అందరి ప్రార్థన ఒక్కటే... | Everyone pray is the same | Sakshi
Sakshi News home page

అందరి ప్రార్థన ఒక్కటే...

Published Mon, Jan 25 2016 12:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అమీర్‌పేట గురుద్వారలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కూన వెంకటేష్‌గౌడ్ - Sakshi

అమీర్‌పేట గురుద్వారలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కూన వెంకటేష్‌గౌడ్

ప్రచారంలోనే విమర్శలు.. ప్రతి విమర్శలు. మందిరంలో మాత్రం అందరిదీ గెలుపు ప్రార్థనే. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నేత కూన వెంకటేశ్‌గౌడ్‌లు ఒకేచోట కలుసుకున్నారు. అమీర్‌పేట గురుద్వార ఇందుకు వేదికైంది. డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా వీరంతా ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చి...ముందుగా ప్రార్థనలు నిర్వహించేందుకు గురద్వారకు వచ్చారు.

వీరి వెంట ఆయా పార్టీల అభ్యర్థులు శేషుకుమారి, లలితా చౌహాన్, అనన్‌జీత్ కౌర్ కూడా ఉన్నారు. మందిరం లోపల ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న నేతలు..బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలాగే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.
 - అమీర్‌పేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement