సచివాలయం,అసెంబ్లీ భవనాలు పటిష్టంగా ఉన్నా కొత్త భవనాలు ఎందుకో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల రీడిజైన్‌పై బహిరంగ చర్చకు రావాలని ఎన్నిసార్లు సవాల్ చేసి నా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిం చారు. ఇలాంటి నిరంకుశ సీఎంపై ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.