
కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు రసాభాసగా మారాయి. శంషాబాద్‌లో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులకు శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అయితే నేతలు మాత్రం.. కోమటిరెడ్డి సోదరులను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో కార్యకర్తల మధ్యే వారిద్దరూ సుమారు రెండు గంటలపాటు కూర్చొని వెళ్లిపోయారు. కోమటిరెడ్డి సోదరులు వెళ్లిపోయే సమయంలో ఉత్తమ్ హఠావో...కాంగ్రెస్ బచావో అంటూ వారి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.