Khairtabad
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్చుకున్నాను: మెగాస్టార్ చిరంజీవి
-
BJP MLA Raja Singh: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
హైదరాబాద్జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాలన్నిటిలోనూ కుల సమీకరణాలకంటే మత సమీకరణాలే కీలకం కానున్నాయి. అన్ని పార్టీలకు హిందుత్వమే కీలకం కానుంది. మజ్లిస్‌ను ఓడించాలంటే హిందుత్వతోనూ ముందుకు సాగాలని కమలనాథులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. గెలుపునకు వారి ఓట్లే కీలకం గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న గోషామహాల్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి కంచుకోటగా మారింది. గోషా మహల్‌ను వశం చేసుకునేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్లో ఎలాగైనా పాగా వేయాలని అన్ని పార్టీలు తహ తహలాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా అంతే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లే కీలకం కాబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా హిందూ ఓట్లే రాజాసింగ్‌ను గెలిపించాయని చెప్పక తప్పదు. గోషామహాల్ ఏరియాలో బేగం బజార్ అత్యంత కీలకం. ఇక్కడ షాపుల యజమానులందరూ మార్వాడీలే. ఇక్కడ ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశం ఉంది. అలాగే యాదవ, బెస్త, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు అన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 16 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితే గెలుస్తామనే ధీమాను కాంగ్రెస్, టిఆర్ఎస్ లు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఆయనపై నమోదైన కేసులు.. బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వెరసి రాజాసింగ్ రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాంగ్రెస్‌నేత ముఖేష్ గౌడ్ మృతి చెందడంతో... ఆ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. ఫిషర్మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ , అంజన్ కుమార్ యాదవ్ చిన్న కొడుకు అరవింద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసే అవకాశం ఉంది. (చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! ) ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ నుంచి ఎవరు? ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. అన్ని రంగాలకు చెందిన వీఐపీలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా.. ఫిలింనగర్ మురికివాడలు, బస్తీలు కనిపిస్తాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే కాలనీ సహా అనేక రంగాల కీలక కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పి. జనార్థనరెడ్డి ఉన్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ మృతి, 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత దానం టిఆర్ఎస్లో చేరి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఖైరతాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి దానం నాగెందర్ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఏస్పీ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ ఈసారి టిక్కెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్ రెడ్డి ఈసారి కచ్చితంగా తనకే టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మధ్యే టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకే టిక్కెట్ అని చెబుతున్నారు. (చదవండి: సెప్టెంబర్ 7కు హైదర్‌నగర్ భూముల కేసు వాయిదా) సర్వేతో భయపడుతున్న కాలేరు అంబర్‌పేటలో రెండుసార్లు వరుసగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయం సాధించగా... గత ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మీద టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాక్ ఎక్కువగానే ఉంది. దీంతో హిందూ, ముస్లిం ఎజెండాలో బీజేపీ ఈజీగా బయటపడుతుందని కమలనాధులు లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాలేరు వెంకటేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ తనకే టిక్కెట్ వస్తుందని కాలేరు వెంకటేష్ భావిస్తున్నారు. అయితే సర్వేలో మంచి మార్కులు వచ్చిన సిట్టింగ్ లకే మళ్ళీ టిక్కెట్ అనడంతో కాలేరుకు సర్వే భయం పట్టుకుందట. ఇక్కడ పార్టీ ఓట్‌బ్యాంక్‌తో పాటు.. మైనారిటీ ఓట్లతో గెలవవచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో దింపితే అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు లైన్ లో ఉన్నారు. అయితే వీహెచ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని అదిష్టానం ముందు మెలిక పెట్టారట వీహెచ్. ఫైనల్‌గా వీహెచ్ ఆశీర్వాదం ఉన్న వారికి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినందున ఇక్కడ కాంగ్రెస్ స్థానంలో టీజేఎస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళిందనే ఆందోళన కనిపిస్తోంది. (చదవండి: ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?) -
దానం నాగేందర్ వియ్యంకుడిపై దాడి
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్‌కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు
-
రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
ఖైరతాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, మెట్రో రైల్ ఇలా అన్నింట్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ సెంచురీ సెలబ్రేషన్స్‌లో భాగంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆటోమేషన్ అండ్ డిజిటల్ మాన్యుఫ్రాక్షరింగ్ అంశంపై నిర్వహించిన ఆలిండియా సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు. సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెమినార్లో వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంజనీర్ల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ ఆర్సీఐ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాస్‌రావు, ఐఈఐ చైర్మన్ రామేశ్వర్రావు, ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త గురురాజ్, డాక్టర్ పి.చంద్రశేఖర్, ప్రొఫెసర్లు శ్రీరాం వెంకటేశ్, చంద్రమోహన్‌రెడ్డి, ఐఈఐ సెక్రటరీ అంజయ్య, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రాజ్‌కిరణ్, ప్రొఫెసర్ రమణా నాయక్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయం(పాతభవనం)లో బుధవారం మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. రెండురోజుల క్రితం కూడా స్వల్పంగా మంటలు రావడంతో హైదరాబాద్ జేటీసీ చాంబర్‌తోపాటు అన్ని గదులను ఖాళీ చేశారు. తాజాగా భవనం పైఅంతçస్తులోని రికార్డు రూంలో ఉదయం 9.30 గంటలకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పేశారు. ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు గంటకుపైగా సమయం పట్టింది. రికార్డురూంలోని ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి. రెండు రోజుల క్రితమే అధికారులు, సిబ్బంది భవనాన్ని ఖాళీ చేయడంతో ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిజాం కాలం నాటి ఈ భవనంలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని, ఏడాది క్రితమే సిబ్బందిని మరోచోటకు తరలించామని మంత్రి చెప్పారు. రికార్డ్‌రూంలో 40 ఏళ్లకుపైగా భద్రపరిచిన ఫైళ్లు దగ్ధమయ్యాయని, వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్నిరకాల ఫైళ్లను కంఫ్యూటర్లో భద్రపరిచినట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, ఇతర ఫైళ్లు చాలావరకు కాలిపోయాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంపై జేటీసీ రమేశ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు మిగతాప్రాంతాల్లో ఆర్టీఏ కార్యాలయాలను పరిశీలించి నివేదిక అందజేస్తుందన్నారు. ఖైరతాబాద్‌లోని ఈ భవనం ఏ మాత్రం సురక్షితం కాదని రోడ్లు, భవనాల శాఖ 10 ఏళ్ల క్రితమే హెచ్చరించింది. భవనంలో కొన్నిచోట్ల పెచ్చులూడాయి. మరికొన్నిచోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. గత సంవత్సరం పైకప్పు నుంచి పెద్ద సిమెంట్ దిమ్మె విరిగిపడడంతో ఉద్యోగులు ఆ భవనాన్ని ఖాళీ చేశారు. వర్షాల కారణంగా ఏ సమయంలో కూలుతుందో తెలియని స్థితి నెలకొందని అధికారులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో నిజాం నవాబు కూతురు నూర్జహాన్ కోసం నాలుగు ఎకరాల్లో ఈ భవనాన్ని కట్టించారు. స్వాతంత్య్రానంతరం ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ : నగరంలోని అంబర్‌పేట-గోల్నాక ప్రధాన రహదారిలో శనివారం వాహనదారులు నరకయాతన పడ్డారు. మెట్రో రైలు పనుల కారణంగా మలక్‌పేట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనాలను... అదే విధంగా విజయవాడ నుంచి దిల్సుఖ్నగర్ మీదుగా అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ల వైపు వచ్చే వాటిని అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి గోల్నాక మీదుగా అప్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. వాహనాల రద్దీని తక్కువగా అంచనా వేయటంతో అంబర్‌పేట రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వారం క్రితం ట్రయల్ వేసిన ట్రాఫిక్ అధికారులు సమస్య తీవ్రతను అంచనా వేయకుండానే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడ్డారు. దీంతో రోడ్లన్నీ పెద్ద సంఖ్యలో వాహనాలతో నిండిపోయాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ అధికారులు నానా హైరానా పడ్డారు. ఖైరతాబాద్ లో దారి మళ్లింపు.. ఖైరతాబాద్ జంక్షన్లో జరుగుతున్న మెట్రో పనుల నేపథ్యంలో పలు దారులను అధికారులు ఈ రోజు మూసివేశారు. నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే కేసీపీ గెస్ట్‌హౌజ్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ఆనంద్ నగర్ కాలనీ శ్రీధర్ ఫంక్షన్ హాల్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తాకు వెళ్లే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకొని కేసీపీ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రహదారులకు వెళ్లాల్సి ఉంటుంది. -
ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర
-
బొజ్జ గణపయ్య కోసం భారీ లడ్డూలు
-
జూన్ 12 టూ సెప్టెంబర్ 10
మేకింగ్ ఆఫ్ మహాగణపతి 91 రోజుల ప్రతిమ ప్రస్థానం ఖైరతాబాద్: ఎన్నో ఆలోచనలు.. మరెన్నో అంచనాలు.. సిద్ధహస్తులైన శిల్పులు.. చేయి తిరిగిన కళాకారులు.. వెరసి 59 అడుగుల భారీ గణపయ్య విగ్రహం. అదే ఖైరతాబాద్ మహా గణపతి. భక్తుల కంటికి ఇంపైన రూపం. ఈ ఏడాది త్రిశక్తిమయ మోక్ష గణపతి స్వరూపం. భక్తుల అంచనాలకు అనుగుణంగా ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఊహకు రూపమిచ్చారు. జూన్ 12న భూమి పూజతో మొదలై సెప్టెంబర్ 10 నాటికి నేత్రాలను దిద్దే స్థాయికి చేరుకుంది ఈ ప్రతిమ ప్రస్థానం. 91రోజుల పాటు ఎలా సాగిందో వివరించే స‘చిత్ర’ కథనం.. జూన్ 12: భూమిపూజ ఆ రోజు నుంచే ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రధాన శిల్పి రాజేంద్రన్‌తో ఈ ఏడాది రూపంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నో సలహాలు, మార్పులతో గణపయ్య రూపు తయారీ మొదలైంది. కంప్యూటర్ డిజైనర్ ప్రవీణ్ సహకారంతో శిల్పి రాజేంద్రన్ రెండు రోజుల పాటు శ్రమించి తుదిరూపును తయారు చేశారు. ‘త్రిశక్తిమయమోక్ష గణపతి’గా నామకరణం చేశారు. జూలై 2: నమూనా ఆవిష్కరణ ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ అండ్ టీం (15 మంది) షెడ్డును నిర్మించారు. 22 టన్నుల సర్వే కర్రలు, 50 బండిళ్ల తాళ్లు వినియోగించారు. జూలై 15: వెల్డింగ్ పనులు షురూ కావలికి చెందిన శేషారెడ్డి బృందం (10 మంది) వెల్డింగ్ పనుల్ని ప్రారంభించింది. 20 టన్నుల స్టీల్‌ను వినియోగించారు. జూలై 28: 4 టన్నుల బరువైన 42 అడుగుల ఎత్తయిన సెంటర్ పోల్‌ను క్రేన్ సాయంతో అమర్చారు. ఆగస్ట్ 7: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు.. చెన్నైకి చెందిన మూర్తి టీం(25 మంది), మహారాష్ట్ర సుభాష్ టీం పీఓపీ పనుల్ని ప్రారంభించాయి. ఇందుకు 34 టన్నుల పీఓపీ, 75 బండిళ్ల కొబ్బరి నార, బంకమట్టి 600 బ్యాగులు, ఫెవికాల్ 30 లీటర్లు, సబ్బులు 50, నూనె 40 లీటర్లు వినియోగించారు. సెప్టెంబర్ 2: పెయింటింగ్ పనులు ప్రారంభం కాకినాడకు చెందిన భీమేష్ టీం (20 మంది) విగ్రహానికి రంగులద్దే పనులకు శ్రీకారం చుట్టింది. 200 లీటర్ల రంగుల్ని వినియోగించారు. సెప్టెంబర్ 10: నేత్రాలను దిద్దారు 59 అడుగుల ఖైరతాబాద్ త్రిశక్తి మయ మోక్ష గణపతికి గురువారం ఉదయం 6.20 గంటలకు ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేత్రాలను దిద్దారు. మహాగణపతి కంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. విగ్రహాన్ని ఏ వైపు నుంచి చూసినా అటువైపు మహా గణపతి చూస్తున్నట్టు ఉండడం ఈ ఏడాది ప్రత్యేకత అని రాజేంద్రన్ అన్నారు. సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ నిర్ణయించిన ముహూర్తానికే నేత్రాల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విగ్రహ ప్రత్యేకతలివే.. 59 అడుగుల మహా గణపతి విగ్రహం కుడివైపు గజేంద్రమోక్షం ఎడమ వరంగల్ భద్రకాళి అమ్మవారు -
రూ.10వేలు బకాయిపడితే నల్లా కట్
సాక్షి,సిటీబ్యూరో: నీటి బిల్లు బకాయిలు రూ.10 వేలు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేయాలని జలమండలి నిర్ణయించింది.శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎమ్డీ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నెలవారీ నీటి బిల్లులు, బకాయిలతో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. జలమండలికి రావలసిన బకాయిల మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ బిల్లులతో పాటు బకాయిల్లో కొంతమొత్తమైనా రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నూతన కుళాయి కనెక్షన్ల జారీ, ట్యాంకర్ల ద్వారా విక్రయించే నీటి చార్జీలు అన్నీ కలిపితేరూ.100 కోట్ల రెవెన్యూ లక్ష్యం సాధించవచ్చని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.25 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నెలవారీ ఠంఛనుగా బిల్లులు చెల్లించేవారు నాలుగు లక్షలకు మించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మహా’ పోటీ
గణేశుని లడ్డూ కోసం పోటెత్తిన భక్తులు గంటల తరబడి బారులు ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో పూజలందుకున్న మహా లడ్డూ (5వేల కిలోలు) ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. నగర నలు మూలల నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొంతమంది బుధవారం అర్థరాత్రి నుంచే పడిగాపులు కాశారు. గురువారం ఉదయం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లలో ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు పురుషులు, మింట్ కాంపౌండ్ వైపు మహిళలు బారులు తీరారు. అంతకుముందు సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ పి.అశోక్, ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్, లడ్డూ దాత మల్లిబాబు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు కమిటీ సభ్యులు, నాయకులు పూజలు చేసి, ప్రసాద పంపిణీని ప్రారంభించారు. 5వేల కిలోలలో దాత మల్లిబాబుకు రెండు టన్ను లడ్డూను ఇచ్చారు. క్రేన్‌తో వాహనంలోకి లడ్డూను చేర్చారు. ప్రత్యేక వాహనంలో మల్లిబాబు తన స్వగ్రామం తాపేశ్వరానికి ప్రసాదాన్ని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మహాగణపతికి ప్రసాదం సమర్పించినా, దక్కించుకోలేకపోయామని, ఈ సంవత్సరం తిరిగి తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రసాదాన్ని తమ చుట్టు పక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తానని మల్లిబాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ కార్యక్రమం రెండు గంటలకు ముగిసింది. రసాబాసగా మారిన పంపిణీ మహాప్రసాదం కోసం భారీగా జనం తరలి రావడంతో అదుపు చేయడం నిర్వాహకులు, పోలీసులకు కష్టంగా మారింది. ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ భక్తులు ముందుకు రావడంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ బారికేడ్లు సరిచేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే గేటు నుంచి శ్రీనివాస్‌నగర్ వరకు భక్తులు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల నిరాశ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ లభించకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని బారులు తీరారు. తీరా రెండు గంటలకే ప్రసాదం అయిపోయిందని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ‘ఉయ్ వాంట్ లడ్డూ...’ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. -
మహాగణపతి విశ్వరూపం
ఇంత ఎత్తయిన రూపం ఇదే చివరిసారి వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న గణపయ్య ఎత్తు నేడు గవర్నర్ దంపతుల తొలిపూజ సాయంత్రం పూజలకు సీఎం కేసీఆర్ సాక్షి, సిటీబ్యూరో: ‘విశ్వరూపుడి’ ఈ ఏడాది విశేషాలు.. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతిగా నామకరణం చేశారు. 1954లో ఖైరతాబాద్‌లో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. గణపతికి కుడివైపు లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. మహాగణపతి బరువు 40 టన్నులు మహాగణపతి విగ్రహంతో పాటు రెండు వైపులా ఏర్పాటు చేసే విగ్రహాల తయారీకి కలిపి వినియోగించిన స్టీల్ 20 టన్నులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు గోనె సంచులు 10 వేల మీటర్లు బంకమట్టి ఒకటిన్నర టన్నులు నార రెండున్నర టన్నులు చాక్ పౌడర్ 100 బ్యాగులు సిబ్బంది 150 మంది పూజా ద్రవ్యాలన్నీ ‘ఘన’మైనవే.. 75 అడుగుల పొడవైన కండువా... 75 అడుగుల పొడవైన యజ్ఞోపవీతం... మహా‘ఘన’పతికే సొంతం. ఇవి నల్గొండ జిల్లాలో తయారయ్యాయి. 10 అడుగుల పొడవైన మూడు అగరుబత్తీల (ఒక్కొక్కటీ 72 గంటల పాటు) సువాసనలు పొందే అరుదైన అవకాశం ఇక్కడి ఉండ్రాలయ్యకే దక్కుతోంది. వీటిని అంబికా దర్బార్ బత్తి కంపెనీ అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇవి తయారు చేశారు. మహాప్రసాదం... ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి సమర్పించే లడ్డూ బరువు 5 టన్నులు(ఐదువేల కిలోలు). ఈ ప్రసాదాన్ని 2010 నుంచి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి. ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) అందిస్తున్నారు. 2010లో 600 కిలోలు 2011లో 2400 కిలోలు 2012లో 3500 కిలోలు 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఈ ఏడాది 5000 కిలోల (ఐదు టన్నులు) లడ్డూను సిద్ధం చేశారు. గురువారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డూ ప్రత్యేక వాహనంలో నగరానికి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజాముకు నగరానికి చేరుకుంటుందని దాత మల్లిబాబు ‘సాక్షి’కి తెలిపారు. నేడు గణనాథుడి తొలిపూజకు గవర్నర్... ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 7గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజవర్గం వారి ఆధ్వర్యంలో తయారు చేసిన 75 అడుగుల యజ్ఞోపవీతం, అంతే పొడవున్న కండువాను మహాగణపతికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి పార్థసారధి, ఐపీఎస్ అధికారి కె.ఆర్.ఎం. కిషోర్‌కుమార్‌తో పాటు ప్రముఖులు హాజరవుతారని ఖైరతాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షుడు కడారి శ్రీధర్, ఉపాధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి, ఉపాధ్యక్షులు పున్న బాలకృష్ణ, శ్రీనివాసులు తెలిపారు. సాయంత్రం పూజలకు సీఎం కేసీఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కైలాస విశ్వరూప మహాగణపతిని శుక్రవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. భారీ గాయత్రీ మాల రామన్నపేట: ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే భారీ వినాయక విగ్రహానికి అలంకరించడానికి భారీ గాయత్రీ మాల (యజ్ఞోపవీతం) సిద్ధమైంది. ఖైరతాబాద్ పద్మశాలీ సంఘ పర్యవేక్షణలో సిరిపురం గ్రామానికి చెందిన పద్మశాలి పురోహితుడు అప్పం రాములు గాయత్రీ మాలను తయారు చేశాడు. దీని పొడవు సుమారు 25 మీటర్లు. గురువారం సిరిపురంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘ అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, ఎంపీటీసీ సభ్యుడు పున్న వెంకటేశం, పద్మశాలీ సంఘ అధ్యక్షుడు పెంటయ్యల ద్వారా ఖైరతాబాద్ పద్మశాలీ సంక్షేమ సంఘం వారికి దీన్ని అందజేశారు. ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, సిటీ బ్యూరో: ఖైరతాబాద్ భారీ గణేషుడి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా... మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ గణేష్ మండపం (ఖైరతాబాద్ లైబ్రరీ) వైపు అనుమతించరు. ఈ వాహనాలు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రాజీవ్‌గాంధీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ లైబ్రరీ వైపు అనుమతించరు. వాహనాలు రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు. రాజ్‌దూత్ హోటల్ లేన్, ఖైరతాబాద్ మార్కెట్ బైలేన్ నుంచి వచ్చే వాహనాలు జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. -
ఖైరతాబాద్ గణపతికి 5 టన్నుల లడ్డు
తయారీకి సిద్ధమైన మండపేట తాపేశ్వరం సురుచి ఫుడ్స్ తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఈసారి భారీ లడ్డూ తయారు చేయనుంది. ప్రతిష్టించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ విగ్రహం చేతిలో ఉంచేందుకు 5 వేల కేజీల లడ్డూను తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం తెలిపారు. లడ్డూ తయారీ నిమిత్తం ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేశ్ మాలధారణ చేయనున్నామన్నారు. పూర్తైన లడ్డూను 28న క్రేన్ సాయంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపిస్తామన్నారు.