
Marri Shashidhar Reddy.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్టానం ఎందుకు మందలించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగాలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మునుగోడుపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. సర్వే రిపోర్టుతో అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment