Komatireddy brothers
-
కాంగ్రెస్ ప్రభంజనం చూసి బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది
-
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తపరుస్తున్నాయి. ఇక, ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కేసీఆర్‌తోనే ఉన్నారని మరోసారి రుజువైంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఛాలెంజ్‌పై మీడియా ప్రశ్నించగా.. మంత్రి జగదీష్ రెడ్డి..ఈ జిల్లాలో వాళ్ల అన్నదమ్ముల మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అలాంటి ఛాలెంజ్‌లు చాలా చేసే ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ మాటను వారు అమలు చేయలేదు. వాళ్లు గురించి నేను పెద్దగా పట్టించుకోను. టీఆర్ఎస్ను ఓడించడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు, కీలక నేతలు వచ్చారు. కానీ, వారు కేసీఆర్‌ను ఓడించలేకపోయారు. బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతి చేసినా.. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్‌గారు మీరు ఢిల్లీ వెళ్లండి.. దేశరాజకీయాల్లోకి వెళ్లండి అని ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇక, ఇక్కడి నుంచే కేసీఆర్‌గారు ఢిల్లీపైన ధర్మయుద్ధం ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోవడంపై కూడా మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతపారాధం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు అనడానికి ఇదే నిదర్శనం. నల్లగొండలో కాంగ్రెస్‌కు ఇక గత చర్రితే అని అన్నారు. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా ...?
-
కాంగ్రెస్‌లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి
Marri Shashidhar Reddy.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగా జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్టానం ఎందుకు మందలించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగాలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడుపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. సర్వే రిపోర్టుతో అలర్ట్ -
స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామా సమర్పిస్తా: రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ: తానే స్వయంగా వెళ్లి స్పీకర్‌కి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 8న స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెప్పారు. స్పీకర్ తనను కలవకుండా కాలయాపన చేస్తే అసెంబ్లీ సెక్రటరీని కలిసి రాజీనామా సమర్పిస్తానని స్పష్టం చేశారు. చండూరు పర్యటనలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపుతానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ‘చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించాను. కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదు. శేషిలేటి వాగు,వెల్మకన్నె పీడర్ ఛానల్ గురించి అధికారులతో చాలా సార్లు మాట్లాడినా స్పందించలేదు. మునుగోడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు కూడా కేసీఆర్ నిధులు ఇవ్వలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారు. చండూర్, చౌటుప్పల్ మున్సిపాటీల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు.’ అని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమే’ -
రేవంత్ ఎవరి ఏజెంటో అందరికీ తెలుసు.. బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి 2017లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఏ వ్యాపారం కోసం, ఎవరి ఏజెంట్‌గా పనిచేయడం కోసం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడికి రేవంత్‌రెడ్డి ఏజెంట్ అని, ఆయన వ్యాపారాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారన్న ఆరోపణలు నిజమని ప్రజలు అనుకోవాలా? అని వ్యాఖ్యానించారు. 14 నెలలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి విలువలకు కట్టుబడని రేవంత్‌రెడ్డి, ఇప్పుడు విలువలు, వ్యాపారాలు, ఇతర శాసనసభ్యుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. బుధవారం ఢిల్లీలో రఘునందన్ మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి విలువలున్న వ్యక్తి కాబట్టే కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారని తెలిపారు. -
గవర్నర్... హద్దులు గుర్తెరగాలి
రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం గవర్నర్ పరిధి కాదని, రాష్ట్ర గవర్నర్ తన పరిధిలోనే ఉండాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ పదవుల్లో ఉన్న వారు తమ హద్దులను గుర్తెరగాలన్నారు. దేశంలో సరైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేనందునే బీజేపీ ఆటలు సాగుతు న్నాయని, దేశానికి సరైన నాయకత్వం అవసరముందన్నారు. శాసనమండలిలోని తన చాంబర్లో గురువారం మీడియాతో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది రాజకీయాల్లో నాణ్యత తగ్గుతోంది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ప్రతి విషయంలోనూ మోకాలడ్డుతోంది. నిరంకుశ, నియంత పాలన వైపుగా దేశాన్ని నడిపేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరపాలి. జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనపుడు తెలంగాణ, ఏపీలో ఎందుకు సాధ్యం కాదు? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎనిమిదేళ్ల తర్వాత కేంద్రానికి గుర్తుకొచ్చాయా? సీఎంది పార్లమెంటరీ భాషే! ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతున్నారు. ఏది పార్లమెంటరీ.. ఏది అన్‌పార్లమెంటరీ అనే అంశంపై మార్గదర్శకాలు ఇవ్వాలి. సర్వేల్లో బీజేపీ పుంజుకుందని చెబుతున్నా అధికారం టీఆర్ఎస్దే అనే విషయాన్ని మరిచిపోవద్దు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. హుజూర్నగర్, హుజూరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను 95 శాతం మేర నెరవేర్చింది. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పార్టీలు మారడం సహజం. ఈటలకు టచ్‌లో ఉన్న నేతలెవరో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. చంద్రబాబు మాట విని ఏడు మండలాలను బీజేపీ ఏపీలో విలీనం చేసింది. పోలవరం ముంపు తగ్గించేందుకు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలవరంతో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ప్రమాదం ఉంది. ప్రకృతి ప్రకోపిస్తే అమెరికానే మునిగింది. కాళేశ్వరం కూడా ప్రకృతి వైపరీత్యమే. షర్మిల కోరుకుంటున్న పాలన తెలంగాణలో కాదు రావాల్సింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లైఫ్ అండ్ డెత్... మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతాను అని అడిగిన విషయం నాకు తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం రాజగోపాల్‌రెడ్డి చేతిలోనే ఉంది. అయితే ఆయన రాజీనామా అంశాన్ని సాగదీసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి సోదరులకు మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా చావుబతుకులకు సంబంధించిన సమస్య. ఉప ఎన్నిక వస్తే ఇద్దరు సోదరులు మునుగుతారు. మునుగోడులో నేను పోటీ చేయాలా వద్దా అనేది సీఎం నిర్ణయిస్తారు. -
కాంగ్రెస్ నేతలకు సవాల్ : ఈద శంకర్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని, మిడ్ మానేర్ ప్రాజెక్టు నాణ్యతపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ హయాంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పనిని 80 శాతం పూర్తి చేశారు. కట్టపని చేసిన కాంట్రాక్టర్‌ను కోమటిరెడ్డి బ్రదర్స్ చర్చకు తీసుకు రావాలి. అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నీటి విడుదల ప్రాజెక్టు నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నామని’ తెలిపారు. కొమటిరెడ్డి బ్రదర్స్ ఆధారాలతో వస్తే ఎప్పుడైనా.. ఎక్కడైనా.. చర్చకు సిద్ధమని ఈద శంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి : ప్రమాదకరంగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే : కోన వెంకట్ -
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: వరుస వలసలతో కంగుతింటున్న కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలంపాటు పనిచేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014, 2018 ఎన్ని కల్లో ఓడిపోయారు. మొన్నటివరకు పార్టీలో క్రియా శీలకంగా ఉన్న భిక్షమయ్య ఉన్నట్టుండి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ విషయం ముందే టీపీసీసీ నాయకత్వం పసిగట్టి నిలువరించే ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. వారి కారణంగానే ఓడాను.. కోమటిరెడ్డి సోదరుల కారణంగానే ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు సార్లు ఓటమి పాలయ్యానని.. తన ఉసురు వారికి తగులుతుందని భిక్షమయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై గత ఎన్నికల్లో కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దించి ఓటమికి కారణమయ్యారని ఆయన ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్‌ను మధుయాష్కీకి లేదా గ్రూపులు లేని బీసీ నేతలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరామని, అయితే కోమటిరెడ్డి సోదరులు అడ్డుపడి వారే టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే గెలవాలని మాయమాటలు ఇటీవల టీఆర్ఎస్లో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. దీంతో భువనగిరి లోక్‌సభ సీటును ఎలాగైనా గెల వాలని వారు మాయమాటలు చెబుతున్నారని భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదనే బాధతోనే కాంగ్రెస్ పార్టీ, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్యగౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సామాజిక న్యాయం పాటిస్తూ నల్లగొండలో ఓసీ, భువనగిరిలో బీసీకి టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. తన అనుచరులతో కలసి రెండు, మూడ్రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, సంక్షేమ పథకాల వైపే ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, పదేళ్లపాటు తనకు సహకరించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యా రాజకీయాలు!
సాక్షి, నల్లగొండ: రాజకీయంగా ఎదుర్కోలేకే అధికార టీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నల్లగొండ మర్రిగూడ బైపాస్‌లో గల ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో ఆదివార మధ్యాహ్నం కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీ గౌడ్ తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సభలో బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబసభ్యులను చూసి కోమటిరెడ్డి సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలం లేకనే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా మారారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పతన౦ నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభమైందని అన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే తెలంగాణ, బంగారు తెలంగాణగా మారిందన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ, డీఎస్పీ పోలీసు శాఖకే మచ్చగా మారారని ఆరోపించారు. రాజకీయ హత్యను చిల్లర హత్యగా చిత్రీకరించారని విమర్శించారు. .తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఈ సంతాప సభ సందర్భంగా నల్లగొండలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేశారు. వందలమంది కానిస్టేబుళ్లతోపాటు 42 మంది ఎస్సైలు, 32 మంది సీఐలు, నలుగురు డీఎస్సీలు బందోబస్తులో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అక్కడ కూడా బలగాలను మొహరించారు. -
కాంగ్రెస్‌వి శవరాజకీయాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతను అత్మీయుడు, మిత్రుడని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నేతలంతా నల్లగొండకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఏదో హత్యలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.. కానీ జిల్లాలో హత్యలు చేయించింది, రౌడీషీటర్లను పెంచి, పోషించింది ఆ పార్టీయే’’అని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగారని, ఖాసీంఖాన్, యూసుఫ్ లాంటి రౌడీషీటర్లను పెంచి పోషించారని ఆరోపించారు. అసలు శ్రీనివాస్ హత్యతో తనకు సంబంధం ఏమిటని, హత్యకు గురైన వారు.. నిందితులు టీఆర్ఎస్ పార్టీవారా అని ప్రశ్నించారు. ఓడిపోతారనుకున్నప్పుడల్లా హత్యా రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అలవాటేనని విమర్శించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి నియోజకవర్గంలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. డీజీపీని కలసిన కోమటిరెడ్డి.. తనకు బుల్లెట్ ప్రూఫ్ కారు, గన్మన్లను అదనంగా ఇవ్వమని కోరాడే కానీ శ్రీను కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో శ్రీనివాస్ తనకు కాఫీ డే హోటల్ వద్ద అనుకోకుండా కలిశాడని, అతనే తన దగ్గరికి వచ్చి పార్టీ మారే విషయమై సలహా ఇవ్వమని అడిగారని వీరేశం పేర్కొన్నారు. తనపై అభాండాలు వేసిన వారిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. నా హత్యకు కాంగ్రెస్ కుట్ర తన హత్యకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ఎమ్మెల్యే వీరేశం ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తానన్నారు. నల్లగొండలో పీజీ పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు చాలా మంది వచ్చి ఫోటోలు దిగారని.. అందులో ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు. -
కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు రసాభాసగా మారాయి. శంషాబాద్‌లో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులకు శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అయితే నేతలు మాత్రం.. కోమటిరెడ్డి సోదరులను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో కార్యకర్తల మధ్యే వారిద్దరూ సుమారు రెండు గంటలపాటు కూర్చొని వెళ్లిపోయారు. కోమటిరెడ్డి సోదరులు వెళ్లిపోయే సమయంలో ఉత్తమ్ హఠావో...కాంగ్రెస్ బచావో అంటూ వారి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. -
‘మాతో చాలా మంది టచ్‌లో ఉన్నారు’
యాదాద్రి భువనగిరి జిల్లా: బీజేపీలో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమతో చాలా మంది టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా? అని విలేకరులు అడిగినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. రాష్ట్రంలోని వివిధ స్థాయిల నాయకులు ఢిల్లీ, హైదరాబాద్ నాయకులతో నిరంతరం చర్చిస్తున్నారని తెలిపారు. అయితే ఎవరెవరు చేరుతున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
అవగాహనలేని కోమటిరెడ్డి బ్రదర్స్: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జానారెడ్డి అవుతారని అవగాహన లేకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. శాసనసభ్యులుగా ఎన్నికైన వారే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కాంగ్రెస్ విధానమని, ఒకరిద్దరు వ్యక్తుల ఇష్టం కాదని తెలిపారు. కోమటిరెడ్డి విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేతలంతా సమిష్టిగా పోరాడితే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చుననే భావన సామాన్య ప్రజల్లో ఉందన్నారు. ఏ లక్ష్యాలు, ఆకాంక్షల కోసం తెలంగాణను సాధించుకున్నామో, వాటిని సీఎం కేసీఆర్ నీరుగార్చారని విమర్శించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ఉద్యమకారులను, హక్కుల కోసం ప్రశ్నించే వారిని తీవ్రవాదులను చూసినట్లు ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఉద్యమ నేతల ఇళ్లపై దాడులు, అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్ కుటుంబ జాగీరు అన్నట్టుగా పాలిస్తున్నారని విమర్శించారు. నా రాష్ట్రం, నా ఇష్టం, నన్నెవరూ ప్రశ్నించడానికి వీలులేదు అనే నియంతృత్వ, నిరంకుశ ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలు చేసిన కేసీఆర్‌ను ఇప్పటిదాకా 33 సార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయన్నారు. తన భూమికి సంబంధించిన అంశాన్ని పట్టుకుని రాజకీయంగా దెబ్బకొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఈ విషయంలోనూ మరోసారి మొట్టికాయ పడకుండా చూసుకోవాలని హెచ్చరించారు. -
కేసీఆర్ మరో చండీయాగం!
మాకు పీసీసీ పదవి రాకుండా చేసేందుకే..: రాజగోపాల్ రెడ్డి తిప్పర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ భయం పట్టుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తమకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా కేసీఆర్ మరో చండీయాగం చేసేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సోదరుడు, ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లా డుతూ, రాష్ట్ర ప్రజలంతా కోమటిరెడ్డి సోదరుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పా రు. తాము పాదయాత్ర చేస్తే 2019లో కాంగ్రెస్ వంద సీట్లు గెలుచుకుని అధికారం లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో చేరిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. మరో రెండేళ్లలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌తోనే రైతు రాజ్యాన్ని తీసుకువస్తామన్నారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎందుకో అంత ఆసక్తి?
-
'కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎందుకో అంత ఆసక్తి?'
హైదరాబాద్ : శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మంగళవారం గ్యాంగ్ స్టర్ నయీం కేసు అంశాన్ని ప్రస్తావించారు. నయీం డైరీని బయటపెట్టాలని, ఆ కేసులో సంబంధం ఉన్నవారందరి పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఇవాళ సభలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తూ కేసులో సంబంధించిన అన్ని అంశాలను సభ ముందు ఉంచుతామని తెలిపారు. అలాగే నయీం కేసులో కోమటిరెడ్డి సోదరులకు ఎందుకో అంత ఆసక్తి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమత్రి ఆదేశాల మేరకే నయీం ఎన్కౌంటర్ జరిగిందా అని ప్రశ్నించారు. -
అందరి దృష్టి నల్లగొండ మీదే
రౌడీ రాజకీయాల నుంచి విసునూరు వారసుల వరకు హాట్ హాట్ చర్చ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే వీరేశం అంతకు ముందే నల్లగొండలో మాటల తూటాలు పేల్చుకున్న ఆయా నేతలు కాంగ్రెస్ లోనూ పదవుల పందేరంపై చర్చ జానా, ఉత్తమ్ లను తప్పిస్తారని, కోమటిరెడ్డికి బాధ్యతలిస్తారని ప్రచారం బడ్జెట్ సమావేశాల్లో రాజకీయమంతా జిల్లా చుట్టూనే సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి రాజకీయం రక్తి కడుతోంది. వారం రోజులుగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర శాసనసభా బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటుండడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై చర్చ మరోసారి ప్రారంభం కావడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టి మన జిల్లా మీదే ఉంది. ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి సోదరులు అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ మాట్లాడుతుండడం, అందుకు ప్రతిగా జగదీశ్‌రెడ్డి కౌంటర్లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో రౌడీ రాజకీయాలు, విసునూరు రామచంద్రారెడ్డి వారసులంటూ ఆవేశపూరిత వ్యాఖ్యానాలు, ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసుననే ఎత్తిపొడుపు మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరపై మరోసారి ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభం కావడం, ఈ పందేరంలో మన జిల్లాకు చెందిన ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఇప్పుడు రాష్ట్రంలో జిల్లా రాజకీయాలే హాట్‌టాపిక్‌గా మారాయి. రౌడీలు... విసునూరు వారసులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో ఉండే 15 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాంతిభద్రతల అంశంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. నల్లగొండలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అనడం సీన్‌ను మరింత హాటెక్కించింది. అయితే, అందుకు ప్రతిగా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. డబ్బుతో రాజకీయాల్లో ఏదైనా చేయవచ్చని అనుకునే రీతిలో కోమటిరెడ్డి సోదరులు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో విసునూరు రామచంద్రారెడ్డి వారసులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ పక్షాన జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులను దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏంటో జిల్లా ప్రజలకు తెలుసునని, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో వారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కోమటిరెడ్డి శిబిరం ఎలా స్పందిస్తుందో, చర్చ ఎటువైపుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. అయితే, అసెంబ్లీలో ప్రతిపక్షాలు డీలాపడిపోయి బడ్జెట్ సమావేశాలు స్తబ్దుగా జరుగుతాయని అందరూ భావించిన తరుణంలో జిల్లాను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు వేడెక్కుతుండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. డిండి రెండేళ్లలో.. కాగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో తాత్సారం జరిగిందని, డీపీఆర్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చిందని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం డిండి ఎత్తిపోతలపై పట్టుదలగా ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. పదవులు పోయేనా..? టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ఆరోపణల మాట అటుంచితే... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై జరుగుతున్న చర్చ అటు ఆ పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే జరిగేదా.. అనే మీమాంస ఉన్నా అటు సీఎల్పీ నేతను, ఇటు పీసీసీ అధ్యక్షుడిని ఆయా పదవుల నుంచి తప్పిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభమైన ఈ చర్చలో కూడా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేర్లే వినిపిస్తున్నాయి. తన సోదరుడిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఊపు మీదున్న వెంకటరెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చేసిన వ్యాఖ్యల ఆంతర్యంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానాలకు పదవీగండం ఉందని, ఇద్దరికీ ఏఐసీసీలో స్థానం కల్పిస్తారని కూడా పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పట్లో ఉన్న ప్రమాదం ఏమీ లేదని, అయితే, సీఎల్పీ నేతను మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఇతర జిల్లాలకు చెందిన జీవన్‌రెడ్డి, అరుణ లాంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నా, పీసీసీ అధ్యక్ష పదవికి జరుగుతున్న చర్చలో మాత్రం ఉత్తమ్‌ను తప్పిస్తే ఆ పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఇస్తారని ప్రచారం జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు కూడా జిల్లా నేతలను కేంద్రంగా చేసుకుని హాట్‌హాట్‌గా మారుతున్నాయి. నల్లగొండ డీఎస్పీ కార్యాలయం నుంచి మొదలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న రాజకీయం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేయడం, ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు దానిని ఖండించడం, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం, మళ్లీ టీఆర్ఎస్ నాయకులు దానిని ఖండించడం, ఆ తర్వాత నకిరేకల్ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం వరకు ఈ ఆరోపణల పరంపర వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలోనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు ఓ పక్షాన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైన కోమటిరెడ్డి సోదరులు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండ్‌కో మరో పక్షాన మాటల దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం, పది రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లాస్థాయిలోనే హాట్ హాట్ గా మారింది. కానీ, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో జిల్లా రాజకీయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. -
పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్
టీఆర్ఎస్కు సవాలు విసిరి మరీ విజయం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసన మండలి ఎన్నికలు కాంగ్రెస్‌లో జోష్ నింపాయి. గత సాధారణ ఎన్నికల తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌కు నల్లగొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు నూతనోత్తేజాన్ని కలిగించింది. నల్లగొండలో భారీ మెజారిటీ రావడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లోనూ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో కూడా గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నల్లగొండలో గెలుపును పార్టీ శ్రేణులు ఎక్కువగా ఆస్వాదిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్లగొండ మండలి ఎన్నికల్లో కోమటిరెడ్డి బద్రర్స్ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి గెలిచి, టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం కూడా రాజీనామా చేస్తారా అంటూ కాలు దువ్వారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ గెలుపును భుజాలపై వేసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై సవాల్ విసిరి, పంతాన్ని నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పార్టీలో విశ్వాసం పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ఉన్న ముఖ్యనేతలు అందరినీ కలుపుకుని పోయి గెలుపొందడం ద్వారా జిల్లాలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ నిలుపుకున్నట్టైంది. సోనియాకు అంకితం: రాజగోపాల్‌రెడ్డి తన విజయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నల్లగొండ జిల్లా ప్రజలకు అంకితమిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కౌంటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాకు నూతన సంవత్సర కానుకగా ఈ విజయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలో ధర్మం గెలిచిం దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా జిల్లా ప్రజాప్రతినిధులు ఓట్లేశారన్నారు. తన విజ యానికి సహకరించిన సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి నల్లగొండ జిల్లాపైనే కేంద్రీకృతమైంది. జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఉనికిని కూడా గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. జిల్లా నాయకులతో మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నాయకత్వం నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. టీపీసీసీ నాయకత్వం ఒంటెద్దు పోకడలు పోతే తగిన గుణపాఠం చెబుతామంటూ వీరి అనుచర వర్గం సిద్ధమవుతోంది...!! సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే ఆశావహుల జాబితా అగ్గి రాజేస్తోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) టీపీసీసీకి నివేదించినట్లుగా చెబుతున్న ఈ జాబితాపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎవరికి వారు తమ కుటుంబసభ్యుల పేర్లతో ఆయా నియోకవర్గాలకు పేర్లు ప్రతిపాదించడం, అదే జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పంపినట్లు ప్రచారం జరగడంతో సిట్టింగు ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. జిల్లా కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ఒక్కో నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షపదవి రేసులో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డికి అవకాశం దక్కకపోవడం, జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కలిసి రావడంతో గ్రూపు రాజకీయాలకు ఊపు వచ్చింది. పార్టీ సంస్థాగత పదవులకు సంబంధించింది కాకపోయినా, ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం సిఫారసు చేసిన పేర్ల దగ్గరే తగవు మొదలైంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గత ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చిన వారిలో ముగ్గురు కొత్త వారు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జిల్లాలోని గుంపు రాజకీయాల పుణ్యమాని ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎర్తు పెడుతున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. తొలిసారి టికెట్‌తోనే, మహాకూటమి అభ్యర్ధిని భారీ మెజారిటీ తేడాతో ఓడించి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చికాకులు సృష్టిస్తున్నారని, అదే సమయంలో ఆయన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ స్థానంలోనూ ప్రత్యామ్నాయ పేరును ప్రచారంలోకి తెచ్చారు. పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో డీసీసీ అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ‘నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లను ఒక్కొక్కటే పంపించాం. ఇక్కడ ప్రత్యామ్నాయ పేర్లనేవీ డీసీసీ ప్రతిపాదించలేదు..’ అని డీసీ సీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. కానీ, త మ వర్గంగా లే రని భావిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దే వరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌లకు చెక్ పెట్టేందుకు ఈ రెండు చోట్లా మరికొందరి పేర్లు జాబితాలో చేరాయి. ఇక, స్థానిక ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించడం, భీ-ఫారాల విషయంపై చర్చించేందుకు హైదరాబాద్ గాంధీ భవన్లో టీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి అటు కోమటిరెడ్డి సోదరులు, ఇటు జానారెడ్డి హాజరు కాలేదు. ఒక దశలో టీపీసీసీ నాయక త్వ ఉనికినే వీరు గుర్తించడం లేదా, అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ముగ్గురు కీలకమైన నాయకుల గైర్హాజరీతో ఈనెల 21వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘టీపీసీసీ నాయకత్వం ఒంటెద్దు పోకడలతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తోంది. ఒకరిద్దరు నాయకులు ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని దెబ్బకొట్టాలని చూస్తారా..? కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేని వారిని తెరపైకి తెచ్చి టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తారా..? ఇదే జరిగితే గుణపాఠం చెప్పడం ఖాయం..’ అని జిల్లా కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకుడు ఒకింత తీవ్రంగానే హెచ్చరించారు. జరుగుతున్న పరిణామాలు, నాయకుల మధ్య జరుగుతున్న సంభాషణలు, మాటల యుద్ధాన్ని సునిశితంగా పరిశీలిస్తే.. అంతా సీనియర్లే ఉన్న జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మనసు లు కలవడం లేదని, అంతా కలిసి పనిచేసే వాతావరణం కని పించడం లేదన్న అభిప్రాయం కలగక మానదు. ముందు ముందు మరెన్ని ఉదంతాలు జరుగుతాయో..? జిల్లా కాంగ్రెస్ నావ ఏ తీరానికి చేరనుందో అన్న అంశాలు ఆసక్తి గొల్పుతున్నాయి. -
కోమటిరెడ్డి షో