కొండపాక(మెదక్): ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీల జలాశయాన్ని తలపెట్టిన దాఖలా తెలంగాణలో తప్ప ప్రపంచంలోనే మరెక్కడా లేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. మెదక్‌జిల్లా కొండపాక మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఎర్రవల్లి, సింగారంలలో శనివారం కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, ఉస్మానియా కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డిలతో కలిసి నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ లిప్టు ఇరిగేషన్ స్కీంలో 50 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం సరికాదని ఇంజనీర్లు, నిపుణులు చెపుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముంపు గ్రామాల ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు ముందుగా జిల్లా కలెక్టరుతో గ్రామ సభలు ఎందుకు పెట్టించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
మల్లన్న సాగర్ కోసం సేకరించిన భూములపై హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలను తీసుకొచ్చుకున్నారు. ఈసందర్బంగా బాలవ్వ అనే మహిళ తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించాలని టీఆర్‌ఎస్ నాయకులు బలవంతం చేస్తున్నారంటూ పురుగు మంతుఆ తాగేందుకు యత్నించింది. వెంటనే అక్కడున్న వారు డబ్బాను లాక్కోన్నారు. ప్రాజెక్టులో ఎర్రవల్లి మునిగిపోతే పురుగుల మందే శరణ్యమంటూ మహిళలు ముక్త కంఠంతో నినదించారు.
‘ఇలాంటి విడ్డూరం ప్రపంచంలోనే లేదు’
Published Sat, Jul 16 2016 11:01 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM
Advertisement
Advertisement