సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్‌ఎస్ బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్‌రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్‌లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు.
ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్‌రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment