జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఖైరతాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మెట్రో రైల్ ఇలా అన్నింట్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ సెంచురీ సెలబ్రేషన్స్‌లో భాగంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆటోమేషన్ అండ్ డిజిటల్ మాన్యుఫ్రాక్షరింగ్ అంశంపై నిర్వహించిన ఆలిండియా సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు.
సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెమినార్‌లో వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంజనీర్ల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ ఆర్సీఐ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాస్‌రావు, ఐఈఐ చైర్మన్ రామేశ్వర్‌రావు, ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త గురురాజ్, డాక్టర్ పి.చంద్రశేఖర్, ప్రొఫెసర్లు శ్రీరాం వెంకటేశ్, చంద్రమోహన్‌రెడ్డి, ఐఈఐ సెక్రటరీ అంజయ్య, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రాజ్‌కిరణ్, ప్రొఫెసర్ రమణా నాయక్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment