ఇదీ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమిక లెక్క
ఈఎన్‌సీ నుంచి ఏఈఈల దాకా...
కాళేశ్వరం కమిషన్‌కు నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
నెలాఖరులో పూర్తి నివేదిక
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమికంగా తేలి్చనట్టు సమాచారం. ఈ బరాజ్‌లపై విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో 10 మంది దాకా ఇంజనీర్లు బాధ్యులని తేలి్చంది. ఈ మేరకు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను కాళేశ్వరం కమిషన్‌కు అందించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలసత్వం బరాజ్‌ల వైఫల్యానికి కారణాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది.
పూర్తి నివేదిక అందించడానికి మరికొంతకాలం గడువు కావాలని విజిలెన్స్ నివేదించగా.. పత్రాలన్నీ ఇస్తే తామే వైఫల్యానికి కారణాలను తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేయడంతో నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకరించింది. ఇక విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదని ప్రభుత్వానికి లేఖ రాయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది అధికారులు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన సమాచారంలో ఈ విషయాన్ని కమిషన్ గుర్తించింది. విచారణను తప్పుదోవ పట్టించడానికి వీరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టు తేలింది.
ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో ముడిపడిన అన్నీ డాక్యుమెంట్లు అందించాలని నీటిపారుదలశాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్, ఎం–బుక్ (మెజర్‌మెంట్ బుక్)లు కూడా కమిషన్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండురోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ రెండు బుక్‌లకు సంబంధించిన ప్రస్తావన పలు సందర్భాల్లో వచ్చింది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవా? కావా? అనేది నిర్ధారణ కావాలంటే కీలకమైన రెండు బుక్‌లను తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచి్చన నేపథ్యంలో ఆ అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది.
40 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని..
విచారణలో భాగంగా మంగళవారం నుంచి శనివారం దాకా 40 మంది దాకా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.తాజా జాబితాలో మాజీ ఈఎన్‌సీతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.ఇంజనీర్లను పూర్తిగా ప్రశ్నించిన తర్వాత ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు కమిషన్ కబురు పంపనుంది. ఆ పిదప కీలక ప్రజాప్రతినిధులకు కూడా సమన్లు పంపించనుంది. ఇప్పటికే విచారణలో స్పష్టత వచి్చంది.
లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్
లాయర్ లేకుండానే ఒంటరిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒకవేళ కమిషన్ లాయర్‌ను సమకూర్చుకుంటే..ప్రతివాదులు కూడా లాయర్లను
తెచ్చుకుంటున్నారని, దీనివల్ల రోజుకు ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేమనే అభిప్రాయానికి కమిషన్ వచి్చంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. అయితే కమిషన్‌కు న్యాయవాదిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment