
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నాయకులతో 2021 కొత్త ఓటర్ లిస్ట్ సమరీపై రివ్యూ జరిగిందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమస్యలపై చర్చించామని వెల్లడించారు. దీనిలో భాగంగా 150 డివిజన్లు యధాతథంగా ఉంటాయా లేదా అనేది ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టం చేయాలని తెలిపారు. అదే విధంగా వార్డు డీలిమిటేషన్‌పై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. 'వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం జరగాలి కానీ 2016లో రిజర్వేషన్ చివరి నిమిషం వరకు చెప్పకుండా వ్యవహరించారు. అలాంటి ధోరణి సరైనది కాదని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కమిషనర్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కూడా కలుస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా ఎన్నికల కోసం సిద్ధం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాని కమిషన్ మాత్రం మమ్మల్ని అభిప్రాయాలు కొరుతూ లేఖలు రాశారు. (మేము సైతం.. రెఢీ)
ఎన్నికల నిర్వహణపై లాభనష్టాలను తెలపాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి. 800 ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్ కు కాకుండా 500లకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తాం. 2015లో ఓటర్ల ఆక్రమణల తొలగింపుపై మా పోరాటం వల్ల అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్‌ను తొలగించారు. ఓటరు లిస్ట్ తయారుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కి తీసుకెళ్తాం. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ పనిచేయకపోవడం దురదృష్టకరం. ఇంటి నెంబర్ సెర్చ్ అనేది ఎలక్షన్ వెబ్ సైట్‌లో ఉండాలి. 68లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టు లో పిటిషన్ వేస్తే.. న్యాయస్థానం అంగీకరించారు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే ఓటరు జాబితా సరిగా నిర్వహించాలి' అని పేర్కొన్నారు. (బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: తలసాని)