతుకమ్మ ప్రారంభం అవుతుందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని మహిళలకు పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజుకోక బతుకమ్మను అలంకరించి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. -
రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
ఖైరతాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, మెట్రో రైల్ ఇలా అన్నింట్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ సెంచురీ సెలబ్రేషన్స్‌లో భాగంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆటోమేషన్ అండ్ డిజిటల్ మాన్యుఫ్రాక్షరింగ్ అంశంపై నిర్వహించిన ఆలిండియా సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు. సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెమినార్లో వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంజనీర్ల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ ఆర్సీఐ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాస్‌రావు, ఐఈఐ చైర్మన్ రామేశ్వర్రావు, ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త గురురాజ్, డాక్టర్ పి.చంద్రశేఖర్, ప్రొఫెసర్లు శ్రీరాం వెంకటేశ్, చంద్రమోహన్‌రెడ్డి, ఐఈఐ సెక్రటరీ అంజయ్య, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రాజ్‌కిరణ్, ప్రొఫెసర్ రమణా నాయక్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
‘పర్మిట్’పై ప్రతిష్టంభనకు తెర ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీల సమ్మె నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఈ పర్మిట్ల గొడవతో తెలంగాణకు చెందిన లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో సింగిల్ పర్మిట్ ఒప్పందంపై సంతకం పెట్టి ఫైల్‌ను ఏపీ సీఎంకు పంపినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ట్రావెల్స్ ఒత్తిడితో ఈ ఫైలుపై సంతకానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారని తెలంగాణ లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ లారీల నుంచి వస్తున్న ఆదాయాన్ని దండుకోవాలనే ఆలోచనతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ లాబీయింగ్‌కు తలొగ్గారని విమర్శిస్తున్నారు. తాత్కాలిక పర్మిట్‌తోనే.. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు విభజన అనంతరం 2015 మార్చి 31 వరకు చలానాలు లేకుండానే తిరిగాయి. కానీ ఆ తర్వాత రెండు రాష్ట్రాలు తాత్కాలిక పర్మిట్లకు తెరతీశాయి. దీని ప్రకారం తెలంగాణ నుంచి ఒక లారీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి రావడానికి తాత్కాలిక పర్మిట్ కింద రూ. 1,400, ముడుపుల కింద మరో రూ. 200 కలిపి మొత్తం రూ. 1,600 చెల్లించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లారీలు తెలంగాణకు రావాలన్నా ఈ మొత్తాన్ని కట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన పరిస్థితి ఉండటంతో ఆదాయం కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందానికి ఆసక్తి కనబరచట్లేదు. తీరప్రాంతం లేకపోవడం, రైలు మార్గాలు కూడా తక్కువగా ఉండటంతో తెలంగాణ ఎక్కువగా రోడ్డు రవాణా మీదే ఆధారపడి ఉంది. అందులో లారీల ద్వారా జరిగే రవాణా కీలకపాత్ర పోషిస్తోంది. కానీ తెలంగాణకు చెందిన లారీల్లో ఎక్కువ వాటికి నేషనల్ పర్మిట్లు లేవు. 12 ఏళ్లు పైబడిన లారీలకు నేషనల్ పర్మిట్ ఇవ్వకపోవడంతో పాత వాహనాలు తాత్కాలిక పర్మిట్లతోనే ఏపీకి వెళ్లి వస్తున్నాయి. అదే ఏపీ విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా నేషనల్ పర్మిట్ ఉన్న లారీలే ఉన్నాయి. దీంతో తెలంగాణకు రావాలన్నా అదనంగా ఏమీ చెల్లించకుండానే ఏపీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీలు ప్రతిరోజూ 120 నుంచి 400 వరకు ఉంటాయని అంచనా. ఈ లారీల ద్వారా ఏటా ఏపీకి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావట్లేదు. సింగిల్ పర్మిట్ అంటే...! దేశంలో సరుకు రవాణా చేసే ఏ లారీ అయినా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే పర్మిట్ తప్పనిసరి. ఈ పర్మిట్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి నేషనల్ పర్మిట్కాగా రెండోది సింగిల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ లారీలు నిర్ణీత రుసుము చెల్లించి దేశంలోని ఏ రాష్ట్రానికైనా సరుకు రవాణా చేయొచ్చు. అదే సింగిల్ పర్మిట్ మాత్రం రెండు పొరుగు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందమన్నమాట. ఈ పర్మిట్ తీసుకున్న ఒక రాష్ట్రానికి చెందిన లారీ ఏడాదికి రూ. 5 వేలు చెల్లించి ఒప్పందం చేసుకొని పొరుగు రాష్ట్రంలో రాకపోకలు సాగించవచ్చు. దీని ప్రకారమే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో సింగిల్ పర్మిట్ విధానాన్ని తెలంగాణ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటకలతో సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకున్నా తెలంగాణతో మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈసారైనా మోక్షం కలిగించండి 2015లో జరిగిన లారీల సమ్మె సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాలకు నివేదించాం. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే పలుమార్లు ఏపీకి చెందిన రవాణా మంత్రి, అధికారులను కలిశాం. కానీ ఆ ఫైలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలి. లారీల సమ్మె సందర్భంగా మేం ఇదే అంశాన్ని ప్రధానంగా పరిష్కరించాలని కోరుతున్నాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబే కారణం తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ చంద్రబాబుతోనే పేచీ వస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల ఒత్తిడితో ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. – వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే (తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు) -
మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. తొలుత శ్రీనివాస్‌ను పలకరించిన కోమటిరెడ్డి.. ‘శ్రీనన్నా.. మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..? ఉద్యమ సమయంలో మీరు, స్వామిగౌడ్ లాఠీ దెబ్బలు తిన్నారు కదా. మీకు మంత్రి పదవి వస్తే బాగుండేదన్నా..’అని అన్నారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. ‘అదేం లేదన్నా.. మంత్రి పదవి వచ్చే టైమ్‌లో వస్తుంది.. అయినా మా ప్రభుత్వం వచ్చింది కదా? సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కదా..’అని అన్నారు. ‘ఉద్యమం చేసిన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు వచ్చాయి కదా..’ అని కోమటిరెడ్డి చమత్కరించారు. ‘ఇదంతా ఎందుకు? మీరెప్పుడు మా పార్టీలోకి వస్తున్నరో చెప్పండి..’అని శ్రీనివాస్ గౌడ్ ఎదురు ప్రశ్నవేశారు. ‘ఎక్కడికీ రాను. తెలంగాణ వచ్చింది అదే సంతోషం. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న’ అని కోమటిరెడ్డి అన్నారు.