lift irrigation scheme
-
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమికంగా తేలి్చనట్టు సమాచారం. ఈ బరాజ్‌లపై విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో 10 మంది దాకా ఇంజనీర్లు బాధ్యులని తేలి్చంది. ఈ మేరకు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను కాళేశ్వరం కమిషన్‌కు అందించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలసత్వం బరాజ్‌ల వైఫల్యానికి కారణాలని ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొంది.పూర్తి నివేదిక అందించడానికి మరికొంతకాలం గడువు కావాలని విజిలెన్స్ నివేదించగా.. పత్రాలన్నీ ఇస్తే తామే వైఫల్యానికి కారణాలను తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేయడంతో నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకరించింది. ఇక విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదని ప్రభుత్వానికి లేఖ రాయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది అధికారులు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన సమాచారంలో ఈ విషయాన్ని కమిషన్ గుర్తించింది. విచారణను తప్పుదోవ పట్టించడానికి వీరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టు తేలింది.ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో ముడిపడిన అన్నీ డాక్యుమెంట్లు అందించాలని నీటిపారుదలశాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎం–బుక్ (మెజర్మెంట్ బుక్)లు కూడా కమిషన్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండురోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ రెండు బుక్‌లకు సంబంధించిన ప్రస్తావన పలు సందర్భాల్లో వచ్చింది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవా? కావా? అనేది నిర్ధారణ కావాలంటే కీలకమైన రెండు బుక్‌లను తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచి్చన నేపథ్యంలో ఆ అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది.40 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. విచారణలో భాగంగా మంగళవారం నుంచి శనివారం దాకా 40 మంది దాకా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.తాజా జాబితాలో మాజీ ఈఎన్సీతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.ఇంజనీర్లను పూర్తిగా ప్రశ్నించిన తర్వాత ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు కమిషన్ కబురు పంపనుంది. ఆ పిదప కీలక ప్రజాప్రతినిధులకు కూడా సమన్లు పంపించనుంది. ఇప్పటికే విచారణలో స్పష్టత వచి్చంది.లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ లేకుండానే ఒంటరిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒకవేళ కమిషన్ లాయర్‌ను సమకూర్చుకుంటే..ప్రతివాదులు కూడా లాయర్లనుతెచ్చుకుంటున్నారని, దీనివల్ల రోజుకు ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేమనే అభిప్రాయానికి కమిషన్ వచి్చంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. అయితే కమిషన్‌కు న్యాయవాదిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. -
పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో పాలమూరు–రంగారెడ్డి, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్న ం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్), వాకిటి శ్రీహరి ముదిరాజ్(మక్తల్), జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట)లతో కలిసి, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజవర్గాలకు నీరందించడానికి వీలుగా నారాయణపేట–కొడంగల్ ఎత్తి పోతల పథకం చేపట్టడానికి వీలుగా 2014 మే 28వ తేదీన ఉత్తర్వులుజారీ చేశారని, ఆ ప్రాజె క్టును చేపడితే కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీరందేదని, దీనికోసం రూ.133.86 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చినా, ఆ పథకాన్ని చేపట్టలేదని, నివేదించారు. తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతినివ్వా లని వీరు నివేదించగా... మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రేవంత్‌రెడ్డి పట్టుదలతో 2014 మేనెలలోనే నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిస్తే... గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని చేపట్టి ఉంటే లక్ష ఎకరాలకు పైగా నీరందేదని గుర్తు చేశారు.కోయిల్గర్ ప్రాజెక్టు సామర్థ్యం మరో రెండు టీఎంసీలు పెంచాలని మంత్రి ఉత్తమ్‌ను కోరామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. 2014లోపే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును పక్కనపెట్టి, రూ.50 వేల కోట్లతో రీ ఇంజనీరింగ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని, రూ.30 వేల కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకు ఈ పథకంతో నీరందలేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జీఓ నంబరు 69ని గత ప్రభుత్వం పక్కనపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మండిపడ్డారు. పాలమూరులో వలసలు తగ్గలేదు మహబూబ్‌నగర్ అంతా పచ్చగా లేదని, ఇంకా నీటి గోసతో అల్లాడుతుందని మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రిని కలిసిన అనంతరం సచివాలయ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు చేసిందని శూన్యమని నిప్పులు చెరిగారు. వలసలు తగ్గలేదని..వలపోత ఆగలేదన్నారు. ముంబై బస్సు రావడం ఆగలేదు...పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకా తప్పలేని పరిస్థితి అని ధ్వజమెత్తారు. ఏదో చేశామని చెబుతున్న బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఒక్క పిల్ల కాల్వ నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్లు, మాటల మీద పని తప్పా...ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. -
‘రాయలసీమ’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు రిజర్వు చేసింది. రాయలసీమపై గతంలో ఎన్జీటీ ఇచి్చన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. వీటిని తాజాగా సోమవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. జియాలజిస్టుల సూచనలు, డీపీఆర్ అవసరాల మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద పనులు జరుగుతున్నాయని పునరుద్ఘాటించారు. ఎన్జీటీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టం లేదని స్పష్టం చేశారు. ఆదేశాల ధిక్కరణ పిటిషన్ల విచారణ ఎన్జీటీ పరిధిలో లేదంటూ పలు కేసులు ప్రస్తావించారు. ఎన్జీటీని ఏపీ తప్పుదోవ పట్టించలేదని పేర్కొన్నారు. డీపీఆర్ పరిధి దాటి పనులు చేస్తే దానిపై చర్యలు తీసుకొనే అధికారం విషయంలో చట్టపరంగా ఎక్కడా స్పష్టత లేదన్నారు. అదనపు పనులపై చర్యలు తీసుకొనే అధికారం పర్యావరణ శాఖకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మాధురి దొంతిరెడ్డి, తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు హాజరయ్యారు. -
పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి..
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుగా ఉన్న కోయిల్‌సాగర్ 67వ వసంతంలోకి అడుగిడింది. దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1947లో నిజాం పాలనలో నిర్మాణ పనులు ప్రారంభించి 1955 సంవత్సరంలో పూర్తిచేశారు. ఆనాడు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసింది కేవలం రూ.85 లక్షలే. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 26.6 అడుగులుగా నిర్మించారు. ఆనాటి ఆయకట్టు కింద 8 వేల ఎకరాలు ఉండగా.. కుడి, ఎడమ కాల్వల ద్వారా మొదటిసారి 1955లో జూలై 7న నీటిని వదిలారు. సిమెంట్ స్టీల్ ఉపయోగించని ఆనాడు అందుబాటులో ఉన్న సున్నం గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం 67వ వసంతంలోకి చేరుకున్న ప్రాజెక్టు నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. 1981లో క్రస్టుగేట్ల ఏర్పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఆధునీకరించే పనులు 1981లో కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. అలుగుపై 13 గేట్లను నిర్మాణం చేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి గాను రూ.92 లక్షల వ్యయం అయింది. గేట్ల నిర్మాణంతో ప్రాజెక్టులో 32.6 అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలకు చేరింది. ఆయకట్టు కింద 8 వేల నుంచి 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం లభించింది. -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. -
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్జీటీ
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్ అంశంపై అదే పనిగా కేసులు వేయడంపై టిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పదేపదే కేసులా అంటూ ఆవులపల్లి గ్రామస్థులపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. తరచూ కేసులు వేసి ఇబ్బంది పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు మళ్లీ వేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రిబ్యునల్ హెచ్చరించింది. -
Kaleshwaram : మూడో సీజన్లో ముందస్తుగానే...
కాళేశ్వరం: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మూడో సీజన్లో నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకు గాను నాలుగింటిని ప్రారంభించారు. తొలుత 1, ఆపై 2, 5, 7 నంబర్ మోటార్లు ప్రారంభించగా, ఎనిమిది పంపుల ద్వారా నీరు గ్రావిటీ కాల్వలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు అన్నారం బ్యారేజీకి తరలుతోంది. 5 రోజులుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుతోంది. బుధవారం ఇక్కడ గోదావరిలో 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. మరో రెండు రోజుల్లో వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూన్ నుంచే ఖరీఫ్ అవసరాలకు నీటిని తలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
‘బాహుబలి’ సెంచరీ
రామడుగు/బోయినపల్లి(చొప్పదండి)/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏడాదిలో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్లు బుధవారం రికార్డు సృష్టించాయి. ఇక్కడ లిఫ్ట్ చేసిన నీటిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిధిలోని శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపూర్ వద్ద నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్‌లో ఏడు మోటార్లు బిగించారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం వీటి ప్రత్యేకత. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్‌మానేరుకు పంపింగ్ చేస్తున్నారు. బుధవారం నాటికి 100 టీఎంసీల నీరు గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు. గాయత్రి నుంచి విడుదలైన నీటిని శ్రీరాజారాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి రెండేళ్లుగా ఎస్సారెస్పీ నుంచి, రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాలువ మీదుగా సుమారు 125 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులోకి చేరిన నీటిలోంచి సుమారు 25 టీఎంసీల నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టులో నిల్వ చేసుకుని మిగతా 100 టీఎంసీల నీరు దిగువన ఉన్న ఎల్ఎండీ ప్రాజెక్టులోకి, కుడి కాలువ ద్వారా అనంతగరి ప్రాజెక్టుకు సరఫరా చేసినట్లు ఎస్ఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. మరోపక్క కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 17 నుంచి బుధవారం వరకు 21.5 టీఎంసీల నీటిని ఆరు మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. చదవండి: సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు! -
ఆ అవసరాలకు సీమ ఎత్తిపోతల అవసరమే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నీటిని మళ్లించి, వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.(చదవండి: సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’) ఈ ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ)కు సమర్పించకుండా ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని హరిత ట్రిబ్యునల్ గుర్తు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి అవసరమా? లేదా? అన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణ ప్రాంత బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, ఈ పథకం వల్ల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించిన సంగతి విదితమే.(చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స) -
సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే వాటా నీటిని వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి కాలువ), టీజీపీ (తెలుగుగంగ), గాలేరు–నగరి, కేసీ కెనాల్ల ఆయకట్టుకు ఇప్పటికే నీటిని అందిస్తున్నారని, ఆ ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) సాంకేతిక పరిశీలనకు పంపేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడం కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎత్తిపోతలకు వర్తించదని గతంలోనే నివేదిక.. రాయలసీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ తెలంగాణకు చెందిన ఒక రైతు ఎన్జీటీ(జాతీయ హరిత న్యాయస్థానం)ని ఆశ్రయించడంతో పర్యావరణ అనుమతితో ఆ పథకాన్ని చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఎన్జీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)–2006 నోటిఫికేషన్ పరిధిలోకి రాయల సీమ ఎత్తిపోతల రాదని స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జూలై 29న నివేదిక ఇచ్చింది. పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తి పోతల చేపట్టారని, ఈ పథకం ద్వారా విద్యుదుత్పత్తి చేయడం లేదని, జలాశయాలను కొత ్తగా నిర్మించడం లేదని పేర్కొంది. అందువల్ల ఈ పథకానికి పర్యా వరణ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యా వరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం.. కృష్ణా, గోదావరి జలాల విని యోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, తుమ్మిళ్ల ఎత్తిపోతల, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు, మిషన్ భగీరథ, భక్తరామదాస ఎత్తిపోతల డీపీఆర్‌లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. నీటి కేటాయింపులు ఉన్న పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిబంధనల ప్రకారమే సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
దృఢ సంకల్పంతో ముందడుగు
-
దృఢ సంకల్పంతో ముందడుగు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సమస్యలను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్ వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి వీడియో లింక్ ద్వారా శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలో ఉన్న నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాలు తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీబీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా ‘వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం’ ద్వారా నీరు అందిస్తామని’’ సీఎం వెల్లడించారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. (చదవండి: ‘వైఎస్సార్-వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం) రైతు బాంధవుడిగా నిలిచారు.. వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇది ముఖ్యమంత్రి పెళ్లి రోజు కానుకగా రైతుల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దంపతులు నూరు వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ అప్పట్లో ఈ ప్రాంతానికి మేలు చేశారని, మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని.. రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతు బాంధవుడిగా సీఎం నిలిచిపోతారన్నారు. సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు. పెళ్లి రోజున ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
‘వైఎస్సార్-వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
సాక్షి, జగ్గయ్యపేట: కృష్ణానదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న ‘వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్‌లో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించారు. (చదవండి: ప్రతి రంగంలోనూ విజన్) ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో సమస్యలను పట్టించుకోలేదన్నారు.14 నెలల కాలంలోనే వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, 2021 ఫిబ్రవరి కల్లా వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.491 కోట్ల వ్యయంతో 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వేదాద్రి గ్రామంలో ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది. -
రాయలసీమలో నవశకం
సాక్షి, కర్నూలు : రాయలసీమ.. ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, కరువుతో అల్లాడే జిల్లాలే. అయితే ఇదంతా గతం... 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ నుంచి సీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతితో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని ముఖ్యమంత్రి జెట్ స్పీడుతో పరుగులు పెట్టించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ సంక్పలంతో ప్రస్తుతం అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకమే పెద్దది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం. దీని మొత్తం పంపింగ్ సామర్థ్యం ఏడాదికి 40 టిఎంసీలు మాత్రమే. అలాగే పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నంలాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా సీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్.. కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది. శతాబ్దాలుగా కరువు ప్రాంతంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఇక కృష్ణమ్మ పరవళ్లతో పచ్చదనంతో కళకళలాడనుంది. వృథా నీటిని ఒడిసి పట్టనున్న ఎత్తిపోతల పథకం.. ఎన్నో దశాబ్దాలుగా సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. గత 16ఏళ్ళలో పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాల్లో లభించాల్సిన నీటికన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి కృష్ణాకు భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగి ప్రవహించి జలాలు సముద్రంపాలు అయ్యాయే తప్ప సీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి తలంచారు. దీంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనంచేసి ఆచరణలో సాధ్యమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారీ పంపింగ్ కేంద్రం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం(ఆర్.ఎల్.సీ-రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు మూడు టీఎంసీల(34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు నీటిని మళ్లించేలా పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8టీఎంసీల వరకు కూడా పంప్ చేసేలా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది వైఎస్ జగన్ సర్కార్ ఉద్దేశం. భారీ పైపులైన్లను ఏర్పాటుతో నీటి తరలింపు.. ఎత్తిపోతల ద్వారా పంప్ చేసిన నీటిని 125మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బీ.సీ, కేసీ కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తోపాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు మొత్తం 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఏపీలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ రూపురేఖలు మార్చేలా అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
ప్రజాధనం గోదారి పాలు.. టీడీపీ నిర్వాకం
రాజుల సొమ్ము.. రాళ్లపాలు అన్నట్టుగా.. నాటి చంద్రన్న సర్కారు కమీషన్ల కక్కుర్తితో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదారి పాలు చేసింది. సరైన అనుమతులు లేకుండానే నాటి ప్రభుత్వం నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భారీగా కమీషన్లు ఎత్తిపోశారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అసలు ఈ ఎత్తిపోతల పథకమే వృథా అని చాలామంది అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికీ కమీషన్ల కక్కుర్తితో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం ఆగమేఘాల మీద నిర్మించేసింది. ఇప్పుడీ పథకం ‘ఉత్తిపోతలు’గా మారినట్టే కనిపిస్తోంది. దీని నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయడానికి వీల్లేదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారగా.. దీనికోసం ఖర్చు చూపించిన రూ.1,638 కోట్లను చంద్రన్న ప్రభుత్వం గోదారిలో కలిపినట్టయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాలకుల స్వలాభపేక్ష ఫలితంగా ప్రజాధనం ఎలా దురి్వనియోగం అవుతుందో కళ్లకు కడుతోంది పురుషోత్తపట్నం ఎత్తిపోల పథకం. మెట్ట ప్రాంత సంజీవనిగా పిలిచే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీటిని పంపింగ్ చేస్తామని నమ్మించి, నాటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఈ పథకం ద్వారా గత పాలకులు రూ.కోట్లు కొల్లగొట్టేశారు. 2017 ఆగస్టు 15న అప్పటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. సాగునీరు విడుదల చేస్తున్నట్టు పెద్ద ఆర్భాటమే చేశారు. 2017లో పాక్షికంగా 1.63 టీఎంసీలు, 2018–19 ఖరీఫ్‌న్‌లో 7.81 టీఎంసీలు.. అది కూడా గోదావరికి వరదలు వచ్చినప్పుడు విడుదల చేశారు. పోలవరం ఎడమ కాలువ, ఏలేరు ప్రాజెక్టులు ఉండగా ఈ ఎత్తిపోతల పథకం వృథా అని రైతులు, ఇంజినీర్లు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు చెవికెక్కలేదు. ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే.. కమీషన్లకు కక్కుర్తి పడి, అధికార బలంతో రూ.1,638 కోట్ల ప్రజల సొమ్ము గోదావరిపాలు చేశారు. అనుమతులు తీసుకోకుండానే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం, రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై ఎన్జీటీ, న్యాయస్థానాలు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయరాదంటూ ఎన్జీటీ తాజాగా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. బలవంతపు భూసేకరణ.. అక్రమ కేసులు వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆద్యంతం వివాదాస్పదంగానే జరిగింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూ పరిధిలో భూములకు పరిహారం తక్కువని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని 70 ఎకరాలకు చెందిన 85 మంది రైతులు అప్పట్లో డిమాండ్ చేశారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు క్రిమినల్ కేసులు పెట్టి, బలవంతంగా నాటి ప్రభుత్వం భూములు తీసుకుంది. దీనిపై 30 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి న్యాయ పోరాటానికి మద్దతుగా ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అప్పట్లో ఆమరణ దీక్ష కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జక్కంపూడి రాజా పురుషోత్తపట్నం రైతుల సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై చంద్రబాబు సర్కార్ పెట్టిన అక్రమ కేసులను ఇటీవల ఎత్తివేయించారు. దీంతో ఆ రైతులకు ఉపశమనం లభించింది. ‘ఏలేరు’లో సమృద్ధిగా జలాలు ఏలేరు రిజర్వాయర్ కింద ఖరీఫ్‌లో 60 వేలు, రబీలో 40 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఒక టీఎంసీ జలాలతో 10 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 12.21 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ఆయకట్టుకు ఎటువంటి ఢోకా లేదు. సీజన్ ప్రారంభంలోనే సమృద్ధిగా నిల్వలుంటే వర్షాలు విస్తారంగా పడితే ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ– రామవరం లిఫ్ట్‌తో సంబంధం లేకుండానే ఏలేరు ఆయకట్టులో రెండు పంటలకూ సమృద్ధిగా నీరందుతోంది. ఇటువంటి ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని ఎత్తి పోస్తామని నమ్మబలికి, రైతుల పేరుతో పురుషోత్తపట్నం పథకాన్ని తీసుకువచ్చి, కమీషన్ల రూపంలో రూ.కోట్లు కొట్టేశారని మెట్ట ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టు రైతులపై ప్రేమ కంటే కమీషన్ల పై యావ ఎక్కువయ్యే చంద్రబాబు అండ్ కో ఇలా చేశారని రైతు ప్రతినిధులు విమర్శిస్తున్నారు. రామవరం లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా రామవరం వద్ద రెండో లిఫ్ట్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఏలేరు ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేశారు. రామవరం పంపు హౌస్‌కు మూడు కిలోమీటర్లు దూరాన కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం, ఏలేరు కాలువలు క్రాస్ అవుతున్నాయి. రెండో దశ లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండానే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని ఏలేరు ప్రధాన కాలువలోకి మళ్లించవచ్చు. అలా చేసే అవకాశం ఉన్నప్పటికీ రెండో దశ లిఫ్ట్ పేరుతో రూ.500 కోట్లు వృథా చేశారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. నీటి విడుదలకు ఎన్జీటీ ‘నో’ అనుమతులు లేకుండానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నారంటూ ప్రారంభంలోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా దీని నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం, పర్యావరణ అనుమతి, కేంద్ర జలసంఘం నుంచి అనుమతి వచ్చే వరకూ ‘పురుషోత్తపట్నం’ నుంచి నీటి విడుదలను నిలుపు చేయాలని తాజాగా ఆదేశించింది. కీలకమైన ఈ అనుమతులేవీ తీసుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతల పథకం చేపట్టి ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేశారని రైతులు దుయ్యబడుతున్నారు. కేసులు పెట్టి వేధించారు పురుషోత్తపట్నం పథకంలో నేను 4.32 ఎకరాలు కోల్పోయాను. నా అనుమతి లేకుండా, సంతకం చేయకపోయినా భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. భార్యతో సహా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయతి్నస్తే పోలీసులు అడ్డుకుని, ఇంటిలోనే బంధించారు. నా అంగీకారం లేకుండానే క్రిమినల్ కేసులు పెట్టి మరీ భూమిని బలవంతంగా తీసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను రద్దు చేసింది. – కరుటూరి శ్రీనివాస్, రైతు,రామచంద్రపురం,సీతానగరం మండలం జక్కంపూడి కృషితో కేసులు ఎత్తేశారు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని అడిగాం. ఆ చట్టం ప్రకారం ఎకరాకు రూ.39 లక్షలు వస్తుంది. అలా పరిహారం చెల్లించకుండా పోలీసు బందోబస్తుతో బలవంతంగా భూముల్ని లాగేసుకుని మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా మాపై ఉన్న కేసులను ఎత్తేశారు. కేసులు ఎత్తివేసినట్టే పరిహారం విషయంలో కూడా ఆదుకుంటారనే నమ్మకంతో ఉన్నాం. – ఐఎస్ఎన్ రాజు, చినకొండేపూడి, సీతానగరం మండలం ‘పురుషోత్తపట్నం’లో ‘బాబు’ లూటీ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో చంద్రబాబు అండ్ కో రూ.కోట్లు లూటీ చేసింది. రూ.1,638 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసినా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని పరిస్థితి చంద్రబాబు నిర్వాకంతోనే ఏర్పడింది. ఆయనకు కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడంలో లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చినా లెక్క చేయలేదు. దానికి అభ్యంతరాలు ఎదురైనా ఇక్కడ పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి హడావుడిగా పూర్తి చేసి, కమీషన్లు నొక్కేశారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకపోగా, తిరిగి వారిపై అక్రమంగా కేసులు పెట్టి బలవంతంగా భూములు లాగేసుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి రైతులపై కేసులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అవసరం లేదన్న నిపుణుల సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టి ప్రజల సొమ్మును దుబారా చేశారు. పోలవరం యుద్ధప్రాతిపదికన జరుగుతోందని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో భాగంగానే దీనిని చేపడుతున్నామని అప్పట్లో చెప్పారు. దీనిలో ఆంతర్యమేమిటి? – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం -
అభివృద్ధి పనులపై సీఎం ఆరా
సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో అభివృద్ధి పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈనెలలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి్ద పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కడప స్టీలు ప్లాంటు,కుందూ– తెలుగుగంగ ఎత్తిపోతల పథకంతోపాటు పలు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం జిల్లా వెళ్లేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం కడప విమానాశ్రయంలో దిగారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ కలుసుకున్నారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈనెల 23,24,25 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న శంకుస్థాపనలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్,భారీ నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాలశాఖ, ఏపీ టూరిజం విభాగంతో పాటు పలు శాఖలకు సంబంధించి 15 జీఓలు విడుదల కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్ సీఎం దృష్టికి తెచ్చారు. జీఓలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి్ద పనులపై వారంలోగా విజయవాడలో సమీక్ష నిర్వహిద్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. పులివెందుల అభివృద్ధి్ద పనులపై అక్కడిప్రత్యేక అధికారితో చర్చించి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పనులు సకాలంలో జరిగేలా చూడాలని ఆయన కలెక్టరుకు సూచించినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు వెళ్లిన సీఎం కడప రూరల్: ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయంలో దిగారు. ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా వెంట వచ్చారు. విమానాశ్రయంలో సీఎంకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డా. సుధీర్‌రెడ్డి,డా. వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె. సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ గౌతమి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కొద్దిసేపు అధికారులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.29 గంటలకు హెలికాప్టర్లో సీఎం అనంతపురం జిల్లాకు బయలుదేరారు. అక్కడ వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతదేహాన్ని సందర్శించాక తిరిగి 4.39 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. 4.45 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాసీమ బాబు, గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల తొలిదశలో పూర్తిస్థాయి ఎత్తిపోతల ఆరంభమైంది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు ఉన్న అన్ని పంప్‌హౌస్‌లలో మోటార్లు తిరగడం మొదలైంది. రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం.. మిడ్‌మానేరు నింపుతుండటంతో ఎల్లంపల్లి ఖాళీ అవుతుండటంతో కాళేశ్వరం ద్వారా లభ్యతగా ఉన్న గోదావరి వరద నీటినంతా ఒడిసిపట్టేలా లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) మోటార్లను నడిపిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి దాని దిగువన సిద్దిపేట జిల్లాలో ఉన్న రెండు రిజర్వాయర్లకు నీటిని డిసెంబర్ నుంచి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేట్లు క్లోజ్.. మోటార్లు ఆన్.. కాళేశ్వరంలో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి వరద మొన్నటి వరకు లక్ష క్యూసెక్కుల వరకు నమోదైంది. వర్షాకాల సీజన్లో మేడిగడ్డను దాటుకుంటూ కనిష్టంగా వెయ్యి టీఎంసీల నీరు దిగువకు వెళ్లిపోయింది. అయితే విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మిడ్‌మానేరు కట్టలో లోపాల కారణంగా ఎత్తిపోతల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం మిడ్‌మానేరు సిద్ధంకావడంతో ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నీటి ఎత్తిపోతల ఆరంభమైంది. ఇక్కడి 5 మోటార్ల ద్వారా రోజుకు 1.5 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. దీంతో ఎల్లంపల్లిలో నిల్వ 20 టీఎంసీలకుగానూ 7.5 టీఎంసీలకు చేరగా, మిడ్‌మానేరులో నిల్వ 25.87 టీఎంసీలకు గానూ 16 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి ఖాళీ అవుతుండటంతో ఎగువన ఉన్న మూడు పంప్‌హౌస్‌ల మోటార్లను ఆన్ చేశారు. దీనికోసం మేడిగడ్డ బ్యారేజీలో నిల్వలు పెంచేందుకు గేట్లన్నింటినీ మూసివేశారు. ప్రస్తుతం గోదావరిలో 20వేల క్యూసెక్కుల వరద ఉండగా, దానిని అడ్డుకుంటున్నారు. దీంతో నిల్వలు పెరగనున్నాయి. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 4 మోటార్లు ఆన్ చేసి 8,400 క్యూసెక్కుల నీటిని అన్నారం పంపుతున్నారు. అక్కడి నాలుగు మోటార్ల ద్వారా సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ప్రస్తుతం పంపింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ గోదావరి వరద ఉన్నన్ని రోజులు నిరంతరాయంగా కొనసాగనుంది. మిడ్‌మానేరు కిందికి తీసుకెళ్లే యత్నాలు మిడ్‌మానేరులోకి ఎత్తిపోతలు సాగుతుండటంతో అక్కడి నుంచి లోయర్ మానేరుకు నీటిని తరలించనున్నారు. లోయర్ మానేరులో నీటిని పూర్తి స్థాయిలో నింపిన అనంతరం మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10, 11, 12ల పరిధిలోని అనంతగిరి, రంగనాయక్సాగర్ల రిజర్వాయర్లను నింపనున్నారు. ఈ ప్యాకేజీల పరిధిలో ఉన్న నాలుగేసి మోటార్లకు డిసెంబర్లో వెట్‌రన్ పూర్తి చేసిన అనంతరం కొత్త ఏడాదిలో కొండపోచమ్మ వరకు నీటిని తరలించే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు వెల్లడించాయి. -
కుందూ‘లిఫ్ట్’.. రైతులకు గిఫ్ట్
బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి ప్రాణాధారమైన బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు నీటి గలగలలు కరువయ్యాయి. నీరొస్తే పండించుకోవచ్చనే అన్నదాత ఆశ నెరవేరడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, శ్రీశైలం నుంచిఅవసరమైన స్థాయిలో నీటి విడుదల లేకపోవడంతో ప్రాజెక్టు ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 17 టీఎంసీలు అయినా నాలుగేళ్లుగా కనీసం సగం స్థాయిలో కూడా నీరు చేరడం లేదు. చెంతనే ప్రాజెక్టు ఉన్నా సాగు మాత్రం సున్నా అన్నట్లు రైతుల పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుందూ నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఆయన ప్రకటన ఈ ప్రాంత రైతులకెంతో ఆనందం కలిగించింది సాక్షి, బద్వేలు : జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో సాగు, తాగునీటి ఇక్కట్లు దశాబ్దాల తరబడి ఉన్నాయి. వీటిని గమనించి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుపై తదుపరి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఎట్టకేలకు 1995లో డ్యాం నిర్మాణం పూర్తయింది. చంద్రబాబు హయాంలో కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో రైతులకు నీరు అందని పరిస్థితి. రెండు పర్యాయాలు ఆయన సీఎం అయినా జిల్లాపై శీతకన్ను వేయడంతో అన్నదాతల అవస్థలు తీరలేదు. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఎన్నో పర్యాయాలు ఆయన్ను కలిసి బ్రహ్మంసాగర్‌ను పూర్తి చేయాలని కోరినా ప్రయోజనం మాత్రం సున్నా. దీనిపై మాజీ మంత్రి వీరారెడ్డి కూడా పలుమార్లు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో సీఎం కాగానే ఆయన మొదటి బడ్జెట్లోనే రూ.450 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సబ్సిడీ రిజర్వాయర్–1, సబ్సిడీ రిజర్వాయర్–2లతో పాటు ఎడమకాలువ, కుడి కాలువ నిర్మాణాలను పూర్తి చేశారు. కేవలం 15 నెలల వ్యవధిలో ఈ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఇందుకు గాను కంట్రాక్టరుతో కూడా ప్రతివారం సమీక్ష నిర్వహించారు. 2006 సెప్టెంబరులో సోనియాగాంధీతో ప్రాజెక్టును ప్రారంభించి నీటిని విడుదల చేయించారు. ఆనందంలో రైతులు బ్రహ్మంసాగర్ పూర్తయితే 1.50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. వైఎస్ ప్రాజెక్టు పూర్తి చేయడంతో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందింది. సబ్సిడి రిజర్వాయర్–1, సబ్సిడి రిజర్వాయర్–2 పూర్తి చేసి వాటిలో 4.50 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఈ నీటితో దువ్వూరు, మైదుకూరు మండలాల్లో 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి,కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లోని 1.20 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. శ్రీశైలం నుంచి బ్రహ్మంసాగర్‌కు తెలుగుగంగ జలాలను కాలువల ద్వారా అందిస్తారు. వైఎస్ పాలనాకాలంలో 2007లో ఒక్క పర్యాయమే 13.48 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ చేశారు. 2008లో 11.56 టీఎంసీలు, 2011లో 11.834, 2012లో 9.835, మరోసారి 12 టీఎంసీల నీటిని ప్రాజెక్టులోకి తీసుకురాగలిగారు. తదుపరి ఏడెనిమిదేళ్లుగా ఐదారు టీఎంసీలకే పరిమితం. 2018లో 4.482, 2017 6.49 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణాజలాలు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. డీసీ గోవిందరెడ్డి ఆకుంఠిత కృషి నాడు వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న డీసీ గోవిందరెడ్డి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పూర్తిలో కొంతమేర కృషి చేశారు. వైఎస్‌కు విన్నవించగా ఆయన తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. కానీ ప్రాజెక్టు నిర్మించినా నికరజలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమీపంలో ఉన్న కుందూ నది నుంచి వరద జలాలు వృథాగా పోతున్నాయని, వీటిని వినియోగించుకుంటే కొంత మేర ఇబ్బందులు తప్పుతాయని గ్రహించారు. ఇదే విషయాన్ని ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాసంకల్పయాత్రలో దువ్వూరు వద్ద రైతులు కూడా జగన్‌ను కలిసి విన్నవించారు. కుందూ నది నుంచి వృథాగా పోతున్న వరదనీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బ్రహ్మంసాగర్లోకి ఎత్తి పోయడం ద్వారా కొంతైనా నీటి ఇక్కట్లు తీరతాయి. జగన్ అధికారం చేపట్టగానే నాటి సంకల్పయాత్రలో విన్నపాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామని సోమవారం జమ్మలమడుగులో జరిగిన రైతు సదస్సులో ప్రకటించారు. దీంతో నియోజకవర్గ రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్ది ఆపరభగీరథుడికి ప్రతిరూపం. ఆయన చొరవతోనే బ్రహ్మంసాగర్ పూర్తయింది. రైతుల రెండు దశాబ్దాల కల నెరవేరింది. ఆయనకు తగ్గ కుమారుడిగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతుల దుస్థితి గమనించి కుందూ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం. ప్రాజెక్టు పూర్తయిన పదేళ్లకు... 1995లో డ్యాం నిర్మాణం పూర్తయినా రైతులకు నీళ్లు మాత్రం అందలేదు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో రైతులు ఆశలు నెరవేరలేదు. వైఎస్ సీఎం కాగానే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఆయనకు రైతులపై ఉన్న ప్రేమ అంతులేనిది. ఆయన మాదిరే జగన్ కూడా అపరభగీర«థుడిగా పేరు తెచ్చుకుంటారు. -
‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశించింది. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు లో దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును నాగం ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వం లోని ధర్మాసనం వద్దకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960.79 కోట్లుగా మదించగా.. తెలంగాణ ప్రభుత్వం బీహెచ్ఈఎల్, మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కుమ్మక్కై అంచనాలను రూ.8,386 కోట్లకు పెంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్లు నష్టం వాటిల్లింది. మోటారు పంపుసెట్లకు అధిక రేటు చూపి, యంత్రాలు డిజైన్ చేసి సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ కంటే అదనంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెల్లించారు. ప్యాకేజీ–5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటారుకు రూ.87 కోట్లుగా లెక్కించి 9 మోటారు పంపుసెట్లకు రూ.179 కోట్ల చొప్పున రూ.1,611 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెల్లింపుల బ్రేకప్‌లో మాత్రం బీహెచ్ఈఎల్కు రూ.803 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.808 కోట్లను మెఘా సంస్థకు చూపారు. వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమే. ఇక సివిల్ పనులకు మరో రూ.1,459 కోట్లు ఖర్చుగా చూపారు. అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు అదనంగా వెచ్చించారు. ఇక్కడ సివిల్ పనులు చూడాల్సిన మెఘా సంస్థ ఈ రూ.1,459 కోట్లు పొందడమే కాకుండా.. ప్యాకేజీ–5 మొత్తం ఈసీవీ విలువైన రూ.4,018 కోట్లలో మిగిలిన రూ.2,558 కోట్ల నుంచి కూడా తీసుకుంది. వీటిలో బీహెచ్ఈల్కు రూ.803 కోట్లు చెల్లించింది. ఇదే తరహాలో ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలకు ఎక్కువ వ్యయా న్ని చూపడం ద్వారా నవయుగ సంస్థకు కూడా లబ్ధి చేకూర్చారు. ప్యాకేజీ 1, 16లలో బీహెచ్ఈఎల్–మెఘా సంస్థ 145 మెగావాట్ల మోటారుకు రూ.38 కోట్లు కోట్ చేసింది. నవయుగ సంస్థ రూ.40 కోట్లకు కోట్ చేసింది. కానీ ప్రభుత్వం 145 మెగావాట్ల మోటారుకు రెండు సంస్థలకు రూ.87 కోట్లు ఆమోదించింది. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచింది. వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా హైకోర్టు వీటిని విస్మరించింది’ అని వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.. పాలమూరు అంశంపై పిటిషనర్ 4 పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండింటిని కొట్టేసిందని, మరో రెండు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు ఎక్కువ వ్యయం కావడంలో ఆశ్చర్యం లేదని, ఆ ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆరోపణలను తోసిపుచ్చిందని వివరించారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘మీ వాదనలు కూడా వింటాం. అంకెలు చూస్తుంటే అసాధారణ రీతిలో ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. మీరు కరెక్టే కావచ్చు. కానీ ఈ కేసును మేం విచారిస్తాం’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్ రోహత్గీ బదులిస్తూ ‘హైకోర్టు ఈ అంశాలను కొట్టివేసింది’ అని నివేదించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందించారు. ‘హైకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ అంకెలు అసాధారణ రీతిలో ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించలేదు’ అని జస్టిస్ పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ బీహెచ్ఈఎల్ సంస్థ తాను సరఫరా చేసిన పంపుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతో పాటు సివిల్ పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యం లో కేసును ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
గిరమ్మ ఆత్మఘోష
సాక్షి, ద్వారకాతిరుమల : గిరమ్మ ఎత్తిపోతల పథకం ఆత్మ ఘోషిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు చుక్క నీరందించలేకపోయానని ఆవేదన చెందుతోంది. ఆ పాపం పాలకులదేనని గిరమ్మ చెప్పలేకపోయినా, బాధిత రైతులు మాత్రం గొంతెత్తి చాటుతున్నారు. పాలకుల నిర్లక్ష్యమే పథకానికి శాపమని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని గిరమ్మ చెరువు నీటిని ఎత్తిపోతల ద్వారా 7 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2003 నవంబర్ 12న అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబే అయినా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పంప్ హౌస్, పైప్‌లైన్, కాలువ నిర్మాణ పనులన్నీ జరిగాయి. 2010 ఆగస్టులో పథకానికి ట్రైల్ రన్ కూడా వేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో పథకం పనులు అటకెక్కాయి. ఇదిలా ఉంటే కాలువ నిర్మాణానికి భూములు ఇవ్వమంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకంపై నిర్లక్ష్యం వహించడంతో దాదాపు రూ.8 కోట్లు ఖర్చుతో చేసిన పనులు నిరుపయోగంగా మారాయి. ఇదిలా ఉంటే కోర్టును ఆశ్రయించిన రైతులు ఇటీవల భూములివ్వడంతో కాలువ తవ్వకం పనులు పూర్తిచేసిన అధికారులు ట్రైల్‌రన్ కూడా వేశారు. అయితే ఈస్టు యడవల్లి–దొరసానిపాడు గ్రామాల మధ్య సుమారు 3 కిలోమీటర్లు మేర కాలువకు బదులు నిర్మించిన అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ నీటి ఒత్తిడి తట్టుకోలేక, ధ్వంసం కావడంతో పథకం మళ్లీ మూలకు చేరింది. 7 వేల ఎకరాలకు.. ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న దాదాపు 7 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందించవచ్చు. ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లి, మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, దొరసానిపాడు, కామవరపుకోట మండలంలోని ఈస్టు యడవల్లి, వెంకటాపురం, తాడిచర్ల తదితర ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే పథకం శంకుస్థాపన జరిగి 15 ఏళ్లు గడిచినా వినియోగంలోకి రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పథకం : గిరమ్మ ఎత్తిపోతల పథకం ప్రాంతం : సీహెచ్ పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం శంకుస్థాపన : 2003 నవంబర్ 12 వ్యయం : రూ.8 కోట్లు సాగు లక్ష్యం : 7 వేల ఎకరాలు పూడుకుపోతున్న కాలువ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు 2003లో టీడీపీ హయాంలో ప్రారంభమైన గిరమ్మ ఎత్తిపోతల పథకం ఇప్పటివరకు రైతులకు అక్కరకు రాలేదు. పథకాన్ని దాదాపుగా పూర్తిచేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కింది. కొద్దిపాటి పనులు పూర్తిచేస్తే పథకం పూర్తవుతుంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నేతలు దీనిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. ఇటీవల ద్వారకాతిరుమల మండలంలో జరిగిన ప్రజాసంకల్పయాత్రలో గిరమ్మ పథకం గురించి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించాం – యాచమనేని నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, సీహెచ్ పోతేపల్లి కాలువలు పూడుకుపోతున్నాయ్ గిరమ్మ ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్విన కాలువలు పలు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. మరికొంత మేర పూడుకుపోయి కాలువ వెడల్పు తగ్గిపోయాయి. ఇంకా ఆలస్యమైతే కాలువ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 2003లో పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉన్నా దీనిపై దృష్టి సారించలేదు. కాలువలు, పంప్‌హౌస్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – బసివిరెడ్డి వెంకటరామయ్య, రైతు -
‘గట్టు’ ఎత్తిపోతల చేపట్టి తీరుతాం
గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా రైతులకు వరప్రదాయినిగా మారనున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయడం ద్వారా గట్టు బీడుభూములకు సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. గట్టు, సోంపురంలో రూ.4.5 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు సోమవారం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రూ.32 లక్షలతో నిర్మించిన మండల మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గట్టు ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ, 0.6 టీఎంసీలకు బదులు 4టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆగస్టు 15 నాటికి సాగునీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డలో సాగునీటి కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఇన్చార్జ్ అబ్రహాం, ఎంపీపీ సునీతమ్మ, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు నన్నేసాబ్, ఎంపీటీసీలు అలేఖ్య, నాగవేణి, నాయకులు బల్గెర నారాయణరెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, మహబూబ్అలీ, హనుమంతు, రామకృష్ణారెడ్డి, మహానందిరెడ్డి, నీలకంఠం, శ్రీనాథ్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, బజారి, వెంకటేష్ పాల్గొన్నారు. -
జూరాల నుంచే ‘గట్టు’కు ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం స్వరూపం మారే అవకాశం కనిపిస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించారు. అయితే ప్రస్తుతం నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచే నీటిని తీసుకునేందుకు యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునే సాధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత నెల 29న శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టనుండగా, తొలి విడతను రూ.459.05కోట్లు, రెండో విడతను రూ.94.93కోట్లతో చేపట్టనున్నారు. అయితే గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడు రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడినుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచకలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడుకు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని ఇటీవల సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. పెరగనున్న వ్యయం! జూరాల ఫోర్‌షోర్, గట్టుకు మధ్య ఉన్న దూరం, మధ్యలో ఉన్న ఆటంకాలు, పెరిగే వ్యయ అంచనాలపై అధికారులు అధ్యయనం మొదలు పెట్టారు. జూరాల నుంచి గట్టుకు నీటి తరలించాలంటే మధ్యలో పెద్ద పెద్ద గుట్టలను దాటాల్సి ఉంటుందని, దానికోసం టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో వ్యయం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తి అధ్యయనం తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడిస్తున్నారు. -
ప్యాకేజీ–8.. సవాళ్లూ ‘భారీ’వే!
భూమికి 333 మీటర్ల లోతున ఓ పెద్ద షాపింగ్ మాల్ ఉంటే..! ఇది అంతకంటే భారీ నిర్మాణమే. 65 మీటర్ల ఎత్తయిన రాతి ట్యాంక్. సొరంగం ద్వారా నీరు ఆ ట్యాంక్‌లోకి చేరుతుంది. అక్కడి నుంచి అత్యంత భారీ పంపులు, మోటార్ల సాయంతో దాదాపు 117 మీటర్ల పైకి వస్తాయి. వీటిని ఆపరేట్ చేయటానికి ఆ భూగర్భంలోనే భారీ నాలుగంతస్తుల సముదాయమూ ఉంది. క్లుప్తంగా... కాళేశ్వరం ప్యాకేజీ–8 ఇదే. ‘సర్జ్ పూల్’గా పిలుస్తున్న ఆ ట్యాంక్‌లు మూడున్నాయి. వీటిలో 2 కోట్ల లీటర్ల నీళ్లు నిల్వ ఉంటాయి. పలు ఇంజనీరింగ్ విశిష్టతలతో రాష్ట్రానికి చెందిన మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) చేపడుతున్న ఈ ప్రాజెక్టును సోమవారం రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు సందర్శించారు. మోటార్లు, పంప్‌లు, ఇతర పరికరాలు సరఫరా చేసిన భెల్, నిర్మాణం చేపట్టిన ‘మేఘ’ సంస్థలు ప్రాజెక్టు విశేషాల్ని ఈ సందర్భంగా వివరించాయి. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా రామడుగు వద్ద నిర్మిస్తున్న భారీ భూగర్భ టన్నెల్, అక్కడే నిర్మించిన సర్జ్‌పూల్‌లు... వీటిలోని నీటిని పంప్ చేసేందుకు 139 మెగావాట్ల చొప్పున ఏర్పాటవుతున్న 7 పంప్‌లు... 600 టన్నుల బరువుండే మోటార్లు... ఇవన్నీ ఇతర ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోనూ కనిపించకపోవచ్చు. ఈ ఏడు పంపుల ద్వారా ఏక కాలంలో 21 వేల క్యూసెక్కుల నీటిని పంప్ చేయొచ్చు కూడా. 24 గంటలూ పనులు జరుగుతున్నాయని, జాప్యం నివారించడానికి... కీలక ఎలక్ట్రో–మెకానికల్ పరికరాల్ని ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో తెప్పిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి చెప్పారు. మోటార్లను భోపాల్‌లో తయారు చేశామని, షాఫ్ట్‌లు, పంప్‌లు కూడా ఆలస్యం లేకుండా అందిస్తున్నామని ‘భెల్’ సాంకేతిక సలహాదారు నరేంద్ర కుమార్ తెలియజేశారు. ‘‘భెల్ సరఫరాల్ని జాప్యం లేకుండా తెచ్చి కమిషన్ చేయటానికి మా పాతికేళ్ల ఇంజనీరింగ్ అనుభవం పనికొస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్నో సవాళ్లు విసిరింది. వాటిని ఛేదించుకుంటూ వచ్చాం. సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా 600 టన్నుల బరువుండే మోటార్లను భూగర్భంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చినా వెనకాడలేదు. 85 శాతం పని పూర్తయింది. మిగిలింది 4 నెలల్లో చేస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ ఒక్క ప్యాకేజీ–8 విలువే దాదాపు రూ.4,700 కోట్లు!!. లింక్–2 ఈపీసీ... లింక్–1 బీఓక్యూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 80 వేల కోట్లు. వీటిలో దాదాపు 50 శాతం పనుల్ని మేఘ దక్కించుకుంది. ఏడు లింకులుగా విభజించిన ఈ పనుల్లో... లింక్–2 పనుల్ని ఈపీసీ పద్ధతిలో, లింక్–1 బీఓక్యూ పద్ధతిలో చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు రేటు ముందే నిర్ణయమవుతుంది. బీఓక్యూలో చేస్తున్న పనులకు తగ్గ బిల్లుల్ని ప్రభుత్వం చెల్లిస్తుంటుంది. ‘‘లింక్–1లో మేం 3 లిఫ్ట్‌లు చేపట్టాం. ఇందులో ప్యాకేజీ–8లోని భూగర్భ పంప్‌హౌస్‌తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు ఓపెన్ పంప్‌హౌస్‌ల నిర్మాణం కూడా ఉంది. అన్నీ 80–85 శాతం వరకూ పూర్తయ్యాయి. లింక్–2లో ప్యాకేజీ–6 పనులే చేపట్టాం. ఇక్కడ మరో నాలుగు నెలల్లో 7 పంపుల ఏర్పాటూ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. కావాల్సిన నిధుల్ని అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్నామన్నారు. నిధుల కొరత లేదని, ఇప్పటికైతే పబ్లిక్ ఇష్యూకు వెళ్లే ఆలోచన కూడా లేదని చెప్పారాయన. భవిష్యత్తులో ఆ అవకాశాల్ని కొట్టి పారేయలేమన్నారు. తమ సంస్థకు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్... ఏప్లస్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘మా ఆర్డర్‌బుక్ రూ.60వేల కోట్లుంది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.8 వేల కోట్ల ఆర్డర్లు కొత్తగా వచ్చాయి. ఇక 2017–18లో టర్నోవర్ 50% వృద్ధి చెంది 3 బిలియన్ డాలర్లకు చేరింది’’ అన్నారాయన. ఇన్ఫ్రాతో పాటు గ్యాస్ సరఫరా, విద్యుత్, విమానయాన రంగాల్లోనూ తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాం. 2017–18 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 70 ప్రాజెక్టులు పూర్తి చేశాం’’ అని వివరించారు. ఇవీ... సర్జ్‌పూల్ విశేషాలు 333 మీటర్ల లోతున భూగర్భంలో 65 మీటర్ల ఎత్తులో భారీ ట్యాంక్‌లా ఉండే ఈ పూల్ పూర్తిగా ఆటోమేషన్తో పనిచేస్తుంది. సర్జ్‌పూల్‌లో చేరిన నీటిని తోడి... పూల్ వెనకాల 90 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసిన 117 మీటర్ల ఎత్తయిన పంప్‌ల ద్వారా పైనుండే పాండ్‌లోకి పంప్ చేస్తారు.పంప్ ట్రిప్ అయినపుడు నీరు వెనక్కొచ్చి సర్జ్‌పూల్‌లో నీటి స్థాయి పెరిగి, ఆటోమేషన్ విభాగం మునిగిపోయే ప్రమాదముంది. అందుకే... ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ 3 పూల్స్ నిర్మించారు. వాటిలోకి నీరు సర్దుకుంటుంది. ప్రాజెక్టును చాన్నాళ్ల క్రితమే చేపట్టినా... ఈ పనులన్నీ మూడున్నరేళ్లలోనే చేసినట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వీటి పనితీరును నీరు లేకుండా ఇప్పటికే పరీక్షించామని, మరో రెండున్నర నెలల్లో నీటితో పరీక్షిస్తామని చెప్పారు. ఈ విద్యుత్ కోసం బయట 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. - (మంథా రమణమూర్తి) -
ఉప్పుతిప్పలు
యలమంచిలి : పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఉప్పునీరువల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కారణం ఏమిటంటే.. పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 2,088 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ పొలాలకు నక్కల డ్రెయిన్ నీటిని చించినాడ కాల్వలోకి తోడి పంట చేలకు ఇస్తున్నారు. అయితే నక్కల డ్రెయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంతో పంటలు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనిపై గత డిసెంబర్లోనే దాళ్వాకు నక్కల డ్రెయిన్ నీటిని ఎత్తిపోయవద్దని అధికారులను వేడుకున్నారు. డిసెంబర్ 27న పెనుమర్రు ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చిన నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి తమ గోడు విన్నవించుకున్నారు. రూ.కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నీరు తమకు వద్దని రైతులు స్పష్టం చేశారు. దీనిపై ఆయన రైతులను ప్రశ్నించగా, నక్కల డ్రయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా చేలకు తోడితే పైరు చౌడు బారిపోతుందని చెప్పారు. దిగుబడీ గణనీయంగా తగ్గుతుందన్నారు. దీంతో ఆయన నక్కల డ్రెయిన్‌లోని నీటిని పరీక్ష చేయించగా 0.8 శాతం ఉప్పు సాంద్రత ఉన్నట్టు నివేదిక వచ్చింది. దీనిపై వ్యవసాయ అధికారి జాన్సన్‌ను పిలిచి వరి సాగుకు ఎంత ఉప్పు శాతం ఉండవచ్చునని అడగ్గా 4 శాతం వరకూ ఉండవచ్చని చెప్పారు. దీంతో గాంధీ జనవరి 10వ తేదీ వరకు దమ్ములు పూర్తి కావడానికి మాత్రమే ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తోడతామని రైతులకు చెప్పారు. ప్రస్తుతం 0.8 శాతం మాత్రమే ఉప్పు ఉంది కాబట్టి పరీక్ష యంత్రాన్ని నీటి సంఘ అధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు వద్ద ఉంచుతామని, జనవరి 10 లోపు ఎప్పుడు రెండు శాతానికి మించి ఉప్పు వచ్చినా వెంటనే మోటార్లు ఆపివేస్తామని హామీనిచ్చారు. అక్కడి నుంచి మార్చి 31వ తేదీ వరకు పంటకాల్వ నీరే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఆ హామీలు అమలు కాలేదు. మార్చి వచ్చినా ఎత్తిపోతల నీటినే తోడుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వడం వలన రైతులు నష్టాలపాలవుతున్నారు. అందుకే నారుమడలు వేయకుండానే సాగు చేయలేమని చెప్పారు. సాక్షాత్తు సబ్ కలెక్టర్ వచ్చి దమ్ముల వరకే ఎత్తిపోతల పథకం నీరు తోడతామని, మార్చి నెలాఖరు వరకు కాల్వ నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నమ్మి సాగుచేసి మోసపోయారు. – తోటకూర వెంకట్రామరాజు, మాజీ సర్పంచ్, పెనుమర్రు నక్కల డ్రెయిన్‌లో 5శాతం ఉప్పు ఉంది పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టులో రావిపాడు, పెనుమర్రు, మేడపాడు, యలమంచిలి, కట్టుపాలెం, శిరగాలపల్లి గ్రామాలలో 2,088 ఎకరాలు సాగవుతోంది. నక్కల డ్రెయిన్ నీటిలో 5 శాతం ఉప్పు ఉంది. ఆ నీటిని పంట చేలకు పెడితే గింజలన్నీ చౌడుబారి పోయి రైతులు నష్టపోతారు. కాల్వ నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల నుంచి నీరు తోడవద్దని రైతులు ఎంత మొత్తుకుంటున్నా అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యంలా ఉన్నాయి. – పాకా సూర్యనారాయణ, రైతు -
ఇన్నాళ్లకు గుర్తొచ్చె.. నిర్మాణ వ్యయానికి రెక్కలొచ్చె..
కొవ్వూరు: తాడిపూడి ఎత్తిపోతల పథకంపై సర్కారు సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోంది. కృష్ణా జిల్లాకు నీళ్లు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం తాడిపూడిని విస్మరించింది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన ఈ పథకంను పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపయ్యింది. ఈ పథకం నిర్మాణ వ్యయం మొదట్లో రూ.467.70 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పుడు ఆ వ్యయం కాస్తా రూ.885.53 కోట్లకు పెరిగింది. ఇటీవలే ప్రభుత్వం అదనపు అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సుమారు రూ.417.83 కోట్ల వ్యయం అదనంగా పెరిగింది. చంద్రబాబు ప్రారంభించారు.. వైఎస్ పూర్తి చేశారు 2003 నవంబర్ 12న అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు ఈ పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేశారు. 2007 అక్టోబర్ 25న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించారు. అయితే చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించాలని చేపట్టిన భూ సేకరణలో సమస్యలు ఎదురయ్యాయి. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఈ పథకంపై కన్నెత్తి చూడకపోవడం విశేషం. అసంపూర్తి పనులు పూర్తయితే.. తాళ్లపూడి మండలంలోని తాడిపూడిలో ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పథకం వల్ల తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల తదితర మండలాల్లోని 2,06,600 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది లక్ష్యం. వైఎస్ చలవ వల్ల ఈ పథకం ద్వారా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1,57,454 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వాస్తవానికి లక్ష ఎకరాలు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. తాడిపూడి వద్ద గోదావరి జలాలను ఎత్తిపోసి కాలువల ద్వారా సుమారు 74 కిలోమీటర్ల దూరంలోని నల్లజర్ల మండలంలోని పొలాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తిగానే నిలిచిపోయింది. ఇంకా మెయిన్ కెనాల్‌పై 154 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీటిలో 141కి పూర్తి చేశారు. 31 పంపిణీ కాలువలు పూర్తి చేయాల్సి ఉండగా 29 పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా రెండు పంపిణీ కాలువలు తవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఐదు సబ్లిఫ్ట్లుంటే మొదటి సబ్ సబ్ లిఫ్ట్ పూర్తి చేశారు. 2, 3, 4, సబ్లిఫ్ట్లతో పాటు ఐదు సబ్లిఫ్ట్లో కొన్ని చోట్ల అసంపూర్తి పనులు ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70 పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐదో సబ్‌లిఫ్ట్ ద్వారా 12,915 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా గత ఏడాది నాలుగు వేల ఎకరాలకు నీరు అందించారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే తప్ప ఆయకట్టు అంతటికీ సాగునీరు అందే పరిస్థితి లేదు. 420 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని నిమిత్తం రూ.80 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో అంచనా వ్యయం రెట్టింపు ముడుపుల కోసం, పర్సంటేజీల కోసమే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించింది. తాడిపూడిని మూడున్నరేళ్లుగా విస్మరించింది. స్వయంగా చంద్రబాబే శంకుస్థాపన చేసిన పథకం ఇన్నాళ్లకు ఆయనకు గుర్తుకు రావడం శోఛనీయం. అసంపూర్తి పనులను అధికారంలోకి రాగానే పూర్తి చేసి ఉంటే అంచనా వ్యయం పెరిగేది కాదు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా అంచనా వ్యయం రెట్టింపైంది. ఇప్పటికైనా అసంపూర్తి పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకూ సాగునీరు అందించాలి. –తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్, కొవ్వూరు -
పాలమూరు ప్రాజెక్టును నిలిపేస్తాం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పూర్తికాని భూసేకరణ.. మరోవైపు కోర్టు కేసులు.. ఇంకోవైపు చేసిన పనులకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు ఆపేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సంకేతాలు పంపినట్లుగా తెలిసింది. గతేడాది ఆగస్టు నుంచి ప్రభుత్వం నయాపైసా నిధులు చెల్లించని దృష్ట్యా కాంట్రాక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరానికి నిధుల లభ్యత పుష్కలంగా ఉండటం, ప్రాజెక్టు పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో పనుల వేగిరానికి చర్యలు చేపడుతుండటంతో అక్కడ పనులను దక్కించుకున్న ఇదే కాంట్రాక్టర్లు తమ యంత్ర పరికరాలను అటువైపు మళ్లిస్తున్నట్లుగా తెలిసింది. ఉల్టా.. పల్టా.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీలక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మొత్తం 5 రిజర్వాయర్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి రూ.30 వేల కోట్లతో పనులు చేపట్టారు. 2015–16 నుంచే ప్రాజెక్టు భూసేకరణ మొదలైనా, 2016–17 మార్చి నుంచి ఏజెన్సీలు పనులు మొదలెట్టాయి. ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వస్తోంది. మొదట్లో పనులు ఘనంగా మొదలైనా తర్వాత చతికిలబడ్డాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.7,510.34 కోట్లు కేటాయించినా, భూసేకరణ జరగక, కోర్టు కేసుల కారణంగా పనులు జరగకపోవడంతో దాన్ని తిరిగి రూ.1,650 కోట్లకు సవరించారు. ఈ ఏడాది సైతం రూ.4,067 కోట్లు కేటాయించగా, ఇంతవరకు రూ.1,282 కోట్ల మేర ఖర్చు జరిగింది. మరో రూ.1,282 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇందులో చేసిన పనులకు చెల్లించాల్సిన మొత్తాలు రూ.900 కోట్ల మేర ఉండగా, భూసేకరణకు సంబంధించి రూ.380 కోట్ల వరకు ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు పనులకు నయా పైసా ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ నుంచే పనులు నెమ్మదించాయి. ప్యాకేజీ–10లో మూడు రీచ్‌లు ఉండగా, ఇందులో ఒక రీచ్ పని ఆరంభమే కాలేదు. ప్యాకేజీ–1లో భూసేకరణ కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. ప్యాకేజీ–9లో పనులు చేస్తున్న ఏజెన్సీ తన యంత్రాంగాన్ని పూర్తిగా కాళేశ్వరం రిజర్వాయర్లకు తరలించినట్లు సమాచారం. ప్యాకేజీ–6లో మెజార్టీ పనులు జరగ్గా, అక్కడ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అక్కడి నుంచి ఏజెన్సీ తన యంత్రాలను కాళేశ్వరం పనులకే తరలిస్తున్నట్లుగా తెలిసింది. ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు.. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ పరిధిలో 16, 17, 18 ప్యాకేజీలు ఉండగా, ఇక్కడ 16 ప్యాకేజీ పనులు ఇటీవలే మొదలవ్వగా, మిగతా రెండింటిలో పనులు ఆరంభమే కాలేదు. ఇప్పట్లో ఆ పనులను ఆరంభించే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ప్రాజెక్టు పరిధిలో అవసరమైన 27 వేల ఎకరాల్లో మరో 9,692 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు ప్రస్తుతం నిధులు విడుదల జరగడం లేదు. అదీగాక ప్రస్తుతం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు పడుతోంది. నిధుల లేమి కారణంగా తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించినట్లుగా తెలుస్తోంది. దీన్ని గమనించిన కాంట్రాక్టు సంస్థలు పనులు నిలిపివేసే దిశగా ప్రభుత్వానికి సంకేతాలు పంపినట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని పెద్ద కాంట్రాక్టు సంస్థలు పనులను యథావిధిగా కొనసాగిస్తున్నా, మార్చి వరకు వేచిచూసి ఆ తర్వాత పనులు నిలిపివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. -
ఎమ్మెల్యే అనుచరుల డిష్యుం.. డిష్యుం..
బండిఆత్మకూరు: సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభంలో భాగంగా ముఖ్యమంత్రి సభకు జనం తరలించే విషయం టీడీపీ నేతల మధ్య విభేదాలుకు కారణమైంది. దీంతో సింగవరంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు ఒకరిపై మరొకరు కట్టెలతో దాడులు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఎమ్మెల్యేకు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య ఒకవైపు, వెంకటసుబ్బయ్య, నాగేష్, బూరగయ్య సోదరులు మరోవైపు అనుచరులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి సభ కోసం ఇరువర్గాలకు రెండు బస్సులు పంపించారు. దీంతో ఎవరి బస్సులో వారు పట్టుదలతో సీఎం సభకు జనాలను తరలించారు. సీఎం సభ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత రాత్రి ఇరువర్గాల వారు ఇంటికి చేరుకున్నారు. రామసుబ్బయ్య వర్గానికి చెందిన మల్లయ్య బైక్‌పై వెళ్తుండగా వెంకటసుబ్బయ్య, బూరగయ్య, నాగేష్‌లు కట్టెలతో దాడి చేశారు. దీంతో రామసుబ్బయ్య వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతీకార దాడులు చేశారు. ఈ క్రమంలో బూరగయ్య, వెంకటసుబ్బయ్య, నాగేష్‌లకు గాయాలు కావడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ క్రమంలో వారు మొదట దాడి చేసిన మల్లయ్య తలపై రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి సీరియస్‌గా మారింది. ఎస్ఐ విష్ణునారాయణ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మల్లయ్య పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వెట్టి బతుకులు!
సాక్షి, నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి కోటిఆశలతో వలసొచ్చిన కూలీల విషాదాంతమిది. జిల్లాలోని పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–1 వద్ద పలు రకాల పనులు చేసేందుకు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కింజోలి, చిత్తాపూర్, ఒడియాపాల్, దోన్వా గ్రామాలకు చెందిన కార్మికులు ఏడాది క్రితం జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పలు పనుల్లో వీరు కార్మికులుగా పనిచేస్తూ నెలనెలా తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. శనివారం ఉదయం వీరు ఉంటున్న క్యాంపు నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి టిప్పర్‌లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో అందులోని 16మంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో సుమారు 15–20 నిమిషాలపాటు వీరి ఆర్తనాదాలు అడవిపాలయ్యాయి. ఆ తర్వాత అటుగా వెళ్తున్న వారు గమనించి ఒక్కొక్కరిని ముళ్లపొదల నుంచి రక్తమోడిన శరీరాలతో రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు. తహసీల్దార్ల ద్వారా.. అయితే ఒక గ్రామం నుంచి ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస వెళ్లాలంటే తప్పనిసరిగా అలాంటి వారి పూర్తి వివరాలు నమోదు చేయాలి. వారికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ల ద్వారా కార్మిక శాఖ సేకరించాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కూలీలను కార్మిక శాఖ అధికారులు నమోదు చేసుకుని వారి రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా అన్న అంశాలపై వాకబు చేయాలి. జిల్లాలోని అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ, మరణించిన వారి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. ఎవరు ఎక్కడి వారో.. వారు మరణించారన్న వార్త ఎవరికి తెలియజేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ముఖం చాటేసిన కంపెనీ.. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే నవయుగ ఎన్ఈసీ కంపెనీల ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కంపెనీ వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా టిప్పర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని, మరో రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. గాయపడిన కూలీలకు వైద్యఖర్చులతోపాటు రూ.2 లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పొట్ట చేతపట్టుకుని వలసలకు పేరుగాంచిన జిల్లాకే వలస వచ్చారు.. అనుకోని సంఘటనతో ముగ్గురు అమాయకుల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మరికొందరు రెక్కలు తెగిన పక్షుల మాదిరిగా మారాయి. ఈ ఘటనతో వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు.. కుటుంబ సభ్యులు ఎవరు.. వీరికి బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా.. తదితర వివరాలు సేకరించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
‘కాళేశ్వరం’లో మరో ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మలక్‌పేట రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించి కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట, వీర్నపల్లి మండలాల పరిధిలోని 10 వేల ఎకరాలకు నిరీచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మలక్‌పేట రిజర్వాయర్ ఎడమ కాల్వ పరిధిలో 4.26 కి.మీ. వద్ద నుంచి నీటిని మళ్లించి మూలవాగు, హనుమయ్య చెరువులు నింపడం.. అలాగే 6.5 కి.మీ. వద్ద నీటిని తరలించి సింగసముద్రం, రాయుని చెరువులు నింపి వాటికింది 10 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.166 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. 36 ప్యాకేజీల గడువు పొడిగింపు ప్రాజెక్టుల పరిధిలో పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు ధరలు చెల్లిస్తూ ఇప్పటికే విడుదల చేసిన జీవో 146 పరిధిలోని 36 ప్యాకేజీల పనుల గడువును వచ్చే ఏడాది మే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 ప్రాజెక్టుల పరిధిలోని 111 ప్యాకేజీలకు ఎస్కలేషన్ చెల్లించాలని రెండేళ్ల కిందే నిర్ణయించగా, తర్వాత ప్యాకేజీల సంఖ్య 116కు పెరిగింది. వీటిలో వివిధ కారణాలతో 33 ప్యాకేజీలను తొలగించగా, 83 ప్యాకేజీలను ఎస్కలేషన్ పరిధిలోకి చేర్చారు. వీటిలో 74 ప్యాకేజీలకు ఎస్కలేషన్ చెల్లింపుల విషయమై ఇప్పటికే అధికారిక ఆమోదం లభించింది. ఇందులో 36 ప్యాకేజీలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. భూ సేకరణలో ఇబ్బందులతో పనులు పూర్తవలేదు. దీంతో గడువును ప్రభుత్వం పొడిగించింది. -
దోపిడీకి కొత్త ఎత్తుగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చెరువు ఏర్పాటవుతుందో లేదో తెలియదు. ఆ చెరువులోకి నీరు వస్తుందో, రాదో స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి అనుమతులు లేవు. కనీసం రాతపూర్వక ప్రతిపాదనలు కూడా లేవు. కానీ 40 ఎకరాల్లో చెరువును తవ్వించి అందులో నీటిని నింపి భవిష్యత్తులో పొలాలకు నీరు అందిస్తామంటున్న ఓ ప్రజాప్రతినిధి మాటలకు అక్కడి అధికారులు తందాన తాన అన్నారు. ఇంకేముంది పేద రైతులకు చెందిన భూములను నామమాత్రపు ధరకు తీసేసుకుని, చెరువు తవ్వకం పేరిట గ్రావెల్, మట్టిని పెద్ద ఎత్తున అమ్మేసుకుంటున్నారు. పది కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టే పథకాన్ని అమలుపరుస్తున్న అ«ధికార పార్టీ నేతలను ఇదేంటని మాటమాత్రంగానైనా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు సంబంధిత అధికారులు. వివరాల్లోకి వెళితే... దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామం పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్తోంది. అక్కడికి దగ్గరలో చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఓ కంకరగుట్ట ఉంది. గుట్టను తవ్వి చెరువుగా తయారుచేసి నీరు నిలబెడితే చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయని, అవసర సమయాల్లో చెరువు నీటిని సాగు కోసం వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిపాదించారు. తొలుత ఆ ప్రాంత వాసులు ఒప్పుకోకపోయినా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ను, జలవనరుల శాఖ అధికారులను వెంట పెట్టుకుని వెళ్లారు. పోలవరం కుడి కాలువ నుంచి గాని, చింతలపూడి కాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని నమ్మబలికారు. ఏదైనా చెరువుకు నీరు తరలించాలంటే ఆ చెరువు విస్తీర్ణం కనీసం వంద ఎకరాలైనా ఉండాలి. అలా ఉంటేనే కాల్వ నుంచి అధికారికంగా లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడానికి వీలవుతుందని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి చెరువు తవ్వడానికి గ్రామస్తులను చింతమనేని ఒప్పించారు. ప్రతిపాదనలు లేకున్నా... కంకరగుట్టతో పాటు అక్కడి భూములు తీసుకుంటేనే వంద ఎకరాలకు పైగా చెరువు రూపుదిద్దుకుంటుంది. ఇందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. కానీ చెరువు పేరిట సుమారు నలభై ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులైన పేదలకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చిన వాటిని చెరువు తవ్వకానికి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే గట్టిగా చెప్పడంతో రైతులు సమ్మతించక తప్పలేదు. ఎకరానికి రూ.ఆరు లక్షల చొప్పున ధర నిర్ణయించి తన అనుచరుడైన కిషోర్ ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్‌గా చింతమనేని చెల్లింపజేశారు. తక్కిన మొత్తాన్ని తర్వాత ఇప్పిస్తానని నమ్మబలికారు. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో చెరువు తవ్వకం పనులు రెండు వారాలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఎకరాల విస్తీర్ణంలో గ్రావెల్, మట్టి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. రూ.10 కోట్లకు పైగా టార్గెట్... ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.2,500, ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు వంద నుంచి 120 వరకూ టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి తోలుతున్నారు. ఈ వ్యవహారాన్ని చింతమనేని అనుచరుడు కిషోర్ చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. పనులు మొదలైన తరువాత ఎమ్మెల్యే ఆ ప్రాంతం వైపు కూడా కన్నెత్తి చూడలేదు. రైతుల నుంచి తీసుకున్న 40 ఎకరాలలోని గ్రావెల్, మట్టి అమ్మకాల ద్వారానే పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని స్థానికులు అంచనాగా చెబుతున్నారు. తమ భూమికి నామమాత్రపు ధర చెల్లిస్తున్నారని పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనుమతులు ఇవ్వలేదు : ఈ చెరువు తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేవు. కనీసం ప్రతిపాదనలు కూడా లేవు. పెదవేగి తహíసీల్దార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా అక్కడ ఎత్తిపోతల నుంచి లిఫ్ట్ ద్వారా చెరువుకు నీరు నింపే పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్ వారిని అడిగితే సమాచారం తెలుస్తుందని దాటవేశారు. ఎవరో పొలంలో చెరువు తవ్వుకుంటే తామేం చేయగలమని ఇరిగేషన్ అధికారులు ప్రశ్నించారు. తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, పైపులైన్ ద్వారా చెరువు నింపడానికి కూడా ప్రతిపాదనలు లేవన్నారు. ఈ భూమిని ఇరిగేషన్ శాఖ తీసుకుని చెరువు తవ్వే ప్రతిపాదనలు కూడా రాలేదని, భవిష్యత్‌లో కూడా చేయడానికి నిబంధనలు అంగీకరించబోవని వివరించారు. అయితే చెరువు తవ్వకానికి తమను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం కాలేదన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? చెరువుకు పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాల్వల నుంచి నీటిని తరలించాలంటే వంద ఎకరాల విస్తీర్ణం ఉండాలని కలెక్టరే స్వయంగా చెప్పారు. అసలు చెరువే లేకుండా, కంకర గుట్టను, చుట్టుపక్కల పొలాలను తవ్వి చెరువుగా రూపుదిద్దడమంటే పెద్ద ప్రహసనమే. ప్రతిపాదనలే లేకుండా చెరువు తవ్వుతామని చెప్పడమంటేనే గ్రావెల్, మట్టి కొల్లగొట్టడానికే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు పూర్తిగా డబ్బు చెల్లించకుండా తవ్వకం పనులు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో డబ్బులు చెల్లించడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని వాపోతున్నారు. -
‘పాలమూరు’పై నేడు గ్రీన్ ట్రిబ్యునల్ ముందు విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బుధవారం చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు విచారణ జరుగనుంది. ఎంకే నంబియార్‌తో కూడిన ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, పిటిషన ర్లు తుది వాదనలు వినిపించనున్నారు. దీనికోసం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ప్రాజెక్టు సీఈ లింగరాజు తదిత రులు మంగళవారం సాయంత్రమే చెన్నై వెళ్లారు. అటవీ చట్ట నిబం ధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిష న్పై ఇప్పటికే ట్రిబ్యునల్ పలు మార్లు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా.. పూర్తిగా తాగునీటికి ప్రాధా న్యమిస్తూ ప్రాజెక్టును చేపట్టామని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని ప్రభు త్వం తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని, రెండో దశలో సాగునీటిని అందిస్తామని వివరిం చింది. సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందుతామని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదిం చింది. దీనికి అంగీకరించిన ట్రిబ్యునల్, పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటి ప్రాజెక్టుకు అనుమతు లు పొందే వరకు సంబంధిత పనులు చేపట్టరాదని చెప్పింది. అయితే ఈ విష యంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని, తాగునీటి పనుల పేరుతో సాగు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్లు వాది స్తున్నారు. పూర్తిగా తాగునీటి పనులే చేపడుతున్నా మంటూ అందుకు సంబంధించిన డ్రాయిం గ్లను ప్రభుత్వం సమర్పించనుంది. -
పోలవరం కోసమే ప్యాకేజీకి ఓకే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక హోదాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఉండడం వల్లే తాను ఆ ప్యాకేజీకి ఒప్పుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఉండి ఉంటే ఈ రోజు మనం పోలవరం ప్రాజెక్టును సాధించుకునే వాళ్లమే కాదని చెప్పారు. ఆయన గురువారం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో రూ.1,600 కోట్లతో తలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. అప్పుడు ఎన్టీఆర్, తరువాత తాను చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యతను తీసుకున్నానన్నారు. ఆయనేం చెప్పారంటే.. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేశారు. అది నేనే టేకప్ చేశాను, సపోర్టు కూడా చేశాను. ప్రజలు 50 రోజులు డబ్బులకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు డబ్బుల కొరత తగ్గిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో 25 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మార్చి నాటికి 50 శాతం జరుగుతాయి. నేను ప్రపంచమంతా స్టడీ చేశాను. భారతదేశంలో మొదట నగదు రహిత లావాదేవీలు విజయవాడలో ప్రారంభించాను. అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తాం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మాదిరిగానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పరిధిలో రైతులకు న్యాయం చేస్తాం. ఏడాది తిరగకుండానే పట్టిసీమను పూర్తి చేసినట్టే తొమ్మిది నెలల్లో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తిచేస్తాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ఇదీ అసలు సంగతి.. ♦ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, తామే పూర్తిచేస్తామని విభజన సమయంలో కేంద్రం ప్రకటించి, విభజన చట్టంలోనూ చేర్చింది. ఇదే అంశాన్ని సాక్షాత్తు ప్రధాని రాజ్యసభలో ప్రకటించారు. దీంతోపాటు ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ రెండే కాకుండా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ.. ఇలా అనేక అంశాలను విభజన చట్టంలో పేర్కొన్నారు. ♦ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేస్తుందని, ప్రత్యేక హోదా ఇస్తుందని దీని భావం. హా ఐదేళ్లు సరిపోదు, తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని వెంకయ్య నాయుడు పేర్కొ న్నారు. ♦ ఐదేళ్లు పదేళ్లలో ఒరిగేదేమీ ఉండదు, రాష్ట్రానికి 15 ఏళ్లు హోదా కావాల్సిందేనని చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ సమక్షంలోనే డిమాండ్ చేశారు. ♦ ఎన్నికల ప్రచార సభల్లోనూ బీజేపీ పెద్దలు పోలవరంపై హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర నిధులతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. ♦ ఏపీకి హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని ఒక్క హామీనీ పట్టించుకోకుండా, పోలవరం ప్రాజెక్టును నిర్మించకుండా... కేవలం నాబార్డు నుంచి రుణంగా ఇప్పించిన రూ.1,981 కోట్లను ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అని చెప్పడం విచిత్రం. పోలవరం నా కల అని సీఎం మాట్లాతుండడం మరో వింత. ♦ కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ గద్దెనెక్కిన తర్వాత ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. కమీషన్ల యావతో తామే సొంతంగా పోలవరం నిర్మిస్తామన్నారు. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ♦ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5,135.87 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద కేంద్రం ఇచ్చిన నిధులు 562.47 కోట్లు మాత్రమే మిగతా నిధులన్నీ రాష్ట్రమే భరించింది. 144 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువ, 135కి.మీ మేర ఎడమ కాలువ నిర్మాణం వైఎస్ హయాంలోనే పూర్తయ్యింది. బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండున్నరేళ్లలో చేసిన వ్యయం రూ.1,900 కోట్లే. ఈ నిధులూ కేంద్రం ‘నాబార్డు’ నుంచి రుణంగా ఇప్పించింది. -
మెగా’కే పురుషోత్తపట్నం!
-
మెగా’కే పురుషోత్తపట్నం!
పథకం టెండర్లు ఖరారు సాక్షి, అమరావతి: గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసిన మెగా సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు సైతం దక్కనున్నాయి. రూ.1,638 కోట్ల అంచనాతో ఈ టెండర్లలో ప్రైస్ బిడ్‌ను శనివారం జలవనరులశాఖ అధికారులు తెరిచారు. 4.55 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ మెగా(మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్), 4.90 అధిక ధరలకు కోట్ చేస్తూ నవయుగ (నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్) షెడ్యూళ్లు దాఖలు చేశాయి. మెగా ఎల్–1గా నిలిచిందని పోలవరం ఎడమ కాలువ ఎస్ఈ సుగుణాకర్‌రావు ఇంజనీర్–ఇన్–చీఫ్ వెంకటేశ్వరరావుకు నివేదిక పంపారు. దీన్ని సీఎస్ టక్కర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి పంపారు. కమిటీ ఆదేశాల మేరకు ‘మెగా’తో జలవనరులశాఖ ఒప్పందం చేసుకోనుంది. -
అమృతా ఏజెన్సీకి ‘సీతారామ’ ప్యాకేజీ 3 పనులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-3 పనులను 0.5% లెస్తో అమృతా కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ఈమేరకు ప్యాకేజీ-3 పనుల ప్రైస్‌బిడ్‌ను అధికారులు శుక్రవారం తెరిచారు. దుమ్ముగూడెం నుంచి 39వ కిలోమీటర్ కెనాల్ వరకు సీతారామ ప్రాజెక్టు పనులకు ఆగస్టు నెలలో టెండర్లు పిలిచారు. మొదటి ప్యాకేజీ పనులకు రూ.1,455 కోట్లతో టెండర్ పిలవగా వీటిని మెగా కంపెనీ దక్కించుకుంది. రెండో ప్యాకేజీలో రూ.317కోట్ల పనులను 1.1లెస్తో బీవీఎస్ఆర్ సంస్థ దక్కించుకుంది. వేపులగడ్డ నుంచి కోయగుట్ట (39.9వ కిలోమీటర్) వరకు రూ.254 కోట్లతో టెండర్ పిలిచిన మూడో ప్యాకేజీ పనులకుమొత్తంగా 8 సంస్థలు పోటీపడగా.. ఇందులో 0.5లెస్‌కు టెండర్ వేసిన అమృతా ఏజెన్సీ సంస్థకు పనులు దక్కాయి. -
‘నారాయణపేట్-కొడంగల్’ అక్కర్లేదు?
♦ ‘పాలమూరు’ నుంచేఆ ఆయకట్టుకు నీరు ♦ ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదంగా మారిన ‘నారాయణపేట్-కొడంగల్’ ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు పాలమూరు ప్రాజెక్టు ద్వారానే నీరందించవచ్చని నీటి పారుదల శాఖ తేల్చింది. భీమా ప్రాజెక్టు కింది ప్రతిపాదిత లక్ష ఎకరాల ఆయకట్టులో మెజారిటీ ఆయకట్టుకు పాల మూరుతో నీరందించవచ్చని.. మిగతా 17,285 ఎకరాల ఆయకట్టుకు కర్వెన రిజర్వాయర్ ద్వారాగానీ, చిన్న ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారాగానీ నీరివ్వొచ్చని సూచిం చింది. దీంతో ‘నారాయణపేట్-కొడంగల్’ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని నీటి పారుదల శాఖ చెప్పకనే చెప్పింది. భీమా ప్రాజెక్టు నుంచి.. కృష్ణా బేసిన్‌లోని భీమా ఎత్తిపోతల పథకానికి అప్పటి బచావత్ ట్రిబ్యునల్ 20 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అప్పటి ప్రభుత్వం టీఎంసీకి 10 వేల ఎకరాల సాగు చొప్పున లెక్కలు వేసి 2.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు వేశారు. తర్వాతి కాలంలో పెరిగిన సాంకేతికత, కాల్వల ఆధునీకరణ నేపథ్యంలో... ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీరివ్వొచ్చని అంచనా వేశారు. ఇదే సమయంలో భీమా ప్రాజెక్టు కింద కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న చివరి ఆయకట్టు భూమి 15 వేల ఎకరాలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కిందకి బదలాయించారు. దీంతో భీమా ప్రాజెక్టు కింద నిర్ణయించిన 2.03 లక్షల ఆయకట్టుకు 12.9 టీఎంసీలు సరిపోతాయని లెక్కలు వేశారు. మిగతా 7.1 టీఎంసీలతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల సాగు అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్ చేసి... నారాయణపేట-కొడంగల్ (భీమా) ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. దానికి 2014 మే 23న రూ.1,450 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతోపాటు.. రూ.133.86 కోట్లను విడుదల చేశారు. ఇందులో రూ.130.5 కోట్లు భూసేకరణకు, మిగతా సొమ్మును ప్రాజెక్టు డిజైన్, ఇన్వెస్టిగేషన్ కోసం కేటాయించారు. మిగిలేది 17,285 ఎకరాలే..! తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు ఆ ప్రాజెక్టు నుంచే నీరివ్వాలని నిర్ణయించి ‘నారాయణపేట-కొడంగల్’ పథకాన్ని పక్కనపెట్టింది. అయితే పాలమూరు కింద ఈ మూడు నియోజకవర్గాలు పూర్తిగా చివరి ఆయకట్టులో ఉండడం, అంతేగాకుండా పాల మూరు కేటాయించిన నీరు వరద జలాలపై ఆధారపడి ఉండడంతో ఇక్కడి ఆందోళనలు చేపట్టింది. ‘నారాయణపేట-కొడంగల్’ పథకాన్ని కొనసాగించాలని రాజకీయ పక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రాజెక్టు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరిశీలన జరిపిన అధికారులు సర్కారుకు తుది నివేదిక అందజేశారు. పాలమూరులోని కర్వెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల కింద నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని మెజారిటీ ఆయకట్టు సాగులోకి వస్తుందని నివేదికలో తెలిపారు. కేవలం దౌల్తాబాద్, దామరగిద్ద మండలాల్లోని 6 గ్రామాలు, కొడంగల్‌లోని 2 గ్రామాలు, తాండూర్లోని 4, నారాయణపేట్‌లోని 2, కోస్గి మండలంలోని 2 గ్రామాల్లో కలిపి 17,285 ఎకరాల ఆయకట్టు మిగిలిపోతుందని అందులో పేర్కొన్నారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు సైతం ప్రత్యేక ఎత్త్తిపోతల పథకం ద్వారాగానీ, పాలమూరు ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల ద్వారాగానీ నీటిని అందించవచ్చని వివరించారు. -
‘పాలమూరు’ పల్టీలు!
- ఎత్తిపోతల పథకం భూసేకరణలో తీవ్ర జాప్యం - 26,582 ఎకరాలకు సేకరించింది 12,350 ఎకరాలే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథక ం పనులకు భూసేకరణ సమస్య బ్రేక్ వేస్తోంది! పనులు ఆరంభించి నాలుగు నెలలు కావొస్తున్నా భూసేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. సేకరణ పూర్తయిన కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నా.. మిగతా చోట్ల కాంట్రాక్టు సంస్థలు తమ యంత్రాలను ఖాళీగా ఉంచుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి సరైన సహకారం లేదని, అందుకే పనులు నెమ్మదిస్తున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. సగం కూడా కాని భూసేకరణ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ఐదు రిజర్వాయర్ల పరిధిలో పంప్‌హౌస్‌లు, కాల్వలు, టన్నెళ్ల నిర్మాణానికి 26,582.28 ఎకరాలు కావాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,075.33 ఎకరాలు కాగా, పట్టాభూమి 22,506.35 ఎకరాలు ఉంది. ఇందు లో ఇప్పటివరకు 13,081.13 ఎకరాల భూమిని ఇచ్చేందుకు 5,256 మంది రైతులు ముందుకు వచ్చారు. మొత్తంగా రెవెన్యూ అధికారులు 12,350.12 ఎకరాలు సేకరిం చగా.. అందులో పట్టాభూమి 8,371.38 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,978.14 ఎకరాలు ఉంది. అంటే ఇప్పటివరకు మొత్తం సేకరిం చాల్సిన భూమిలో సగం కూడా పూర్తికాలేదు. నాలుగు నెలల కింద ప్రాజెక్టు పనులు ఆరంభం అయ్యేనాటికే 9,300 ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించింది 3 వేల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. భూసేకరణ సమస్య కారణంగా ప్రధాన ప్యాకేజీల పనులు నిలిచిపోయాయి. మరి కొన్ని చోట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పనులు నెమ్మదించినా.. అక్టోబర్ నుంచి వేగవంతం చేయాలని ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. -
కొద్దిపాటి భూములనూ లాక్కొంటోంది
హైకోర్టులో కొల్లాపూర్ రైతుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్ పేరుతో తమకున్న కొద్దిపాటి భూములను కూడా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందంటూ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వాధికారులు తమ భూముల్లో నవయుగ కంపెనీ ద్వారా సర్వే చేయిస్తూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2013 భూ సేకరణ చట్ట నిబంధనల మేర పరిహారాన్ని ఖరారు చేయకుండా నవయుగ జోక్యం చేసుకుంటోందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన టి.నాగజ్యోతి, మరో 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 నిర్మాణం కోసం 2003లో అప్పటి ప్రభుత్వం 265 ఎకరాలను సేకరించిందన్నారు. దీంతో 114 కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయాయని తెలిపారు. ఫేజ్-2 కోసం మరో 389 ఎకరాలను సేకరించారని, దీనివల్ల 154 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైన్ అంటూ 185 ఎకరాలు సేకరిస్తున్నారని, దీనివల్ల 38 కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. -
‘ఇలాంటి విడ్డూరం ప్రపంచంలోనే లేదు’
కొండపాక(మెదక్): ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీల జలాశయాన్ని తలపెట్టిన దాఖలా తెలంగాణలో తప్ప ప్రపంచంలోనే మరెక్కడా లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. మెదక్‌జిల్లా కొండపాక మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఎర్రవల్లి, సింగారంలలో శనివారం కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, ఉస్మానియా కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డిలతో కలిసి నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ లిప్టు ఇరిగేషన్ స్కీంలో 50 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం సరికాదని ఇంజనీర్లు, నిపుణులు చెపుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముంపు గ్రామాల ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు ముందుగా జిల్లా కలెక్టరుతో గ్రామ సభలు ఎందుకు పెట్టించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ కోసం సేకరించిన భూములపై హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలను తీసుకొచ్చుకున్నారు. ఈసందర్బంగా బాలవ్వ అనే మహిళ తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించాలని టీఆర్ఎస్ నాయకులు బలవంతం చేస్తున్నారంటూ పురుగు మంతుఆ తాగేందుకు యత్నించింది. వెంటనే అక్కడున్న వారు డబ్బాను లాక్కోన్నారు. ప్రాజెక్టులో ఎర్రవల్లి మునిగిపోతే పురుగుల మందే శరణ్యమంటూ మహిళలు ముక్త కంఠంతో నినదించారు. -
ప్యాకేజీ-1లో భూగర్భ పంపుహౌస్!
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1లో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈ ప్యాకేజీలోని పంపుహౌస్ నిర్మాణానికి అటవీ శాఖ తీవ్ర అభ్యంతరం లేవనెత్తడంతో.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నీటి పారుదల శాఖ ఇప్పటికే పంపుహౌస్ నిర్మాణ ప్రాంతంలో అటవీ చట్టాలను ధిక్కరించి పనులు చేపట్టిందని.. అందుకు బాధ్యులైన అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభుత్వానికి లేఖ రాశారు కూడా. దీంతో అటవీ సమస్య లేకుండా భూగర్భ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. పనులకు ఇబ్బంది : ఒకటో ప్యాకేజీలోని స్టేజ్-1 పంపుహౌస్ పనులను సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు గత నెలలోనే ప్రారంభించాయి. అయితే ఈ ప్రాంతంలో 287 ఎకరాల మేర అటవీ భూమి ఉన్నందున పంపుహౌజ్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కాంట్రా క్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. కల్వకుర్తి పంపుహౌస్‌కు 300 మీటర్ల దూరంగా పశ్చిమాన భూగర్భంలో పంపుహౌస్నిర్మాణానికి అనుమతించాలని కోరింది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం పరిశీలిస్తున్న సమయంలోనే... తొలి ప్రతిపాదనను తప్పుబడుతూ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పీకే శర్మ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఎలాం టి అనుమతులు లేకుండా అటవీ స్థలంలో పనులు ప్రారంభించారని, ఇది 1980 అటవీ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశా రు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయడంతోపాటు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భూగర్భంలోనే బెటర్: చీఫ్ కన్జర్వేటర్ లేఖపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమాలోచన జరిపింది. ప్రాజెక్టుకు ఇదే మొదటి పంపుహౌస్ అయినందున, అటవీ అనుమతుల కోసం నిర్మాణం ఆగితే మొత్తం ప్రాజెక్టు ఆగి పోతుందని నీటి పారుదల శాఖ భావిస్తోంది. అదే జరిగితే నిర్ణీత సమయంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేమని, ఆ ప్రభావం డిండి ప్రాజెక్టుపైనా ఉంటుందని యోచిస్తోం ది. అందువల్ల పంపుహౌస్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమనే అభిప్రాయానికి వచ్చింది. ప్రాజెక్టులోని మిగతా స్టేజ్ల్లో పంపుహౌస్‌లను భూగర్భంలోనే నిర్మిస్తున్నందున స్టేజ్-1ను అలాగే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. భూగర్భ నిర్మాణానికి అనువైన ప్రాంతంపై కర్ణాటక కొల్లార్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం)తో అధ్యయనం చేయించ గా.. వారు సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నాయి. భూగర్భంలో నిర్మాణంతో రూ.120 కోట్ల వరకు అదనపు వ్యయం ఉంటుందని చెబుతున్నాయి. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కామారెడ్డి, భిక్కనూరు ఏఎంసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీ లక్ష్మి లిఫ్ట్ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో 1,045 అడుగుల నీటి మట్టం వద్ద నిర్మిస్తున్న లక్ష్మి ఎత్తిపోతల పథకం పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన లక్ష్మి లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆయకట్టు, పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న చోట ఒక్క ఇంజినీర్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా లక్ష్మి లిఫ్ట్ పనులు నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. 2007లో పనులు ప్రారంభించారని, 2014 వరకు 20 శాతం పనులనూ పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశామని, రెండేళ్లలో తుదిదశకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు ఏటా రెండు పంటలకు నీరందుతుందన్నారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం లిఫ్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విజయ్ మాథ్యూస్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన లిఫ్ట్ వద్ద నుంచి ఫోనులో మాథ్యూస్‌తో మాట్లాడారు. పనుల్లో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెలాఖారు వరకు రెండు మోటార్లు, వచ్చే నెలాఖారు వరకు లిఫ్ట్పనులు పూర్తి చేయాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, డీఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. ఎస్సారెస్పీలో నీరెంతుంది మంత్రి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్‌తో మాట్లాడి ప్రాజెక్ట్‌లో ఇప్పుడెంత నీరుందో తెలుసుకున్నారు. ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరుందని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎంసీల నీరుందన్నారు. లక్ష ఎకరాలకు నీరందిస్తాం కిసాన్‌నగర్‌లో రూ. 4.5 కోట్లతో నిర్మించిన 7,500 మెట్రిక్ టన్నుల గోదాంను, బస్సాపూర్ గ్రామంలో రూ. 6 కోట్లతో నిర్మించే బస్సాపూర్ లిఫ్ట్ నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ప్రాణహిత -చేవెళ్ల 21వ ప్యాకేజీ ద్వారా బాల్కొండ నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలో 600 మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మిస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 35 వేల మెట్రిక్ టన్నుల గోదాంలను నిర్మించిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని గోదాంలలో నిల్వ చేసుకుని రుణాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, సర్పంచ్ లింగస్వామి, ఎంపీపీ అర్గుల్ రాధ, జెడ్పీటీసీ సభ్యురాలు జోగు సంగీత, వైస్ ఎంపీపీ శేఖర్, వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ పుట్ట లలిత, ఎంపీటీసీ సభ్యురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్‌లో.. మోర్తాడ్ : మండలంలోని గుమ్మిర్యాల్‌లో రూ. 11.40 లక్షలతో చేపట్టనున్న గోదావరి నది ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. -
రాష్ట్రంలో కరువు నివారణకు చర్యలు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల: రాష్ట్రంలో శాశ్వత కరువునివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే పెండింగ్ప్రాజెక్టులు పూర్తిచేయడంతోపాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జడ్చర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. కరువు మండలాలను ప్రకటించాక ఎలాంటి సహాయక చర్యలు తీసుకోలేదని సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు. కరువుపై కేంద్రానికి నివేదికలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుందని వివరించారు. తాత్కాలిక చర్యలతోపాటు శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల డిజైన్లను సక్రమంగా చేయకపోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరు పారాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు పారలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల అలా కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఏడాదిలో ఆరునెలల పాటు తీసుకునే వెసులుబాటు ఉందని, అందుకే ముందుగా రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. రిజర్వాయర్లు ఉంటే నీటిని నింపుకునే వీలుందని, లేదంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లాగే అవుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మిశంకర్, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్ని, వైస్ ఎంపీపీ రాములు, సింగిల్‌విండో చైర్మన్లు బాల్‌రెడ్డి, దశరథరెడ్డి పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకాలకు మహర్దశ
► 18 పథకాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపిన ఏపీఎస్ఐడీసీ ► 16 స్కీమ్‌లకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం కర్నూలు సిటీ: నేలపై పడిన ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నీరు-ప్రగతి కార్యక్రమం కింద డబుల్ డిజిట్ గ్రోత్ కింద జిల్లాలో గతంలో ప్రారంభించి మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. ఈ స్కీమ్‌లని పునరుద్ధరిస్తే 8322 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 18 పథకాలను పునరుద్ధరించేందుకు 20.32 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఐడీసీ) అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఈమేరకు ఇటీవలే 16 పథకాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో మొత్తం 77 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 23 పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ఈ పనులు పూర్తి చేసి ఆయకట్టును రెండింతలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని 2016-17 సంవత్సర ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. పునరుద్ధరణతో అదనపు ఆయకట్టు జిల్లాలో చిన్న చిన్న కారణాలతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించలేకుండా ఉన్న 18 స్కీమ్‌లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి 20.32 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. వీటిలో 16 ఎత్తిపోతల పథకాలకు ఇటీవలే నిధులు మంజూరు అయ్యాయి. మిగిలిన రెండు స్కీమ్‌లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతాం.- రెడ్డిశంకర్, ఈఈ, ఏపీఎస్ఐడీసీ -
సస్యశ్యామలం చేస్తాం
♦ తెలంగాణలో కోటి, జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరివ్వడమే లక్ష్యం ♦ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా కేటాయిస్తాం ♦ ప్రభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు ♦ తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు.. ♦ మంత్రి మహేందర్‌రెడ్డి ఏదడిగినా కాదనడం లేదు ♦ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ⇔ ‘పాలమూరు’తో జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు ⇔ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు ఎన్ని నిధులైనా ఇస్తాం ⇔ {పభుత్వ మంచి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదు ⇔ తాండూరు కొత్త మార్కెట్ యార్డుకు 40 ఎకరాలు ⇔ రైతుబజార్లో వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు కోల్డ్ స్టోరేజీ ⇔ మంత్రి మహేందర్‌రెడ్డి ఏదిఅడిగినా కాదనం ⇔ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు - తాండూరు తాండూరు : పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పాలమూరు ప్రాజెక్టును ఆపలేరన్నారు. రంగారెడ్డి జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో తాండూరుకు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. తాండూరు, వికారాబాద్, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఏడాదికి రూ.25లక్షల కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరందించడంమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమెరికాలోని యూనివర్సిటీల నుంచి ఇతర రాష్ట్రాల సీఎంలు, నీటి ఆయోగ్, ప్రధాని కూడా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. భూసేకరణ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. 2013 భూసేకరణ చట్టం, 123 జీఓ ప్రకారం ప్రజలు ఏదీ కోరుకుంటే దాని ప్రకారం రూ.5,6లక్షలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఎన్ని నిధులైనా మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రి మహేందర్‌రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవమని.. జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఏం అడిగినా కాదనలేదన్నారు. తాండూరులో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు 30-40 ఎకరాల స్థలం కేటాయించాలని జేసీ రజిత్‌కుమార్ సైనీని మంత్రి ఆదేశించారు. స్థలం కేటాయింపుల తర్వాత రైతులకు అన్ని సౌకర్యాలతో యార్డును నిర్మిస్తామన్నారు. రైతు బజారులో వేర్వేరుగా వెజ్, నాన్‌వెజ్ విక్రయాలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పడిన బషీరాబాద్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానన్నారు. తాండూరు మార్కెట్లో కవర్ షెడ్ల నిర్మాణానికి రూ.83లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేం దర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు మంత్రి హరీష్‌రావు రూ.375కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ అనంతయ్య, జేసీ రజిత్‌కుమార్ సైని, వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతిఓజా, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, ఏడీ ఛాయాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్‌అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎంపీపీలు సాయిల్‌గౌడ్, కోస్గి లక్ష్మి, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
తెరుచుకున్న కాళేశ్వరం బ్యారేజీల సాంకేతిక టెండర్లు
♦ రూ. 5,813 కోట్లతో 3బ్యారేజీల పనులకు టెండర్లు వేసిన ప్రముఖ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించే మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీల నిర్మాణాల సాంకేతిక టెండర్లను నీటి పారుదల శాఖ గురువారం తెరిచింది. ఈ పనులను పొందేందుకు 12 కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నిర్మించే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు, వాటి పంప్‌హౌజ్‌ల నిర్మాణం, హైడ్రోమెకానికల్ పనుల కోసం వేర్వేరుగా అంచనా వ్యయాలు సిద్ధం చేశారు. ఇందులో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్ధ్యంతో 3 బ్యారేజీల నిర్మాణానికి, మేడిగడ్డకు రూ.2,591కోట్లు, అన్నారం 1,785కోట్లు, సుందిళ్లకు 1,437 కోట్లకు మొత్తంగా రూ.5,813కోట్లతో ప్రభుత్వం పాలనా అనుమతులిచ్చి వీటికి తొలుత గత నెల 18న టెండర్లు పిలిచింది. కాగా టెండర్ల గడువు బుధవారం సాయంత్రానికే ముగియగా, గురువారం ఉదయం సాంకేతిక బిడ్లు తెరిచారు. ఇందులో మెగా, నవయుగ, ఎల్అండ్టీ, ఎన్సీసీ, అస్కాన్స్, సుచిత వంటి కంపెనీలు పోటీపడినట్లుగా తెలుస్తోంది. రేపు తెరుచుకోనున్న పంప్‌హౌజ్‌ల బిడ్లు కాగా పంప్‌హౌజ్‌ల నిర్మాణ టెండర్లు శని వారం తెరుచుకోవచ్చు. రూ.7,998 కోట్లతో ఈ టెండర్లను పిలిచారు. మేడిగడ్డ-అన్నారం ఎత్తిపోతలకు 3,524కోట్లు, అన్నారం-సుం దిళ్ల ఎత్తిపోతలకు 2140 కోట్లు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి నిర్మాణాలకు రూ.2,140కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చారు. -
ఎత్తిపోతల పనులు అడ్డగింత
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు పట్టిసీమ తరహాలో తమకు కూడా ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ నెల 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో భూ నిర్వాసితులు పనులు జరగకుండా ప్రొక్లెయినర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. -
30 నెలల్లోపే ‘పాలమూరు’ పూర్తి
♦ అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ♦ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరంభించిన తొలి భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గడువు లోపలే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కరువు, వలసలతో అరవై ఏళ్లుగా అల్లాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా గోస తీర్చాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని షెడ్యూలు పెట్టుకున్నప్పటికీ అంతకుముందే పనులు పూర్తి చేసి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని మంత్రి సూచించారు. మంగళవారం సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) కార్యాలయంలో పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిపై 5 గంటల పాటు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి లక్ష్మారెడ్డితో పాటు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యపై కలెక్టర్‌ను, ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా భూసేకరణ సమస్యను కొలిక్కి తెచ్చి, కాంట్రాక్టర్లు పనులు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. కట్టలు, కాల్వల నిర్మాణం కోసం ప్రాధాన్యతా పరంగా భూమి సేకరించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టు ఒప్పందాలన్నీ పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లు కలసి పనిచేస్తే పనులు విజయవంతమవుతాయని, ఈ దృష్ట్యా అంతా సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. ప్రాజెక్టు పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలకు నీరు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఇంజనీర్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నట్లు తెలిపిన మంత్రి.. పాలమూరు ఎత్తిపోతలు భారత దేశ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పాలమూరు జిల్లాలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలకు నీరందిస్తామని, అయితే ఇందుకు మరింత కష్టపడాల్సి ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. -
రాజధాని గొంతెండుతోంది
► కృష్ణానదిలో తగ్గిన నీటి మట్టం ► దప్పిక తీర్చలేని పెలైట్ ప్రాజెక్టులు ► రాజధాని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతరం ► రెండు మూడు రోజులకోమారు నీటి సరఫరా ► కార్యరూపం దాల్చని మంత్రి నారాయణ హామీ సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. సమీపంలోనే కృష్ణానది ఉన్నప్పటికీ నీటి మట్టం తగ్గిపోయింది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పెలైట్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడంతో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. భూ సమీకరణకు పూర్తిగా సహకరించిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ హామీ కార్యరూపం దాల్చలేదు. తాడికొండ, తుళ్ళూరు, మంగళగిరి మండలాల పరిధిలో 29 రాజధాని గ్రామాలుంటే, అందులో సగం గ్రామాల్లో రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటం ఇక్కడి పరిస్థితికి నిదర్శనం. నత్తనడకన హరిశ్చంద్రపురం పథకం పనులు.. తాడికొండ మండలంలో హరిశ్చంద్రపురం, బోరుపాలెం, దొండపాడు, తుళ్ళూరు, రాయపూడి, లింగాయపాలెం, అబ్బురాజుపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాడికొండ గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన హరిశ్చంద్రపురం తాగునీటి పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తిచేసి ట్రయల్ రన్ చేయాల్సి ఉంది. 2009 సంవత్సరం నుంచి ఈ పథకం నత్తనడకన సాగుతోంది. అన్ని గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు పూర్తయితే పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రామాల ప్రజలకు విడివిడిగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో రెండురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. తుళ్ళూరు మండలం అనంతవరం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలకు కృష్ణానది నీటి సరఫరాలో జాప్యం కారణంగా రెండు మూడు రోజులకు ఒకసారి నీరు అందుతోంది. దీంతో ఎక్కువ మంది గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. నిరుపయోగంగా పెలైట్ ప్రాజెక్టు.. తుళ్ళూరు మండలంలో భూ సమీకరణకు పూర్తిగా సహకరించిన నేలపాడు గ్రామస్తులు కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడక తప్పడం లేదు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు శాఖమూరు, నేలపాడు, ఐనవోలు, మల్కాపురం, వెల్వడం, మందడం గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.7.5 కోట్లు వెచ్చించి నిర్మించిన పెలైట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2006లో అప్పటి ఎంపీ వల్లభనేని బాలశౌరి అంచనాలు రూపొందించి పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిని అప్పటి మంత్రి డి.శ్రీనివాస్ నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి అంచలంచెలుగా నిర్మాణాలు పూర్తిచేసుకొని 2015లో శాఖమూరు, ఐనవోలు గ్రామాలకు మాత్రమే తాగునీటి సరఫరాను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కృష్ణానది నుంచి పైపులైన్ ద్వారా శాఖమూరు చెరువుకు నీరందించి అక్కడి నుంచి ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఇంకా పదిశాతం పూర్తికావాల్సి ఉంది. శాఖమూరు, ఐనవోలు ప్రజలు తాగునీటిని తెచ్చుకొనేందుకు తుళ్ళూరు గ్రామాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కాలనీల్లో సమస్య తీవ్రం.. మంగళగిరి మండల పరిధిలో ఏడు గ్రామాలుంటే నీరుకొండ, యర్రబాలెం ప్రజలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నారు. మిగిలిన గ్రామాల్లోని శివారు కాలనీల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో 4500 జనాభా ఉంది. 1300 ఉన్న ఎస్సీ కాలనీల్లో ఒక్క చేతి పంపు మాత్రమే ఉండగా అది సక్రమంగా పని చేయడం లేదు. 25 వేల జనాభా వున్న నవులూరు, ఎర్రబాలెం గ్రామాల్లోని ఇండస్ట్రీయల్ ఏరియా, శ్రీనగర్, సాయినగర్ కాలనీల్లోనూ, 6500 జనాభా వున్న ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ఎన్టీఆర్ కాలనీలనూ తాగునీటి ఎద్దడి వెన్నాడుతోంది. -
రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టారు
► తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్ట్లతోఏపీకి తీవ్ర నష్టం ► ఓటుకు నోటు కేసు విషయంలో ► కేసీఆర్‌తో రహస్య ఒప్పందాలు ► పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి నెల్లూరు, సిటీ: కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి(నక్కలగండి) ఎత్తిపోతల పథకాలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టినట్టుగా స్పష్టం అవుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసీరెడ్డి పేర్కొన్నా రు. నెల్లూరులోని ఇంది రాభవన్‌లో బుధవారం జిల్లా కాం గ్రె స్ పార్టీ నా యకులతో సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేసీఆర్‌తో రహస్య ఒప్పందాలు కుదర్చుకున్నట్టు స్పష్టమవుతుందన్నారు.కేసీఆర్ అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మించేం దుకు ప్రయత్నాలు చేస్తుంటే బాబు మిన్నకుండటం చూస్తే ఇదే అర్థమవుతుందన్నారు. ఏపీలోని 9 జిల్లాల్లోని 48.24 లక్షలు ఎకరాలకు రాబోయే రోజుల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. నెల్లూరు జిల్లా లో 3.33 లక్షలు ఎకరాలు నీరందక ఏడారి గా మారే ప్రమాదం ఉందన్నా రు. ఏపీ లో నీటికి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. రైతులకు నష్టం వాటిల్లితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగి లిపోతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, వెంకట్రావు, దేవకుమార్‌రెడ్డి, సీవీ శేసారెడ్డి, రఘురామ్‌ముదిరాజ్, బాలసుధాకర్, అరుణమ్మ, బాలకృష్ణ పాల్గొన్నారు. -
‘పాలమూరు’ అగ్రిమెంట్లకు సీఓటీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీల అర్హతలకు కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) ఆమోదంతెలిపింది. పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు నిబంధనల మేర అన్ని అర్హతలున్న దృష్ట్యా, వారితో ఒప్పందాలకు ముందుకు వెళ్లవచ్చునని నిర్ణయించింది. అయితే అధికారికంగా మినిట్స్‌పై సీఓటీ అధికారులు సంతకాలు చేసి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు పంపాలి. అక్కడ ఆమోదం అనంతరం ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగి పనులు ఆరంభమవుతాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారు. దీని అంచనా వ్యయం రూ.35,200 కోట్లు. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి రూ.29,924.78 కోట్ల పనులకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. వీటిని గత నెల 11న తెరవగా ప్రముఖ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి. -
పాలమూరుకు ముహూర్తం నెలాఖరులో..
► ప్రారంభంకానున్న నిర్మాణ పనులు ► బడ్జెట్లో అగ్రతాంబూలం ► ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి ► మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాక.? ► సాంకేతిక చర్యలపై అధికారుల కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రతిష్టాత్మక పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మంచిరోజులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో ఈ ఎత్తిపోతల పథకానికే ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ మేరకు అధికారుల సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన పనులను 18 ప్యాకేజీలుగా టెండర్లను ఖరారు చేయడంతో ఇక పాలమూరు నిర్మాణం పరుగులు తీయనుందని ప్రజలు భావిస్తున్నారు. పూర్తికాని భూ సేకరణ.. సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నా దీనికి సంబంధించి నాలుగు జలాశయాల పరిధిలో భూసేకరణ మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 16 లక్షల 446 వేల 40 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించాలని సంకల్పించారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూ కొనుగోలును వేగవంతం చేస్తూ రిజిస్ట్రేషన్లను పూర్తిచేస్తున్నారు. మరోవైపు భూసేకరణ వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై వివిధ జలాశయాల పరిధిలోని ముంపుబాధితుల్లో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. కొందరైతే నష్టపరిహారాన్ని పెంచాలంటూ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అనుకున్న సమయానికి పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించే లక్ష్యంతో ఈ నెలాఖరుకు నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో శంకుస్థాపన ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం జూన్ నెల 11వ తేదీన కర్వెన ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం జలాశయం వెనుక భాగం నుంచి నార్లాపూర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందిన ఈ పథకం కింద ఉద్దండాపూర్ జలాశయం వరకు నీటిని తరలించేందుకు గాను టెండర్లను పూర్తిచేశారు. మార్చి నెల చివరి వారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్‌తోపాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ఆహ్వానించి పనులను ప్రారంభింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు మంత్రిని జిల్లాకు చెందిన అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు ఆహ్వానించినట్లు సమాచారం. పనుల ప్రారంభానికి అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు 7 వేల 860 కోట్ల రూపాయలను కేటాయించడంతో పనులను వేగవంతంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే జలాశయాల పరిధిలో సేకరించిన భూమి.. ఇంకా సేకరించాల్సింది ఎంత.. నిర్మాణ పనులకు తక్షణం ఎంత భూమి అవసరమవుతుందన్న అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూమిని అధికారికంగా సాగునీటి అధికారులకు అప్పగించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏయే ప్రాంతంలో ఎంత భూసేకరణ జరిగింది. అందులో రిజిస్ట్రేషన్ జరిగి నిర్మాణ పనులకు సిద్ధంగా ఉన్న భూమి ఎంతన్న అంశాన్ని రెవెన్యూ అధికారులు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. -
మిషన్ భగీరథ చరిత్రాత్మకం
► నీళ్లొచ్చే దాకా కేఎల్ఐ ప్రాజెక్టు వద్దే నిద్ర ► జూన్ నాటిని సాగునీరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ► ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గోపాల్పేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం ముఖ్యమంత్రి తీసుకున్న చరి త్రాత్మక నిర్ణయమని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎ ల్‌ఐ) ద్వారా సాగునీరు వచ్చే దాకా ప్రాజెక్టు వద్దే నిద్రపోతానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మం డలంలోని గౌరిదేవిపల్లి సమీపంలో జరుగుతున్న కేఎ ల్‌ఐ మూడవ లిఫ్టు పనులతో పాటు మిషన్ భగీరథ ప నులను పరిశీలించారు. సర్జఫుల్, పంప్‌హౌజ్ పనుల పు రోగతిని కేఎల్ఐ ఎస్ఈ భద్రయ్య వివరించారు. అనంతరం అక్కడే నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేఎల్ఐ పనులను వేగిరం చేసేందుకు ఒకటవ లిఫ్టు నుం చి మూడో లిఫ్టు వరకు ప్రతివారంలో ఒకరోజు గడిపి రా త్రి అక్కడే బస చే స్తామని, ఇందుకోసం సంబంధిత అధికారులు, ఏజేన్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నాటికి మూడవ లిఫ్టు నుంచి ఒకటి లేదా రెండు మోటార్ల స హాయంతో నీళ్లివ్వడానికి ఏజేన్సీ, అధికారులు కృషి చే యాలన్నారు. బడ్జెట్లో ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించడం హర్షనీయమని, ఒ క్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 8600 కోట్ల కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ పథకంలో భాగంగా నాగపూర్ శివారులో జరుగుతున్న సంపు నిర్మాణ స్థలాన్ని, పైపులను పరిశీలించారు. బాధిత రైతులకు పరిహారం విషయమై నిరంజన్‌రెడ్డి ఫోన్లో జేసీతో మాట్లాడారు. నిరంజన్‌రెడ్డి వెంట ఎంపీపీ జానకిరాంరెడ్డి, నాగపూర్ సర్పంచ్ పాపులు, కేఎల్ఐ ఈఈ రమేష్‌జాదవ్, డీఈలు రవీంద్రకిషన్, లోకిలాల్, సత్యనారాయణగౌడు, మం డల ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. -
నిర్వేదం...
భూ పరిహారం అందించలేదని రైతు ఆత్మహత్యాయత్నం పోలీసుల ఎదుటే విషం తీసుకుని అఘాయిత్యం కాలువ పనులను అడ్డుకున్న రైతులు నేటికీ పూర్తిగా అందని సింగటాలూరు ఎత్తిపోతల పథకం భూముల పరిహారం గదగ్ : తాలూకాలో సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం వెంటనే తగిన భూ పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ పోలీసుల ఎదుటే ఓ రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన శుక్రవారం సంచలనం రేపింది. తాలూకాలోని అడవి సోమాపుర గ్రామం వద్ద కాలువ నిర్మిస్తున్న స్థలంలో అధికారులు, పోలీసుల ఎదుటే రామణ్ణ హొసళ్లి అనే రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అతనిని గదగ్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్ఐ జూలకట్టి అడ్డుకొని విషం బాటిల్‌ను లాక్కొన్నాడు. గదగ్, కొప్పళ, బళ్లారి జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరందించే సింగటాలూరు ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. కాలువ నిర్మాణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం రైతుల పొలాలను స్వాధీనం చేసుకుంది. అయితే భూములు కోల్పోయిన వారి లో కొందరు రైతులకు మాత్రమే పరిహారం లభించింది. ఇంకా కొందరికి పరిహారం లభించలేదు. మరికొందరు పరిహా రం లభించినా తగినంత పరిహారం లభించలేదని ఆరోపిస్తూ పథకం పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. పథకం పనులు పూర్తయినా భూములు కోల్పోయిన వారికి పరిహారం లభించక పోవ డంతో కోపోద్రిక్తులైన రైతులు అడవి సోమాపురం వద్ద జరుగుతున్న కాలువ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి అధికారులు, గదగ్ రూరల్ పోలీసులు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో చర్చిస్తుండగా, పనులు చేపట్టేందుకు ప్రయత్నించినా జేసీబీ డ్రైవర్‌పై రైతులు చేయి చేసుకోబోగా, పోలీసులు అడ్డుకొని శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
సీఎం వ్యవసాయ క్షేత్రం కోసమే ప్రాజెక్టు
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించేందుకే మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టును నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఉదయం మహాశివరాత్రిని పురస్కరించుకొని కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని ఒక్క ఎకరం భూమి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో ముంపుకు గురైనా పార్టీ పక్షాన సహించేదిలేదని అన్నారు. రూ,500 కోట్ల కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పనులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. సుమారు 50శాతం పనులు జరిగాయన్నారు. కాళేశ్వర క్షేత్రానికి టూరిజం ప్లానింగ్ కింద నిధులు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఎంత భూమి ముంపుకు గురవుతుంది, రైతులకు చెందిన ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారో సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు..ఆయన వెంట మహదేవపూర్ సర్పంచ్ కోట రాజబాబు, కాటారం ఎంపీటీసీ సమ్మయ్య, నాయకులు చల్లా తిరుపతిరెడ్డి, విలాస్‌రావు, వామన్‌రావు, సట్ల మురళి, శశిభూషన్ కాచే, కొత్త శ్రీనివాస్, శకీల్, గీతామాయ్, రాణీబాయ్, మిల్కమ్మ ఉన్నారు. -
బలవంతంగా భూములు లాక్కోవద్దు
భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి పాలమూరు’ భూసేకరణను పరిశీలించిన సీపీఎం నేతలు బిజినేపల్లి/జడ్చర్ల: పాలమూరు, రంగారె డ్డి ఎత్తిపోతల పథకంలో నిర్వాసిత రై తాంగానికి 2013 భూసేకరణ చట్టాన్ని ప టిష్టంగా అమలు చేయాలని సీపీఎం కం ట్రోల్ కమిషన్ చైర్మన్, రైతు సంఘం అఖి ల భారత జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మె ల్యే నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం కార్కొండ గ్రామంలో మాట్లాడారు. అలాగే పాలమూరు ముంపు గ్రామం జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్వాసితులు 80శాతం అంగీకరిస్తేనే పనులు ప్రారంభించాలన్నారు. భూములు కోల్పోతున్న రైతాంగానికి పలుకుతున్న ధరకంటే నాలుగురెట్లు అధికంగా ఇవ్వాలని లేదా భూమికి భూమి ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నారు. రైతులు అంగీకరించిన తర్వాతే ప్రణాళికలు తయారుచేసి టెండర్లు పిలవాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల డిజైన్ ప్రారంభంలో ఉదండాపూర్ రిజర్వాయర్ లేదన్నారు. అనంతరం కొత్త డిజైన్‌లో పుట్టుకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి ఉంటే నేడు 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్తగా పాలమూరు ఎత్తిపోతలకు నిదులు కేటాయించడం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనని మండిపడ్డారు. ఉదండాపూర్ ముంపునకు గురికాకుండా డిజైన్ మార్చాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాములు, వెంకట్రామ్రెడ్డి,డివిజన్ కార్యదర్శి దీప్లానాయక్, ఆర్.శ్రీనువాసులు, జగన్, సత్తయ్య పాల్గొన్నారు. -
ఆ భూములకు మినహాయింపునివ్వండి
ఇరుగారు పంటలు పండే భూములను సేకరణ నుంచి తప్పించాలని విజ్ఞప్తి కలెక్టర్‌కు వినతిపత్రం కర్నూలు (హాస్పిటల్): బావులు, బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కింద రెండు పంటలు పండే భూములను భూసేకరణ నుంచి తప్పించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, నందికొట్కూరు కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జీ సి.అశోక్త్న్రం, తంగెడంచ, మండ్లెం, భాస్కరాపురం గ్రామాల రైతులు విన్నవించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన వారు కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల కోసం భాస్కరాపురం, మండ్లెం, తంగెడంచె గ్రామాల్లో ఏపీఐఐసీ భూ ములు సేకరిస్తోందన్నారు. అయితే అవన్నీ బీడు భూములుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఈ గ్రామాల్లో భూసేకరణ నిలిపివేయాల కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్.. రైతులను కలిసి వివరాలు సేకరిస్తామని తెలిపారు. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఎట్టకేలకు..
► ప్రభుత్వానికి చేరిన తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్ ► మూడు రిజర్వాయర్లతో డీపీఆర్‌ను ఆమోదించిన ఈఎన్సీ ► రూ. 835 కోట్లఅంచనాతో తుమ్మిళ్ల ► ఎత్తిపోతల డీపీఆర్ డీపీఆర్‌కు అనుమతి వస్తే పథకం పనులకు శ్రీకారం ► ఈ ఎత్తిపోతలతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లు ► 23వ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఆయకట్టులోని 70వేల ► ఎకరాలు సాగులోకి.. జూరాల : మూడు రిజర్వాయర్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఈఎన్సీ ఆమోదించి మంజూరు కోసం ప్రభుత్వానికి పంపారు. దీంతో ఎనిమిది నెలలుగా సర్వే దశలో ఉన్న ఈ పథకం ముందడుగు పడినట్లయింది. దశాబ్దాలుగా ఆర్డీఎస్ ఆయకట్టులో నీళ్లందని రైతులకు శాశ్వత పరిష్కారంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఆర్డీఎస్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు నీళ్లిచ్చేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను రూ. 835 కోట్ల అంచనాకు ఈఎన్సీ మురళీధర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో మూడు పంపులతో పంప్‌హౌస్ నిర్మించనున్నారు. ఒక్కో పంపు 10 క్యూమిక్స్ నీటిని తోడే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. అక్కడినుంచి నీటిని మొదటగా మల్లమ్మ కుంట రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ నుంచి జూలకల్, వల్లూరుల వద్ద నిర్మించే రెండు రిజర్వాయర్లకు నీటిని మళ్లించి నింపుతారు. మూడు రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ డి-23 నుంచి అలంపూర్ మండల పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఎత్తిపోతల ద్వారా ఎనిమిది టీఎంసీల నీటిని 90 రోజుల్లో తుంగభ ద్ర నుంచి పంపింగ్ చేయాలన్నది లక్ష్యం. 70 నుంచి 80వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా డిజైన్ చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ చివరి వరకు నదిలో వరద ఉన్న సమయంలో పంపింగ్‌ను చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. కర్ణాటకలోని మాన్వి తాలూకా పరిధిలో ఉన్న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి వచ్చే నీళ్లు చివరి దాకా అందని ఆయకట్టు భూములకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే శాశ్వతంగా నీరందనుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ల సర్వేను వీఎస్ మ్యాప్ సంస్థకు రూ. 18 లక్షల అంచనాతో జూన్‌లో అప్పగించింది. నాటి నుంచి సర్వే కొనసాగుతూ ఎట్టకేలకు డిసెంబర్ చివరి వారంలో సర్వేను పూర్తి చేశారు. సర్వేకు అనుగుణంగా అంచనాను రూపొందించి రూ.835 కోట్ల డీపీఆర్‌ను సిద్ధం చేశారు. -
ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సర్వే
చింతపల్లి : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని చిన్నచెరువు, పెద్దచెరువు ప్రాంతాల వద్ద 1.11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు భూములను బుధవారం అధికారులు పరిశీలించారు. మండల కేంద్రంలోని శిఖం భూములతో పాటు రైతులకు చెందిన 1500 ఎకరాలుపాజెక్టు నిర్మాణంలో కోల్పోనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతుల భూములను పరిశీలించారు. -
విశాఖకు పోల‘వరమే’
ఎడమ కాలువతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు సత్యనారాయణ దేవరాపల్లి: పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయి నీరు వస్తే విశాఖపట్నం తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు ఎస్. సత్యనారాయణ తెలిపారు. రైవాడ జలాశయం అతిథి గృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎడమ కాలువ పనులు త్వరగతిన పూర్తి చేసేందుకు రైతులు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రైవాడ సమస్యకు పరిష్కారం: పోలవరం నీరు విశాఖకు వస్తే అప్పుడు రైవాడ నీరు రైతులకు అంకితం చేసే అవకాశం ఉంటుందన్నారు. రైవాడ నీటిని రైతులకు అంకితమిస్తే అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 2 వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉందన్నారు. పోలవరం జిల్లాకు వచ్చేలోగా అదనపు ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేసేందుకు కాలువుల నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలన్నారు. ఎత్తిపోతల పథకం మేలు కృష్ణా నదిపై నిర్మించిన పట్టిసీమ మాదిరిగా పురుషోత్తమపురం వద్ద ఎడమ వైపు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేస్తే విశాఖపట్నానికి త్వరితగతిన నీరు వస్తుందని, దీని సాధనకు రైతులు, ప్రజా ప్రతినిధులు పోరాటం చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఎడమ కాలువ 2017 జూన్ నాటికి పూర్తవుతుందన్నారు. పోలవరం కాలువను పొడిగించి విశాఖపట్నం దాటిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చన్నారు. విశాఖపట్నలో 3 లక్షల ఎకరాలకు సాగు నీటి కష్టాలకు మోక్షం లభిస్తుందన్నారు. -
త్వరలో ‘పాలమూరు’ టెండర్
► రూ.27 వేల కోట్ల పనులకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ఆరంభానికి నేడో, రేపో తొలి అడుగు పడనుంది. ప్రాజెక్టు టెండర్ నోటిఫికేషన్ సోమవారంగాని, మంగళవారంగాని విడుదల కానుంది. మొత్తంగా 18 ప్యాకేజీలకుగానూ రూ.27 వేల కోట్ల పనులు చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించనున్నట్లుగా తెలిసింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 14 రోజులపాటు కాంట్రాక్టు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల అంచనాలు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కన పెట్టి, అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు టెండర్ పనులను రెండువారాల్లో పూర్తి చేయాలని గత సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దానికి అనుగుణంగా కదలిన అధికారులు ప్యాకేజీల్లో చిన్న, చిన్న మార్పులు చేసి టెండర్ల ప్రక్రియకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రానికి సాంకేతిక అంశాలను సరి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయం చేశారని ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది. -
‘ప్రాణహిత’ కోసం టీడీపీ పాదయాత్ర
- 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి ప్రారంభం - పాల్గొననున్న ఎర్రబెల్లి, రమణ, పెద్దిరెడ్డి తదితరులు చేవెళ్ల: ప్రాణహిత -చేవెళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. 18, 19 తేదీల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి టీడీఎల్పీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ, ఈ.పెద్దిరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ జిల్లా నాయకులు శేరి పెంటారెడ్డి, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు శేరి నర్సింహారెడ్డి చేవెళ్లలో ఆదివారం విలేకరులకు వివరించారు. 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, 19న కూడా కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాకు తాగు, సాగునీరు అందించడంలో జరుగుతున్న అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా రైతులకు, ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రాజెక్టు డిజైన్ మారుస్తోందని మండిపడ్డారు. మెదక్ జిల్లాకు నీరివ్వడం కోసం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడం పద్ధతి కాదన్నారు. 19న ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్‌వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీశైలం, సుభాన్‌గౌడ్, శర్వలింగం, రాజశేఖర్, లింగం, మొహినుద్దీన్, వడ్డె రాంచంద్రయ్య, మల్లారెడ్డి, అబీబ్, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరే..
- గుత్ప ఎత్తిపోతల ద్వారా గోదావరిలోకి చేరని నీరు - 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకమే - రైతుల జీవితాల్లో మళ్లీ అంధకారం నందిపేట : ప్రతి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో దివంగత మఖ్యమం త్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిర్వీర్యమవుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ తీరంలోని నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నదిని ఆనుకుని నిర్మించిన అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేదు. 8 సంవత్సరాల పాటు రైతులకు సాగునీరందించిన ఈ పథకానికి.. ఇప్పుడు గోదావరిలో ప్రవాహం పూర్తిగా సన్నగిల్లడంతో నీటి సరఫరా నిలిచిపోరుుంది. దీంతో తొలిసారిగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఈ ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు పంటలకు సాగు నీరు విడుదల కాలేదు. గుత్పతో సస్యశ్యామలం.. ఎనిమిది సంవత్సరాలుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా 540 క్యూసెక్కుల నీటిని తోడి రైతులకు నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా 38,792 ఎకరాలకు సాగునీరందించారు. దీంతో నందిపేట, మాక్లూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, ఆర్మూర్ మండలాల పరిదిలోని 55 గ్రామాలలో పంటలు సాగయ్యూయి. ఫలితంగా ఎన్నో ఎళ్లుగా బీడుగా ఉన్న భూములు పంట పొలాలుగా మారాయి. దుర్భర జీవితాలు గడుపుతున్న ైరె తుల కుటుంబాలలో ఈ పథకం వెలుగులు నింపింది. ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకమే.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ జూన్‌లోనే ప్రారంభమైనా, ఇంతవరకు సరైన వర్షాలు కురియక పోవడం, గోదావరి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆ నది నీటి ప్రవాహం లేక గుత్ప ఎత్తిపోతల పథకం ఉత్సవ విగ్రహంలా మారింది. దీంతో దీని పరిధిలోని 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో వందల సంఖ్యలో బోరుబావులు సైతం ఎండిపోయూరుు. జూలై మొదటి వారంలోనే భూగర్భ జలాలు దిగువకు పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్నందున అనేక మంది రైతులు కొత్తగా 200-300 అడుగుల లోతు వరకు బోర్లు తవ్విస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుత్ప ఆయకట్టు పరిధిలో కనీసం 30 శాతం విస్తీర్ణంలో కూడా వరి నాట్లు పడలేదు. పదేళ్ల క్రితం గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని, తిరిగి ఇప్పుడు అలాంటి పరిస్థితే పునారవృతం అవుతోందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి ఖరీఫ్, రబీ సీజన్లలో వరినాట్లు వేసుకునేందుకు ముందస్తుగానే ఒక దఫా గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారు. దాంతో ఆయకట్టు రైతులు ఆ నీటిని తమ పొలాల్లోకి మళ్లించుకుని జోరుగా వరినాట్లు వేసేవారు. అలాంటిది ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారు కావడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోరుుంది. సాగునీటి మాటెలా ఉన్నా కనీసం తాగునీటికి కూడ తిప్పలు తప్పేలా లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
తాడిపూడి ‘కృష్ణా’ర్పణం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం జాతీయ హోదా గల బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును సర్కారు పక్కన పెట్టేసింది. రాయలసీమ పేరుచెప్పి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించేందుకు యత్నిస్తున్న ప్రభుత్వం జిల్లా రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ మరో కుట్రకు తెరలేపింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని తరలించుకుపోతామంటోంది. ఇందుకు మెట్ట ప్రాంతంలోని 14 మండలాల రైతులను సమిధలుగా మారుస్తోంది. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయేందుకు గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడికాలువతో అనుసంధానిస్తూ పైప్ కల్వర్టు నిర్మిస్తోంది. మన జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2,06,600 ఎకరాలకు సాగునీరు, 135 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. కృష్ణా డెల్టాకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొడుతున్న సర్కారు తీరుపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ప్రభుత్వ జాప్యం తాడిపూడి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. సర్కారు కుట్రపూరిత నిర్ణయంతో తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కృష్ణా నదికి అడ్డదారిలో గోదావరి జలాలను తరలించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. - కొవ్వూరు ‘పట్టిసీమ’ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించని ప్రభుత్వం ఏదో రకంగా గోదావరి నీటిని కృష్ణానదికి తరలించేందుకు పూనుకుంది. జిల్లాలో ఏడు నియోజవర్గాల పరిధిలో 14 మండలాలకు చెందిన మెట్టరైతుల ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టింది. సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిల్చింది. వెయ్యి క్యూసెక్కులు తరలింపు లక్ష్యం తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కాలువకి 600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇక్కడి నుంచి 900 నుంచి వెయ్యి క్యూసెక్కులు నీరు తరలించాలని ప్రభుత్వం పథకం రచించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం కాకిలెక్కలు చెబుతూ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాడిపూడి పథకం నిర్దేశించిన 2,06,600 ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 1,397 క్యూసెక్కులు (12.15 టీఎంసీలు) అవసరం. ఒక క్యూసెక్కు నీటితో 147.86 ఎకరాలకు నీరు అందించే విధంగా ఈపథకం రూపొందించారు. తాడిపూడి కాలువ నుంచి 600 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలువకు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. వీటితో 88,720 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ప్రస్తుతం 797 క్యూసెక్కుల నీటిని తాడిపూడి ఆయకట్టుకు అధికారులు లెక్కలు చూపుతున్నారు.1,17,851 ఎకరాలకు నీరు ఇస్తున్నట్టు లెక్కతేల్చారు. వాస్తవానికి అసంపూర్తి పనుల కారణంగా కేవలం 70 వేల ఎకరాలకే నీరందిస్తున్నారు. తాడిపూడి పథకం రూపకల్పన ప్రకారం 1,397 క్యూసెక్కుల్లో మూడోవంతు నీరు ప్రస్తుతం ఆయకట్టుకి సరిపోతుంది. 900 క్యూసెక్కుల నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని తరలించడమే ప్రభుత్వ వ్యూహమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. భూసేకరణలో జాప్యం తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలు, ఉప కాలువలు, పంపిణీ కాలువలకు సంబంధించి ఇంకా 720 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.పది కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.పోలవరం కుడి ప్రధాన కాలువ భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం తాడిపూడి భూసేకరణను మాత్రం పక్కన పెట్టింది. భూసేకరణ, చెట్ల పరిహారం కలిపి సుమారు రూ.100 కోట్లు అవసరమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సమజ తెలిపారు. అదనంగా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 అక్టోబర్ 25న లాంఛనంగా తాడిపూడి పథకం నిర్మాణ పనులు ప్రారంభించారు.అప్పట్లోనే 40 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 2009 నుంచి జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల వరకు నీరందించారు.కొందరు కోర్టులను ఆశ్రయించడం, భూసేకరణ పెండింగ్ ఉండడంతో పనులు ముందుకు సాగలేదు.వైఎస్సార్ మరణానంతరం పథకం పను లు పడకేశాయి.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదు. తాడిపూడికి గండి కొట్టడం సమంజసం కాదు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెట్ట రైతులకు సాగు నీరు అందించేందుకు తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చంద్రబాబు సర్కారు పనులు పూర్తి చేయకపోవడం వల్ల పంటపొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాలకు తాడిపూడి నీరు తరలించేందుకు కుట్ర చేయడం దారుణం.పట్టీసీమను పూర్తి చేయకుండా తాడిపూడి నీరుకు గండి కొట్టడం వెంటనే మానుకోవాలి. -బాలం సుబ్బారావు, రైతు, పోచవరం నీరు సక్రమంగా అందడం లేదు తాడిపూడి కాలువ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో పంటలకు నీరు అందడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ పూర్తి కాలేదన్న సాకుతో తాడిపూడి నీటిని కృష్ణాజిల్లాకు తరలించడం ద్వారా ఆయకట్టు రైతులంతా తీవ్రంగా నష్టపోతారు. - గుళ్లపూడి శివరామకృష్ణ, రైతు, పోచవరం దగా చేస్తున్న చంద్రబాబు పట్టిసీమ పేరుతో రెండు జిల్లాల రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నదులను అనుసంధానం చేస్తున్నామని గొప్పులు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నాటికి ఒక్క చుక్క నీటిని కూడా తరలించే అవకాశం లేదు. తాడిపూడి పంపింగ్ పథకం నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని లేకుండా చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నీటిని తరలించటం అంతా బూటకమే... - కొవ్వూరి త్రినాథరెడ్డి, నీటి సంఘాల రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రామచంద్రపురం(తూ.గో.) డెల్టాలో రబీ సాగు ఉండదు పట్టిసీమ వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలో రబీసాగు సగానికి పైగా తుడుచుపెట్టుకు పోతుంది. తూర్పుగోదావరిలో శివారు ప్రాంతాలకు సాగునీరందదు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉప్పునీటి ముంచెత్తడం వల్ల 10వేల ఎకరాల్లో సాగులేకుండా పోయింది. తూర్పు కంటే పశ్చిమగోదావరి జిల్లా మెరకప్రాంతం కావడంతో సగానికి పైగా సాగు ఉండదు. - ముత్యాల జమ్మి, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి, అంబాజీపేట(తూ.గో.) -
ఇబ్రహీంపట్నంను సస్యశ్యామలం చేస్తాం
మంత్రి హరీష్‌రావు హయత్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, నాలుగున్నర కోట్ల ఖర్చుతో బాచారంలోని మూసీనదిపై ఉన్న కత్వాను, కుత్బుల్లాపూర్‌లోని నారాయణరెడ్డి కత్వాలను అభివృద్ధి చేస్తామని భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజాపూర్, తొర్రూరు, తారామతిపేటలో విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు. కొహెడలో మంచినీటి సంపు, లక్ష్మారెడ్డిపాలెంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం పనులు, అబ్దుల్లాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఘట్కేసర్- అబ్ధుల్లాపూర్ రోడ్డు పనులను, గౌరెల్లిలో రోడ్డు వెడల్పు పనులను, కుంట్లూరులో ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదులను ఆయన రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువు అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తామని, వచ్చే రెండేళ్లలో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాసబ్చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హయత్‌నగర్ మండలంలో స్థలం కేటాయిస్తే ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు వెళ్లడం లేదని గుర్తించామని, వాటికి రోడ్డు ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హయత్‌నగర్ మండలంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల కోసం 2,600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, ఈఈ వెంకటరమణ, ఎస్ఈ వెంకటేశం, ఎంపీపీ జి.హరిత, జెడ్పీటీసీ టీ.నర్సింహ్మ, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ చైర్మన్ ఈ.ధనలక్ష్మీ, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సానెం కృష్ణగౌడ్, ఎంపీడీఓ జ్యోతి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఫర్నీచర్, వైద్య పరికరాలు లేకుండానే ఆస్పత్రి ప్రారంభం అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్మించిన ప్రాథమిక ఆస్పత్రిలో ఫర్నీచర్, మందులు, వైద్య పరికరాలు లేకుండానే మంత్రులు ఆస్పత్రిని ప్రారంభించారు. భవనం నిర్మించి 9 నెలల పూర్తయినా నేటి వరకు ఎలాంటి ఫర్నీచర్, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా రోగులను పరీక్షించడానికి కూడా ఎలాంటి వసతులు లేకపోవడంతో అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
వేగంగా తాడిపూడి మళ్లింపు పనులు
దేవరపల్లి:గోదావరి జలాలను కృష్ణాజిల్లాకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అధికారులు రేయింబవళ్లు కాలువ పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అడ్డంకులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్యాయ ఏర్పాట్లను చేపట్టింది. ఆగస్టు 15 నాటికి ఏదేమైనా గోదావరి జలాలను కృష్ణాకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పంపుల వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోసి నీటిని గుడ్డిగూడెం వద్ద పోలవరం కాలువకు అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకువెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని కోసం గుడ్డిగూడెం 14.806 కిలోమీటరు వద్ద రూ.25లక్షల వ్యయంతో 7 పైపులు ఏర్పాటు చేసి పైపు కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి జలాలను ఎత్తిపోయటానికి ఎనిమిది పంపులు ఏర్పాటు చేశారు. అయితే తాడిపూడి కాలువ పనులు పూర్తికాకపోవటం, పంటకాలువలు ఏర్పాటు చేయకపోవటంతో మూడు పంపులను మాత్రమే ఉపయోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. మిగిలిన ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి పోలవరం కాలువకు అనుసంధానం చేసి తాత్కాలికంగా కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని తీసుకువెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది. దాదాపు కల్వర్టు పనులు పూర్తిగావచ్చాయి. దీనికి ఎగువ భాగంలో 1.5కిలోమీటర్ వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసే నీటిని పోలవరం కాలువలో అనుసంధానం చేయడానికి భారీ పైపులతో కల్వర్టు ఏర్పాటు చేశారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు 24పంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఈ నెల 15న మూడు పంపులను వినియోగంలోకి తీసుకువచ్చి నీటిని పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేయనున్నారు. పట్టిసీమ వద్ద పంపులను ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు గుడ్డిగూడెం వద్ద ఏర్పాటు చేస్తున్న తాడిపూడి నీరు పోలవరం కుడికాలువకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. భూములు ఇక ఎడారులే తాడిపూడి నీరు పోలవరం కాలువకు అనుసంధానం జరిగితే దిగువ ప్రాంతంలోని ఆయకట్టు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయకట్టు భూములలో వరినాట్లు ఎండిపోతుండగా ఉన్న నీటిని పోలవరంలోకి మళ్లిస్తే ఈ ప్రాంత రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసినట్టవుతుందని రైతులు వాపోతున్నారు. 3 పంపుల ద్వారా తాడిపూడి వద్ద ఎత్తిపోస్తున్న నీరు ప్రవహించడానికి కాలువగట్లకు పలుచోట్ల గండ్లు పడుతుండగా 8పంపులు ఒకేసారి వినియోగంలోకి తీసుకువస్తే గట్లు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంత రైతాంగానికి ద్రోహం చేసే పనికి పూనుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు. పట్టిసీమ నాలుగు పంపులతో పాటు తాడిపూడికి సంబంధించిన ఐదు పంపులను ఉపయోగించి 1800 క్యూసెక్కుల నీటిని తాడిపూడి కాలువ ద్వారా పోలవరానికి మళ్లించి కృష్ణాకు తీసుకువె ళ్లటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తాడిపూడి కాలువ ద్వారా సుమారు 2.06 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయవలసి ఉండగా 60 నుంచి 70 వేల ఎకరాలకే సరఫరా చేస్తున్నారు. అన్ని పంపులను వినియోగించి తాడిపూడి ఆయకట్టు భూములకు నీరు సరఫరా చేయకుండా పోలవరానికి అనుసంధానం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమాల ‘పుట్టి’!
పట్టిసీమ ఎత్తిపోతల్లో అవినీతి ప్రవాహం కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును ‘లిఫ్ట్’ చేయడానికే... నిబంధనలకు విరుద్ధంగా 5 శాతానికి మించి టెండర్ వేయడానికి అవకాశమివ్వాలని నిర్ణయం జనవరి 20న మెమో జారీ.. మినహాయింపు పట్టిసీమకేనట ‘తమ’ కాంట్రాక్టర్లు మినహా ఎవరూ రాకుండా ఎత్తుగడ! 10 కంపెనీలు టెండర్లు దాఖలు చేయకపోవడంపై అనుమానాలు 21.9 శాతం ఎక్సెస్ కోట్ చేసి ఎల్.1గా నిలిచిన ఎంఇఐఎల్కు కాంట్రాక్టు కట్టబెట్టిన సర్కారు సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో అవినీతి ప్రవహిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును లిఫ్ట్ చేయడానికి ఈ స్కీమ్‌ను ప్రభుత్వ పెద్దలు వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నీటిని నిలువ చేయడానికి వీలులేని ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమిటని టీడీపీ మినహా పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నిలదీస్తున్నా.. ప్రభుత్వం పట్టుదలతో ముందుకెళ్లడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పైగా టెండర్లను పిలవడంలోనే గోల్‌మాల్‌కు వీలుగా నిబంధనలకు ‘రూపకల్పన’ చేశారు. తొలుత రూపొం దించిన టెండర్‌ను మార్చి రెండోసారి తమకు అనుకూల నిబంధనలతో తయారు చేశారు. భారీగా ముడుపులు చేతులు మారడం వల్లనే.. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నిబంధనలు మార్చారనే ఆరోపణలున్నాయి. ‘5 శాతం’ నిబంధనకు నీళ్లు ఎర్న్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువను అనుమతించరు. గతంలో 10 శాతం వరకు అదనంగా కోట్ చేయడానికి అవకాశం ఉన్నా, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత.. 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం లేదని జీవో తెచ్చారు. ఒకవేళ టెండర్లో పాల్గొన్న కాంట్రాక్టర్లందరూ.. 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేస్తే..పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.పట్టిసీమ టెండర్లో అందుకు విరుద్ధంగా జరిగింది. తొలుత సాధారణ నిబంధనలతో జనవరి 7న టెండర్ పిలిచారు. ఆ ప్రకటన జనవరి 9న ‘ఈనాడు’లో వచ్చింది. జనవరి 12 నుంచి షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమవుతుందని, 27న ముగుస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రీబిడ్ సమావేశాన్ని 19న నిర్వహిస్తామని తెలిపారు. 28న టెక్నికల్ బిడ్స్, 31న ప్రైస్ బిడ్స్ తెరుస్తామని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.సాధారణ నిబంధనల వల్ల తాము ‘ఆశించిన ప్రయోజనం’ దక్కదనే ఉద్దేశంతో టెండర్ నిబంధనలు మార్చాలని ప్రభుత్వ పెద్దలు భావించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇలా ‘5 శాతం’ మించకూడదనే నిబంధనను తుంగలో తొక్కేశారు. అధిక ధరకు వీలుగా మెమో జారీ అధిక ధరకు కోట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 20న మెమో (నం. 52/ప్రాజెక్ట్ 1.ఎ.2/2015)ను ప్రభుత్వం జారీ చేసింది. 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం ఉంటుందని, గడువులోగా పూర్తి చేస్తే 5 శాతానికి పైన కోట్ చేసిన మొత్తాన్ని నజరానాగా చెల్లిస్తామని మెమోలో పేర్కొన్నారు. ఈ మినహాయింపు కేవలం పట్టిసీమ ప్రాజెక్టుకే పరిమితమని, మిగతా ప్రాజెక్టులకు సాధారణ ఈసీపీ నిబంధనలే వర్తిస్తాయని పేర్కొన్నట్లు తెలిసిం ది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. అన్ని టెండర్లు, ప్రాజెక్టులకు అది వర్తించాలి.కేవలం ఈ ఎత్తిపోతల టెండర్లకే మినహాయింపు పరిమితంటూ నిర్ణయం తీసుకోవడానికి ‘అవినీతి’ ఒత్తిడే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. ‘5 శాతం కంటే అధికంగా కోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 శాతం పైన కోట్ చేసిన మొత్తాన్ని గడువులోగా పూర్తి చేసిన తర్వాతే చెల్లించాలి’ అనే సవరణలను టెండర్ నిబంధనలకు జోడించారు. ప్రపంచంలో ఎక్కడా లేదు! విచిత్రమైన విషయం ఏమిటంటే.. పని పూర్తి చేయడానికి టెండర్లో ఇచ్చిన గడువు ఏడాది కాలమే.ఆ సామర్థ్యం ఉన్న సంస్థలే అందులో పాల్గొంటాయి. అటువంటప్పుడు ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తే.. 5 శాతం పైన కోట్ చేసిన మొత్తాన్ని నజరానాగా ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారులే అంటున్నారు. ఇలా 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. రెండో టెండర్ నోటీసు ప్రకటనను జనవరి 30న ‘ఈనాడు’లో ప్రకటించారు. అయితే సవరణల్లో ముఖ్యమైన అంశమైన ‘5 శాతం పరిమితి తొలగింపు’ విషయాన్ని ప్రకటనలో పేర్కొనకపోవడం గమనార్హం. కేవలం టెండర్ షెడ్యూళ్లలో మార్పునే ప్రకటనలో పేర్కొన్నారు.‘ఈనాడు’లో ప్రకటన వచ్చేసరికే షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. జనవరి 24 నుంచే షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమైంది. పత్రికల్లో నోటీసు వచ్చిన మరుసటి రోజే.. జనవరి 31న ప్రీబిడ్ సమావేశం ధవళేశ్వరంలో జరిగింది. అంటే.. తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్లు మినహా, మిగతా వారిని కట్టడి చేసేందుకే ఇలా ప్రకటన ఇచ్చారని అధికారులే చెబుతున్నారు. ప్రీబిడ్ సమావేశానికి మొత్తం 12 సంస్థలు రాగా కేవలం రెండు సంస్థలే టెండర్లు దాఖలు చేశాయి. 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం ఉన్నా.. మిగతావారు ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తొలి టెండర్లో అసమగ్ర డాక్యుమెంట్ తొలి టెండర్ ముగింపు తేదీ జనవరి 27. ముగింపు తేదీ కంటే నాలుగు రోజుల ముందే.. అంటే జనవరి 24 నుంచే సవరించిన టెండర్ షెడ్యూళ్ల అమ్మకం ప్రారంభమైంది. తొలి టెండర్లో అసమగ్ర టెండర్ డాక్యుమెంట్‌ను ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో ఉంచారని అధికార వర్గాల సమాచారం. అందువల్ల తొలి విడతలో కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి అవకాశం లేకుండా పోయింది. తమతో అవగాహన ఉన్న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు.. తొలి టెండర్లో ఎవరూ పాల్గొనకుండా ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొందనే ఆరోపణలున్నాయి. సవరణల తర్వాత.. అంతా అనుకున్న తీరుగానే జరిగే విధంగా పక్కాగా వ్యూహరచన జరిగిందని, తమతో అవగాహన ఉన్న కంపెనీకి కాంట్రాక్టు దక్కడానికి, తద్వారా కాంట్రాక్టర్ నుంచి కాసులు రాల్చుకోవడానికి అడ్డగోలుగా నిబంధనలు మార్చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 16.9 శాతం నజరానా టెండర్ సవరణల తర్వాత 5 శాతానికి మించి కోట్ చేయడానికి అవకాశం కల్పించినా.. ఇద్దరే కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. ఎంఇఐఎల్ (మెయిల్), ఎల్ అండ్ టీ టెండర్లు వేశాయి. ఎంఇఐఎల్ తక్కువ (21.9 శాతం ఎక్సెస్) కోట్ చేసి ఎల్1గా నిలిచింది. ఎల్1గా ఎంఇఐఎల్కు ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టింది. పట్టిసీమ పని విలువ రూ. 1,170.25 కోట్లు. ఎల్1గా నిలిచిన కంపెనీ కోట్ చేసిన ధర (21.9 శాతం ఎక్సెస్) ప్రకారం.. రూ. 1426.53 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే పని విలువ కంటే రూ.256.28 అధికంగా చెల్లించాలి. ప్రభుత్వం చెబుతున్న విధంగా 5 శాతంపైన ఉన్న 16.9 శాతం నజరానా విలువ.. రూ. 198 కోట్లు. కాంట్రాక్టర్ అనుకూల నిర్ణయం వల్ల ఖజానా మీద ఇలా అదనపు భారం పడుతుంది.ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి, సకాలంలో పూర్తి చేయకపోవడానికి తామే కారణమని ఏ కాంట్రాక్టర్ చెప్పరు. ప్రభుత్వం మీదకే తప్పును నెట్టేస్తారు. ఇచ్చిన గడువులోగా పూర్తి చేయకపోయినా మొత్తం సొమ్ము చెల్లించాల్సిందేనని అడుగుతారు. పట్టిసీమ విషయంలో జాప్యం జరిగినా.. టెండర్ నిబంధనలే అడ్డగోలుగా మార్చేసిన ప్రభుత్వం, తమతో అవగాహన కుదుర్చుకున్న కాంట్రాక్టర్‌కు నజరానా చెల్లించకుండా ఎందుకుంటుంది? అని అధికారులే అంటున్నారు. -
మా బాబే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉభయగోదావరి జిల్లాల రైతాంగం ప్రాణాలను పణంగా పెట్టి వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకువెళుతున్న సర్కారు ఇప్పుడు నిండు శాసనసభలోనూ పచ్చి అబద్ధపు ప్రకటనలతో సమర్థించుకుంటోంది. మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన చర్చతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వరదల కాలంలోనే గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తామని ప్రకటిస్తూ.. గోదావరి ఏడాదిలో నాలుగున్నర నెలలు పొంగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఉభయగోదావరి జిల్లాల రైతాంగం భగ్గుమంటోంది. శానససభ సాక్షిగా చంద్రబాబు పచ్చి దగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతోంది. వాస్తవానికి గోదావరికి సగటున వరద కాలం రెండు నెలలు కాగా గత కొన్నేళ్లుగా 45 రోజులుకు కూడా వరద నీరుభారీగా వస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ భారీగా వచ్చినా నిల్వ చేసే వనరులూ లేవు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని రెండో పంటకు ఏటా సీలేరు రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. డెల్టా పంటలకు 12వేల 500 క్యూసెక్కుల నీరు అవసరం కాగా, ఆ సమయంలో గోదావరి నదిలో కేవలం 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే నీరు మళ్లిస్తామని సర్కారు చెబుతోంది. సీజన్ మార్పు కారణంగా జూన్, జూలై నెలల్లో గోదావరిలో వరదనీరే ఉండటం లేదు. గత ఏడాది జూన్, జూలై నెలల్లో కూడా గోదావరిలో 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వఉంది. ఇప్పటికే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మెట్ట ప్రాంతాల్లోని పంటలకు మళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుందంటూ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే రైతన్నల మొరను ఏ మాత్రం పట్టించుకోని సర్కారు చివరికి అసెంబ్లీ సాక్షిగా కూడా మోసపూరిత ప్రకటనలు చేస్తోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గోదావరి నాలుగున్నర నెలల పాటు పొంగిన చరిత్ర ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవే మాటలు ఇక్కడికొచ్చి మాట్లాడితే సరైన సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్ బాసటతో రైతన్నల హర్షం గోదావరి జిల్లాల రైతులకు ప్రభుత్వం ఏమాత్రం భరోసా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు నీటిని మళ్లిస్తున్న చర్యలతో రైతులలో తీవ్ర ఆందోళన నెలకొందంటూ వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. పట్టిసీమ రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద కాలం 60 రోజులు కాగా.. నాలుగున్నర నెలలు ఎప్పుడుందంటూ సర్కారును నిలదీశారు. పట్టిసీమను హడావుడిగా చేపడుతున్న ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని పక్కన పెడుతోందన్న రైతుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన పోరాటం ఇక్కడి రైతాంగానికి స్థైర్యాన్నిచ్చింది. చంద్రబాబు నయవంచన తీరును ఎండగట్టి డెల్టా రైతన్నలకు జగన్ బాసటగా నిలిచారంటూ ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం.. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నమోదైన గోదావరి వరద వివరాలిలా గోదావరి ఫ్లడ్ సీజన్ జూలై నుంచి అక్టోబర్ అత్యధిక వరద కాలం జూలై నుంచి ఆగస్టు నెల వరకు మాత్రమే. ఇప్పటి వరకు జూలై, ఆగస్టు నెలల్లోనే అధిక నీటి మట్టాలు, అత్యధిక వరద నమోదయ్యాయి. అప్పుడప్పుడు మాత్రమే సెప్టెంబర్‌లో నమోదవుతుంది. గడిచిన 155 సంవత్సరాల నుంచి గోదావరి వరద రికార్డులను పరిశీలిస్తే 20 నుంచి 25 సార్లు మాత్రమే అత్యధిక (ప్రమాద స్థాయికి) వరద చేరింది. 1861 నుంచి ఇప్పటి వరకు కేవలం నాలుగుసార్లు అక్టోబర్ నెలలో అత్యధిక స్థాయి వరద నమోదు కాగా, ఇందులో రెండుసార్లు వరద ప్రమాద స్థాయికి చేరింది. 1861 నుంచి గోదావరి వరదలను పరిశీలిస్తే 30.10.1891లో రెండోప్రమాద హెచ్చరిక దాటి 17అడుగులకు చేరింది. (17.75 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు) 1.10.1948లో 8.20 అడుగుల అత్యధిక వరద నమోదైంది. 17.10.1987లో 9.75 అడుగుల స్థాయికి చే రింది. 23.10.1995లో ఒక సారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 17 అడుగులకు (మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపానికి) నమోదైంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.75 అడుగులకు చేరితే మొదటి హెచ్చరిక, 13.75 అడుగులకు చేరితే రెండో హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 60 రోజులకు మించి వరద ఉండదు గోదావరి నదిలో 60 నుంచి 70 రోజుల వరకు మించి వరద ఉండదు. అది కూడా అన్ని జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాలుగు నెలలు గోదావరికి వరద వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దీని అర్థమేమిటంటే ఆ నాలుగు నెలల పేరుతో కృష్ణా డెల్టాకు నీరు తోడే కుట్ర జరుగుతుంది. పట్టిసీమ వద్ద కడుతున్న ఎత్తిపోతల పథకం ఎంపీడీఎల్ ఎత్తు 12.5 మీటర్ల కంటే 14 మీటర్లు ఎత్తు పెంచితే గోదావరి డెల్టాకు కొంత ఇబ్బంది తప్పవచ్చు. ఎత్తు పెంచకపోతే రబీ సమయంలో కూడా కృష్ణాడెల్టాకు గోదావరి నుంచి నీరు తరలించుకోవచ్చునన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏదిఏమైనప్పటికీ ఎత్తిపోతల పథకం ముమ్మాటికి గోదావరి జిల్లా ప్రజలకు ముప్పుగానే భావించవచ్చు. - ప్రొఫెసర్ పీఏ రామకృష్ణంరాజు, జల వనరుల నిపుణులు ఏడాదిలో రెండు నెలలు పాటే వరద గోదావరి నదికి ఏటా జూలై రెండో వారం నుంచి రెండు నెలల పాటు వరద భారీగా వచ్చి చేరుతుంది. ఏడాదిలో రెండునెలలు మాత్రమే అత్యధికంగా వరదనీరొస్తుంది. అక్టోబర్, సెప్టెంబర్ నెలల్లో గత 150 సంవత్సరాల నుంచి వరద నీర్చొచ్చినా చెప్పుకోదగినంత నమోదు కాలేదు. ఇప్పటి వరకు నమోదైన వరద నీటిమట్టాలు పరిశీస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అన్ని ఉపనదులు ఒకేసారి పొంగి ప్రవహించడం మూలంగా గోదావరికి వరదలు వస్తాయి. - విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం చంద్రబాబువన్నీ మాయమాటలే గోదావరి నదికి ఏ సమయంలో వరద వస్తుందో తెలియకుండా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు చెప్తున్నవన్నీ పక్కా మాయమాటలు. పోలవరంను విస్మరించే కుట్ర ఇదంతా. గోదావరికి రెండు నెలలు మాత్రమే వరద నీరు వస్తుంది. అదే సమయంలో కృష్ణానదిలో కూడా వరద నీరు ఉంటుంది. ఆ సమయంలో ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే 80 టీఎంసీల నీరు ఎక్కడ స్టోరేజ్ చేస్తారు, కృష్ణా నదిలో కేవలం 3 టిఎంసీల నీరు మాత్రమే ఆ సమయంలో స్టోర్ చేయవచ్చు. ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకం. - రుద్దరాజు పండురాజు పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ -
‘బాబు’ నిర్ణయంపైనే పట్టిసీమ ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై శాసనసభలో చర్చ జరగనున్న కారణంగా ఈనెల 14న తలపెట్టిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు సర్కారు మొండిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో రైతుల పక్షాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తారని ఎదురు చూస్తున్నామని, చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయూన్ని అనుసరించి తమ ఉద్యమం ఉంటుందని నెహ్రూ చెప్పారు. అంతవరకు వేచి చూస్తామన్నారు. -
ముంపు ఒకరిది..మేలొకరికి!
అచ్చంపేట : ముంపు ఒకరికైతే.. మరొకరికి మేలు జరుగనుంది. ఓ ప్రాంత రైతులు నష్టపోతే మరోప్రాంత రైతులకు లబ్ధి చే కూరనుంది. మహబూబ్‌నగర్, నల్లగొం డ జిల్లాల మధ్య డిండి ఎత్తిపోతల పథకం విషయంలో ఇదే జరుగుతుంది. ఎస్ఎల్బీసీ, మిండ్ డిండి ఎత్తిపోతలతో పా టు జూరాల- పాకాల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా డిండికి నీళ్లను తీసుకొచ్చే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కృష్ణానది మిగులు జలాల ద్వారా ఎస్ఎల్బీసీ, డిం డి ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాట ర్ నుంచి 25 టీఎంసీల నీటిని నల్లగొండ జిల్లాకు తీసుకెళ్లి ఆరులక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. నక్కలగండి, లోయర్డిండి, మిడ్డిండిల కొత్త రిజర్వాయర్లతో పాటు పాత అప్పర్డిండి ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల అచ్చంపేట నియోజకవర్గంలోని 11గ్రామాలు, సుమారు 10వేల ఎకరాలు నీటిముంపునకు గురవుతున్నాయి. భూములు కోల్పోయేది తామైతే.. నీళ్లు పొందేది వాళ్లా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే డిండి ఎత్తిపోతల తెరపైకి వచ్చింది. డిండి రిజర్వాయర్ ఎత్తు పెంపుపై ఇప్పటికే అచ్చంపేట ఎమ్మెలే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. నష్టం మనది.. ఫలితం వారిదా? ఎస్ఎల్బీసీ టన్నెల్-1 అవుట్లెట్ నుంచి నక్కలగండి వద్ద 7.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో లోయర్ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీంతో అచ్చంపేట మండలం మర్లపాడుతండా, పాత్యతండా, కేశ్యతండా, జోగ్యతండా, మన్నెవారిపల్లి, సిద్ధాపూర్, దేవులతండాలకు చెందిన 2755 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. టన్నెల్ మట్టి డంప్‌యార్డు కోసం 450 ఎకరాల భూమిని ఇప్పటికే ఈ ప్రాంతవాసులు కోల్పోయారు. లోయర్ డిండికి 6కి.మీ వెనుక 11 టీఎంసీల నిల్వసామర్థ్యం గల మిడ్ డిండి రిజర్వాయర్‌ను సిద్ధాపూర్ వద్ద నిర్మిస్తున్నారు. ఇది జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కంటే పెద్దది. దీనివల్ల సిద్ధాపూర్, అనుబంధ తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఇందులో 3వేల ఎకరాల భూములు కోల్పోనున్నారు. కొత్తగా నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌కు 16కి.మీ దూరం వెనుకభాగంలో అప్పర్ పాతడిండి ప్రాజెక్టు ఉంది. మిడ్‌డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఒక భారీలిఫ్ట్ను నిర్మించి పాతడిండికి నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పాతడిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీలు కాగా, ఐదు మీటర్ల ఎత్తు పెంచి ఆధునికీకరించి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల వంగూరు మండలం గాజర, డిండి చింతపల్లి, నిజామాబాద్, చాకలి గుడిసెలు, ఉప్పునుంతల మండలం కొరటికల్లు గ్రామాలతో పాటు 3500 ఎకరాల భూములు మునిగిపోనున్నాయి. ప్రతిపాదనలు ఇలా.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌కు లింక్ కలపడానికి శ్రీశైలం అప్పర్‌ప్లాట్ గుట్టల్లో భూగర్భ టన్నెల్, రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం జలయజ్జంలో రూ.2813కోట్లు కేటాయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 43.5 కి.మీ మేర సొరంగమార్గం తవ్వాల్సి ఉంది. ఇప్పటికీ కేవలం 23.7కి.మీ మాత్రమే పూర్తయింది. కాగా, దీనికి అనుసంధానంగా రూ.5700 కోట్ల వ్యయంతో డిండి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పాత డిండి ప్రాజెక్టును ఆధునికీకరించి నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లోని మరో మూడులక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సర్వేలు ముగిశాయి. ప్రస్తుతం పాత డిండి ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.6టీఎంసీ కాగా, ఐదు మీటర్లు ఎత్తు పెంచి 7.6 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదించారు. పాలమూరు జిల్లా పరిధి అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో 17వేల ఎకరాలు, కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, ఇర్విన్ మండలాల్లో 10వేల ఎకరాలు, అమ్రాబాద్ ఎత్తిపోతల ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెబుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఇదే నియోజకవర్గంలోని 20వేల ఎకరాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. -
‘కల్వకుర్తి’ మూడోదశ పూర్తయ్యేదెప్పుడు?
ఆరు నెలలుగా ఆగిన పనులు పనుల గడువును ఏడాది పొడిగించినా మారని కాంట్రాక్టు సంస్థ తీరు వచ్చే జూన్‌లోగా ప్రాజెక్టు పూర్తికావడం అనుమానమే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. వివిధ కారణాలను చూపుతూ కాంట్రాక్టు సంస్థ ఆరు నెలలకు పైగా పనులను పూర్తిగా నిలిపివేసి చోద్యం చూస్తోంది. పనులు పూర్తి చేసేందుకు గతంలో విధించిన గడువు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసినా, పనుల చివరి దశలో ఇతర కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటం ఇష్టం లేక ప్రభుత్వం పాత సంస్థకే మరో ఏడాది గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు దశలుగా ప్రాజెక్టు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 3.40లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నలబొగడ రెండో దశ కింద 47వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను నిర్మించేందుకు 2005-06లో గ్యామన్ ఇండియా అనే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. 13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800ల క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్యామన్ ఇండియా 2010లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు గడువును పొడిగించింది. ఈ ఏడాది మే వరకు ఆ సంస్థ 82 శాతం పనులను పూర్తి చేసింది. అయితే జూన్ మొదటివారం నుంచి పనులను పూర్తిగా నిలిపివేసింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యానే కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. గడువు పొడిగించినా కదలని పనులు.. కాగా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఈ ఏడాది జూన్‌తో గడువు ముగియగా సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు గడువును ఏడాది పాటు పొడిగించింది. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మధ్యలో నిలిచిపోయిన సుమారు రూ.110కోట్ల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరందించాలని ఆదేశించింది. అయితే గడువు పొడిగించి రెండు నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు కదల్లేదు. దీనిపై స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. -
ఎత్తిపోయిన ఎత్తిపోతల పథకం
వెల్దుర్తి : మండలంలోని కుకునూర్ హల్దీవాగులో 20 ఏళ్ల క్రితం రూ. 31 లక్షలు ఖర్చు చేసి ఎత్తి పోతల పథకాన్ని నిర్మించినా, అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, లబ్ధిదారుల అవగాహన లోపం అన్నీ కలగలిపి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. ఫలితంగా 181 మంది రైతు కూలీల బతుకులకు ఆసరా లేకుండాపోయింది. కూలీలను రైతులను చేయాలని భూమి లేని ఎస్సీలను రైతులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కుకునూర్ హల్దీవాగు ఒడ్డున ఉన్న 181 ఎకరాల సీలింగ్ భూమిని కుకునూర్, పంతుల్‌పల్లి, బస్వాపూర్ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేసింది. నిరుపేద రైతులు ఈ భూముల్లో పంటలు పండించి అభివృద్ధి చెందడం కోసం 1992లో అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి కృషి ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై రూ. 22 లక్షలు మంజూరు చేయించారు. ఆ డబ్బులతో 116 ఎకరాలను చదును చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు అవసరమైన డబ్బును కూడా ఎస్సీ కార్పొరేషన్ చెల్లించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఐడీసీ సహకారంతో హల్దీవాగులో ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు బావులు తవ్వి రింగులు వేశారు. ఈ బావుల్లో 7.5 హెచ్‌పీ మోటర్లను బిగించి నీటి సరఫరా కోసం చదును చేసిన భూముల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక బతుకులు బాగుపడతాయని రైతులంతా భావించారు. కానీ సాగు సలహాలు ఇచ్చేవారు కరువవడంతో రైతులు ఆ పొలాన్నీ వృథా ఉంచేశారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి విలువైన పైపులను దొంగలు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పైపులను ఎత్తుకెళ్లారు. అలాగే విద్యుత్ వైర్లు, ప్యానల్ బోర్డులు, స్టాటర్లు, 7.5 హెచ్‌పీ మోటర్లను సైతం చోరులు అపహరించారు. సంవత్సరాలు గడచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం చెట్లు, ముళ్ల పొదలతో అటవీ ప్రాంతంగా మారింది. ప్రస్తుతం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామంటున్న కేసీఆర్ సర్కార్ బీడుగా మారిన భూములను చదును చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తే సాగుకు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని, తద్వారా తమ బతుకులు బాగుపడతాయని రైతులు కోరుతున్నారు. బోర్లు వేస్తే సాగు చేసుకుంటాం తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన 181 ఎకరాల్లో బోర్లు వేసి మోటర్లు బిగిస్తే కలిసికట్టుగా శ్రమించి పంటలు సాగు చేసుకుంటామని రైతులు తెలిపారు. ప్రతి పది ఎకరాలకు ఓ బోరు వేసి, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సాగుకు సలహాలు, సూచనలు ఇస్తే సిరులు పండిస్తామని రైతులు చెబుతున్నారు. -
ఖర్చు బారెడు సాగు చారెడు!
కొల్లాపూర్: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ)పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయకట్టు లక్ష్యంలో సగానికి కూడా సాగునీటిని ఇవ్వలేకపోయారు. రూ.2995 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.2650కోట్లకు పైగా ఖర్చుచేశారు. 2012లో ప్రాజెక్టులోని మొదటిలిఫ్ట్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మొదటిలిఫ్ట్ ద్వారా 13వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఖర్చుచేసిన మొత్తానికి, సాగవుతున్న ఆయకట్టుకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. దాదాపుగా 90శాతం నిధులు ఇప్పటికే ఖర్చుచేసిన అధికారులు లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం పూర్తిగా వెనుకపడిపోయారు. ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ మినహా మిగతా రెండు లిఫ్టుల్లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. జొన్నలబొగుడ ఎత్తిపోతల పనులు అరకొరగా సాగుతుండగా గుడిపల్లిగట్టు లిఫ్టు పరిస్థితి మరింత దారుణంగా మారింది. పనుల్లో నాణ్యతాలోపాలు ఎంజీఎల్‌ఐ పనుల్లో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. సాగునీటిని విడుదల చేస్తున్న లిఫ్టుల్లో నీటిలీకేజీ కారణంగా పంపుహౌస్ మునిగిపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే పంపుహౌస్‌లోకి నీరు ఎలా చేరిందనే విషయమై ఇప్పటివరకు అధికారులు కచ్చితమైన నిర్ధారణకు రాలేదు. లిఫ్ట్ పనులు చేపట్టిన పటేల్ కంపెనీని వెనకేసుకొచ్చేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జొన్నలబొగుడ లిఫ్ట్ వద్ద కూడా గతంలో సర్జిపూల్లో మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. పంపుహౌస్‌లో కూడా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా, ఇటీవల రెండురోజుల క్రితం కురిసిన వర్షాలకు పంపుహౌస్‌లోకి భారీగా నీరు చేరింది. ఇక ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. కొల్లాపూర్ మండలంలో పంటలకు సాగునీరు అందిస్తున్న కాల్వల నిర్వహణ కాంట్రాక్టర్, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా అస్తవ్యస్తంగా తయారైంది. ఎల్లూరు రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న కాల్వలన్నింటిలో జమ్ము విపరీతంగా పెరిగింది. నీరు ముందుకుపారేందుకు రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కాల్వలకు లైనింగ్ చేయడం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికారణంగా చాలా మేరకు నీరు భూమిలోనే ఇంకిపోతుంది. ఈ నేపథ్యంలో సోమవాం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదనపు రిజర్వాయర్ల నిర్మాణం జరిగేనా? ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని కొల్లాపూర్‌తోపాటు అచ్చంపేట, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గాలకు సాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన రిజర్వాయర్లు మాత్రం లేవు. ప్రస్తుతం నిర్మించిన మూడు రిజర్వాయర్లతోపాటు మినీ రిజర్వాయర్‌గా కొనసాగుతున్న సింగోటం శ్రీవారిసముద్రంతో కలిసి కేవలం నాలుగు టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసే వీలుంది. అదనపు రిజర్వాయర్ల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టిసారించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. -
నీటమునిగిన పంప్‌హౌస్!
కొల్లాపూర్: మహబూబ్‌నగర్‌లో కరువు నేలలకు సాగునీరందించే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీఎల్‌ఐ)లోని ఐదు మోటార్లు బుధవారం నీట మునిగాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌పై ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా రూ.490 కోట్లతో ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్ నిర్మించారు. ఈ పనులు గతేడాది పూర్తయి.. ఇటీవలే ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన ఐదు మోటార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా, ఇటీవల కృష్ణానదికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం ట్రయల్న్ ్రచేస్తుండగా పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చి, ఐదుమోటార్లు నీటిలో మునిగిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులో జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు తెలియజేశామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఏజెన్సీదే బాధ్యత సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని పంప్‌హౌస్ మునకకు సంబంధిత ఏజెన్సీనే బాధ్యత వహించాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాజెక్టు కాంట్రాక్టు పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత ఏజెన్సీలదేనని, పంప్‌హౌస్ మునక కారణంగా జరిగిన నష్టానికి వారే బాధ్యత వహిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. -
పరుగు.. పరుగున గోదారమ్మ
* దేవాదుల వద్ద 74 మీటర్లకు చేరిన నీటి మట్టం * పంపింగ్‌కు మోటార్లు సిద్ధం ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం గురువారం 74 మీటర్లకు చేరుకుంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు వస్తోంది. దేవాదుల వద్ద జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నిర్మించిన ఇన్‌టేక్‌వెల్‌లోకి నీరు చేరుకుంటోంది. దేవాదుల ప్రాజెక్టులోని నాలుగు మోటార్లు రన్ కావడానికి 72 మీటర్ల నీటి మట్టం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం నీరు 74 మీటర్లు ఉన్నందున ఇరిగేషన్ అధికారులు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. నీరు విడుదలైతే తపాస్‌పల్లి, భీంఘన్‌పూర్, ధర్మసాగర్ రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటారుు. అయితే మోటార్లను రన్ చేయడానికి ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాసినట్టు డీఈఈ చిట్టిరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మోటార్లను రన్ చేస్తామన్నారు.