సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు శశిధర్‌రెడ్డిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి శనివారం ప్రకటించారు.
శశిధర్‌రెడ్డి ఈ నెల 18న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈ నెల 18న అమిత్ షాతో భేటీ అవడం, శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. శశిధర్‌రెడ్డి వైఖరి పార్టీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని, ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ఆమోదించాలని ఏఐసీసీకి ప్రతిపాదన పంపామని వివరించారు.
చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment