ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు ఎక్కువ కరెన్సీ పంపుతూ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు ఎక్కువ కరెన్సీ పంపుతూ, కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్బీఐని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
సమాచారహక్కు చట్టం కింద నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ బ్యాంకుకు ఎంత కరెన్సీ పంపించారో చెప్పాలని ఆర్బీఐని కోరినట్లు తెలపారు. సమాచారాన్ని ఇవ్వలేమని ఆర్బీఐ సమాధానమిచ్చినట్లు ఆయన తెలిపారు. సమాచారహక్కు చట్టాన్ని ఆర్‌బీఐ అవహేళన చేస్తోందని పేర్కొన్నారు.