
రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టారు
► తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్ట్‌లతోఏపీకి తీవ్ర నష్టం
► ఓటుకు నోటు కేసు విషయంలో
► కేసీఆర్‌తో రహస్య ఒప్పందాలు
► పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి
నెల్లూరు, సిటీ: కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి(నక్కలగండి) ఎత్తిపోతల పథకాలతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టినట్టుగా స్పష్టం అవుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసీరెడ్డి పేర్కొన్నా రు. నెల్లూరులోని ఇంది రాభవన్‌లో బుధవారం జిల్లా కాం గ్రె స్ పార్టీ నా యకులతో సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేసీఆర్‌తో రహస్య ఒప్పందాలు కుదర్చుకున్నట్టు స్పష్టమవుతుందన్నారు.కేసీఆర్ అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మించేం దుకు ప్రయత్నాలు చేస్తుంటే బాబు మిన్నకుండటం చూస్తే ఇదే అర్థమవుతుందన్నారు. ఏపీలోని 9 జిల్లాల్లోని 48.24 లక్షలు ఎకరాలకు రాబోయే రోజుల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు.
నెల్లూరు జిల్లా లో 3.33 లక్షలు ఎకరాలు నీరందక ఏడారి గా మారే ప్రమాదం ఉందన్నా రు. ఏపీ లో నీటికి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. రైతులకు నష్టం వాటిల్లితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగి లిపోతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, వెంకట్రావు, దేవకుమార్‌రెడ్డి, సీవీ శేసారెడ్డి, రఘురామ్‌ముదిరాజ్, బాలసుధాకర్, అరుణమ్మ, బాలకృష్ణ పాల్గొన్నారు.