సాక్షి, కరీంనగర్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని, మిడ్ మానేర్ ప్రాజెక్టు నాణ్యతపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
‘కాంగ్రెస్ హయాంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట పనిని 80 శాతం పూర్తి చేశారు. కట్టపని చేసిన కాంట్రాక్టర్‌ను కోమటిరెడ్డి బ్రదర్స్ చర్చకు తీసుకు రావాలి. అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నీటి విడుదల ప్రాజెక్టు నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నామని’ తెలిపారు. కొమటిరెడ్డి బ్రదర్స్ ఆధారాలతో వస్తే ఎప్పుడైనా.. ఎక్కడైనా.. చర్చకు సిద్ధమని ఈద శంకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి : ప్రమాదకరంగా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే : కోన వెంకట్
Comments
Please login to add a commentAdd a comment