OterList
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నాయకులతో 2021 కొత్త ఓటర్ లిస్ట్ సమరీపై రివ్యూ జరిగిందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమస్యలపై చర్చించామని వెల్లడించారు. దీనిలో భాగంగా 150 డివిజన్లు యధాతథంగా ఉంటాయా లేదా అనేది ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టం చేయాలని తెలిపారు. అదే విధంగా వార్డు డీలిమిటేషన్‌పై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. 'వార్డుల పునర్విభజన చట్ట ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం జరగాలి కానీ 2016లో రిజర్వేషన్ చివరి నిమిషం వరకు చెప్పకుండా వ్యవహరించారు. అలాంటి ధోరణి సరైనది కాదని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కమిషనర్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కూడా కలుస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా ఎన్నికల కోసం సిద్ధం చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాని కమిషన్ మాత్రం మమ్మల్ని అభిప్రాయాలు కొరుతూ లేఖలు రాశారు. (మేము సైతం.. రెఢీ) ఎన్నికల నిర్వహణపై లాభనష్టాలను తెలపాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి. 800 ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్ కు కాకుండా 500లకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తాం. 2015లో ఓటర్ల ఆక్రమణల తొలగింపుపై మా పోరాటం వల్ల అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్‌ను తొలగించారు. ఓటరు లిస్ట్ తయారుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కి తీసుకెళ్తాం. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ పనిచేయకపోవడం దురదృష్టకరం. ఇంటి నెంబర్ సెర్చ్ అనేది ఎలక్షన్ వెబ్ సైట్లో ఉండాలి. 68లక్షల ఓట్లలో అవకతవకలు ఉన్నాయని హైకోర్టు లో పిటిషన్ వేస్తే.. న్యాయస్థానం అంగీకరించారు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే ఓటరు జాబితా సరిగా నిర్వహించాలి' అని పేర్కొన్నారు. (బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: తలసాని) -
జాబితాలో సవరణకు అవకాశం
ధరూరు : ఓటరు లిస్టులో సవరణల కోసం ఈ నెల 8 వరకు అవకాశం ఉందని దానిని రాజకీయ పార్టీల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి నరసింహనాయుడు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో అయిదో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు లిస్టులో తొలగింపు చేయాల్సి ఉందని, కొత్తగా చేర్చిన వారి జాబి జాబితాలో నమోదు కాలేదని నాయకులు ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్ట్రోరల్ అధికారి, లేదా డీపీఓలను కలవాలని సూచించారు. మూడు చోట్ల ఓటు హక్కు.. మల్దకల్ : ప్రభుత్వం ఒక ఓటరు ఒకే చోట తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిబంధనలు విధించినప్పటికీ బీఎల్ఓల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొన్ని గ్రామాల్లో ఒక ఓటరు మూడు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మండల అధ్యక్షుడు పాలవాయి రాముడు, బ్రహ్మోజిరావు, బంగి గోవిందులు ఆరోపించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సూపరింటెండెంట్ రాజారమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాలో ఒక కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరైనా వేర్వేరు చోట ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఈ నెల 10లోపు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటరు జాబితాలో కొందరు ఓటర్ల పేర్లను బీఎల్ఓలు తొలగించకుండా అలాగే ఉంచారని, బీఎల్ఓలు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ.. వారి అనుచరుల పేర్లు తొలగించడం లేదన్నారు. వివాహాలు చేసుకుని వెళ్లిన, గ్రామంలో నివాసం లేకుండా వెళ్లిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉన్నాయని వాటన్నింటిని తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సవారమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు, నీలిపల్లి కృష్ణయ్య, కిశోర్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి నాలుగు ఓటర్లలో ఒక ఓటు తొలగించారు
-
ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయండి
అదనపు సీఈఓ అనూప్‌సింగ్ మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పులను సరిచేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అదనపు చీఫ్ ఎన్నికల అధికారి అనూప్‌సింగ్æఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్ ఎంట్రీలు, కచ్చితమైన ఫొటోలు, ఓటర్ వివరాలు సరిచేయడంతో పాటు డమ్మీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం వంటి పనులను వేగవంతం చేయాలన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాలను, అధికారుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్ వేసుకొని గూగుల్ మ్యాప్‌కు, జీఐఎస్ అప్లికేషన్‌కు ఈనెల 31వ తేదీ లోపు అప్లోడ్ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సరిచేయడంతో పాటు ఖచ్చితమైన ఓటర్ వివరాలతో సెప్టెంబర్ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రకటించాలన్నారు. ఈనెల 29న జిల్లా ఎన్ఐసీ డీఐఓ, టెక్నికల్ సిబ్బందికి ఓటర్ల జాబితాల సవరణలు, ఇతర అంశాలపై హైదరాబాద్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో భాస్కర్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, డిసెక్షన్ తహసీల్దార్ సువర్ణరాజు, ఎన్నికల విభాగం జూనియర్ సహాయకులు కష్ణకుమార్లు హాజరయ్యారు.