Marri Shashidhar Reddy
-
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
సీఎంను అందించిన భాగ్యనగరం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని భాగ్యనగరం మూటగట్టుకుంది. రాజకీయ ఉద్దండుడు మర్రి చెన్నారెడ్డి 1989లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు సీఎం బాధ్యతలు చేపట్టారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తనదైన మార్క్‌ను సాధించారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేయకముందే 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబర్ 11 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న సనత్‌నగర్ నియోజకవర్గం 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా నాలుగో ఎమ్మెల్యేగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు మర్రి శశిధర్‌రెడ్డిని నిలబెట్టి 1992లో గెలిపించుకుని తన రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకుసాగారు. దశాబ్ద కాలం క్రితం వరకు సనత్‌నగర్ అంటే మర్రి కుటుంబం, మర్రి అంటే సనత్‌నగర్‌గా ఉంటూ వచ్చింది. ఇవి చదవండి: TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..! -
తండ్రి దారి చూసుకున్నారు.! కొడుకు సంగతేంటీ?
కొందరి చరిత్ర ఘనంగా ఉంటుంది. వర్తమానం గందరగోళంగా ఉంటుంది. దీంతో భవిష్యత్ శూన్యంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఒక యువనేత పరిస్థితి అలాగే తయారైంది. తాత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. తండ్రి కూడా కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తండ్రి పార్టీ మారాడు..మరి కొడుకు హస్తం పార్టీలో ఉంటారా? తండ్రి బాటలో నడుస్తారా? చరిత్ర ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం మర్రి ఆదిత్యరెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. తాత మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గానూ పనిచేశారు. తెలంగాణలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా చేశారు. యూపీఏ హయాంలో కేంద్రంలో విపత్తు నిర్వహణ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. మర్రి కుటుంబ చరిత్ర ఎంతో ఘనం. కాని చెన్నారెడ్డి మూడో తరానికి చెందిన ఒక వారసుడి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనే చర్చ ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త తరం .. కొత్త ఛాలెంజ్ మర్రి శశిథర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఢిల్లీ వెళ్ళి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. శశిధర్‌తో పాటు మరో కుమారుడు పురూరవరెడ్డి కూడా తండ్రితో బాటలోనే నడిచి కాషాయ కండువా కప్పుకున్నారు. తన కుటుంబ ఘనమైన చరిత్ర చూసైనా తనకు పార్టీలో విలువ ఇవ్వడంలేదని కినుక వహించిన శశిధర్‌రెడ్డి గాంధీభవన్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు శశిధర్ మరో కుమారుడు ఆదిత్య రెడ్డి వంతు వచ్చింది. ఆదిత్య తన తండ్రి, సోదరుడి బాటలో నడుస్తారా? లేక తాత వారసత్వాన్ని కొనసాగిస్తారా? అంటూ చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీజేఎస్‌లో చేరిన ఆదిత్యరెడ్డి తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు పూర్తవ్వగానే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పునరాగమనం తర్వాత ఆదిత్యరెడ్డి కాంగ్రెస్‌లోన యాక్టివ్గానే ఉంటున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్న కుటుంబమే అయినా.. శశిధర్‌రెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. ఇప్పుడు తండ్రి, సోదరుడు పార్టీ మారడంతో తాను కూడా వారి బాటలో నడవాలా లేక కాంగ్రెస్‌లో కొనసాగాలా అనే విషయాన్ని తేల్చుకోలేక మీమాంసలో పడ్డారు ఆదిత్య రెడ్డి. ఢిల్లీ సరే, గల్లీలో సంగతేంటీ? మర్రి చెన్నారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పేరే ఉంది. తాతకు ఉన్న పేరు ప్రతిష్టలను ఉపయోగించుకుని కాంగ్రెస్‌లోనే రాజకీయంగా ఎదగాలని ఆదిత్య రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గతంలో తండ్రి పోటీ చేసి గెలిచిన సనత్ నగర్ లేదంటే తాండూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ ఎలా రూపొందించుకోవాలో అనే విషయంపై కొద్ది రోజుల్లోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. మరి తాత..తండ్రి దారుల్లో ఏ దారి ఎంచుకుంటారో ? ఎలా నడుస్తారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎందుకింత ‘హస్త’వ్యస్తం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటు అందించినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అస్తవ్యస్తంగా మారడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతుండటం, సంప్రదాయ ఓటు బ్యాంకు చేజారడం, నేతలు వీడుతుండటాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల అనంతరం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో బీజేపీ పెద్దగా ఉనికి లేదనుకున్న చోట్ల కూడా ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో పలువురు కాంగ్రెస్ నేతలు నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదులు చేశారు. ఇటీవల పార్టీని వీడిన మర్రి శశిధర్‌రెడ్డి ఆయా అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు. తర్వాత కొందరు సీనియర్ నేతలు కూడా ఫ్యాక్స్, ఈమెయిళ్ల ద్వారా పలు అంశాలను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ వ్యవహారం ఏమిటో పరిశీలించాలని ఖర్గేకు సూచించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏడాదిన్నరగా కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏమైంది? 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24 శాతం, 28.5 శాతం ఓట్లు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 29.5శాతం వచ్చాయి. ఉంది. తర్వాత జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో 48శాతం, నాగార్జునసాగర్‌లో 42శాతం ఓట్లు సాధించగలిగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు 35 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. మునుగోడులోనూ 49శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక భారీ బహిరంగ సభలు నిర్వహించినా పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఎందుకు పడిపోయిందన్న దానిపై అధిష్టానం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవడం, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటంపై కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమీక్షించారు. పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ ఇటీవల భేటీ అయ్యారు. సీనియర్ల మధ్య సమన్వయ లేమి, ఇటీవల కొందరు సీనియర్లను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో సీనియర్లను టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులపైనా చర్చించినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు పనిచేయడకపోవడం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఒక్కో ఉమ్మడి జిల్లాలో రెండేసి నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ పటిష్టంగా ఉందని.. మిగతాచోట్ల మూడో స్థానంలో నిలిచే పరిస్థితి ఉందని.. దీనికి కారణమేమిటనే దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే.. తెలంగాణ సీనియర్లతో తాను మాట్లాడుతానని ఖర్గే పేర్కొన్నట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వలసలు మరింత పెరిగి నష్టం జరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఖర్గే భావిస్తున్నట్టు సమాచారం. మాణిక్యం ఠాగూర్‌ను తప్పించే యోచన? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్లు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌పై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటాన్ని ఏఐసీసీ పెద్దలు పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టు సమాచారం. ఆయనను ఒడిశా రాష్ట్ర ఇన్చార్జిగా పంపుతారనే ప్రచారం జరుగుతోంది. -
కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు తెలంగాణలోనూ కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీ గెలవాలంటే, నాయకత్వంపై నమ్మకం ఉండాలని, ఆ విషయాన్ని బీజేపీ నిజం చేస్తోందని చెప్పారు. బీజేపీలో చేరాక తొలిసారిగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా శశిధర్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎస్.కుమార్, డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, మురళీగౌడ్ స్వాగతం పలికారు. శశిధర్‌రెడ్డిని కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇతరనేతలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై రాష్ట్ర ప్రజలు విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతున్నారని, అదే సమయంలో అభివృద్ధి, మార్పు అనేది బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారని చెప్పారు. 1994, 1999 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని జాతీయపార్టీ నేతలకు ముందుగానే చెప్పగా అదే నిజమైందని గుర్తు చేశారు. శశిధర్ రెడ్డి చేరికతో నగరంలో పార్టీ మరింత బలోపేతం: కిషన్‌రెడ్డి శశిధర్‌రెడ్డి చేరికతో హైదరాబాద్ లో బీజేపీ మరింత బలపడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. శశిధర్రెడ్డి్డ కుటుంబ నేపథ్యం గొప్పదని, ఎన్నో ఉద్యమాలకు ఆయన తండ్రి చెన్నారెడ్డి నేతృత్వం వహించారని గుర్తు చేశారు. శశిధర్‌రెడ్డి సౌమ్యుడిగా పేరుందని, మాజీమంత్రి పి.జనార్దన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ ప్రజల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర వారిదన్నారు. -
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీజేపీలోకి మర్రి కుమారుడు!.. అక్కడి నుంచి పోటీ?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పాలిటిక్స్ జెట్ స్పీడ్‌లో మారిపోయితున్నాయి. ఈరోజు ఓ పార్టీ జెండా కప్పుకున్న పొలిటికల్ లీడర్ మరుసటి రోజు ఏ జెండా ఎత్తుకుంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో టీకాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాగా, ఇటీవలే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన కుమారుడు పురురవరెడ్డి సైతం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి పురురౌరెడ్డి రాజీనామా చేశారు. అయితే, పురురవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, పురురవరెడ్డి.. సనత్‌నగర్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ వీడుతున్న సమయంలో పరురవరెడ్డి.. టీపీసీసీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్టు చెప్పుకొచ్చారు. -
Congress Party: చర్యల్లో తేడాలెందుకు? కోమటిరెడ్డికి ఓ రూల్.. మర్రికి మరో రూల్!
కాంగ్రెస్ ఒక విచిత్రమైన పార్టీ. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఒక్కొక్కరి మీద ఒక్కోలా చర్యలుంటాయి. బీజేపీ నేతలతో సమావేశమయ్యారనే ఆరోపణతో ఒక నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. మరి మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చెప్పాడంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? మా వాడయితే ఓకే.! కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని.. తమది ప్రజాస్వామ్య పార్టీ అని చెబుతారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను ఘోరంగా అవమానిస్తారు. బీజేపీ నేతలను కలుసుకున్నందుకు సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని ఆరేళ్ళ పాటు బహిష్కరించారు. ఆయనకు కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఘోరంగా విమర్శించిన పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద నో యాక్షన్. పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా కనీసం పల్లెత్తు మాట అనలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో బయటపడినా ఎంపీ వెంకటరెడ్డి మీద నో యాక్షన్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేదా క్రమశిక్షణా సంఘం ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తోంది? పార్టీలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల నాయకుడెవరు? మాదంతా నిబద్ధత, క్రమశిక్షణ కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ.. అక్టోబర్ 22న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షోకాజ్ నోటీసు పంపారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరికి ఫోన్ చేసి మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకటరెడ్డికి ఏఐసిసి నోటీసు పంపింది. ఈ నోటీసుకు వెంకటరెడ్డి చాలా ఆలస్యంగా సమాధానం పంపారు. తాను రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెబుతున్న వాయిస్ మెసేజ్ తనది కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పులు తనవి కావని వివరణ ఇచ్చినట్లు ఏఐసిసి వర్గాల సమాచారం. తాను నిబద్దత, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఏఐసిసి క్రమశిక్షణ సంఘానికి చెప్పారట. అసలు కారణం అదా.? వెంకటరెడ్డి వివరణతో సంతృప్తి చెందిన ఎఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పట్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదని ఏఐసిసి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సిట్టింగ్ ఎంపీ కావడంతో చర్యలు తీసుకోవడానికి అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది అసలు విషయం. ఇప్పటికే లోక్‌సభలో తక్కువ సభ్యులతో అధమ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీని వదులుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందో పార్టీ హైకమాండ్‌కు బాగా తెలుసు. అందుకే క్రమశిక్షణ పేరుతో బెత్తం పట్టుకుంటే లోక్ సభలో మరింత పలచబడతామని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని చూసి చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డిని ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారు. కనీస వివరణ తీసుకోకుండా ఆయనపై బహిష్కరణ వేటును కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సైతం చర్యలు తీసుకుంటే సీనియర్లు రగిలిపోయే అవకాశం ఉందట. పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినా.. ఆయన ఎంపీ కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం. శశిధర్‌రెడ్డి చట్టసభ సభ్యుడు కాదు కనుకే తేలిగ్గా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటే లోక్‌సభలో కాంగ్రెస్ కౌంట్ ఒకటి తగ్గుతుంది. అందుకే హైకమాండ్ సైతం ఈయన విషయంలో సైలెంట్ అయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోగలుగుతుందా? లేదా? అన్న చర్చ సాగుతోంది. తాజాగా పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. గత కొంతకాలంగా ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధోరణి నచ్చనివారిలో ఆయన కూడా ఒకరు. ఆయన పార్టీని వీడటం వల్ల పోయేదేమీ లేదని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నా, సీనియర్ నేతలు పార్టీని వదలిపోతున్నారన్న ప్రచారం పార్టీ క్యాడర్లో నైరాశ్యానికి దారి తీస్తుంది. అసలే గత మూడు ఉప ఎన్నికలలో పార్టీకి డిపాజిట్ దక్కలేదన్న బాధ పార్టీ కార్యకర్తలలో ఉంటే, కొద్దో, గొప్పో పేరున్న నేతలు ఇలా వెళ్లిపోతుంటే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అన్న భావన సర్వత్రా ఏర్పడుతుంది. నాలుగేళ్లుగా చేయికి బేజారే! కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని తమవైపు ఆకర్షించడానికి భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్లు పోటీపడుతున్నాయి. ఆ పార్టీల ఆకర్షణ శక్తి ముందు కాంగ్రెస్ నిలవలేకపోతోంది. మునుగోడు నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, ఉప ఎన్నికలో బీజేపీ పక్షాన పోటీచేశారు. ఆయన టీఆర్ఎస్పై ఓడిపోయారు. అంతేకాదు కాంగ్రెస్‌ను మూడో స్థానానికి పంపించారు. అంతకుముందు పెద్దగా ఉనికి లేని బీజేపీకి అక్కడ తొంభైవేల ఓట్లు వస్తే, కాంగ్రెస్ 23 వేల ఓట్లే సంపాదించుకుని డిపాజిట్ కోల్పోయింది. అంతకుముందు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో పార్టీ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో పార్టీకి అండగా ఉండవలసిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు, రేవంత్‌పై అవిశ్వాసం, అసమ్మతి అని చెప్పాలి. రేవంత్ Vs సీనియర్స్.. రేవంత్ ఏకపక్షంగా పార్టీని నడిపిస్తున్నారని, సీనియర్లను సంప్రదించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కానీ, పార్టీ బాగుండాలని చిత్తశుద్దితో ఉన్నవారు ఎవరైనా ఈ అంశాల ఆధారంగా అల్లరి చేస్తారా? కాంగ్రెస్‌లో మాత్రం యధేచ్చగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్‌పై దృష్టి పెట్టి చర్చలు జరుపుతున్నారు. రేవంత్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయనకు క్లాస్ పీకారట. పార్టీ నుంచి ఎవరూ వెళ్లకుండా అంతా కలిసి కృషి చేయాలని, టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పార్టీ ఇప్పటికే రకరకాల కారణాలతో బలహీనపడింది. కనుమరుగు అవుతోన్న హస్త వైభవం ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో పట్టు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. చివరికి గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. గత ఎన్నికలలో హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మాత్రమే గెలిచారు. వారు కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లోకి చేరిపోయారు. టీఆర్ఎస్ను ఎలాగోలా ఎదుర్కొందామంటే, ఇప్పుడు బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం ఒక సీటు మాత్రమే ఉన్న బీజేపీ ఆ తర్వాత రెండు ఉప ఎన్నికలలో గెలిచి తన సంఖ్యాబలాన్ని మూడుకు చేర్చుకుంది. అనేక నియోజకవర్గాలలో ఇంకా పార్టీ పుంజుకోవలసి ఉంది. అందుకే ఆయా చోట్ల ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నేతలను లాగే పనిలో పడింది. తద్వారా టీఆర్ఎస్కు సవాలు విసరాలని చూస్తోంది. అందుకు మునుగోడు వేదిక అయింది. తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం వరకు బీజేపీ కొంతమేర సఫలం అయిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే శశిధర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. మర్రికి పదవుల నీడ మర్రి శశిధర్ రెడ్డి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. నిజానికి ఆయనకు పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చినట్లు లెక్క. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కుమారుడు కావడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శశిధర్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేసి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. చెన్నారెడ్డి సీఎం పదవి పోయిన తర్వాత ఆయనను గవర్నర్‌గా నియమించింది కాంగ్రెస్. ఖాళీ అయిన సనత్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో శశిధర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికతో పాటు మరో మూడుసార్లు ఆయన విజయం సాధించారు. 2004లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆయనకు బాగా ఉపయోగపడింది. సోనియాగాంధీ ఈయనకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. నక్సలిజంపై టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆయనను తొలుత కన్వీనర్‌గా పనిచేశారు. తదుపరి ఆయనను ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించారు. పదేళ్లపాటు పదవులు అనుభవించిన ఆయన ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్దం అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని కూడా ఆయన అంటున్నారు. తెలంగాణ ఫస్ట్ అన్న నినాదం కూడా ఇచ్చారు. లీడర్లు కాదు, లీడర్షిప్ కావాలి! ఒకప్పుడు కాంగ్రెస్ విధేయులం అంటూ దివంగత నేత పీజేఆర్‌తో కలిసి పనిచేశారు. గోదావరి జలాల వినియోగంపై కూడా కొంత ప్రచారం చేశారు. కాంగ్రెస్‌లో ఆయనకు మంచి గుర్తింపే వచ్చింది. కుమారుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం విశేషం. కాంగ్రెస్‌కు ఆయన ఎంత చేశారో కానీ, కాంగ్రెస్ వల్ల ఆయన బాగా లబ్దిపొందారన్నది వాస్తవం. గతంలో చెన్నారెడ్డి కూడా రెండు, మూడుసార్లు కాంగ్రెస్‌ను వీడి, తిరిగి కాంగ్రెస్‌లోనే చేరారు. అప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీనే ప్రధానపక్షంగా ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కుదేలైంది. జిల్లాలలో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉన్నా, వారందరిని కదలించి, ముందుకు నడిపే నాయకత్వం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. హస్తం.. కిం కర్తవ్యం? పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి మొదట కొంత జోష్ వచ్చినా, వరుస ఓటములు, సీనియర్ల అలకలు, పార్టీ వీడటాలు వంటివాటితో నైతికంగా దెబ్బతిన్నారు. శశిధర్ రెడ్డి లేదా ఇతర సీనియర్ నేతలను కోల్పోవడానికి గల కారణాలపై పార్టీ ఎంతవరకు దృష్టి పెడుతోందన్నది చర్చగానే ఉంది. భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా ఇదే బాట పట్టవచ్చని చెబుతున్నారు. బీజేపీ ఒక వైపు పాదయాత్రలనో, మరొకటనో హడావుడి చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పాదయాత్ర చేయాలా? బస్సు యాత్ర చేయాలా? అన్న మీమాంసలో ఉంటున్నారు. డెబ్బైమూడేళ్ల వయసులో శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందన్నది చెప్పలేం కానీ, కాంగ్రెస్‌లో నైతికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. అంతేకాక సామాజికవర్గం రీత్యా రెడ్డి కమ్యూనిటీని ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. దీనివల్ల కూడా కాంగ్రెస్‌కు నష్టం కలిగించవచ్చు. వచ్చే 2023 ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్తుకు గీటురాయి అవుతాయి. అధికారంలోకి రావడమో, లేక కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలగడమో చేయలేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అగమ్య గోచరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీజేపీలో చేరిన మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీనియర్ పొలిటీషియన్ మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనావాలా, కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ నేతలు బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్.. మర్రిశశిధర్ వెంట ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, తెలంగాణలో టీఆర్ఎస్ను గద్దె దించేందుక పోరాటం చేస్తానని మర్రి శశిధర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడేతత్వం ఉన్న మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీలో చేరడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కుటుంబ పాలన అంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి శశిధర్‌రెడ్డి.. ఈ మధ్యే కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. -
పోడు సమస్యల పరిష్కారంతో ప్రభుత్వం విఫలమైంది: భట్టి విక్రమార్క
-
ఐటీ దాడులు, మర్రి శశిధర్‌పై భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పోడు భూముల వ్యవహరం తెరపైకి వచ్చింది. కాగా, పోడు భూముల సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పోడు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. పోడు రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోంది. అర్హులైన వారికి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ విధానాలతో అధికారులు, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక, తెలంగాణలో దాడులపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. గతంలోనూ ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. రెగ్యులర్‌గా జరిగే రైడ్స్‌ను పార్టీలు, ప్రభుత్వం చూపించడం తప్పు. విధినిర్వహణలో జరిగే చర్యలను కూడా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేశాయి. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది కాదు.. కానీ వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీతో మర్రి కుటుంబానికి సుదీర్ఘంగా అనుబంధం ఉంది. మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతాను. ఆయన ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాను. నాకు బేషజాలు లేవు. కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు రెడీగా ఉంటుంది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం అభ్యంతరకం. శ్రీనివాస్ రావు కాళ్లు మొక్కడాన్ని ఖండిస్తున్నాం. కాళ్లు మొక్కుతా బాంచన్ అనే కాలం నుంచి మనం బయటకు వచ్చాము అని కామెంట్స్ చేశారు. -
పార్టీలో పరిస్థితులు బాగోలేవు.. అలా వెళ్లొస్తానని గుర్తు చూపిస్తూ అనకండి సార్!
పార్టీలో పరిస్థితులు బాగోలేవు.. అలా వెళ్లొస్తానని గుర్తు చూపిస్తూ అనకండి సార్! -
బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా..
-
చాలా బాధతో కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుంటున్నాను: మర్రి శశిధర్‌రెడ్డి
-
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ బాగు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. కాంగ్రెస్‌కు కేన్సర్ సోకిందని ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయనను పార్టీ అధిష్ఠానం ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. 25 లేదా 26న బీజేపీలోకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి దాపురించిందని శశిధర్‌రెడ్డి సోమవారమే అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోకపోవడం వల్లే తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన శశిధర్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్లు, మైనారిటీ నేతలతో బేగంపేటలోని తన కార్యాలయంలో సోమవారం సమా వేశమయ్యారు. తాను బీజేపీలో చేరాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీజేపీ మాత్రమే మైనార్టీల అభివృద్ధికి పాటుపడుతోందని, తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఈ నెల 25 లేదా 26వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలతో జాగ్రత్త.. కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం -
శశిధర్ రెడ్డికి కాంగ్రెస్‌ను నిందించే హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ వచ్చిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉన్నాయని, అయినా బీజేపీలో చేరాలనుకునేవారికి కాంగ్రెస్ పార్టీని నిందించే హక్కులేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎవరికైనా పార్టీ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛ ఉంటుంది కానీ పార్టీని విమర్శించే హక్కు ఉండదని పేర్కొన్నారు. 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చారని, ఎంతో మంది వెళ్లిపోయారని, ఎవరు ఎలాంటి వారో, ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్తులో తేలిపోతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి కేన్సర్!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ సోకిందని, అది కాస్తా ఇప్పుడు నయం చేయలేని స్థితికి చేరు కుందని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని వీడాల్సి వస్తుందని తాను అనుకోలేదని, తెలంగాణలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినే అనుకున్నానని.. కానీ కొంతకాలం నుంచి కాంగ్రెస్‌లో జరుగు తున్న పరిణామాలు తాను పార్టీలో ఉండలేని స్థితికి తీసుకొచ్చాయని చెప్పారు. ఒక హోంగార్డు కాంగ్రెస్‌ను వీడితే పోయేదేమీ లేదని.. కానీ పార్టీలోని పరిస్థితులు తనలా చాలామంది హోంగార్డులు కాంగ్రెస్‌ను వీడేలా చేస్తాయని వ్యాఖ్యానించారు. శనివా రం మధ్యాహ్నం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో శశిధర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలను చర్చించానని చెప్పారు. రేవంత్ వల్ల పార్టీ ఉనికికి దెబ్బ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి ఏమాత్రం సరిగా లేదని, ఆయన వైఖరితో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని.. రేవంత్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను మూడు నెలల క్రితం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ అందుబాటులో ఉండడని.. పూర్తిగా ఆయన వర్గం వారితోనే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. పార్టీకి నష్టం కలిగించేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3వేల ఓట్లు రావడం కంటే, మునుగోడులో 20వేలకు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకుని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు. గత పీసీసీ అధ్యక్షుడు తనకు సనత్‌నగర్ టికెట్ ఇవ్వకున్నా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశానన్నారు. తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాడినే అంటూ పెట్టుకున్న వాక్యాన్ని శశిధర్‌రెడ్డి తొలగించడం గమనార్హం. ఈ నెల 25న ఢిల్లీలో మర్రి శశిధర్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో వీలైనంత త్వరగా పార్టీలో చేరాలని అమిత్ షా కోరినట్టు తెలిసింది. -
కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెండ్..
-
కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు శశిధర్‌రెడ్డిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి శనివారం ప్రకటించారు. శశిధర్‌రెడ్డి ఈ నెల 18న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈ నెల 18న అమిత్ షాతో భేటీ అవడం, శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. శశిధర్‌రెడ్డి వైఖరి పార్టీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని, ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ఆమోదించాలని ఏఐసీసీకి ప్రతిపాదన పంపామని వివరించారు. చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదు : మర్రి శశిధర్ రెడ్డి
-
కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ సోకిందని, అది కాస్తా ఇప్పుడు నయం చేయలేని స్థితికి చేరు కుందని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని వీడాల్సి వస్తుందని తాను అనుకోలేదని, తెలంగాణలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని పేర్కొన్నా రు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినే అనుకున్నానని.. కానీ కొంతకాలం నుంచి కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తాను పార్టీలో ఉండలేని స్థితికి తీసుకొచ్చాయని చెప్పారు. ఒక హోంగార్డు కాంగ్రెస్‌ను వీడితే పోయేదేమీ లేదని.. కానీ పార్టీలోని పరిస్థితులు తనలా చాలామంది హోంగార్డులు కాంగ్రెస్‌ను వీడేలా చేస్తాయని వ్యాఖ్యానించారు. శనివా రం మధ్యాహ్నం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో శశిధర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలను చర్చించానని చెప్పారు. రేవంత్ వల్ల పార్టీ ఉనికికి దెబ్బ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి ఏమాత్రం సరిగా లేదని, ఆయన వైఖరితో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని.. రేవంత్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను మూడు నెలల క్రితం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ అందుబాటులో ఉండడని.. పూర్తిగా ఆయన వర్గం వారితోనే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. పార్టీకి నష్టం కలిగించేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3వేల ఓట్లు రావడం కంటే, మునుగోడులో 20వేలకు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకుని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు. గత పీసీసీ అధ్యక్షుడు తనకు సనత్‌నగర్ టికెట్ ఇవ్వకున్నా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశానన్నారు. తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాడినే అంటూ పెట్టుకున్న వాక్యాన్ని శశిధర్‌రెడ్డి తొలగించడం గమనార్హం. ఈ నెల 25న ఢిల్లీలో మర్రి శశిధర్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో వీలైనంత త్వరగా పార్టీలో చేరాలని అమిత్ షా కోరినట్టు తెలిసింది. చదవండి: (అమిత్ షాతో కీలక భేటీ.. బీజేపీలోకి మర్రి శశిధర్‌రెడ్డి!) -
అమిత్ షాతో కీలక భేటీ.. బీజేపీలోకి మర్రి శశిధర్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారని కొన్నిరోజులుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మర్రి శశిధర్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మర్రి శశిధర్‌రెడ్డితో అమిత్‌షా మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు, విధానాలు తదితర అంశాలనూ ప్రస్తావించినట్టు సమాచారం. గురువారం రాత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్ భేటీ అయినప్పుడే మర్రి శశిధర్‌రెడ్డి చేరికపై చర్చ జరిగింది. అమిత్‌షా నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో శశిధర్‌రెడ్డి శుక్రవారం ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొద్దినెలలుగా అసంతృప్తితో.. మూడు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఇక గత ఆగస్టులో కాంగ్రెస్‌లో కల్లోలానికి రేవంత్‌రెడ్డి ముఖ్య కారణమని, ఆయన కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారని మర్రిశశిధర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ రేవంత్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలూ చేశారు. అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరిగింది. తాజాగా అమిత్‌షాతో భేటీకావడంతో శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
అందుకే ఢిల్లీకి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారన్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 'నేను విమానంలో ఢిల్లీకి రావడం కొత్త కాదు. మనవడి స్కూల్ ఫంక్షన్ కోసమే ఇక్కడకు వచ్చాను. నేను రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా రిటైర్ కాలేదు. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు' అని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!) -
సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కొనసాగుతుండగానే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిట్మెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను సోనియాకు వివరించనున్నారు. అలాగే తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు మీడియాకు వివరించారు. చదవండి: (ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన) బాధ్యతలిస్తే ప్రచారం చేస్తా: కోమటిరెడ్డి దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించాడు. అనంతరం చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారి పనులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో మాత్రమే వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చదవండి: (విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి) -
ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో తమకు తెలుసు: రేణుకా చౌదరి
-
ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: మర్రి శశిధర్‌రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్‌లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయన్న మాజీ మంత్రి.. నితిన్ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. -
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందన
-
ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్దంకి దయాకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దదిగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతోంది. సీనియర్ నేతలు మాట్లాడితే కాదు అనే వారు ఎవరూ లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి. కానీ, పీసీసీని ఇలా అంటే పార్టీకి నష్టం కదా?. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా మీరు(మర్రి శశిధర్ రెడ్డి) ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్నాను. రేవంత్ చెప్తే నేను స్పందించడం లేదు’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు... -
రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని తెలియజేశారు. ఈ మేరకు ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టాడు. బీజేపీలో చేరిన వాళ్లే నాపై ఏదైనా మాట్లాడతారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల్ని సోనియా, రాహుల్, ప్రియాంక తెలుసుకుంటున్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణకి వస్తా అంటే వెల్కమ్ చెప్తాను. ఇక్కడ నుంచి పోటీచేయాలని రాహుల్, ప్రియాంకను రిక్వెస్ట్ చేస్తే వాళ్లు ఆలోచిస్తారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. చదవండి: (కాంగ్రెస్‌లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి) -
కాంగ్రెస్ లో కల్లోలానికి కారణం ఠాగూర్, రేవంతే : శశిధర్ రెడ్డి
-
కాంగ్రెస్‌లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
Marri Shashidhar Reddy.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్టానం ఎందుకు మందలించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగాలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడుపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. సర్వే రిపోర్టుతో అలర్ట్ -
‘కేసీఆర్‌కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా?’
సాక్షి, హైదరాబాద్: తన జీవితంలో ఇప్పటివరకు 80 వేల పుస్తకాలు చదవిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వర్షాలు ఎలా పడతాయో కూడా తెలియకపోవడం బాధాకరమని మాజీ మంత్రి, జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ భారీ వర్షాలు పడటం అంతర్జాతీయ కుట్ర అనడం కేసీఆర్ అవివేక మని పేర్కొన్నారు. గతంలో క్లౌడ్ బరస్ట్ లడఖ్, ఉత్తరాఖండ్‌లో జరిగిందని తర్వాత గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిందనడంలో ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఏ పంప్‌హౌజ్ కూడా ఇప్పటివరకు మునిగిపోయిన దాఖలాల్లేవని శశిధర్‌రెడ్డి తెలిపారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే గంటకు వంద మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు కావాలి కానీ, గోదావరిపై అంతటి వర్షపాతం లేదన్నారు. కేసీఆర్ పక్కనే ఉన్న సీఎస్ సోమేశ్‌కుమార్ ఏం సలహాలు, సూచనలు ఇస్తున్నారో తెలియ డం లేదని విమర్శించారు. కేవలం కాళేశ్వరం పంప్‌హౌజ్ మునిగిపోయిన వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. -
కాంగ్రెస్‌లోని సంస్థాగత లోపాలు గుర్తించాలి: మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డీకపూల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని సంస్థాగత లోపాలు గుర్తించాలని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటుందని తెలిపారు. రేపటి ఎన్నికలు పార్టీ మనుగడకు చాలా కీలమని శశిధర్‌రెడ్డి తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయాం, హుజురాబాద్‌లో కూడా ఓడామని, అటువంటి పరిస్థితి తెలంగాణలో రాకూడనే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇది అసమ్మతి సమావేశం కాదు.. బాధ్యత గల నేతలుగా తాము సమావేశమయ్యామని తెలిపారు. గత మూడేళ్లుగా సమావేశం అవుతూనే ఉన్నామని తెలిపారు. ఇది మొదటి, చివరి సమావేశం కాదని ఆయన గుర్తుచేశారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్‌రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్‌మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్‌ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్‌బాబు మర్రి శశిధర్‌రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
ఎన్నికల కమిటీ చైర్మన్ పదవికి మర్రి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. తనను ఈ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారని, ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైనందున ఆయన స్వేచ్ఛగా వ్యవహరించే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని శశిధర్ రెడ్డి వెల్లడించారు. -
‘ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలన్ని కాంగ్రెస్ హయాంలో నెలకొల్పినేవని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆరున్నర ఏళ్ల పాలనలో హైదరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాటలకే పరిమితం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే జూమ్ ద్వారా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కమ్ ఠాగూర్ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తుందని తెలిపారు. చదవండి: ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. అందుకోసం 8639721075 నెంబర్‌కు వాట్సప్ చేయగలరని సూచించారు. లేదా speakuphyderabad@gmail.Com చేయవచ్చని తెలిపారు. వారం, పది రోజుల పాటు వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వరద బాధితులకు ఇచ్చే పరిహారం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని, నిజమైన బాధితులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. వరద పరిహారం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ధరణి సర్వే మతలబేంటి?
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ ప్రభుత్వం సరిగా నిర్వహించడంలేదని కాంగ్రెస్ ఎన్నికల కో ఆర్డినేషన్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.బీజీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు జరగడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయంగా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వార్డు విభజనలో గతంలో జరిగిన విధానాన్ని అడిగితే ఇప్పటి వరకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తాము అడిగిన సమాచారం ఇవ్వాలని సవాల్ చేశారు. 2021 ఫిబ్రవరి వరకు జీహెచ్ఎంసీ కాలపరిమితి ఉన్నా.. ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యలో సమగ్రకుటుంబ సర్వే చేశారు.,, ఇప్పుడేమో ధరణి సర్వే అంటున్నారు. అసలు ఆ సర్వే మతలబేంటని ప్రశ్నించారు. ధరణి సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీఆర్ఎస్కు భారీ ఓటమి తప్పదని శశిధర్ అన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నాయకులతో 2021 కొత్త ఓటర్ లిస్ట్ సమరీపై రివ్యూ జరిగిందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమస్యలపై చర్చించామని వెల్లడించారు. దీనిలో భాగంగా 150 డివిజన్లు యధాతథంగా ఉంటాయా లేదా అనేది ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టం చేయాలని తెలిపారు. అదే విధంగా వార్డు డీలిమిటేషన్‌పై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. 'వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం జరగాలి కానీ 2016లో రిజర్వేషన్ చివరి నిమిషం వరకు చెప్పకుండా వ్యవహరించారు. అలాంటి ధోరణి సరైనది కాదని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కమిషనర్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కూడా కలుస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా ఎన్నికల కోసం సిద్ధం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాని కమిషన్ మాత్రం మమ్మల్ని అభిప్రాయాలు కొరుతూ లేఖలు రాశారు. (మేము సైతం.. రెఢీ) ఎన్నికల నిర్వహణపై లాభనష్టాలను తెలపాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి. 800 ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్ కు కాకుండా 500లకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తాం. 2015లో ఓటర్ల ఆక్రమణల తొలగింపుపై మా పోరాటం వల్ల అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్‌ను తొలగించారు. ఓటరు లిస్ట్ తయారుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కి తీసుకెళ్తాం. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ పనిచేయకపోవడం దురదృష్టకరం. ఇంటి నెంబర్ సెర్చ్ అనేది ఎలక్షన్ వెబ్ సైట్లో ఉండాలి. 68లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టు లో పిటిషన్ వేస్తే.. న్యాయస్థానం అంగీకరించారు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే ఓటరు జాబితా సరిగా నిర్వహించాలి' అని పేర్కొన్నారు. (బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: తలసాని) -
అసదుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో అసద్ మాట్లాడుతూ.. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని ఎంఐఎంకు ఓటేయాలని చెప్పడం ద్వారా ఎన్నికల్లో డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేలా మాట్లాడారన్నారు. అలా మాట్లాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజ్ కెమెరాలు మున్సిపల్ పోరు: అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం -
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జావబితా ప్రకటన చేయకుండా నోటిషికేషన్ ఎలా ఇస్తారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ను రాష్ట్రంలో రెండు శాఖలు కాపాడుతున్నాయని.. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్, పోలింగ్ సమయంలో పోలీసులు టీఆర్ఎస్ను కాపాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నాగిరెడ్డి ఎన్నికల అధికారినా..లేక టీఆర్ఎస్ కార్యకర్తనా అని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని దొడ్డి దారిన గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందని, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. సంక్రాంతి పండగ తరువాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు సూచనల మేరకు డిలిమిటేషన్ జరిగిందన్నారు. జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, అయినా కావాలనే ప్రకటించడం లేదని విమర్శించారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా షెడ్యూల్ ప్రకటించిందని ఆరోపించారు. రిజర్వేషనల ప్రకటన ఎన్నికల తేదికి ఒక్క రోజు ఉంచడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ మార్చడానికి అవకాశం ఉందని, రిజర్వేషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కోరారు. -
‘కేసీఆర్‌కు భయం పట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎన్నికల సంఘం సీఈఓ రజత్‌కుమర్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ చానల్, ఇంగ్లీష్ పత్రికలో భారీగా టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఈ ఉపఎన్నికలో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా జరుగుతోందన్న విషయాన్ని రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డిలు కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చెయాలని కోరామని వెల్లడించారు. కేసీఆర్ హుజూర్నగర్ సభలో ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సీఈఓకు విజ్ఞప్తి చేశామని శశిధర్‌రెడ్డి తెలిపారు. హుజుర్ నగర్ ఉపఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందని అందుకే తానే స్వయంగా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చెయాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలని కోరారు. -
‘మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : మెట్రో పిల్లర్ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని, దీనికి కారణమైన ఎల్ అండ్ టీపై మర్డర్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న అమీర్‌పేట మెట్రో స్టేషన్లో కాంక్రీట్ పడి చనిపోయిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ సందర్శించి ఓదార్చకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. ‘నాణ్యత లోపం వల్ల ఈ సంఘటన జరిగింది. మెట్రో స్టేషన్ నిర్మించి రెండేళ్లు కాకుండానే ఇలా జరిగింది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనలో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టత ఇవ్వాలి. మెట్రో రైల్‌ని ప్రధాని మోదీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఇలా జరిగింది. దీనిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో పెచ్చులు ఊడిపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనుకే నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. ప్రభుత్వం వెంటనే మౌనిక కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి’ అని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్) ఉద్యోగులను కుక్కలతో పోల్చుడం సిగ్గు చేటు : రాములు నాయక్ అసెంబ్లీలో బట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరును మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉద్యోగులను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినప్పుడేమో ఉద్యోగులు దేవుళ్లలా కనిపించారు.. ఇప్పుడేమో దెయ్యాల కనిపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె వల్లే రాష్ట్రం వచ్చిందని మరిచిపోవదన్నారు. ధనిక లేబర్ డిపార్ట్మెంట్ అంటూనే ఆరేళ్లుగా కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ లేదని, కుటుంబ తెలంగాణ, బేకారు తెలంగాణగా రాష్ట్రం తయారయ్యిందని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దొరల పాలన తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
పార్టీని మీరే కాపాడాలి : సోనియా
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యతలను తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీని కోరారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఎం.కోదండరెడ్డి, ఎస్. చంద్రశేఖర్, బి.కమలాకర్, ఎ.శ్యాంమోహన్, జి.నిరంజన్లు బుధవారం ఆమెకు లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసినప్పటికీ వరుసగా రెండుసార్లు పార్టీ ఓటమి పాలైందని లేఖలో తెలిపారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో విజయం సాధించినా, బీజేపీ కూడా నాలుగు చోట్ల విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినట్లు శ్రేణులు భావించడం లేదన్నారు. ఈ దశలోనే పార్టీ చీఫ్‌గా రాహుల్‌గాంధీ వైదొలగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా పార్టీ అధ్యక్షుడిని నియ మించాలని, యూపీఏ చైర్‌పర్సన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన సోనియానే పార్టీ రక్షించే చర్యలకు పూనుకోవాలని కోరారు. -
మట్టిలో మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మంచి డాక్టర్‌గా రాణిస్తున్నప్పుడు వృత్తిని వదిలి రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన స్నేహితులు, మేనమామ రంగారెడ్డి స్వాగతించలేకపోయారు. చెన్నారెడ్డి మాత్రం ‘వ్యక్తి కంటే దేశం ముఖ్యం, పరతంత్య్రం కంటే స్వాతంత్య్రం శ్రేయస్సు’ అని నమ్మారు. గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు. పదవులు... బాధ్యతలు చెన్నారెడ్డి 1950లో ప్రొవిషనల్ పార్లమెంట్ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ విప్‌గా పనిచేశారు. ఆయన 1952 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మంత్రిగా పదవి చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత 1962లో సంజీవరెడ్డి, 1964లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కీలకమైన పోర్టుఫోలియోలు నిర్వహించారు. తెలంగాణా రీజినల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, రీహాబిలిటేషన్ కమిటీ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉక్కు సాధకుడు చెన్నారెడ్డి రాజకీయ పరిపక్వతను గమనించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, 1967లో ఆయనను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయడంతోపాటు ఉక్కు గనుల శాఖ మంత్రిగా నియమించారు. ఆ సమయం లోనే దక్షిణ భారతానికి మూడు ఉక్కు పరిశ్రమలను తెచ్చారు. ఓ ఏడాది తర్వాత కేంద్ర మంత్రి పదవి వది లేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. టీపీఎస్ స్థాపన తెలంగాణ ఉద్యమానంతరం చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) స్థాపించి 1971లో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఆయన మీద అనర్హత ఉన్న కారణంగా పోటీ చేయలేకపోయారు. తన అనుచరులను నిలబెట్టి 14 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకొని కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత కొంతకాలానికి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం 1977 లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం చెన్నారెడ్డి.. ఇందిరాగాంధీ 1978లో కాంగ్రెస్ (ఐ) పార్టీని స్థాపించినప్పుడు మర్రి చెన్నారెడ్డి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీకి 180 అసెంబ్లీ స్థానాలను సాధిం చి ఏపీకి ముఖ్య మంత్రి బాధ్యత లు చేపట్టారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆ పదవిలో 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ఉన్నారు. రెండో దఫా 1989 డిసెంబర్ నుంచి 1990 డిసెంబర్ వరకే ఉన్నారు. ఆయన వికారాబాద్, మేడ్చల్, తాం డూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. చివరి ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలిచారు. 1984 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ను స్థాపించి కరీంనగర్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జె.చొక్కారావు చేతిలో ఓడిపోయారు. ఆయన ఓటమిని చూసిన ఎలక్షన్ అదొక్కటే. ఆయన రాజకీయ జీవితంలో గవర్నర్‌గా ఉన్న కాలమే ఎక్కువ. నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించిన చెన్నారెడ్డి డెబ్బై ఏడేళ్ల వయసులో 1996 డిసెంబర్ 2న మరణించారు. రైతు కుటుంబం.. మర్రి చెన్నారెడ్డిది రైతు కుటుంబం. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి శంకరమ్మ. మర్రి చిన్నప్పటి పేరు అచ్యుతరెడ్డి. ఆయన తాత కొండా చెన్నారెడ్డి (తల్లి తండ్రి). ఆ చెన్నారెడ్డి పోయిన తరువాత, తండ్రి పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు శంకరమ్మ. మేనమామ కొండా వెంకట రంగారెడ్డి చెన్నారెడ్డిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చదివించారు. మెట్రిక్యులేషన్ ఉన్నతశ్రేణిలో పాసయ్యి, స్కాలర్షిప్, మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నారాయన. విద్యార్థి నేతగా రాణించారు. ఎంబీబీఎస్ పట్టా తీసుకుని, రెండు నర్సింగ్‌హోమ్‌లు పెట్టి వైద్య వృత్తి చేపట్టారు. పుట్టింది: 1919, జనవరి 13 స్వగ్రామం: వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, సిరిపురం విద్యాభ్యాసం: ఎంబీబీఎస్ (1941) రాజకీయ ప్రవేశం: 1935లో గవర్నర్‌గా: నాలుగు రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్) ఉద్యమ సారధి: తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపన(టీపీఎస్) – సురేఖ శ్రీనివాస్ మాచగోని, వికారాబాద్ -
టీఆర్ఎస్పై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్ శుక్రవారం ఢిల్లీలో సీఈసీని కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా గవర్నర్ ద్వారా హైదరాబాద్‌లో మూడో దశ మెట్రోను ప్రారంభించారని, ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. అలాగే ఇటీవల భూ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తి తన సమస్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోకు స్పందించి సీఎం కేసీఆర్.. నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడి కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించి రైతుబంధు కింద నగదు ఇస్తారని చెప్పారన్నారు. ఈ ఫోన్ సంభాషణను ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేక ప్రసారం చేశారన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల భూ వివాదాలున్నా వాటిని పట్టించుకోకుండా కేవలం ప్రచారం కోసం ఎన్నికల ముందు ఇలా కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడారని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనన్నారు. ఉద్యమసింహం విడుదల కూడా ఉల్లంఘనే.. ఎలాంటి ఆదేశాలు లేకున్నా జాతీయ నేతలైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు రాష్ట్రంలో ముసుగులు వేశారని, ఎన్నికల వేళ తమ పార్టీ నేతలను హింసిస్తున్నారని శశిధర్, నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’చిత్రాన్ని విడుదల చేయడం కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక బ్యాలెట్ ద్వారా జరిగే నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. -
మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం తగదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో గతేడాది ఆగస్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తోసిపుచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శశిధర్‌రెడ్డి తిరిగి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11ను, ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించాల్సి ఉన్నా అవేవీ జరగకుండానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు జారీచేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. విచారణ అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్లో అభ్యర్థనలను మార్చజాలమని, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సాంకేతిక కారణాల దృష్ట్యా తమ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్’ను సవాలు చేస్తూ ఆర్.కృష్ణయ్య పిటిషన్ అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్రకులాల్లోని పేదలను అభివృద్ధి పరచాలంటే ఆర్థిక పరమైన స్కీములు, పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి పరచాలి. అంటరానితనం, సాంఘిక వివక్షకు గురవుతున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా, ఉద్యోగ, పాలన రంగంలో ప్రాతినిథ్యం లేని కులాలను గుర్తించి వారికి ప్రాతినిథ్యం కల్పించడం రిజర్వేషన్ల లక్ష్యం. ఉద్యోగాల్లో వారికి వారి జనాభా ప్రకారం ప్రాతినిథ్యం లేదని ఇస్తారా? వారు చదువుకోవడం లేదని ఇస్తారా? లేక సమాజంలో అగ్రకులాల వారికి సామాజిక గౌరవం లేదని ఇస్తారా? అనే కోణంలో చూడాలి. ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే ఇచ్చి విచారణ జరపాలి’అని పిటిషన్లో అభ్యర్థించారు. -
‘సీఈవో ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్వయంగా అంగీకరించి క్షమాపణలు చెప్పారని, కానీ పార్లమెంటు ఎన్నికల నాటికి కూడా అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీంతో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని రజత్‌కుమార్ ఇచ్చిన ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు జి.నిరంజన్, బి.కమలాకర్, ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని, ధర్నాలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పట్ల తమ వైఖరిని స్పష్టంగా చెప్తామని ఆయన వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకాగాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన మర్రి ఆమె రాకతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. -
ఎడ్ల బండిలో తిరుగుతున్నారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ నుండి 25న జాతీయ ఓటర్ల దినోత్సవ ఆహ్వానం వచ్చిందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సారి ఓటర్స్ డే థీమ్ ఒక్క ఓటర్ను వదిలిపెట్టొద్దని తనతో చెప్పారన్నారు. గత ఎన్నికల్లో లక్షలాది ఓటర్లను తొలగించామని రజత్ కుమార్ అంగీకరించారని, పార్లమెంట్ ఎన్నికల నాటికి అర్హులందర్ని ఓటరు జాబితాలో చేరుస్తామన్న హామీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే ఈ ఓటర్స్ డేను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రేపటి ధర్నాలో అధికార పార్టీకి తొత్తుగా ఉన్న ఎన్నికల సంఘంపై తమ వైఖరి చెబుతామన్నారు. ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, డీకే అరుణలతో పాటు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని తెలిపారు. విమానాలు ట్యాంపరింగ్ జరిగితే ఎడ్ల బండిలో తిరుగుతారా? అన్న రజత్ కుమార్ వ్యాఖ్యలపై శశిధర్ రెడ్డి మండిపడ్డారు. అమెరికా విమానాలను కాదని ఎడ్ల బండిలో తిరుగుతుందా, అక్కడ బ్యాలెట్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని ధ్వజమెత్తారు. ఈవీఎం మొట్టమొదట ప్రవేశ పెట్టిన జపాన్‌లో కూడా ఇప్పుడు బ్యాటెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈవీఎంలపై విశ్వాసం లేదనే వీవీ ప్యాట్ తీసుకొచ్చారని మరిచి పోవద్దన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె రాకతో దేశ వ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. -
‘ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారింది’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని కాంగ్రెస్ నేత మర్రిశశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ లిస్టులో పొరపా ట్లు జరిగాయని ఎన్నికల సంఘం చెప్పిందని, ఆ తప్పులకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మర్రి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు. అధికార పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పని చేసినందుకే సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారా అని అడిగారు. గుణాత్మక మార్పు అంటూ కొన్ని రాజకీయ పార్టీలను కలిసిన కేసీఆర్‌పై, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో ఆ పార్టీలకు లేఖలు రాస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకు 30 లక్షల ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు. -
‘ఎన్నికల సంఘం టీఆర్ఎస్కు తొత్తుగా మారింది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు జరిగాయని స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పిందన్నారు. మరి ఆ తప్పులకు బాధ్యులేవరు.. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేసేంత చిత్తశుద్ధి కూడా లేదంటూ విమర్శించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రజస్వామ్యాన్ని ఫుట్‌బాల్ అడుకుంటుందని శశిధర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం ఏంటో జనాలకు బాగా అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే నంబర్ వన్‌గా ప్రజస్వామ్యన్ని ఎలా ఖూని చేయాలో కేసీఆర్ చూపించారంటూ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : మల్లు రవి సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని మల్లు రవి ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌ను ఆఘమేఘాల మీద ఎందుకు ట్రాన్సఫర్ చేశారని ప్రశ్నించారు. రఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే సీబీఐ డైరెక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. ఆలోక్ వర్మను తప్పించడం వంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థమవుతుందన్నారు. -
సనత్‌నగరే అడిగాను
సాక్షి, న్యూఢిల్లీ: సనత్‌నగర్‌ను మిత్రపక్షాలకు ఇవ్వకుండా కాంగ్రెస్సే పోటీచేయాలని, అభ్యర్థిగా తననే ప్రకటించాలని ఆ పార్టీ సీని యర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తిచేశారు. శనివారం ఆయన ఇక్కడ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్, ఇతర నేతలను కలిశారు. ‘సనత్‌నగర్‌ను కాంగ్రెస్ వదులుకోరాదని, అభ్యర్థిగా నన్ను ప్రకటించాలని కోరా ను. సికింద్రాబాద్ టీడీపీకి ఇవ్వొచ్చని చెప్పాను. సికింద్రాబాద్‌కు నేను బదిలీకాను. ఒకవేళ నాకు సనత్‌నగర్ నుంచి ఇవ్వకపోయినా నేనేమీ పార్టీని వీడను. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగను. రాజకీయాల నుంచి వైదొలగను’ అని మర్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
‘సికింద్రబాద్ నుంచి పోటీ చేయను’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సనత్‌నగర్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే సికింద్రాబాద్ టికెట్ టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే తాను మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇదే విషయాన్ని అధిష్టానానికి తేల్చి చెప్పానని వివరించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని.. సనత్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన లేదన్నారు. అయితే సనత్‌నగర్ టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం మర్రికి హామీ ఇచ్చిందా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. -
నేను గెలవనని ఉత్తమ్ వాదించడం ఆశ్చర్యానికి గురిచేసింది
-
‘పొన్నాలకు లైన్ క్లియర్.. కానీ శశిధర్‌రెడ్డికే’
సాక్షి, నల్గొండ : కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందన్న మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు (శనివారం) హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీతో మాట్లాడారు. టికెట్ల కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఉత్తమ్ కొట్టిపారేశారు. ఒకే సామాజిక వర్గానికి, కుటుంబానికి టికెట్లు ఇచ్చామన్నది వాస్తవం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలకు లైన్ క్లియర్ అయిందనీ, ఇక మర్రి శశిధర్‌రెడ్డి విషయంలో ఇబ్బంది ఉన్న సమిసిపోతుందని ఉత్తమ్ తెలిపారు. డిసెంబరు 12న గడ్డం తీసేస్తానని, సోనియా, రాహుల్ గాంధీలతో సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతానని పేర్కొన్నారు. కేసీఆర్ సభలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ సభలు ఉంటాయని తెలిపారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్లో న్యాయం జరగలేదని, అందుకే ఆమెను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
ఉత్తమ్ గండికొట్టాడు.. శశిధర్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తనకు సీటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. సనత్‌నగర్ టిక్కెట్‌ను టీడీపీకి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ నాయకులు కావాలనే సనత్‌నగర్ స్థానానికి టీడీపీకి వదిలేశారని ఆరోపించారు. ఎల్బీ నగర్ సీటు కోసం తన స్థానాన్ని విడిచిపెట్టారని వెల్లడించారు. అధిష్టాన పెద్దలు సనత్‌నగర్ సీటు తనకే కేటాయిస్తున్నారని తేల్చి చెప్పారని, అయినప్పటికీ సీటు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాను గెలవనని వాదించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనకు సీటు ఇవ్వకుండా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని వాపోయారు. ఇలాంటి నిర్ణయాలతో పార్టీ తీవ్ర నష్టం పోవడం ఖాయమన్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఢిల్లీలో జైపాల్ రెడ్డి మంత్రాంగం దేవరకద్ర, నారాయణపేట స్థానాల్లో బిసిలకే అవకాశం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పట్టుబట్టారు. ఇద్దరికి కుదరకపోతే కనీసం ఒక్కరికైనా ఇవ్వాలని సూచించారు. జైపాల్ రెడ్డి ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అధిష్ఠానం అంగీకరించినట్టు సమాచారం. -
మర్రికి షాక్.. జానాకు సస్పెన్స్.. నెగ్గని ఉత్తమ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి గట్టి షాక్ తగిలింది. న్యాయపోరాటాలతో అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. ఆయన ఆశిస్తున్న సనత్‌నగర్ సీటును మహాకూటమి పొత్తుల్లో భాగంగా మిత్రపక్షం టీడీపీకి కట్టబెట్టింది. ఇక్కడ కూన వెంకటేశ్‌గౌడ్‌కు సీటు కట్టబెడుతున్నట్టు టీటీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో కినుక వహించిన మర్రి శశిధర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తనకు ప్రత్యామ్నాయ దారులు ఉన్నాయని, అనుచరులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని మర్రి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేసినప్పటికీ.. ఇంకా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిర్యాలగూడ, సికింద్రాబాద్, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిర్యాలగూడ సీటును తన కొడుకుకు కట్టబెట్టాలని సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సీటు కేటాయింపుపై సస్సెన్స్ కొనసాగుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును తెలంగాణ జనమితికి కేటాయిస్తారని వినిపిస్తోంది. ఎట్టకేలకు జనగామ సీటు విషయంలో పొన్నాల లక్ష్మయ్య తన పంతం నెగ్గించుకోగా.. అద్దంకి దయాకర్ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట నెగ్గకపోవడం గమనార్హం. ఉత్తమ్ నిరాకరించినప్పటికీ.. తుంగతుర్తి స్థానంలో దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బాల్కొండలో సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ కొడుకుకు చాన్స్ దక్కలేదు. ఇక్కడి నుంచి ఈరపత్రి అనిల్‌కు మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఎల్బీనగర్ సీటును టీటీడీపీ కోరినప్పటికీ.. ఆ ప్రతిపాదనను తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సుధీర్‌రెడ్డికి కట్టబెట్టింది. -
ఇంటర్నెట్‌ని అనడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెలువరించే ఓటర్ల జాబితాల్లో తప్పు, ఒప్పుల్ని పరిశీలించేందుకు ఈసీకి హైకోర్టు ఏమీ ఆడిటర్ కాదు. ఈసీ కూడా తన పనిని తాను సమర్థంగా చేయాలి. లోటుపాట్ల పాపాన్ని ఇంటర్నెట్పై మోపడం అన్యాయం. కొత్త ఓటర్లను చేర్చేందుకు ఇంటర్నెట్ పనిచేస్తుంది కానీ బోగస్ ఓట్లను తొలగించేందుకు పనిచేయడం లేదా?’అని ఈసీని ఉద్దేశించి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. నకిలీ ఓట్ల తొలగింపునకు ఇంటర్నెట్ మొరాయిస్తోందన్న ఈసీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని లేదా ఇతర అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లవచ్చని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సూచన చేసింది. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ 19 వరకూ ఓటర్ల జాబితాల్లో మార్పుచేర్పులకు అవకాశం ఉందని, 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తామని ఈసీ చెబుతోందని గుర్తు చేసింది. ఈసీ దగ్గర పని అవ్వకపోతే ఎలక్షన్ ట్రిబ్యునల్ వద్ద కేసులు దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించింది. నకిలీ ఓట్లు తొలగించడం లేదు.. ఓటర్ల జాబితాలో నకిలీల పేర్లు ఉన్నాయని.. శశిధర్‌రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనర్హులను తొలగించామని ఈసీ తరఫు న్యాయవాది వివరణ ఇవ్వగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 16కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మేనిఫెస్టోలు విధిగా పాటించాలా? ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల్లోని హామీలకు ఆ పార్టీలు కట్టుబడి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలనే మరో పిల్‌పై హైకోర్టు స్పందించింది. పిల్లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చార్టెడ్ అకౌంటెంట్ ఎం.నారాయణాచార్యులు ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
టీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఈసీ: మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఎన్నికల సంఘం (ఈసీ) పనిచేస్తోందని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వ్యవహారశైలి చూస్తుంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా? అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తోందని, ఓటర్ల జాబితాను తిమ్మినిబమ్మిని చేస్తూ మొండిగా ముందుకెళ్తోందని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణలపై కోర్టులో దాఖలు చేసిన నాలుగో అఫిడవిట్ గురువారం విచారణకు వస్తుందని మర్రి తెలిపారు. -
మంత్రులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈ నెల 3న సిరిసిల్లలో నిర్వహిం చిన సభలో చేనేత కార్మి కులకు బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముదిరాజ్‌ల సభ, యాదవుల సభ ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. బ్రాహ్మణ సంఘం సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 28న కేసీఆర్ ప్రత్యేక విమానంలో రాజకీయాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఎలా వెళ్లారు’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లఘించారని ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. అక్టోబర్ 3వ తేదీన సిరిసిల్లలో జరిగిన చేనేత కార్మికుల సభలో ఇన్సూరెన్స్ ఇస్తామనని కేటీఆర్ ప్రకటించారు. గజ్వెల్లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముదిరాజుల, యాదవుల సభలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలే. బ్రాహ్మణ సంఘం సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పాల్గొన్నారు. ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రభుత్వాధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఈసీ విచారించాలి అక్టోబర్ 28న ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారు. రాజకీయాల కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేశారని శశిధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని వాడుకుని చేసిన ఈ పర్యటనపై ఈసీ సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు అడుగడుగునా జరుగుతున్నాయనీ, వీటన్నిటిపై సీఈఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీలో విలీన మండలాలపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఒక్క కలంపోటుతో ఏపీలో విలీనం చేశారంటూ హైకోర్టులో వేసిన పిల్‌పై ఇరు పక్షాల వాద ప్రతివాదనలు ముగిశాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం చెల్లదని పేర్కొంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఈ పిల్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్.ఎస్.వి.భట్ల ధర్మాసనం బుధవారం ఈ పిల్‌ను మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం తీర్పును తర్వాత ప్రకటిస్తామని తెలి పింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్పిస్తూ... ఒక నియోజకవర్గంలోని ఓటర్లను మరో నియోజకవర్గానికి బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. బయటనుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గిందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన చట్ట ప్రకారం చేయాలన్నా రు. దీనిపై ఈసీ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం కింద ఏడు మండలాల్ని ఏపీలోని నియోజకవర్గాల్లో కలిపామన్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య యథాతథంగానే ఉన్నాయన్నారు. -
ఈసీది ధృతరాష్ట్ర వైఖరి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల విషయంలో ఎన్నికల కమిషన్ ధృతరాష్ట్ర వైఖరిని అవలంబిస్తోందని పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో అనేక తప్పిదాలు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే అసలు ప్రజాస్వామ్యానికి విలువే ఉండదన్నారు. పునర్విభజన చట్టం–2008లోని సెక్షన్–11 ప్రకారం మం డలాల పేరు, సరిహద్దులు, విస్తీర్ణం మారితే దానికి అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఏపీలో కలిసిన 7 మండలాల విషయంలో ఇంతవరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయలేదని గుర్తు చేశారు. ఈ విషయమై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్న తీరును ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ దృష్టికి తీసుకెళ్లమని తెలిపారు. -
ఎన్నికలను వాయిదా వేయాలి: మర్రి
సాక్షి, హైదరాబాద్: తుది ఓటర్ల జాబి తాలో దాదాపు 25 లక్షలమంది ఓట్లు గల్లంతయ్యాయని, దీనిని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సవాల్ చేశారు. సాంకేతిక సమస్యలతో తుదిఓటర్ల జాబితాలో కేవలం 25 వేలమంది ఓటర్ల పేర్లు పునరావృతమయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తప్పుడు ఓటరు జాబితాతో ఎన్నికలు సజావుగా జరగవని, ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేత నిరంజన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధంగా ఉన్నామని సీఈవో హైకోర్టును తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈసీ పనితీరు మారకపోతే జాతీయ, ప్రపంచ మీడియా ముందు అసమర్థతను బహిర్గతం చేస్తామని అల్టిమేటం జారీచేశారు. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయకుండా పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈసీ హైకోర్టుకు సమ ర్పించిన నివేదిక మేరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అమలు కావడం లేదన్నారు. పార్టీలకు తుది ఓటరు జాబితా ప్రతులను ఇంతవరకు అందజేయలేదని, కనీసం అధికారిక వెబ్సైట్లో సైతం ఓటర్ల జా బితాలను పొందుపరచలేద ని తప్పుబట్టారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్‌లో ఈవీఎంలు నిల్వ చేసిన గోదాంను అధికారులు తెరవడంపై అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నోడల్ ఆఫీసర్ సమక్షంలో ఈవీఎంల సీలు తీసి, మళ్లీ సీలు వేసే వరకు వీడియో తీయాల్సి ఉందని, కానీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం టీఆర్ఎస్తో కుమ్మక్కు అయిందని హైకోర్టులో న్యా యవాదులు సైతం వాదించారని గుర్తుచేశారు. అధికారుల తప్పుడు వ్యవహార శైలీతో ఎన్నికల ప్రక్రియ గందరగోళమైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఓటర్లకు న్యాయం చేసేందుకే.. : మర్రి
సాక్షి, హైదరాబాద్: ఓటరు నమోదు కార్యక్రమం అస్తవ్యస్తంగా సాగుతోందని, ఓటర్లకు న్యాయం చేసేందుకే తాము కోర్టులో పోరాడుతున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. ఇష్టం ఉన్న వారి ఓట్లను జాబితాలో ఉంచి, లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తాము వేసిన కేసులో కౌంటర్ దాఖలు సందర్భంగా హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని, ఓటర్ల తుదిజాబితా అర్ధరాత్రి విడుదల చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఓటరు నమోదు అవకతవకలపై తాము వేసిన కేసు హైకోర్టులో సజీవంగా ఉందని, ఈనెల 31న మరోసారి విచారణకు రానుందని శశిధర్‌రెడ్డి వెల్లడించారు. -
ఎన్నికల అధికారులూ జాగ్రత్త: మర్రి
సాక్షి,హైదరాబాద్: అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, తప్పుడు ఓటర్ల జాబితా రూపొందిస్తే సహించేది లేదని ఎన్నికల అధికారులను తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేదం టే ఎవరినీ వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. గాంధీభవన్‌లో శుక్రవారం సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నమోదు ప్రక్రియ అంతా హైకోర్టు పర్యవేక్షణలో జరగడం ప్రజాస్వామ్యవాదుల విజయంగా పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు బూత్‌స్థాయి వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను గుర్తించాలన్నారు. ఓటర్ల తుది జాబితాను తమకు అందిస్తే, ఎన్నికల కమిషన్ తప్పులను గాంధీభవన్ సాక్షిగా స్క్రీన్‌పై నిరూపిస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినంత మాత్రాన ఎవరు ఏమీ చేయలేరనుకోవడం తప్పని ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12న వస్తుందని, అప్పటి వరకూ ఓటరుగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని దీనిపై ఈసీని సైతం నిలదీయవచ్చన్నారు. -
వచ్చే నెల 9వరకూ అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆ తేదీకి 10 రోజుల ముందువరకూ అభ్యంతరాలను స్వీకరిస్తా మని హైకోర్టు సీజే జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనానికి ఈసీ విన్నవించింది. బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయో జన వ్యాజ్యం శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఓటర్ల తుది జాబితా శుక్రవారం ప్రకటించామని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ ధర్మాసనానికి తెలిపారు. ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వర కూ అభ్యంతరాలను స్వీకరించాక మార్పులు, చేర్పులతో పాటుగా తొలగింపునకు ఒకరోజు ఉంటుం దని వివరించారు. ఈ మేరకు అఫి డవిట్ దాఖలు చేశామన్నారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలించేందుకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు అధికారి, సహాయ అధికారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాలు, బూత్ స్థాయి అధికారుల కార్యాలయాల వద్దా జాబితా బహిర్గతం చేస్తామన్నారు. వాదనల అనంతరం కోర్టు కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఆ ఆరోపణలు అర్థరహితం
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని, సవరించిన ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించలేదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హైకోర్టుకు నివేదించింది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దకుండానే తుది జాబితా ప్రచురించారన్న ఆరోపణలు అర్థరహితమని తెలిపింది. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న వివరాల మేరకు పిటిషన్ దాఖలు చేయలేదని వివరించింది. 30.13 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారన్న ఆరోపణలకూ ఆధారాలు చూపలేదంది. అత్యాధునిక సాంకేతిక సాయంతో తప్పులను సవరించామని సీఈసీ తెలిపింది. ఊహాజనిత, అర్థరహిత ఆరోపణలతో శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది. తన పిటిషన్లో సీఈసీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి తిరుగు సమాధానం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధా కృష్ణన్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, వీటిని సవరించకుండా తుది ఓటర్ల జాబితాను ప్రచురించకుండా సీఈసీని ఆదేశించాలని కోరుతూ శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ: సీఈసీ శశిధర్‌రెడ్డి వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సత్యవాణి సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. శశిధర్‌రెడ్డి తన పిటిషన్లో చెప్పిన వివరాలన్నీ గతంలోనివని తెలిపారు. ప్రతీ ఏడాది ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఉంటుందని, ఎన్నికలు జరిగే చోట రెండోసారీ సవరణ ఉంటుందన్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందన్నారు. ఎంతో తీవ్రస్థాయిలో పనిచేసి రెండో సవరణను పూర్తి చేశామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒకే రకమైన వివరాలున్న 4.92 లక్షల ఓటర్లను గుర్తించామని తెలిపారు. 2014 ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 2018 ఓటర్ల సంఖ్యలో 20 లక్షల తగ్గుదలను తప్పుపడుతున్నారని, ఇందుకు సహేతుక కారణాలున్నాయని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొందరు వలస వెళ్లడం, ఆధార్ అనుసంధాన ప్రక్రియ, అనర్హుల ఏరివేత వంటి కారణాల వల్ల ఓటర్ల సంఖ్య తగ్గిందని కోర్టుకు నివేదించారు. -
‘ఆ పిటిషన్లో ఉన్నవన్నీ అవాస్తవాలు’
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ ఎన్నికల సంఘం సోమవారం హైకోర్టును కోరింది. శశిధర్ రెడ్డి పిటిషన్‌కు కౌంటర్‌గా ఎన్నికల సంఘం తరపున డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యవాణి పిటిషన్ దాఖలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్న అంశాలు సరైనవి కావని కౌంటర్ కాపీలో పేర్కొన్నారు. 2016-17 డాటా తీసుకుని అందులో ఉన్న అంశాలను శశిధర్ రెడ్డి పిటిషన్లో చేర్చారని... ఓటరు జాబితా సవరణలపై కాల వ్యవధి రెండు నెలల నుంచి రెండు వారాలకు తగ్గించడం ద్వారా జాబితాపై ప్రభావం చూపిస్తుందనడం సరైంది కాదని సత్యవాణి కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పిటిషన్‌ను దాఖలు చేశారని, అందులో ఉన్నవన్నీ అవాస్తవాలని కోర్టుకు విన్నవించారు. 2016-17 ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న ఇబ్బందులను సవరణ చేశామని.. ఆ డాటా ఆధారంగా వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కౌంటర్ పిటిషన్లో కోరారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కావున మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరిన ఎన్నికల సంఘం.. ఇప్పటికీ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపింది. కాగా ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. -
మర్రి శశిధర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన నాయిని
-
ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌పై ఇవ్వరాదని హైకోర్టు ఆదేశం
-
తుది ఎన్నికల జాబితాపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ఓటర్ల జాబితా ఆటంకం కలిగించనుంది. ఓటర్ల జాబితా అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చుతూ.. శుక్రవారమే పిటిషన్లు దాఖలు చేయాలని ఫిటిషనర్లకు సూచించింది. సుప్రీంకోర్టు కాపీ అందడంతో ఉమ్మడి హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల జాబితా, నోటిఫికేషన్ రిట్ ఫిటిషన్‌కు లోబడి ప్రకటించాలని సూచించింది. తుదిజాబితాను ఈసీ అధికారిక వెబ్సైట్లో పెట్టకూడదని, మొదటగా డ్రాఫ్ట్ కాపీని ఫిటిషనర్లకు, హైకోర్టుకు అందించాలని తెలిపింది. ఈనెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీచేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా న్యాయస్థానం రెండు పిటిషన్లను కొట్టేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని, సార్వత్రిక ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌నే అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో తేల్చుకోవాలని సూచించండంతో శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. -
ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో విచారణ
-
‘తలసానిపై కేసు నమోదు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్‌లో ఉన్న జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో గత నెల 30న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తలసానిపై తక్షణమే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సోమవారం ఈ–మెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. -
కోడ్ ఉల్లంఘనపై కోర్టుకు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించేది లేదని, కోర్టును ఆశ్రయించేందుకు కూడా వెనకాడబోమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించారని, తదనుగుణంగా ఎన్నికల కమిషన్ నాలుగు మాసాల్లో పూర్తిచేయాల్సిన ఓట్ల సవరణ కార్యక్రమాన్ని నాలుగు వారాల్లో పూర్తి చేసేందుకు సిద్ధమైందని శశిధర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ చెప్పినట్లు ఎన్నికల సంఘం పనులు చేయడం సరైంది కాదన్నారు. ముందస్తు ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేస్తున్నారని, ఎన్నికల సంఘం సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని మర్రి విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణకు సరైన సమయం ఇవ్వలేదని, దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామన్నారు. ఎన్నికల పనులకోసం హరియాణా నుంచి వచ్చిన కానిస్టేబుల్ కొంపల్లి వద్ద హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని, దీన్ని బట్టి ఎన్నికల సిబ్బందిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చని శశిధర్ పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రభుత్వాన్ని రద్దు చేసిన పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగడం తప్పన్నారు. ప్రభుత్వం రద్దయిన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా, ఆపద్ధర్మ ప్రభుత్వం జోరుగా శంకుస్థాపనలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అధికార పార్టీ మంత్రులు యథేచ్ఛగా ప్రభుత్వ వనరులైన గన్‌మెన్, కార్లు, కాన్వాయ్, సైరన్లను వాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసు అధికారులను బదిలీచేసే అధికారం ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇప్పటికీ ప్రచార పనులు చేస్తున్నారని, దీనిని అరికట్టకుంటే న్యాయ పోరాటం చేస్తామని రవిశంకర్ హెచ్చరించారు. -
7 మండలాల విలీన వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో విలీనం చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కలిపిన ఆ 7 మండలాలు ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయో తేల్చకుండానే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుం డటంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ, 7 మండలాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ వివరాలను తమ ముందుంచాలని అవినాశ్‌కు స్పష్టం చేసింది. ఈ సమయంలో మర్రి శశిధర్‌రెడ్డి తరఫు న్యాయవాది స్పందిస్తూ, చట్టం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం ఈ మండలాల విలీనం జరగలేదని తెలిపారు. వచ్చే విచారణ సమయంలో ఈ అంశంపై వాదనలు వింటామంటూ విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసింది. -
నవంబర్ 24న తెలంగాణ ఎన్నికలు?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 24న ఎన్నికలు జరుగుతాయని ఓ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా నవంబర్లోనే ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారని, ఇది అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ లీక్ చేసిన సమాచారమేనని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చెప్పాల్సిన విషయాలు మాటలు కేసీఆర్ ఎలా వెల్లడిస్తారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినట్లుగానే ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తొలగించిన, కొత్తగా నమోదు చేసుకున్న ఓట్ల డ్రాప్ట్ ఇవ్వలేదన్నారు. నవీన్ మిట్టల్‌ను రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా ఎలక్ట్రోలర్ అబ్జర్వర్‌గా నియమించినట్లు తమకు సమాచారం లేదన్నారు. నవీన్ మిట్టల్ మీద పలు ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని అబ్జర్వర్‌గా పెట్టుకుని పనులు చేయించుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. మార్చి నుంచి నుంచి ఏప్రిల్ వరకు బోగస్ ఓట్ల ఏరివేత జరిగిందని, మళ్లీ ఇప్పుడెలా బోగస్ ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. -
ఓటరు లిస్టులో క్రీస్తుపూర్వం పుట్టినోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీస్తుపూర్వం పుట్టినోళ్ల పేర్లు ఓటరు లిస్టులో ఉన్నాయని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపిం చారు. నకిలీ ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్చోద్యం చూస్తోందని, అధికార పార్టీ చెప్పుచేతుల్లోకి ఈసీ వెళ్లిందని విమర్శించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్ ప్రక్రియపై సమావేశంలో చర్చించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియపై న్యాయపోరాటానికి సంబం ధించిన అంశమై న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తో చర్చించారు. అనంతరం మర్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 31 లక్షల ఓటర్లు ఎలా తగ్గారని తాము ప్రశ్నిస్తే.. విభజన తర్వాత ఏపీకి వెళ్లడంతో తగ్గారని ఈసీ అంటోందన్నారు. మరి ఏపీలో నూ ఓటర్లు పెరగాల్సింది పోయి, 17 లక్షల ఓటర్లు తగ్గారని, దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారిందన్నారు. పది రోజుల్లో 17 లక్ష ల కొత్త ఓటర్లు నమోదయ్యారని, బహుశా ఇలాం టిది దేశంలోనే ఎక్కడా జరగలేదన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించమంటే సర్వర్ పనిచేయడం లేదంటున్న ఈసీ, కొత్త ఓటర్ల నమోదుకు సర్వర్ ఎలా పనిచేస్తోందని ప్రశ్నించారు. 10 రోజుల్లో కొత్త గా నమోదైన ఓటర్ల జాబితాను తేదీల వారీగా తమ కు ఇవ్వాలన్నారు. కొత్తగా నమోదు చేసిన ఓటర్ల జాబితాను తమకు ఇస్తే.. అందులోని డూప్లికేట్లను 2 రోజుల్లో తొలగిస్తామని జంధ్యాల అన్నారు. -
ఓటు హక్కును పణంగా పెడతారా?
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు లక్షలాది మంది ఓటు హక్కును పణంగా పెడితే అది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నిక ఎలా అవుతుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీం కోర్టులో బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోందని, అసెంబ్లీ రద్దయినా 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పని లేదని, ఆర్టికల్ 324 ద్వారా సంఘానికి విశేష అధికారం ఉందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అంతకుముందే ఆగస్టు 28న.. 2019 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ జారీ చేసిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని, తిరిగి 2018 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ సెప్టెంబర్ 8న స్వల్పకాల షెడ్యూలును జారీ చేసిందని, ఆ షెడ్యూలు ప్రకారం తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ శశిధర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దయినందున మార్చి 6 వరకు గడువుందని శశిధర్‌రెడ్డి కోర్టు నివేదించారు. కాబట్టి పాత షెడ్యూలు ప్రకారం 2019 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సమయం ఉందన్నారు. ఎన్నికల సంఘం అలా చేయకుండా అమలులో ఉన్న ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని కోర్టుకు నివేదించారు. ఓటు హక్కును కాపాడాల్సింది ‘సంఘమే’ ఓటరు జాబితా చట్టబద్ధంగా లేనపుడు, ఎన్నికల సంఘం తగినంత సంసిద్ధతతో లేనప్పుడు ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను సవాలు చేయకుండా ఆర్టికల్ 329(బి) నిరోధించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ఇంద్రజిత్ బారువా వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’కేసులో రాజ్యాంగ ధర్మాస నం ఈ మేరకు స్పష్టంగా పేర్కొందని నివేదించారు. ఈ విషయమై పదేపదే తాము చేసిన విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని విన్న వించారు. ఆర్టికల్ 326 ఓటు వేసే హక్కును కల్పిస్తోందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. కానీ ఈసీ వీటిని పట్టించుకోకుండా లక్షలాది మంది కొత్త ఓటర్లను ఎన్నికలకు దూరం చేస్తోందని కోర్టుకు విన్నవించారు. ఆ బృందం రాకుండానే షెడ్యూలు రద్దు ‘అసెంబ్లీ రద్దయిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించి ఎన్నికలకు సంసిద్ధతపై అంచనాకు రావాల్సి ఉంటుంది. కానీ ఆ బృం దం రాకుండానే ఆగస్టు 28న.. 2019 జనవరి 1 అర్హ త తేదీతో ఓటరు నమోదుకు జారీ చేసిన షెడ్యూలు ను ఈసీ రద్దు చేసింది. 2018 జనవరి 1 అర్హత తేదీ తో ఓటరు నమోదుకు తిరిగి సెప్టెంబర్ 8న రెండో షెడ్యూలు జారీచేసింది’ అని కోర్టుకు పిటిషనర్ తెలి పారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8 నాటి షెడ్యూ లు ను రద్దు చేసేలా, ఓటరు జాబితాలో అవకతవకలను సరిదిద్దేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. జాబితాలో ఎన్నో లోపాలు ఏపీ, తెలంగాణ ఓటర్ల జాబితాలో ఎక్కువ సంఖ్యలో లోపాలున్నాయని కోర్టుకు పిటిషనర్ నివేదించారు. సెప్టెంబర్ 10న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో 30 లక్షల పేర్లు పునరావృతం అయ్యాయన్నారు. 2014 నుంచి 2018 మధ్య 20 లక్షల ఓటర్లను తొలగించారని.. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి విన్నవించగా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వెళ్లడం వల్ల జరిగి ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. కానీ ఏపీలోనూ 17 లక్షల ఓట్లు తగ్గి నట్లు తాము గమనించామని పిటిషనర్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. దాదాపు 48 లక్షల ఓటర్ల విషయంలో గందరగోళం ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం తొలుత జారీ చేసిన షెడ్యూలు ను రద్దు చేసిందని తెలిపారు. ఈ అవకతవకలు సరిచేయకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికం గా నిర్వహించడం సాధ్యం కాదని నివేదించారు.