-
ప్రాణహిత–చేవెళ్లకు మళ్లీ రీడిజైన్ చేయాలి
-
డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణమా ?
-
జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి
వరంగల్ : రాష్ట్రం సాధించామనే పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ తన జాగీర్‌గా నిరంకుశ పాలన సాగిస్తున్నారని జాతీ య విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టులో అవసరం లేకున్నా రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, దీంతో సుమారు రూ.26 వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని చెప్పారు. మేడిగడ్డ వద్ద 120 రోజల పాటు నీటిని ఎత్తిపోయవచ్చని, తద్వారా పంటలకు పూర్తి కాలం నీరందించవచ్చని అన్నారు. బ్యారేజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసి కాలువ ద్వారా పంటలకు అందించే అవకాశం ఉన్నా...రిజర్వాయర్ల నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. వేల ఎకరాలు ముంపునకు గురువుతున్నందున ప్రాజెక్టుకు రీyì జైన్ చేయాలని సూచించారు. జీఓ 123ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల విజయమన్నారు. ఎక్కడ అన్యాయంగా భూములు సేకరించినా ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రిజర్వాయర్ల పేరుతో వేల కోట్ల రుపాయాలు దోచిపెట్టి తద్వా రా లబ్ధిపొందాలని చూస్తున్న ప్రభుత్వాన్ని వదలిపెట్టేది లేదన్నారు.
ఇష్టానుసారంగా రీడిజైన్..
గతంలో పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించిన ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేకున్నా గూగుల్ మ్యాపులను ముందు పెట్టుకొని ఇష్టానుసారంగా రీడిజైన్ చేశారని, దీనివల్ల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమవుతున్నాయని శశిధర్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి స్థాయిలో డీపీఆర్ ఉండాలన్నారు. ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు డీపీఆర్‌తో అడ్డుంకులు ఉంటాయనడం సరికాదన్నారు. భూముల కోసమే మల్లన్నసాగర్ నిర్మిస్తున్నారని, అందుకే 86వేల ఎకరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు కట్ల శ్రీని వాస్, మాజీ ఎమ్మెల్యే బి.ఆరోగ్యం, శ్రీనివాస్‌రావు, నవీన్‌నాయక్, రజనీ కాంత్, సురేందర్‌రెడ్డి, సమ్మయ్య, బొజ్జ సమ్మయ్య యాదవ్ ఉన్నారు.