కొల్లాపూర్: మహబూబ్‌నగర్‌లో కరువు నేలలకు సాగునీరందించే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీఎల్‌ఐ)లోని ఐదు మోటార్లు బుధవారం నీట మునిగాయి. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌పై ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా రూ.490 కోట్లతో ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్ నిర్మించారు. ఈ పనులు గతేడాది పూర్తయి.. ఇటీవలే ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన ఐదు మోటార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా, ఇటీవల కృష్ణానదికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం ట్రయల్న్ ్రచేస్తుండగా పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చి, ఐదుమోటార్లు నీటిలో మునిగిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులో జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు తెలియజేశామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఏజెన్సీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని పంప్‌హౌస్ మునకకు సంబంధిత ఏజెన్సీనే బాధ్యత వహించాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాజెక్టు కాంట్రాక్టు పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత ఏజెన్సీలదేనని, పంప్‌హౌస్ మునక కారణంగా జరిగిన నష్టానికి వారే బాధ్యత వహిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి.
నీటమునిగిన పంప్‌హౌస్!
Published Wed, Sep 3 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement