స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామా సమర్పిస్తా: రాజగోపాల్‌ రెడ్డి | Komatireddy Rajagopal Reddy Will Submit Resignation To Speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామా సమర్పిస్తా: రాజగోపాల్‌ రెడ్డి

Published Sun, Aug 7 2022 9:20 PM | Last Updated on Sun, Aug 7 2022 9:24 PM

Komatireddy Rajagopal Reddy Will Submit Resignation To Speaker - Sakshi

తానే స్వయంగా వెళ్లి స్పీకర్‌కి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

నల్లగొండ: తానే స్వయంగా వెళ్లి స్పీకర్‌కి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఆగస్టు 8న స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు చెప్పారు. స్పీకర్‌ తనను కలవకుండా కాలయాపన చేస్తే అసెంబ్లీ సెక్రటరీని కలిసి రాజీనామా సమర్పిస్తానని స్పష్టం చేశారు. చండూరు పర్యటనలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపుతానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

‘చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో  డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించాను. కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదు. శేషిలేటి వాగు,వెల్మకన్నె పీడర్ ఛానల్ గురించి అధికారులతో చాలా సార్లు మాట్లాడినా స్పందించలేదు. మునుగోడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు కూడా కేసీఆర్ నిధులు ఇవ్వలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారు. చండూర్, చౌటుప్పల్ మున్సిపాటీల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు.’ అని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

ఇదీ చదవండి: ‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement